Gagana
భారత కోకిల సరోజినీ నాయుడు
సరోజినీ నాయుడు హైదరాబాద్ లో బెంగాలీ బ్రహ్మణ కుటుంబంలో 1879 ఫిబ్రవరి 13వ తేదీన జన్మించారు. భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె భారత స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి ,అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు అయిన సరోజినీ నాయుడు భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా. ఆమె ఆంగ్లంలో గోల్డెన్ త్రెషోల్డ్, ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్ వంటి కవితలు […]
పండిత రమా బాయి సరస్వతి
పండిత రమాబాయి కర్ణాటకలోని గంగమూల, కార్కాలలో 1858 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. భారతీయ సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధరణకు, స్త్రీ విద్యకు కృషి చేసిన మహిళ. సంస్కృత పండితురాలిగా ప్రసిద్ధి చెందారు. కలకత్తా పండితులు ఆమెకు ‘పండిత’, సరస్వతి అనే బిరుదులు ఇచ్చి గౌరవించారు. మహిళలు వైద్య విద్యాభ్యాసం చేసి డాక్టర్లు అయితేనే మహిళల ఆరోగ్యలు వృద్ధి చెందుతాయనే రమాబాయ్ సూచనలు విక్టోరీయా మహారాణి దృష్టికి వెళ్ళాయి. ఆ తర్వాత మహిళ వైద్య ఉద్యమమే వచ్చింది. […]
సావిత్రిబాయి ఫూలే
1831 మార్చి 10వ తేదీన జన్మించారు సావిత్రిబాయి ఫూలే . భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సర్వహక్కుల కోసం పోరాటం చేశారు. పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిన భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. సంఘ సంస్కర్తగానే కాదు రచయిత్రిగా ఆమె వేగు చుక్కగా నిలిచారు. సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకొంటున్నాము.
కస్తూరిబా గాంధీ
1869 ఏప్రిల్11వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు కస్తూరీబా. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భార్య. రాజకీయ నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు కస్తూరిబా. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యోగుల పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన ఉధ్యమంలో కస్తూరిబా అరెస్ట్ అయ్యారు. క్విట్ ఇండియా మూమెంట్ అరెస్టుల ద్వారానూ సబర్మాతి అశ్రమంలోని కఠినమైన జీవనం మూలంగాను ఆమె జబ్బుపడి కోలుకోలేకపోయారు. గాంధీజీ సిద్దాంతాలకు అనుగుణంగా నడుచుకున్నారు ఆమె. ఆయనకు నీడగా మెలగటం ఆమెను విశిష్ట మహిళగా […]
కెప్టెన్ లక్ష్మీ సెహగల్
కెప్టెన్ లక్ష్మీ సెహగల్ 1914 అక్టోబర్ 24వ తేదీన జన్మించారు. ఆమె ప్రముఖ సంఘ సేవకురాలు, రాజ్యసభ సభ్యురాలు. చిన్నతనం నుంచే సెహగల్ విదేశివస్తు బహిష్కరణ , మధ్యనిషేదం లో పాల్గొన్నారు. మద్రాస్ వైద్య కళశాలలో 1938లో ఎం.బి., బి.ఎస్. గైనకాలజీ పూర్తి చేశారు. తర్వాత సింగపూర్ వెళ్లీ అక్కడ భారతీయ నిరుపేదల వాడలో వైద్యశాల స్థాపించి సేవలు అందించారు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర ఉద్యమంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ’ మహిళా […]
మాదిరెడ్డి సులోచన
మాదిరెడ్డి సులోచన గారు శంషాబాద్ లో 1935 లో సంప్రదాయక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఎం.ఎ. ఎం.యిడి. చేసి ఉపాధ్యాయినిగా పనిచేశారు. ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాశారు. 150 కథలు 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. 10 నవలలు సినిమాలుగా వచ్చాయి. వాస్తవిక జీవిత చిత్రణకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగునాట నవలలన్ని విశేషంగా చదివే అలవాటు చేసిన వారిలో మాదిరెడ్డి సులోచన గారు ఒకరు. ఉత్తమ కథరచయిత్రి […]
యద్దనపూడి సులోచనారాణి
కృష్ణా జిల్లా కాజ గ్రామంలో 1940లో జన్మిచారు యద్దనపూడి సులోచనారాణి. 1970-80 ల్లో ఆమె తెలుగు పాఠశాల ఆరాధ్య కవయిత్రిగా కథలు, నవలలు, నాటికలు రాశారు. ఆమె నవలల్లో 15 సినిమాలుగా వచ్చాయి. మీనా, జీవనతరంగాలు, సెక్రెటరీ ,ప్రేమ లేఖలు, గిరిజా కల్యాణం ఇటు నవలలుగా సినిమాలుగా అపూర్వ ఆధారణ పొందాయి. టీవీ సీరియల్స్ గా బహుళ ప్రజాదరణ పొందాయి. ఆమె రచనలు మెచ్చుకుని ఆరాధించారు.
