Chinna Maata
ఆర్మీ మీడియా హెడ్ గా ఆర్చి
ఇండియన్ ఆర్మీ కి చెందిన ఏ డిజిపిఐఈ విభాగంలో అధికారిక వెబ్సైట్ ప్రారంభం అయింది. ఒక యూట్యూబ్ ఛానల్ భారత రక్షణ దళానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా పని చేసేలా నిర్మితమైంది.సరిహద్దుల్లో తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన మేజర్ ఆర్చి ఆచార్య వీటి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. భారత దేశానికి అందిస్తున్న సేవలు ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న పోరాటాలు మొదలైన అంశాలు ప్రజలకు తెలియజేస్తోంది .వారి సేవా భావం పైన అవగాహన కల్పిస్తోంది. ఈ బాధ్యతలు […]
నిండుగా పోషకాలు
వర్ష కాలంలో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్నో పోషకాలు ఉన్న వాల్ నట్స్ ప్రతిరోజూ తినాలి. వీటిలోని విటమిన్లు క్యాలరీలు ఫైబర్ ప్రొటీన్లతో పాటు కాపర్ మెగ్నీషియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.నిద్రలేమి ,ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.వీటిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. వాల్ నట్స్ రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తాయి.అవయవాలకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా వయసు మీద […]
టాబ్లెట్లు దండగే
ఈ మధ్యకాలంలో కరోనా జాగ్రత్తలలో భాగంగా ఎంతోమంది మల్టీ విటమిన్,విటమిన్-సి, జింక్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు.అయితే ఏదైనా పోషకాహార లోపం ఉంటే తప్ప అధిక మోతాదులో ఈ విటమిన్లు సప్లిమెంట్ల వల్ల ఉపయోగం లేదనే అంటున్నారు డాక్టర్లు.కషాయాలు టాబ్లెట్ల కంటే ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటేనే రోగ నిరోధక వ్యవస్థ బాగా పని చేస్తుందని చెపుతున్నారు.ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, గుడ్లు, పప్పులు, గింజలు, విటమిన్ సి ఉండే తాజా పండ్లు పచ్చి కూరలు అల్లం వెల్లుల్లి ధనియాలు పసుపు […]
మట్టి గణేశుని పూజిద్దాం
వినాయక చవితికి ఏక గణపతి ని తయారు చేయించండి విగ్రహం కోసం మెత్తగా తయారు చేసిన మట్టిలో పెసలు ఆవాలు కూరగాయల గింజలు కలపమంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.చవితి వేడుకలు అయ్యాక ఈ విగ్రహాన్ని నీళ్లలో కరిగించి ఒక చిన్న తొట్టిలో వేస్తే వారం రోజుల్లో అందులో ఉంచిన గింజలు మొలకలు వస్తాయి.ఆ పచ్చదనం ఎప్పటికీ వాడిపోని పండగ అలాగే ఉంటుందంటున్నారు.వినాయకుడిని తయారు చేసే విధానం యూట్యూబ్ వీడియోలో చూడవచ్చు బంక మట్టి నీరు టూత్ పిక్స్ గానీ […]
మొటిమలకు కలబంద
మొటిమల సమస్య టీనేజర్లలో ఎక్కువ. చర్మతత్వాన్ని బట్టి ఎన్నో చిట్కాలు పాటించవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. సాధారణ చర్మానికి తేనె కాంబినేషన్ తో కూడిన ప్యాక్స్ పనిచేస్తాయి.పొడి చర్మం ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ ఉన్న క్రీమ్స్ ప్యాక్స్ వేసుకోవాలి.ముల్తానీ మట్టి, శెనగపిండి ప్యాక్ వేసుకోవచ్చు అలాగే కలబంద గుజ్జు కూడా మొటిమలకు మందు లాంటిది. జిడ్డు చర్మం ఉంటే సిట్రస్ ఫేస్ ప్యాక్స్ ఎక్కువ వాడాలి. సబ్బుతో కాకుండా మైల్డ్ ఫేస్ వాష్ తో మొహం కడుక్కోవాలి.ఎలాటి […]
ఇక పీరియడ్ లీవ్
పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకున్నాం.ఇక మొదట మా సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు లీవ్ తీసుకోవచ్చు అని జొమాటో కంపెనీ సిఈఓ దీపేందర్ గోయల్ ప్రకటించారు.ఈ సౌలభ్యంతో జొమాటో లో పనిచేసే మహిళా ఉద్యోగులకు రెగ్యులర్ సెలవులతో పాటు మరో పది రోజులు అదనపు సెలవు దొరికింది.జొమాటో భారతదేశంలో గురుగావ్ లో మొదలై ఇవ్వాళ 24 దేశాల్లో సేవలు అందిస్తోంది.ఆ సంస్థలో ఐదు వేల […]
పొట్ట లో బాగాలేదా ?
