Thursday, 06 Aug, 2026

కళ్ళకింద కనికట్టు

 అందమైన కళ్లు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. ఈ అందమైన కళ్ళ కోసం మరో కొత్త ఐ మేకప్ ఫ్యాషన్ రంగులు అడుగుపెట్టింది.అదే అండర్ ఐ స్పార్క్ ల్  దీన్ని గ్లిట్టర్ అండర్ ఐ అని కూడా అంటారు.ఇది కంటి కింద మేకప్ చిన్న చిన్న మెరుపులు అనేక రంగుల్లో మార్కెట్ లో దొరుకుతున్నాయి.రంగుల మెరుపులను అంటించే గ్లూ కూడా ఇస్తారు గ్లూ కంటి కింద రాసి దానిపై మెరుపులు అంటించాలి. ఐ షాడో బ్రష్ తో సమంగా […]

రసాయనాలు లేని వాక్స్

అవాంచిత రోమాలు తొలగించేందుకు ఉపయోగపడే వాక్స్ ను ఇంట్లోనే సహజంగా, ఎలాంటి రసాయనాలు కలవకుండా తయారు చేసుకోవచ్చు. ఒక టీ స్పూను చక్కెర, ఒక టీ స్పూన్ నిమ్మరసం తేనె కలిపి బాగా పాకం లా వచ్చేలా వేడిచేయాలి. దాన్ని కాస్త చల్లారేలా చేయాలి ఇప్పుడు చర్మంపైన టాల్కం పౌడర్ వేసి బాగా రుద్ది తర్వాత దాని పైన ఈ మిశ్రమాన్ని రాయాలి.రాసిన దానిపై వాక్స్ స్ట్రిప్ పెట్టి దానిపై రుద్దాలి. ఇప్పుడా స్ట్రిప్ ని వ్యతిరేకదిశ […]

దేనికైనా ఒక పద్ధతి

ఒక పద్ధతి ప్రకారం చర్మ రక్షణ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మొహం కళకళలాడుతుంది అంటారు ఎక్స్పర్ట్స్.రోజుకు నాలుగు సార్లయినా నాణ్యమైన ఫేస్ వాష్ తో, లేదా పెసర పిండి, పాలు మిశ్రమం తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి రోజ్ బాత్ సాల్ట్ తో ముఖంపై మృదువుగా మసాజ్ చేస్తే మృతకణాలు పోతాయి. తరువాత చల్లని నీళ్లలతో కడిగేయాలి.దీని వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. నీళ్ళలో గుప్పేడు తులసి ఆకులు ఒక చుక్క లావెండర్ నూనె వేసి మరిగించి […]

ఇది సహజమైన స్క్రబ్ 

ఆవనూనెతో అందాన్ని పెంచుకోవచ్చు అంటారు  బ్యూటీ ఎక్స్ పర్ట్స్. ఆవాల్లో విటమిన్-ఇ ఉంటుంది ఇది చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.మంచి సన్ స్క్రీన్ లోషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది.ఆవనూనెలో ఒక చెంచా శెనగపిండి కాస్త పెరుగు వేసి కలపాలి.ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం పై నల్ల మచ్చలు తగ్గిపోతాయి.చర్మం మృదువుగా ఉంటుంది. చర్మం నిర్జీవంగా అనిపిస్తే పావుకప్పు ఆవ నూనెలో రెండు చుక్కలు రోజ్ […]

కాఫీ మాస్క్ తో మెరుపు

ముఖం తాజాగా కనిపించేందుకు కాఫీ పొడి పూత వేసుకోండి అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్.రెండు స్పూన్ల కాఫీ పొడిలో చెంచా బాదం నూనె కాసిన్ని పాలు రెండు స్పూన్ల తేనె వేసి పూతలా వేసుకోవాలి.ఒక పావు గంట ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం తాజాగా ఉంటుంది అలాగే రెండు స్పూన్ల కాఫీ పొడిలో తేనె, నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టి ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి.బాగా ఆరిపోయాక కొంచెం పంచదార చేతిలోకి తీసుకుని నీళ్లతో చేతులను […]

