Chinna Maata
ప్రియా మాల్యా జిన్నోవ్ అవార్డ్
ఈ సంవత్సరం జిన్నోవ్ అవార్డ్ నెక్స్ట్ జనరేషన్ ఉమెన్ లీడర్స్ కేటగిరిలో ప్రియా మాల్యాకు వచ్చింది ప్రియా మాల్యా ఐబీఎంలో సాధారణ ఉద్యోగి గా చేరారు స్టూడెంట్ డెవలపర్స్ పైన దృష్టి పెట్టి 2018 లో ‘కాల్ ఫర్ కోడ్’అనే కార్యక్రమం ప్రారంభించారు ఇది కోడింగ్ కాంపిటీషన్ దీనిద్వారా డెవలపర్స్ రకరకాల ఇన్నోవేషన్స్ పరిష్కారాలు రూపొందించవచ్చు. అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించవచ్చు.ఈ ఏడాది వాతావరణ మార్పులపై దృష్టి పెట్టారు కోవిడ్-19 సంక్షోభానికి సంబంధించి టెక్నాలజీ పరిష్కారాలు రూపొందించేందుకు […]
దినుసులు జాగ్రత్త
వర్షా కాలంలో తేమ తో వంటకు ఉపయోగించే దినుసులకు బూజు, పురుగు పడతాయి.పప్పు దినుసులు బియ్యం మొదలైన వాటిని నిల్వ చేయటం లో జాగ్రత్తలు తీసుకోవాలి.చిరు ధాన్యాల పప్పులు నిల్వచేసే డబ్బాలు బాగా తుడిచి ఎండలో పెట్టి శుభ్రం చేసిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే ఇవి పురుగులు రాకుండా చేస్తాయి. అలాగే సేమియాలు నిల్వచేసే ముందర కాస్త వేయిస్తే పురుగు పట్టవు.లేదా సేమ్యాలు ఉన్న డబ్బాలో కాసిన్ని లవంగాలు వేయాలి.పిండి ఉన్న డబ్బాలో రెండు మూడు […]
శ్రమను పోగొట్టే స్నానం
ఆయుర్వేద స్నానం చేయండి ,అది శ్రమను మరిచిపోయేలా చేస్తుంది అంటున్నారు వైద్యులు.నీళ్లలో గంధంపొడి, మల్లెలు, గులాబీలు వేసుకుని స్నానం చేస్తే శరీరం చక్కని సువాసనతో ఉంటుంది.అలాగే కమలాపండు లేదా నిమ్మ తొక్కలను వేడి నీళ్ళలో వేస్తే ఆ నీళ్లకు ఆ వాసన పడుతోంది.ఆ నీళ్ళతో స్నానం శరీరాన్ని తేలిక చేస్తుంది.వేడి నీళ్లలో పసుపు వేపాకులు వేసి స్నానం చేస్తే నీళ్లలోని క్రిములు నశించి పోతాయి.గోధుమ పిండి ఓట్స్ సమానంగా తీసుకోని దీనిలో చిటికెడు పసుపు కొద్దిగా మీగడ […]
కరోనా వచ్చి తగ్గిందా ?
కోవిడ్ -19 వచ్చి కోలుకున్నాక కూడా ఆకలి తక్కువగా ఉండటం ఆహారం రుచించక పోవడం వల్ల నీరసంగా అనిపిస్తుంది. ఆహారంలో శక్తి నిచ్చే పిండి పదార్థాలు మంచి కొవ్వులు మాంసకృత్తులు జీవ వ్యవస్థ లన్నింటి పనితీరు సక్రమంగా ఉంచే విటమిన్లు ఖనిజాలు అన్నింటిని తగ్గ పాలలో తీసుకుంటేనే త్వరగా కోలుకో గలుగుతారు.ఉదయం అల్పాహారంలో గుడ్డు పాలు మొలకెత్తిన గింజలు పండ్లు తీసుకోవాలి.భోజనంలో రొట్టెలు, అన్నం, పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, చికెన్, చేపలు వంటివి మాంసాహారం, పెరుగు ఉండాలి […]
ముదురు రంగులు బెస్ట్
వర్షపు రోజుల్లో ఇంట్లో తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.కార్పెట్ పై దుమ్ము ధూళి బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతూ ఉంటుంది.అందుకే వర్షపు రోజుల్లో కార్పెట్లు వాడకూడదు.ఈ సీజన్ లో ముదురు రంగుల కర్టెన్లు వాడాలి.రెయిన్ కోట్లు, గొడుగులు ఇంటి బయట బాల్కనీ లోనే వేలాడ దీయాలి. ఫర్నిచర్ లో తేమ లేకుండా ప్రతిరోజు పొడి బట్టతో తుడవాలి.ఇంట్లో ఉతికిన బట్టలు గాలి తగిలేలా ఆరనివ్వాలి.బాగా పొడిగా అయ్యాక నే మడతలు వేసి కప్ బోర్డ్ లో పెట్టాలి.వంటగది […]
నిస్రీన్ అల్ సయీమ్
నిస్రీన్ అల్ సయీమ్ ‘ సూడాన్ యూత్ ఆర్గనైజేషన్ ఫర్ క్లైమేట్ ‘కు ఛైర్ పర్సన్ యూత్ అండ్ ఎన్విరాన్మెంట్ సుడాన్ సమన్వయకర్త పారిస్ అగ్రిమెంట్ 2012 ను సుడాన్ ఎడాప్స్ చేసుకోవటంలో కీలక పాత్ర పోషించింది.పర్యావరణ స్పృహ కు సంబంధించిన జ్ఞానం కలిగి ఉండటం ఎంత అవసరమో దీన్నిఇతరులకు పంచటం అంతే అవసరం అంటోంది నిస్రీన్ ఆల్ సయీమ్.ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ అడ్వైజరీ గ్రూప్ కు ఎంపికైన వారిలో ఒక్కరూ నిస్రీన్.