ఒక్క సారి పొట్ట అప్సెట్ అవుతోంది.జీర్ణ వ్యవస్థ యధాస్థితికి రావాలంటే బొప్పాయి సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు.ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.అలాగే అరటిపండు కూడా,వాము సోంపు నమ్మిన కషాయం తాగిన మేలు చేస్తుంది. వీటిలోని ఫైటో న్యూట్రియంట్లు పొట్ట ఉబ్బరం తగ్గిస్తాయి జీలకర్ర పొడి మజ్జిగలో వేసుకుని తాగితే అది జీర్ణ సంబంధ స్రావాల విడుదలకు తోడ్పడి జీర్ణక్రియను చక్కదిద్దుతుంది. అల్లం రసం నిమ్మకాయ రసం తో కలిపి తేనె వేసి తాగితే […]
ప్రసవ వేదన తగ్గుతోంది
గర్భిణీ గా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తూ చురుకుగా పనులు చేసుకునే వారికి కాన్పు తేలికగా అవుతోందని ఎప్పుడో పెద్దలు చెప్పారు.అయితే ఈ వ్యాయామం తో ప్రసవ నొప్పులు సమయం తగ్గుతోందని పరిశోధనలు చెబుతున్నాయి 500 మంది పై చేసిన ఓ అధ్యయనంలో ప్రసవించేప్పుడు నొప్పులు పడే సమయం. తల్లి బరువు బిడ్డ బరువు కాన్పు జరిగిన తీరు మొదలైన విషయాలు పరిశీలించారు. వ్యాయామం చేసిన మహిళల్లో కాన్పు తర్వాత శరీరాకృతి ఏమాత్రం పాడవకుండా యధాస్థితికి చాలా త్వరగా […]
ఆయుర్వేద మాస్క్ లు
తెలంగాణలోని నారాయణపేట మహిళలు తయారు చేసిన ఆయుర్వేద మాస్క్ లు ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.పుదీనా, లవంగం, తులసి, కర్పూరం, వాముతో సంజీవ ధార మిశ్రమాన్ని తయారుచేస్తారు వీటి తో మాస్క్ లను మంచి ఆరబెడతారు.వీటిని వారం వరకు ఉపయోగించవచ్చు శ్వాస పీల్చినప్పుడు ఆయుర్వేద ఔషధ గుణాలతో ఉండే వాసన లోపలికి వెళుతుంది. నాణ్యమైన కాటన్, పోచంపల్లి, నారాయణపేట వస్త్రాలతో వివిధ రకాల డిజైన్ లతో ఈ మాస్క్ లను తయారు చేస్తున్నారు.హైదరాబాద్ లోనే లక్ష […]
నీళ్లు నిలిచిపోయాయా ?
వంటింటి సింక్ లో ఒక్కసారి నీళ్ళు నిలిచిపోయి ఇబ్బంది పెడతాయి.అలాంటప్పుడు నీళ్లు బాగా మరిగించి అందులో బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్ కలిపి ఆ మిశ్రమాన్ని గొట్టంలో పోసి వేగంగా నీళ్లు పోస్తే చాలు నీళ్లు సులువుగా వెళ్లిపోతాయి.అలాగే అరకప్పు బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ కలిపి కూడా పోయవచ్చు.అలాగే సమాన పరిమాణంలో ఉప్పు, వంటసోడా, బోరాక్స్ పౌడర్, వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని గొట్టంలో పోసి నీళ్లు వదిలితే మురికి వదిలిపోయి నీళ్లు సాఫీగా కదులుతాయి.