సహజమైన రంగు 

సౌందర్య పోషణకు బీట్ రూట్ ఎంతో ఉపయోగ పడుతోంది అంటారు ఎక్స్ ఫర్ట్స్ .బీట్ రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ప్రోటీన్ వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి,వీటిలోని సిలికాన్ ఖనిజం గోళ్ళు జుట్టు పెరగడం లో కీలకంగా పని చేస్తుంది.బీట్ రూట్ దుంప ఉడకబెట్టి మెత్తగా గుజ్జు చేయాలి దీనికి చెంచా బాదం నూనె రెండు చుక్కలు తేనె కలిపి ముఖానికి ప్యాక్ గా వేసుకుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది.రసాయనాలు […]

మెరుపు నిచ్చే పెసరపిండి 

టాన్ లేదా మొహంపై నలుపు పేరుకుపోవటం చాలా మంది సమస్య పెసర పిండితో ఈ సమస్యను పోగొట్టవచ్చు.పెసరపిండిలో గులాబీ నీరు, రోజ్ ఆయిల్, పంచదార కలిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.పావుగంట తర్వాత తడి చేతులతో  మృదువుగా రుద్ది కడిగేయాలి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పోతుంది. పెసర పిండి, తేనె, పెరుగు ప్యాక్  తో మొహం పై జిడ్డు పోతుంది. అలాగే పెసరపిండిలో గులాబీరేకులు ,పాలు కలిపి పేస్ట్ లాగా […]

చర్మం కాంతివంతం 

ఎండ వేడికి చర్మం కమిలిపోవడం చెమట వల్ల జిడ్డుగ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సరైన జాగ్రత్త తీసుకోకపోతే ట్యాన్,  మొటిమలు సమస్య వస్తుంది. అలాంటి సమయంలో పుచ్చకాయ రసం స్వాంతన  ఇస్తుంది. పుచ్చకాయ రసం మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఒక టీ స్పూన్ బార్లీ పొడి లో ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పట్టించి ఆరిపోయాక శుభ్రం చేస్తే ఎండదెబ్బకు కమిలిన […]

ఇవి సహజమైనవి

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోవలసి వస్తోంది. ఫేషియల్స్ కోసం పార్లర్ కు పోయే అవసరం ఏమి లేదు. ఇంట్లోనే కొన్ని రకాల ఫేషియల్స్ ట్రయ్ చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెరుగు,ఓట్ మీల్,తేనె ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా చేస్తోంది. ఈ మిశ్రమాన్ని మెత్తగా అయ్యేలా బాగా కలిపి మొహం పైన మాస్క్ లాగా వేసి ఓ పదిహేను నిముషాలు ఆలా వదిలేసి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. చర్మం చాలా మృదువుగా అయిపోతుంది. పసుపు,పెరుగు,జాజికాయ […]

మేకప్ కు బ్రేక్ మంచిదే 

హడావిడిగా తయారై ఆఫీసు పరుగులు తీయటం ఆపేసి ఇంటి నుంచే పనిచేసే రోజులు ఇవి .ఆఫీస్ కు వెళ్తూ కాస్తయినా  మేకప్ వేసుకుంటూ ఉంటారు .ప్రస్తుతం దానికి కూడా బ్రేక్ ఇవ్వడం మంచిదే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . సాధారణంగా మేకప్ చర్మ రంద్రాలను మూసేస్తూ ఉంటుంది .లిక్విడ్ ఫౌండేషన్ లు సిలికాన్ బెస్ట్ ప్రైమరీలు వల్ల ఒక్కసారి మొటిమలు బ్లాక్ హైడ్స్ కూడా వస్తూ ఉంటాయి .ఈ ఇంట్లోంచే పని చేసే రోజుల్లో మేకప్ కు […]

షేరింగ్ వద్దు 

అలంకరణ సామాగ్రిని ఎవరితో షేర్ చేసుకోకండి అనారోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా లిప్ స్టిక్ మస్కారా వంటి ఇతరులతో పంచుకోకపోవటమే మంచిది అంటున్నారు మేకప్ ఉత్పత్తులు వాడి నప్పుడు చర్మానికి ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే వాటిలో సూక్ష్మక్రిములు ఉన్నాయని అర్ధం. వాటిని ఎప్పుడు శుభ్రం చేయాలి. ఆల్కహాల్ ని ఉత్పత్తుల పై కాస్త స్ప్రే చేసి పూర్తిగా ఆరిన తర్వాత వాడుకోవాలి. మేకప్ ఉత్పత్తులను చేత్తో ముట్టుకోకూడదు. శుభ్రమైన బ్రష్ లు ఉపయోగించి మేకప్ […]