ఇది గ్రంథాలయం
లాల్ బహదూర్ వయనశాల అండ్ గ్రంధాలయం పేరున్న ఈ భవనం చూస్తుంటేనే కన్నుల పండగ.కేరళలోని కన్నూర్ జిల్లాలోని పయ్యాన్నూర్ దగ్గరలోని కరాయిల్ లోని ఈ గ్రంథాలయం అందమైన పుస్తకాల రూపంలో ఉంటుంది. గ్రంథాలయంలో వరుసలుగా పుస్తకాలు సర్దినట్లే గది గోడలు అంతస్తులు పుస్తకాలు రూపంలో కనిపిస్తాయి. లైబ్రరీలో ఉండవలసిన పుస్తకాలు బయటికి వచ్చి పాఠకులను రారమ్మని పిలిచి నట్లే కనిపించే ఈ గ్రంథాలయం ఆ వూరికే ఒక అలంకారం .
సహజ క్లెన్సర్
అందానికి ఆరోగ్యానికి ఆముదం చక్కని ఔషధం అంటారు వైద్యులు.ఇది సహజ క్లెన్సర్.ముఖం పై పేరుకున్న దుమ్ము ధూళి శుభ్రం చేస్తుంది.చర్మంలో తేలికగా ఇంకిపోయే గుణం ఉండటం వల్ల చర్మం నిగారింపు గా ఉంటుంది.వేడినీళ్లలో స్పూన్ ఆముదం వేసి ఆవిరి పడితే చర్మ కణాలు శుభ్రపడి ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది.పొడి చర్మ తత్వం ఉంటే రాత్రి వేల ముఖానికి రెండు చుక్కల ఆముదం రాసి మర్దనా చేసి అలా వదిలేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో మొహం కడుక్కుంటే చర్మం […]
ఇది ప్రకృతి ప్రసాదిత ఔషధం
ఈ సీజన్ లో వాక్కయలు ఎక్కువగా వస్తాయి.ఈ వర్షాల్లో జలుబు, దగ్గు, అజీర్తి వంటి సమస్యలు ఎక్కువ.వీటికి ప్రకృతి సిద్ధమైన ఔషధం వక్కయులే.వాక్కాయి అరుగుదలను పెంచుతుంది.కూరలలో చింతపండు బదులు వాక్కాయి వాడవచ్చు.వీటిలో విటమిన్ సి చాలా ఎక్కువ పచ్చడి లాగా సలాడ్ లాగా చేసుకోవచ్చు.ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఆందోళన తగ్గిస్తాయి.ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ పెంచుతాయి. పప్పు, పులిహోర, సాంబారు,మురబ్బా, హల్వా ఇలా ఎన్నో రకాలుగా వాక్కాయిను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు..వాక్కాయ కొబ్బరి ముక్క లు పచ్చి […]
రోజంతటికీ శక్తి
ఉదయపు అల్పాహారం గా పీచు తో కూడిన ఓట్స్ తీసుకుంటే శరీరానికి కావలసిన పోషణ శక్తి అందుతోంది.ప్రాసెస్ చెయ్యని ఓట్స్ లో పోషకాలు మెండుగా ఉంటాయి అలాగే పండ్లు పెరుగు సమ్మేళనం ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.పెరుగులోని ప్రోబయోటిక్స్ పీచు ఫాలి ఫినాల్స్ జీర్ణక్రియకు తోడ్పడతాయి ఉదయాన్నే దోసెలు ఇడ్లీలు కూడా మంచి ఆహారం. వీటి నుంచి ప్రోటీన్ లు కార్బోహైడ్రేట్స్ అందుతాయి. త్వరగా జీర్ణం అవ్వడమే కకుండా ఇమ్యూనిటీ ని ఇస్తాయి.రుచిగా కూడా ఉంటాయి ఉదయం తీసుకొనే […]
ఇవి బెస్ట్