తీర్చి దిద్దుకోవచ్చు
కను బొమ్మలు చక్కని ఆకృతితో ఉంచుకోవటం ఎంతో మందికి అలవాటు.కరోనా సమయంలో బ్యూటీ క్లినిక్ లకు వెళ్లలేక పోతే ఇంట్లోనే వాటిని తీర్చిదిద్దుకోవచ్చు ముందుగా ముఖాకృతి కి తగ్గట్లు ఐబ్రో పెన్సిల్ తో మార్క్ చేసుకుంటే ఎక్కడ ఎలా తీర్చి దిద్దుకోవాలి తెలుస్తుంది.రైజర్ల తో వెంట్రుకలు తొలగిస్తే చర్మం కందిపోతుంది ఐబ్రో ఎలక్ట్రికల్ ఎపిలెటర్ లు దొరుకుతాయి.అయితే జాగ్రత్తగా ఐబ్రో పెన్సిల్ గీత ను అనుసరించి ట్రిమ్ చేసుకోవాలి. ఈ వెంట్రుకలు చాలా తొందరలోనే పెరుగుతాయి.కనుక వెంట […]
లక్షణాలు ఇవే
చర్మం పైన ఎర్రని దద్దుర్లు ర్యాష్ చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు ఉంటే కొంచెం జాగ్రత్త గా ఉండండి అంటున్నారు వైద్యులు.కోవిడ్ ప్రధాన లక్షణాలు కనిపించేందుకు ముందు చర్మానికి సంబంధించిన లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తాయి చర్మం పై ఎర్రటి మచ్చలు కనిపించినా ముందుగా ఐసోలేషన్ లోకి వెళ్లాలి ఐదు రోజుల తర్వాత ఎలాంటి దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలు కనిపించకపోతే నిశ్చింతగా ఉండవచ్చు.కరోనా వచ్చిన వారిలో నిర్దిష్ట లక్ష్యం జ్వరం దగ్గు, దగ్గు తో […]
శ్రద్దగా పెంచితే ఇల్లే ఉద్యానవనం
లాక్ డౌన్ సమయాన్ని మొక్కల పెంపకం తో సద్వినియోగం చేయమంటున్నారు ఎక్సపర్ట్స్. కాస్త ఎండ పొడ తగిలే బాల్కనీలో క్యారెట్, బంగాళాదుంప,ఆస్పరా గస్ ,బ్రొకోలి,క్యాబేజీ కాలిఫ్లవర్,వెల్లులి,బఠాని ముల్లంగి మెంతి వంటివి తేలికగా పంచవచ్చు. అలాగే పీస్ లిల్లీ అంథురియం,బిగోనియ,ఆఫ్రికన్ వైలెట్ వంటి పూల మొక్కలు పెంచవచ్చు. కాస్త ఎండ మాత్రం తగులుతోంది కనుక బలమైన ఎరువు వేయాలి. అప్పుడప్పుడు కుండీని ఎండ వైపుకు మార్చాలి. రోజుకు ఐదారు గంటలు కాస్త సూర్యరశ్మి పడేలాగా శ్రద్దగా పెంచితే చక్కగా […]
అక్షరాల చదువుల తల్లి
శ్రీనగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివిన అస్మా షకీల్ ఇంటర్ ఫలితాల లో 98.2 శాతం మార్కుల తో జమ్ము కాశ్మీర్ లోయలో టాపర్ గా నిలబడింది ఆమెకు అమెరికాకు చెందిన జార్జ్ టౌన్ యూనివర్సిటీ తన కతార్ శాఖలో ఆస్మా పై చదువులు చదివేందుకు పూర్తిస్థాయి స్కాలర్ షిప్ మంజూరు చేసింది.దీని విలువ రెండు కోట్ల రూపాయలు అలాగే అస్మా ఇంగ్లాండ్ లోని నాటింగ్ హోమ్ యూనివర్సిటీ నుంచి ఆసియా ఎక్స్లెన్స్ అవార్డు అందుకుంది.దీని […]
కంటికి రక్షణ
గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళు అలసి పోతాయి.నయనాలను అలసట లేకుండా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే గింజలు, విత్తనాలు, ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు, చేపలు తీసుకోమంటున్నారు ఆహార నిపుణులు.జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, వేరుశెనగపప్పు ల్లో ఉండే ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు సజ్జ అవిసె గింజల్లో ఉండే విటమిన్ -ఇ ఆకుకూరల్లో ఉండే ల్యుటిన్, గ్జియాంతిన్ , విటమన్-సి, కె, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్యారెట్ లలో ఉండే విటమిన్-ఎ, […]