అందాన్నిచ్చే ఫేస్ ప్యాక్   

శనగపిండి మంచి స్క్రబ్బర్. మృత కణాలు తొలగించేందుకు ఎంతో బాగా పనికివస్తుంది. శనగపిండి లో నిమ్మరసం కలిపి చిక్కని పేస్ట్ లాగా చేసి మొహంపై రాసి ఆరిపోయాక నలుస్తు మఖం పై రబ్ చేస్తూ వుంటే ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు రాలిపోతాయి. మోచేతులు మెడ నల్లగా అనిపిస్తే శనగపిండి పసుపు కలిపి మాస్క్ లా వేస్తే నెమ్మదిగా నలుపు తగ్గిపోతుంది. ముఖం శుభ్రంగా ఉండాలంటే శనగపిండి కీరా రసం ప్యాక్ వేసుకోవాలి. ఆయిల్ చర్మం అయితే […]

సమ్మర్ ప్యాక్స్

వేసవి ఎండలు ముదురుతున్న కొద్దీ మొహం,మెడ నల్లబడుతూ ఉంటాయి.సన్ స్క్రీన్ లు రాసుకోన్న చర్మం నల్లబడుతూనే ఉంటుంది. క్రమం తప్పకుండా కొన్ని పేస్ ప్యాక్స్ వేసుకొంటు వుంటే సన్ ట్యాన్ పోతుంది. కొంచెం పాలల్లో నాలుగు చుక్కలు నిమ్మరసం చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలిపి ఆ ప్యాక్ మొహం పైన వేసి ఆరాక కడిగేస్తే సరి. తర్వాత మొయిశ్చ రైజర్ రాయాలి. అలాగే పాలల్లో గుజ్జు చేసిన టమోటా పసుపు ,నిమ్మరసం తేనె కలిపి ప్యాక్ […]

ఎప్పటికీ  మారని ఫ్యాషన్

ఎలాంటి వస్త్రధారణ కైనా మీనాకారి నగలు చక్కగా మ్యాచ్ అవుతాయి . రాజస్థానీ మూలాలు గల ఈ నగలు పర్షియా నుంచి వచ్చాయి . మీనాకారి వర్క్ చాలా సున్నితమైంది . ఆకులూ ,పువ్వులో ,పక్షులు మొదలైన డిజైన్ లను  చక్కని మెరిసే రంగులతో వివిధ మెటల్స్ డిజైన్ లను చక్కని మెరిసే రంగులతో వివిధ మెటల్స్ పైన పెయింటింగ్ చేసి ఈ నగల్ని తయారు చేస్తారు . ఈ పనితనం కళ్ళు చెదిరేలా ఉంటుంది . […]

అదృష్టాన్నిచ్చే విలువైన నగలు

ప్రాచీన కాలంలో మహారాజులు,రాచరిక కుటుంబీకులు నవరత్నాల ఉంగరాలు ఆభరణాలు ధరించేవాళ్ళు . ఈనగలు అందాన్నిస్తాయి అలాగే ధరించిన వ్యక్తుల మానసిక భావోద్రేక స్థితి గతులను సమతౌల్య పరుస్తాయి . తొమ్మిది రకాల విలువైన రాళ్ళూ కూర్చిన ఆభరణాలు ఇవి . కెంపు,పచ్చ ,ముత్యం ,పగడం ,వజ్రం ,వైడూర్యం ,నీలం, పుష్యరాగం,పిల్లికన్ను రాయిలతో ఈ నవరత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించటం వల్ల అదృష్టం ,మంచి భవిష్యత్తు ఉంటాయని ఆశిస్తారు . సూర్యుని చుట్టూ ఉన్నా గ్రహాలకు ఇవి చిహ్నాలుగా […]

