Wednesday, 29 Jul, 2026

ఇది మాట్లాడే సమయం

సాంకేతికంగా ప్రపంచం ఎంతో పురోగతి సాధించింది. కానీ పిరియడ్స్ విషయంలో ఆ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అమ్మాయిలను మహిళలను ఎడ్యుకేట్ చేసే పద్ధతులు ఏవి లేవు అంటూ తాప్సీ తన ఇంస్టాగ్రామ్ లో  ఒక వీడియో షేర్ చేశారు.మహిళలు బహిష్ఠు సమయంలో సాంప్రదాయ శానిటరీ పాడ్స్ ఉపయోగించడం వల్ల వచ్చే పిరియడ్ రాషెస్ చర్మం రంగు మార్చేసి జీవిత కాలం నల్లగా మచ్చలు మిగులుస్తాయి.ఇలాంటి ఎన్నో సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడక పోవటం వల్ల దానికి […]

బార్బీ డాల్ గా డి జె క్లారా

ఉమెన్స్ డే గిఫ్ట్ గా బార్బీ బొమ్మల కంపెనీ మాటిల్ ఈ ఏడాది మహిళా శక్తిని గౌరవిస్తూ డి జె క్లారా గా మార్కెట్లోకి తెస్తోంది. 36 ఏళ్ల క్లారా  బ్రిటిష్ రేడియో ప్రెజెంటర్. క్లారా యంఫో ఆఫ్రికన్ సంతతి బ్రిటిష్ మహిళ లండన్ లో బి బి సి పెజంటర్. జాతి హక్కుల కోసం జాతి వివక్షకు జత్వహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తింది  క్లారా. రిప్లేసెస్ అఫ్ హోప్ పేరుతొ బ్రిటిష్ పత్రిక వోగ్ ఎంపిక చేసిన […]

కొత్త మార్పు

మోడల్ పర్యావరణ కార్యకర్త దియా మీర్జా తన పెళ్లి సందర్భంలో కూడా సంప్రదాయాలు పక్కనపెట్టి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చింది.మహిళ షీలా అట్టా ఆధ్వర్యంలో ఆమె వివాహం జరిగింది. మగ పూజారులే  హిందూ సాంప్రదాయంలో పెళ్లిళ్లు జరిపిస్తూ ఉంటారు.వైభవ్ రాఖీ ని పెళ్లి చేసుకున్న దియా మీర్జా తన పెళ్లి లో కన్యాదానం చిరాయి వంటి కార్యక్రమాలు వద్దనుకుంది. ప్లాస్టిక్ వాడకుండా పెళ్లి మొత్తం పర్యావరణ హితంగా ఉండేలా జాగ్రత్త పడింది.

వయసు కేవలం సంఖ్య మాత్రమే

ఈ ఏడాది జరగబోయే ప్రపంచ ఒలంపిక్స్ లో టార్చ్ బేరర్ పోటీల్లో పాల్గొనేందుకు కసరత్తులు చేస్తోంది 118 ఏళ్ల జపనీస్ బామ్మ కేన్ తనకా  వంద మీటర్ల ట్రెక్ పోటీల్లో ఈమె పాల్గొంటోంది. 1903 లో పుట్టిన కు 19 ఏళ్ల కు పెళ్లయింది.ఈమె 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ని  ఎదుర్కొందీ.రెండు ప్రపంచ యుద్ధాలు చూసింది రెండుసార్లు క్యాన్సర్ ని జయించింది. 2019లో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలనే   గిన్నిస్ రికార్డ్ అందుకుంది. ఈ […]

ఈ లైంగిక హింస ఆగాలి

తమిళనాడులో 32 జిల్లాల్లో ఐదు మహిళా కోర్ట్ లు మాత్రమే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా ఈ  తరహా న్యాయస్థానాలు కోరుతూ సేవ్ శక్తి పేరుతో కోర్టులో పిటిషన్ వేశారు.మహిళలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కలిసినప్పుడే దీనికోసం 333 కోట్ల బడ్జెట్ ఉంటుందని తెలిసిందే  తర్వాత సేవ్ శక్తి పేరుతో ఎన్జీవో ను ప్రారంభించాను  సమస్యల్లో ఉన్న వారికి న్యాయ, ఆర్ధిక సాయం చేస్తాను అంటోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్ […]