స్విస్ బాల్ తో చేసే వ్యాయామం మంచి ఫలితం ఇస్తుంది అంటారు ఎక్సపర్ట్స్.కుర్చీ లో ఎక్కువ సమయం కూర్చుంటే శరీరానికి రక్త ప్రసరణ సరిగ్గా అందదు. ఈ స్విస్ బంతి పైన కూర్చోవడం వల్ల శరీరం నిటారుగా ఉంటుంది.నడుం నొప్పి ఉండదు రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది.అలాగే మెట్లు ఎక్కి దిగడం చేస్తే కాలి కండరాలు దృఢంగా ఉంటాయి.రక్తంలో ఆక్సిజన్ నిల్వలు పెరుగుతాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామా లతో పని ఒత్తిడి పై పోరాడే ఫీల్ గుడ్ ఎండార్ఫిన్ […]
ఆరోగ్య రహస్యం ఇదే
వంటగది శుభ్రంగా ఉంటే ఇంట్లో అందరి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.వంట పూర్తయ్యాక వంటగది పూర్తిగా శుభ్రపరచాలి.స్టవ్ పైన మరకలు లేకుండా సబ్బు నీళ్ళతో శుభ్రంగా కడగాలి.నూనె జిడ్డు అంటుకున్న వంటింటి గోడలు ఏ రోజుకు ఆ రోజు శుభ్రంగా కడిగి వేయాలి. లేకపోతే అవి మొండి మరకలు గా మారుతాయి. స్టవ్ తుడిచిన గుడ్డను వెంటనే వేడి నీళ్లతో ఉతికి ఎండలో ఆరవేయాలి.లేకపోతే దానికి అంటుకున్న జిడ్డు బ్యాక్టీరియా పోదు.స్టవ్ గట్టు వాటర్ క్లీనర్ తో నీరు […]
ఆహారమే కంటికి రక్ష
కంటిచూపు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. విటమిన్ ఎ ఉండే పదార్థాలు తీసుకోవాలి గుడ్డులోని పచ్చసొన, క్యారెట్, మొక్కజొన్న, ఆకుకూరలు తీసుకోవాలి.రెండు మూడు రకాల వంట నూనెలు వాడటం వాల్ నట్స్ అవిసెలు,దోస గింజలు, సన్ ఫ్లవర్ గింజలు వంటివి తినాలి.పచ్చసొన, చేపలు మంచివి ఫ్రూట్స్, నట్స్ పొట్టు ధాన్యాలు తృణధాన్యాలు పిల్లలకు బాగా పెట్టాలి.జింక్ ఎక్కువగా ఉండే గ్రీన్ వెజిటేబుల్స్ తెల్లసొన తీసుకోవాలి. సరైన వ్యాయామం కూడా […]
ఫెమినిస్ట్ టీ
ఈ వర్షా కాలంలో ఫెమినిస్ట్ చాయ్ తాగితే మంచిదంటారు ఎక్స్పర్ట్స్. ఈ చలి గాలుల్లో కాశ్మీర్ లో ప్రత్యేకమైన ఫెమినిస్టు చాయ్ తాగాలి.ఈ చాయ్ చూసేందుకు అందమైన గులాబీ రంగులో ఉంటుంది.ఈ టీ తయారీలో టీ పొడి బాదం, పిస్తా పలుకులు, దాల్చిన చెక్క, గులాబీరేకులు వేస్తారు.చాయ్ కు గులాబీ రంగు రావటం కోసం అక్కడ దొరికే ప్రత్యేకమైన ఉప్పు వాడతారు .నూన్ చాయ్ గా పిలిచే ఈ రుచి చాలా బావుంటుందట.ఈ టీ పొడి ఇప్పుడు […]
విటమిన్ డి లోపిస్తే సమస్యే
ఈ మధ్య కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ తప్పనిసరిగా విటమిన్-డి సప్లిమెంట్లను వాడమంటున్నారు వైద్యులు.ఈ మధ్యకాలంలో చేసిన ఒక అధ్యయనంలో విటమిన్-డి లోపం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కోవిడ్ బారిన పడినట్లుగా తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్ రోగుల్ని పరిశీలించగా వాళ్ల ప్లాస్మా లో విటమిన్-డి తక్కువగా ఉంది.కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ విటమిన్-డి శాతం తక్కువే ఉంది కనుక కాస్తయినా సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోమంటున్నారు అధ్యయనకారులు.