నల్ల మచ్చలు మాస్క్

ఎండ ,కాలుష్యం వంటి ఎన్నో కారణాలతో మొహాం పైన మచ్చలు పడుతూ ఉంటాయి . ఈ నల్లమచ్చలు పోగొట్టాలంటే సహజమైన ఎన్నో వస్తువులు ప్రకృతిసిద్ధంగానే ఉన్నాయి . పచ్చికొబ్బరి గుజ్జుని మొహానికి పట్టించి ఓ అరగంట పాటు అలా వదిలేసి ముఖం శుభ్రం చేసుకొంటే ఈ మచ్చలు క్రమంగా పోతాయి . ఇది ప్రతిరోజూ చేయాలి . బంగాళాదుంప గుజ్జులో గులాబీ నీరు కలపి కాస్త తేనె కలపి ఈ మిశ్రమంతో పేస్ మాస్క్ వేసుకొని ఆరిపోయాక […]

నీట్ గా వేసుకోవచ్చు

కనురెప్పలకు  మస్కారా నీట్ గా వేసుకోవాలంటే దానికి నైపుణ్యం కావాలి . హడావుడిగా వేస్తే మస్కారా కళ్ళపై ముద్దలా పరుచుకొని చూసేందుకు బావుండదు . ఎంతో తొందర పని ఉండి హడావుడిగా బయటికి పోవాల్సి వస్తే ఈ మస్కారా షీల్డ్ గార్డ్ కనుక ఉంటే ,మస్కారా చెదిరి పోకుండా వేసుకోవచ్చు . దీన్ని కన్నుపైన ఉంచుకొని బ్రష్ తో మస్కారా దిద్దుకొంటే రెప్పలా పైన అంచుకోకుండా చక్కగా పరుచుకొంటుంది . దేన్నీ సాయంతో కాటుక చక్కగా పెట్టుకోవచ్చు […]

నేను గుర్తుంటే చాలు

నేనెప్పుడూ మంచి పేరు కోసమే పని చేశాను . ఒక సినిమా చేయాలా వద్దా అన్న విషయంలో నేనెప్పుడూ డబ్బు వైపు చూడలేదు . ఆ సినిమా వల్ల నాకు ఎంతో పేరు వస్తుందీ అన్న విషయం మాత్రం ఆలోచించుకొని కష్టపడుతూ వచ్చాను . అలాగే పేరు వచ్చింది . డబ్బు కూడా వచ్చేసింది అంటోంది సమంత . నాకేరీర్ లో పదేళ్ళు గడిచాయి . కాలం గడిచేసేది కొత్త హీరోయిన్లు వచ్చారు . కొందర్ని బాగా […]

నిండైన సౌందర్యం

యవ్వనవంతమైన చర్మం ,మెరిసే నిండైన బుగ్గలతో మొహం కళకళలాడి పోవాలి అంటే శక్తినిచ్చే ఆహారం తినాలి . క్రీమ్ లు మసాజ్ లతో ,రసాయనాలతో చేసే ఫేషియల్స్ తో ముఖ సౌందర్యం ఎంత మాత్రం పెరగదు, చర్మ ఆరోగ్యానికి మేలు చేసే మామిడి ,కమలా,బత్తాయి కర్బుజా, దానిమ్మ ,నేరేడు మొదలైన రంగురంగుల పళ్ళు తినాలి . వివిధ ఆకుకూరలు చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తాయి . కాఫీ ,టి లను అవతల పెట్టి మంచినీళ్ళు తాగాలి . […]

అందం పేరు ఆత్మవిశ్వాసం

ఆమెకు పుట్టుక తోనే చేతులులేవు. అయినా అంగవైకల్యం. ఆమె ఆత్మవిశ్వాసానికి ఏమాత్రం అడ్డం రాలేదు. మేక్సీ కో మోడల్ అనా గాబ్రియెలా మొలీనా  ఇటీవల నిర్వహించిన అందాల పోటీలో గెలిచి మిస్,నాన్ బిటాల్ 2020 గా ఎంపికైంది. వైకల్యం ఒక శాపం కాదు,భారం కూడా కాదు. దీన్ని గెలిచేందుకు నేను చిన్నపుటి నుంచి కృషి చేశాను. చేతులు లేకపోయిన నష్టాన్ని కాలివేళ్ళలో పూరించాను అందాల పోటీలంటే శారీరక కొలతలే కాదు, ఆత్మవిశ్వాసం కూడా అని నిరుపించేందుకే ఇంత […]