వాసిరెడ్డి సీతాదేవి
1933లో గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు వాసిరెడ్డి సీతాదేవి. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ చేశారు. 39 నవలలు 100 కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్ లో సీరియల్ గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరక్టర్ గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్రపెర్ల్‌బక్ తో పోలుస్తారు.
దుర్గబాయ్ దేశ్ ముఖ్
ప్రముఖ సంఘ సంస్కర్త , స్వాతంత్ర సమరయోధురాలు రచయత్రి దుర్గబాయ్ దేశ్ ముఖ్ 1909 జులై 15 వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. హిందీ పాండిత్యా న్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి విద్యా బోధన అందించారు. 1942 లో ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు. ఆమె స్థాపించిన ఆస్పత్రులు , కాలేజ్ లు ఈనాటికి స్త్రీల అభ్యున్నతి కోసం పని చేస్తున్నాయి. దుర్గబాయ్ దేశ్ ముఖ్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. న్యాయ కోవిదురాలిగా ప్రముఖ […]
కనుపర్తి వరలక్ష్మమ్మగారు
తెలుగు రచయిత్రి సమాజసేవిక కనుపర్తి వరలక్ష్మమ్మగారు 1896 అక్టోబర్ 6వ తేదీన బాపట్లలో జన్మించారు. 1919లో ఆంగ్లంలోకి అనువాదం అయిన సిరామనితో రచనలు చేయడం ప్రారంభించారు. గాంధీ గారిని కలిస జాతీయోధ్యమంలో పాల్గొన్నారు. బాలికల కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలి స్థాపించి స్త్రీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈమె తొలి నవల వసుమతి. రచనా కావ్యం విశ్వామిత్ర. గృహలక్ష్మీ స్వర్ణకంకణం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయత్రీ పురస్కారం. కవితా ప్రవీణ బిరుదు పొందారు. […]
ప్రయోగాత్మకంగా వుండాలి
నూటికి నూరు పాళ్ళు నాకు సాధాసీదాగా ఉండే కథలు నచ్చవు. ఇంతవరకు రెండు వందల కథలు విన్నాను. కానీ ఏడెనిమిది సినిమాలు మించి చేయలేదు అంటోంది నిత్యామీనన్. నేను చేసినవన్నీ ప్రయోగాత్మకాలే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజులో 23 సంవత్సరాల అమ్మాయి తల్లిగా నటించాను. ఇక ‘అ!’లో అయితే ఆ పాత్ర రాంగ్ మెసేజ్ వెళుతోందని నా సన్నిహితులు ఎంతో భయపడ్డారు. కానీ అవి నాకు మంచి పేరు తెచ్చాయి. కథ మంచిదైతే నాకు పారితోషికంతో […]
ఎండ నీళ్ళు తెలియదా ?