శక్తి నిచ్చే స్మూతీ లు
రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ డ్రింక్స్ ఇంటి దగ్గరే తయారు చేయవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.కివి, లేదా నారింజ, నిమ్మరసం, యోగర్ట్, దాల్చిన చెక్క, అల్లం కలిపి మిక్సీ లో వేసి స్మూతీ తయారు చేసుకోవచ్చుఇంకా చిక్కదనం రావాలంటే ఒక అరటిపండు ముక్క వేసుకోవాలి పాలకూర,పైనాపిల్ నిమ్మరసం, అల్లం, యోగర్ట్ కలిపి మిక్సీ లో వేస్తే స్మూతీ తయారవుతోంది.పసుపు అల్లం బాదం పలుకులు తేనె కలిపిన స్మూతీ కూడా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది.
విజో గా తేజస్వినీ రంగారావు
తేజస్వినీ రంగారావు మన దేశం నుంచి మొదటి మహిళ విజో గా ఎంపిక అయింది.సుఖోయ్ వంటి యుద్ధ విమానాలు చేసే యుద్ధ విన్యాసాలు నిర్వహించేందుకు పైలెట్ల తో పాటు ప్రత్యేకంగా వెపన్ సిస్టమ్ అధికారులు ఉంటారు.వాళ్లనే విజో అంటారు.ఆకాశంలో యుద్ధ తంత్రాలు రచించటం వీళ్ళ పని. ప్రతిష్టాత్మక సుఖోయ్ 30 ఫ్లీట్ విమానాలకు విజో బాధ్యతలు అందుకుంది తేజస్వినీ.ఆమె స్వస్థలం చెన్నై తండ్రి రంగారావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ తల్లి రాధిక […]
ఇదే మంచి తరుణం
పిల్లలు ఇంట్లోంచే చదువుకుంటున్నారు వాళ్లతో పెద్ద వాళ్లకు ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది.చిన్నతనంలో ఏ భాషనైనా తేలికగా నేర్చుకుంటారు పిల్లలు మాతృభాష కాకుండా ఇంకో భాష నేర్పే ప్రయత్నం చేయచ్చుఅలాగే నృత్యం, పెయింటింగ్ ఇవన్నీ ఇప్పుడు ఆన్ లైన్ లో అభ్యాసం చేసేవే.వారిలో సృజనాత్మకత ఆలోచన శక్తి పెరగాలంటే ఇలాటి ఆసక్తులు వాళ్లలో కలిగేలా చేయాలి.కామిక్ బుక్స్ చదివించటం పెయింటింగ్ వేయించటం రాయటం అలవాటు చేయడం వంటివి వాళ్ల భవిష్యత్ లో ఎంతో ఉపయోగపడతాయి వాళ్ల […]
నీటి బుడగల తో శుభ్రం
కరోనా రోజుల్లో మార్కెట్లో నుంచి తెచ్చిన పండ్లు కూరలు ఏవైనా సరే ఒకటికి పది సార్లు కడిగి శుభ్రం చేసి తినాల్సి వస్తుంది. ఇంత కడిగిన ఏదో అనుమానం వెంటాడుతూనే ఉంటుంది.అలాంటప్పుడు ఎయిర్ బబుల్ వెజిటేబుల్ క్లీనర్ అన్నిఅనుమానాలను మాయం చేస్తుంది. ఈ మిషన్ ఒక రకం ఓజోన్ ను విడుదల చేయడం ద్వారానే పని చేసినప్పటికీ ఇందులో అమర్చిన ప్రత్యేక టెక్నాలజీ కారణంగా ఇది సూక్ష్మ జీవుల్ని పురుగు మందుల అవశేషాలను సమర్ధవంతంగా శుభ్రం చేస్తుంది. […]
మడతలు రావు
ప్రకృతి ఇచ్చిన ఎన్నో పదార్థాలతో ముఖ సౌందర్యాన్ని పెంచే ఔషధ గుణాలున్నాయి. బాదం గింజలు నీళ్ళలో నాననిచ్చి పై పొట్టు తీసి మెత్తగా పేస్టులా చేసి ముఖంపై మాస్క్ వేసి ఆరిపోయాక కడిగేస్తే ముడతలు రావు.గుప్పెడు మెంతి ఆకులు మెత్తగా చేసిన గుజ్జు ముఖానికి కాంతినిచ్చే విలువైన మాస్క్.అలాగే కలబంద గుజ్జు ముడతలు రానివ్వదు.విటమిన్ ఎ పుష్కలంగా ఉండే క్యారెట్ కొలాజెన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.క్యారెట్ ని ఉడికించి మెత్తగా పేస్ట్ చేసి అందులో తేనె కలిపి మాస్క్ […]