బెంగళూరుని తీర్చిదిద్దారు

ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ హెప్సిబా రాణి 2019 లో బెంగళూర్ స్మార్ట్ సిటీ ఎండి గా బాధ్యతలు తీసుకొన్నారు.. కోఠి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఐ.ఐ.టీ ఢిల్లీలో పి.హెచ్.డీ చేసి రీసెర్చ్ తో పాటు సివిల్స్ కి  ప్రిపేర్ అయ్యారు 20 వ ర్యాంక్ తో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. తొలి పోస్టింగ్  కర్ణాటక  మాండ్వ జిల్లా చామ్ రాజ నగర్, గుల్బర్గా లో స్వచ్ఛ భారత్ మిషన్ తో నూటికి నూరు శాతం […]

మెదడు ఆరోగ్యానికి నిద్ర

ప్రశాంతమైన నిద్ర వల్ల మనస్సు, శరీరము చురుగ్గా ఉంటాయని తెలిసిన విషయమే కాని గాఢనిద్ర వల్ల మెదడు ఆరోగ్యం ఎంతో బావుంటుంది అంటున్నారు పరిశోధకులు.గాఢమైన నిద్ర లో న్యూరో డీజనరేటివ్ వ్యాధికి కారణం అయ్యేలా హానికర ప్రొటీన్లు నశిస్తాయని పరిశోధనల సారాంశం నిద్రలోనే కేంద్ర నాడీ వ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందుతుంది వ్యర్థాల తొలగింపు అనేది మెలకువ,లేదా నిద్రించే సమయంలో జరగవచ్చు అయితే గాఢ నిద్రలోనే మరింత మెరుగ్గా జరుగుతుంది.

పక్షులను రక్షించే బాధ్యత మనదే

రాధిక రామస్వామి భారతదేశంలో తొలి మహిళా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన రాధిక రామస్వామి ఢిల్లీలో స్థిరపడి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా పక్షులను కెమెరాలో బంధించటం మొదలుపెట్టారు. భారతదేశంలోని అన్ని అభయారణ్యాల లో తిరిగి అంతరించిపోతున్న పక్షి జాతుల ఫోటోలు తీశారు. తర్వాత ఆఫ్రికా అడవుల్లో ఫోటోలు తీశారు. మనకు ప్రకృతి ఎంత సమృద్ధమైన వనరులు ఇచ్చిందో అడవుల్లో తిరిగితేనే తెలుస్తుంది అంటుంది రాధిక రామస్వామి. వన్య ప్రాణుల తమ జీవితాలను […]

ఈ నీళ్లలో పోషకాలు

బియ్యం కడిగేసి ఆ నీళ్లు పార పోస్తాము. కానీ ఆ నీళ్లలో ఔషధతత్వాలు ఉన్నాయి అంటారు ఆయుర్వేద వైద్యులు. మొదటిసారి కడిగిన నీళ్లని కడుగు నీళ్ళు అంటారు. ఇది పోషకాలు ద్రవపదార్థం ఇందులో తవుడు తాలూకు పోషక విలువలు లభిస్తాయి.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో విటమిన్ డి విటమిన్ బి లోపం కనిపిస్తోంది. ఈ బియ్యం కడుగు నీళ్ళు లో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్ళు రోజువారీ తాగితే మూత్రకోశ వ్యాధులు రావు. […]

ఇది నొప్పులకు మందు

ఆవాలు ఆవపిండి ఎన్నో రకాల వంటకాల్లో వాడుకొంటారు. ఇవి శరీరం లోపలి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో శరీరంపై భాగంలో నొప్పులకు అలసిన కండరాలకు మంచి మందులా పని చేస్తాయంటున్నారు వైద్యులు. స్నానం చేసే నీళ్లలో రెండు స్పూన్ ల ఆవపొడి,కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ నీళ్లలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే నొప్పులు పోతాయి. ఆవాల్లో వుండే సల్ఫర్ శరీరం పై చర్మ ఇన్ఫెక్షన్లను రానివ్వదు నొప్పి,వాపును తగ్గిస్తుంది. చర్మం లో రక్త ప్రసరణ బాగా […]