ఇది బ్రేక్ ఫాస్ట్ బౌల్
బరువు తగ్గేందుకు బుధ బౌల్ డైట్ ఫాలో అవుతున్నారు చాలామంది. అంటే ఒక గిన్నెలోని ఆహారం మాత్రమే తీసుకోవాలని,ఆ బౌల్ లోనే అన్ని పోషకాలు ఉండే లాగా చూసుకోవాలి అని చెబుతారు ఎక్స్పర్ట్స్.ఈ డైట్ లో సహజంగా లభించే ఆహార పదార్థాలు వాడతారు పోషకాహార నిపుణులు సలహా ప్రకారం బ్రేక్ ఫాస్ట్ బౌల్ లో ఒక అరకప్పు మొలకలు,ఉల్లికాడ టమోటో, కొత్తిమీర, క్యారట్,చిల్లీ సాస్, ఉప్పు, కారం, నిమ్మరసం, బొప్పాయి, మొక్కలు,ఎనిమిది నాన బెట్టిన బాదం పప్పులు […]
క్రిస్టల్ టి షర్ట్స్
వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతో మంది ఇళ్లలోంచే వర్క్ చేస్తున్నారు.టీ షర్ట్ లతో నే రోజు గడిచిపోతోంది క్యాజువల్ లుక్ మారుపేరైన టీ షర్ట్ లు మిల మిల లాడే గ్రాండ్ లుక్ తెప్పించారు డిజైనర్స్. నల్లని టీ షర్ట్ లకు సప్త వర్ణాల కాంతిని విరజిమ్మే స్వరోవ్స్కి క్రిస్టళ్ళు, రాళ్లు జోడించారు పువ్వులు, తీగలు, పక్షులు మొత్తం రాళ్లతోనే సృష్టించారు. సీతాకోక చిలుకలు, నెమళ్ళు ఫ్యాషన్ ఐకాన్లు నిలిచిన హృదయకారాలు, స్మైలీ డిజైన్ లు సంస్కృతిని […]
వర్షాల్లో జాగ్రత్త
వర్షాలు పడటం మొదలు పెట్టాక వాతావరణంలో తేమ పెరుగుతోంది. రకరకాల వైరస్ లు బ్యాక్టీరియా ఫంగస్ లు వల్ల అనారోగ్యాలు వస్తాయి.శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు గానూ నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు బాదం, పిస్తా, ఆక్రోట్, పొద్దుతిరుగుడు గింజలు అరటిపండ్లు ఉడికించిన దుంపలు ఉడికించిన శనగలు తప్పనిసరిగా తినాలి ఆకుకూరల్లో పప్పు ధాన్యాల్లో .ఉండే ఫోలేట్,సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్-డి పెరుగు మజ్జిగ ల నుంచి వచ్చే ప్రోబయోటిక్స్ ఇవన్నీ రోగ నిరోధక శక్తిని […]
కరోనా కషాయం
ఈ కరోనా సమయంలో ఔషధ కషాయం తాగమంటున్నారు ఆయుర్వేద వైద్యులు.ఇందుకు కావాల్సిన పదార్థాలు ధనియాలు అర కప్పు, జీలకర్ర పావు కప్పు, మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు, సోంపు ఒక టీ స్పూన్,యాలుకలు, లవంగాలు 10, పసుపు అర టీ స్పూన్ సొంఠి పొడి అర టీ స్పూన్, తాటి బెల్లం రెండు టీ స్పూన్లు, నీరు రెండున్నర కప్పులు పాలు పావు కప్పు ముందుగా ధనియాలు జీలకర్ర మిరియాలు సోంపు, యాలుకలు, లవంగాలు సన్నని మంటపైన […]
మెహందీ స్టెన్సిల్స్
గోరింటాకు పెట్టుకోవడం అందరికీ ఇష్టమే కానీ హెన్నా డిజైన్లు పెట్టాలంటే కాస్త కల ప్రావీణ్యత కావాల.హెన్నా స్టెన్సిల్స్ తో చూడ చక్కని పువ్వులు, లతలు ముద్దులొలికే ముగ్గులు అరచేతిలో అలంకరించుకోవచ్చు. ఈ స్టెన్సిల్స్ మందపాటి ప్లాస్టిక్ స్టిక్కర్స్ లాగా ఉంటాయి వాటి పైన పల్చని పొరను తొలగించి చేతి పైన అతికిస్తే రంధ్రాలు గా డిజైన్ కనిపిస్తుంది.ఆ రంధ్రాల నిండా మెహందీ నింపితే ఈ డిజైన్ చేతి మీద ప్రత్యక్షం అవుతోంది తీసేసి కడిగేసుకుంటే చాలు. అందమైన […]