మలయాళ అమ్మాయి నివేదా థామస్ తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా చేస్తూ పూర్తిగా తెలుగు అమ్మాయిలా అయిపోయిది. మరి తెలుగు బాగా వచ్చా అని అడిగితే నివేదా ఇప్పటికి ఎదుటి వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకొంటున్నాను. చిన్న చిన్న పదాలు మాట్లాడగలను. కానీ తెలుగు ఎలాగైనా నేర్చుకోవాలని రాకపోయిన తెలుగులోనే మాట్లాడుతాను. ఒక సారి సెట్ లో నాకు వేడి నీళ్ళు తాగాలనిపించింది.హాట్ వాటర్ ను వేడి నీళ్ళు అంటారని తెలియదు . ఎండ నీళ్ళు కావాలన్నాను. సెట్ […]
రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరూ
జూన్ మూడో వారంలో జరుగనున్న మిస్ ఇండియా పోటిలను భాస్కరాల సాయి కామాక్షి, కామావరపు శ్రేయారావు హాజరవుతున్నారు. మెడిసిన్ పూర్తి చేసిన సాయి కామాక్షి హైదరాబాద్ లో ఉంటున్నారు. మిస్ ఇండియా తెలంగాణా 2018 గా కిరీటం సాధిమ్చింది సాయికామాక్షీ. వాయిస్ ఫర్ గర్ల్స్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి ఓఅని చేస్తుంది. అలాగే శ్రేయారావు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్త చేసింది. మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీకి దరఖాస్తు చేసింది. అలగే జూన్ లో జరిగా మిస్ […]
ఇవన్నీ మంచిరోజులు
స్టార్ అని ఎప్పుడైతే మనల్ని పిలవటం మొదలుపెడతారో ఇక జివీతంలో సవాళ్ళు ఎదురవుతాయి అంటుంది సమంత. త్వరలోనే ఆమె నటించిన రంగస్థలం రాబోతుంది. మొదట్ట్లో ఎవరు పట్టించుకోరు. స్టూడియోలో ఆదుతూ పాడుతూ పని చేస్తాం. ఒక స్థానంలోకి చేరాక మాత్రం ఇక శ్రద్దగా ఉండాలి. ఒక్క తప్పు చేసినా ఒక్క పరాజయం ఎదురైనా వేలెత్తి చూపిస్తారు. స్ట్టార్ స్టేటస్ అంత అషామాషి వ్యవహారం ఐతే కాదు సినిమా ఒప్పుకుంటే కథ, కాస్ట్యూమ్స్ ప్రతి విషయం శ్రద్దగా పట్టించుకోవాలి. […]
పాక్ లో సెనెటర్ గా కృష్ణకుమారి
సింధ్ ప్రావిన్స్ కు చెందిన కృష్ణకుమారి కొహ్లీ అనే మహిళ బిలావల్ భుట్టో జర్ధారీ సారధ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధిగా ఈమె పాక్ సెనెట్ గా ఎంపికయ్యారు. మైనారిటీలలో ప్రత్యేకించిన సింధ్ స్థానం నుంచి దళితమహిళ అయిన కృష్ణకుమారి కొహ్లీ ఎన్నికైన విషయాన్ని పీపీపీ ఒక అధికార ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ నుంచి సెనెటర్ గా మొదటిసారి ఎన్నికైన గౌరవం దక్కించుకుంది కృష్ణకుమారి. సింధ్ ప్రావిన్స్ లోని మారుమూల ప్రాంతం నగర్ పర్కర్ నుంచి కొహ్లీ […]
ఎలాంటి కసరత్తు లేదు