ఈ వృత్తిలో ఆమె ఏకైక మహిళ

మధ్యప్రదేశ్ ఫోరెన్సిక్ విభాగం లో ఎండి చేసిన ఏకైక మహిళ గీతారాణి పేరు ఒక్కటే ఉంటుంది. ఫోరెన్సిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళ గానే కాకుండా 32 సంవత్సరాల వైద్య వృత్తిలో 9500 మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసిన రికార్డు కూడా డాక్టర్ గీతారాణి గుప్తా కే సొంతం భూపాల్ లోని మెడికో లీగల్‌ ఇనిస్టిట్యూట్ లో సీనియర్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు గీతారాణి. అలాగే ఫోరెన్సిక్ విభాగంలో శవపరీక్ష ఛాయాచిత్రాలు తీసే పనిలో కూడా […]

కోట్ల కొద్దీ ఫ్యాన్స్

సత్యవతి రాథోడ్ అనటం కంటే మంగ్లీ గానే ఆమె అందరికీ తెలుసు. ఆమె పాడితే కోట్లకొద్దీ వ్యూస్ వర్షం కురుస్తుంది. ‘సారంగదరియా’ ‘బూమ్ బద్దల్’ ‘రాములో రాములా ఎండికొండాలు ఏలేటోడా అడ్డ బొట్టు శంకరుడా పాటలు. ఆమె యూట్యూబ్ లేకపోతే నేను లేను తెలుగు ప్రజల ఆదరణ నేను ఊహించలేనంత ఇప్పుడు ఈషా ఫౌండేషన్ వారి పిలుపుతో శివుడి పాటలు పాడే అవకాశం వచ్చింది. ప్రపంచ వేదిక పైన నేను సద్గురు తో కలిసి పాడగలిగే అవకాశం […]

శాశ్వత పరిష్కారం వ్యాయామమే

రుతుక్రమ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి తగ్గేందుకు సాధారణంగా వేసుకునే మందులు కాకుండా వ్యాయామం ఎంచుకో మంటున్నారు అధ్యయనకారులు. మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ శాశ్వత పరిష్కారం కావు. ఇలాంటి ఇబ్బందులు గలవారిలో రెగ్యులర్ గా థ్రెడ్ మిల్ పైన నడవమని సలహా ఇస్తే శాశ్వత పరిష్కారం లభించింది. అని ఒక రిపోర్ట్ కొన్ని వందల మంది పై చేసిన  రీసెర్చ్ ఆధారంగా ఏదో ఒక సమయంలో ప్రతిరోజు మహిళలు వ్యాయామాలు […]

అవిశ్రాంతి పోరుకు గుర్తింపు 

సాంగ్ ఖుమి ఐజ్వాల్ కు చెందిన సామాజిక సేవకురాలు ఎందరో మిజో  మహిళలను అధికారులుగా నిలబెట్టారు ఆమె, మిజోరంలో మహిళలు చేసిన వివిధ ఉద్యమాల ఫలితంగా  ఆ రాష్ట్రా లా కమిషన్ మిజో వివాహ బిల్లు-2013ను వారసత్వ బిల్లు-2013 విడాకుల బిల్లు 2013 ను సమీక్షించేందుకు పూనుకుంది.. ఎంతో మంది స్థానిక మహిళా సంస్థ లతో కూడిన అపెక్స్ బాడీ ఎం. హెచ్. ఐ. పి దశాబ్దకాలంగా చేసిన పోరాట ఫలితం ఇది 60 ఏళ్ల సాంగ్ […]

షి ఈజ్ కంప్లీట్ ఇన్ హర్ సెల్ఫ్ 

మోనా సింగ్ నటించిన ఒక వీడియో ఇంటర్నెట్ సంచలనం prega news క్రియేట్ చేసిన ఈ వీడియో ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ బ్రాండ్ కి సంబంధించింది. ‘SHE IS COMPLETE IN HER SELF’ పేరుతో వచ్చిన ఈ ప్రకటన ని 23 లక్షల మంది చూశారు. ఇంకా చూస్తున్నారు మనదేశంలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానం లేనంత మాత్రాన ఆ స్త్రీకి సంపూర్ణత్వం ఉండదా ? అనే విషయం తో […]

కళాకారులకు సాయం 

సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ పిలుపుతో వందలాది మంది కళాకారుల కడుపు నింపింది డాక్టర్ భావన.. విజయవాడకు చెందిన భావన కూచిపూడి కళాక్షేత్రంలో ఎం.ఎ  డాన్స్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కళాకారులకు సాయం చేయటం కోసం పేజ్ బుక్  సృష్టించి రోజుకో కళాకారుని ఇంటర్వ్యూ చేస్తూ వారి కష్టాలను చెప్పించారు. లైవ్ మొదటి రోజునే ఎంతో మంది ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అమెరికా లండన్ నుంచి కూడా సాయం అందింది 20 లక్షల […]

సోలో ట్రిప్ లో నిధి కురియన్ 

కేరళ కు చెందిన నిధి కురియన్ ఒంటరిగా సొంత కారులో దేశాటన చేస్తోంది..ఈ ప్రయాణానికి ది గ్రేట్ ఇండియన్ సోలో ట్రిప్ అనే పేరు పెట్టింది.. ఆమె సొంత ఊరు కొట్టాయం, కొచ్చిలో నివాసం ఉంటుంది. ట్రావెల్స్కు సంబంధించిన బ్లాగ్ నడిపే నిధి  వంద రోజుల్లో 25 వేల కిలోమీటర్ల సోలో ట్రిప్ చేయాలనుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన కొచ్చి నుంచి బయలుదేరిన నిధి తమిళనాడు పాండిచెర్రి మీదుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించింది . విశాఖ మీదుగా […]

విద్య పురస్కారం ఆమె లక్ష్యం 

భువనేశ్వర్లో పేరున్న సమాజ సేవకురాలు శాంతి.. ఆమె పుట్టిన ఊరు ఒడిస్సా బాలాసోర్ జిల్లాకు చెందిన ఆమె సేవా సమాజం అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. 17 ఏళ్ల వయసులో మహాత్మాగాంధీ అనుచరుడు రతన్ దాస్ తో పెళ్లయింది.పెళ్లి తర్వాత కోరాపుట్ వచ్చిన ఆమె రాయగడ్ జిల్లా లోని గోబరపల్లి లో ఒక ఆశ్రమం నెలకొల్పి గిరిజన ఆడపిల్లల విద్య అభివృద్ధి కోసం కృషి చేశారు గుణ పూర్ లో సేవా సమాజ్ ఆశ్రమం స్థాపించి అనాధ […]

కిరణ్ అర్జన్ దాస్ అహుజా

కిరణ్ అర్జన్ దాస్ అహుజా అమెరికాలోనే 20 లక్షల 80 వేల మంది ఫెడరల్ ఉద్యోగులకు కొత్త అధికారి. స్వయంగా బైడెన్ ఆమెను ఈ పోస్ట్ లో నియమించారు. భారతీయ సంతతికి చెందిన కిరణ్ అహుజా జార్జియా రాష్ట్రంలోని సవానా లో పెరిగారు.. జార్జియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 49 సంవత్సరాల పౌర హక్కుల న్యాయవాది. ప్రస్తుతం ఆమె యు .ఎస్ పరోపకార సంస్థల ప్రాంతీయ యంత్రాంగం అయిన ప్రసిద్ధి ఫిలాం థ్రోఫీ నార్త్ వెస్ట్ […]

ఈమె ప్రపంచాన్ని మారుస్తోంది

ప్రపంచాన్ని మారుస్తున్న 50 మంది మహిళల జాబితాలో వన్యప్రాణి ప్రేమికురాలు సుప్రజా ధరణి పేరు చోటు చేసుకుంది చెన్నయ్ లో నివసించే సుప్రజా ది సముద్రం తో ఎంతో అనుబంధం అక్కడ అంతరించిపోయే దశలో ఉన్న రిడ్లే తాబేళ్లను కళ్లతో చూసింది గాయాలు పాలైన తాబేళ్లను వాటి గుడ్ల కోసం చంపేసే వాళ్లను గమనించింది గుడ్లు పెట్టేందుకు సముద్రంలో ఎంతో దూరం ప్రయాణం చేసి ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టే ఈ తాబేలు రక్షణ భారం తీసుకొంది […]