గ్లామర్ తో సంబంధం లేని పాత్రలు ఎంచుకోవటం నిత్యామీనన్ కు ఇష్టం పేరు వస్తుందా రాదా అన్న విషయం నేనెప్పుడు మనసులోకి తీసుకోలేదు. ఎన్ని కథలు విన్నా నచ్చిందే ఎంచుకుంటా అ సినిమాలో లెస్బియన్ పాత్రను చేశానంటే కేవలం ఇలాంటి అరుదైన పాత్రకు అవకాశం వచ్చిందన్న ఇష్టం అంతే అంటుంది నిత్యామీనన్. ఇలాంటి పాత్ర కోసం నేనేం అబ్జర్వ్ చేయలేదు. అంత సమయం కుడా లేదు, మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్లేటప్పుడు ఆ పాత్రని ఊహించుకున్నా ఆ […]
డ్యాన్స్, పాట రెండు ఇష్టం
డ్యాన్స్ అంటే నాకెంతో క్రేజ్. నా పదిహేనేళ్ళ వయస్సులో కొరియోగ్రాఫర్ ఆష్లే లోబోస్ డ్యాన్స్ క్లాసెస్ లో చేరాను. ఒక నెల గడిసే సరికి ఆయన నన్ను ఇన్ స్ట్రక్టర్ గా చేరటం ఇష్టమేనా అని అడిగారు. నాకు ఎక్జయింటింగ్ ఆఫర్ .డాన్స్ హార్క్స్ వెస్ట్రర్న్ డాన్స్ స్టూడియో . అక్కడ నేర్పించే ప్రాథమిక డ్యాన్స్ బ్యాలేట్,డ్యాన్స్ సంగీతం మాదిరే భావా వ్యక్తికరణకు రూపం అంటోంది సీరత్ కపూర్. టచ్ చేసి చూడు, రాజుగారి గది రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ […]
పేరు తెచ్చిన దయ్యం
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగులో నటించిన నందిత శ్వేత 2008 నుంచే సినిమాల్లో చేస్తోంది. 14 సినిమాల్లో నటించిన శ్వేత అవార్టులు కూడా తీసుకొంది. దయ్యం క్యారెక్టర్ అయినా అందులో అన్నీ రసాలు పండించింది . మా నాన్న కర్ణాటకలో బిజినెస్ వ్యాపారవేత్త. అమ్మ హాస్ వైఫ్. ఇద్దరు తమ్ముళ్ళున్నారు. ఎంబిఏ చేశాను. మా ఇంట్లో ముందేవరికీ సినిమాలు ఇష్టం లేదు. చాలా బలవంతంమ్మీద కన్నడలో ‘నంద లవ్స్ నందిత’ చేశాను. అది హిట్ ,తర్వాత […]
ఓవర్ ఎక్స్ పోజింగ్ వద్దు
మొదటి సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది పాలక్ లల్వాని. మరెన్నో హిందీ సీరియల్స్ కు పని చేశారు. ఈ రంగం గురించి ఆయనకు బాగా తెలుసు. సినిమాలకు కొత్త కనుక ఎలాంటి కథలు సూటవుతాయో ఆయన సలహా తీసుకుంటున్నా. సైకాలజీ అండ్ ఫిలాసఫీలో గ్రాడ్యూయేషన్ పూర్తైంది. సినిమాల్లోకి చాలా ఇష్టంతో వచ్చాను .కాస్ట్యూమ్స్ విషయంలో చాలా పర్టిక్యూలర్ గా అడిగి తెలుసుకొంటున్నాను. అలా అయితేనే సినిమాలో నన్ను ఎలా చూపించబోతున్నారో నాకు అర్థం […]
నేను లక్కీ
పదిహేనేళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో అప్ ఎండ్ డౌన్స్ రుచి చూసింది శ్రియ శరణ్. వరుస బెట్టి సినిమాలు చేస్తున్న నాకెప్పుడు బోర్ అనిపించలేదు. కానీ నన్ను ఇంకా నటిస్తారా అంటే మాత్రం విసుగ్గా ఉంటుంది అంటుంది శ్రియ. హాలీవుడ్ లో 60 ఏళ్ళు వచ్చే వరకు నటిస్తారు , ఇక్కడేమో 30 ఏళ్ళు వచ్చేస్తే రిటైరైపోమంటారు. కానీ నా విషయంలో నేను ప్లాప్ హీరోయిన్ ముద్ర ఎప్పుడూ వేయించుకోలేదు. అందుకే ఇన్నేళ్ళు నా కెరీర్ […]
