Tuesday, 04 Aug, 2026

మారక మాయం

సాధారణంగా  కాటన్ దుస్తులే ధరించినపుడు  కాటన్ చీరపైనా మరక పడితే వదలడం కష్టమే హెవీ డ్యూటీ లిక్విడ్ లేదా రెండు భాగాలు డిటర్జంట్ ఒక భాగం నీరు కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.శుభ్రమైన టూత్ బ్రష్ తీసుకొని మరకపైన  ఈ పేస్ట్ రాయాలి. గట్టిగా రుద్దటం వల్ల మరక ఫ్యాబ్రిక్ లోకి మరింతగా వెళ్ళిపోతుంది. కొద్దిసేపు ఆలా వదిలేసి చేత్తో మరకపడిన ప్రాంతంలో నలుపుతూ ఉతికితే సరిపోతుంది. ఫ్యాబ్రిక్ మరీ సున్నితం కాకపోతే అప్పుడు దాన్ని […]

 ఇయర్ సేవర్స్ 

కరోనా బాధితులకు సేవలు అందించే క్రమంలో ఆరోగ్య కార్య కర్తలు ఎంతగానో శ్రమ పడుతున్నారు. నిర్విరామంగా మాస్క్ లు ధరించటం వల్ల చెవి నొప్పి దురద వస్తోంది. పేస్ బుక్ ద్వారా ఈ సమస్య తెలుసుకొన్న అమెరికాకు చెందిన క్రిస్టినీ లిసి తన ఇద్దరు కూతుళ్ళతో కలిసి ఇయర్ సేవర్స్ తయారు చేసింది. రిబ్బన్ ముక్కుకు పెద్ద బటన్స్ కుట్టి వీటికే మాస్క్ లు తగిలించుకునే లాగా రూపాందించింది. చెవులకు కాకుండా ఈ రిబ్బన్ గుండీలకు మాస్క్ […]

ఇంట్లోనే వ్యాయామం 

ఎన్నో అనారోగ్యాలకు,అకాల మరణాలకు శారీరక వ్యాయామం లేకపోవటమే కారణం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో గంటల కొద్దీ ఇంట్లోనే పని చేయవలసి వస్తోంది. శరీరాన్ని మనసునీ చురుకుగా ఉంచుకొనేందుకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయచ్చు. మెట్లు ఎక్కి దిగవచ్చు. పని చేసే సమయం మధ్యలో లేచి కాసేపు అటు ఇటు పచార్లు చేయవచ్చు. యోగాసనాలు,బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయవచ్చు. ఎక్కువ సమయం కూర్చొని పనిచేయవలసి వస్తే అరగంటకో సారి […]

 అలా వాడకండి 

కొన్ని కొన్ని వస్తువులకు ప్రత్యేకించి ఎక్స్ పైరీ డేట్ ఉండకపోయినా వాటిని అదేపనిగా సంవత్సరాలపాటు వాడటం క్షేమం కాదు ఉదాహరణకు దిళ్ళు బావుంటాయి చెక్కు చెదరవు. కానీ ఓ మూడేళ్ళు దాటాక వాటిలో డస్ట్ మైన్స్ చేరతాయి. ఎన్నో అలర్జీలు వస్తాయి వీటిని మార్చకపోతే ప్రమాదం.అలాగే దువ్వెనలు కూడా ఓ ఎడాది పాటు వాడాక కొత్తవి కొనుక్కోవాలి ఇక పళ్లు తోముకునే బ్రష్ లు ప్రతి మూడు నెలలకు మార్చాలి.బస్సెల్స్ అడుగుభాగంలో బ్యాక్టీరియా చేరి పళ్లు పుచ్చిపోతాయి.

ఇవి రోజూ తప్పనిసరి 

చాలా మందికి పప్పు తినడం ఇష్టం ఉండదు కానీ పప్పుల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేడ్లు ఎక్కువ మొత్తంలో పీచు ప్రోటీన్ లు శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. పీచు రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. క్యాల్షియం, పొటాషియం, జింక్, ఇనుము వంటి ఖనిజాలు విటమిన్-బి వంటివి పప్పుల్లోనే సమృద్ధిగా అందుతాయి. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, సెనగపప్పు, అలసందలు, సోయా వంటివి ఎన్నో పోషక విలువలున్నవి.  పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రతిరోజు పప్పుని చేరిస్తేనే వారిలో ఎదుగుదల బాగుంటుంది.

పెదవుల రంగు మారితే ! 

ఒక్కసారి ఎండలో ఎక్కువసేపు గడిపే వాళ్లలో శరీర వర్ణం తోపాటు పెదవుల రంగు మారుతుంది.కాఫీ లు తాగితే పెదవులు మాటి మాటికీ తడపటం కొరికే అలవాటు కొద్ది కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఉంటుంది.విటమిన్ల లోపం హార్మోన్ల అసమతుల్యత అతి డైటింగ్ కాస్మెటిక్స్ వాడకం నాణ్యత లిప్స్టిక్ ల వినియోగం కూడా పెదవుల రంగులేని నలుపుగా చేయచ్చు.ఈ రంగు మారితే చికిత్సలు ఏమీ ఉండవు గానీ సరైన లిప్ బామ్ రాసుకొంటూ ఉంటే చాలు బయటకు […]

అవి బ్రా వల్లనే కావచ్చు 

ఒక్కసారి హఠాత్తుగా భుజాలు మెడ నొప్పులు మొదలవుతాయి. అవి బ్రా కారణంగా కావచ్చు అంటారు ఎక్సపర్ట్స్.సరైన బ్రా కాకపోతే ఇలాంటి నొప్పులు రావచ్చు.బ్రా వేసుకొన్నపుడు స్ట్రిప్ వెనక భాగంలో రెండు వేలు పెట్టినా బిగుతుగా అనిపించ కూడదు.అప్పుడే అది సరైన బ్రా గా అర్థం చేసుకోవాలి.సాధ్యమైనంత వరకు అడ్జస్టబుల్ బ్రా స్ట్రిప్ ఉండేలా చూసుకోవాలి. స్ట్రిప్ సరిగ్గా లేకపోయినా కొంత బరువు పెరిగిన పట్టేసి భుజాలు దగ్గర ఉన్న కండరాలు నొక్కినట్టు అవుతాయి. సహజంగానే శరీరాకృతిలో పరిమాణంలో […]

మంచి హెర్బల్ డ్రింక్ 

పువ్వులు కేవలం సౌందర్యం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించవచ్చు.టీ లో వేసుకునే గులాబీ చామంతి, బంతి పూల తోపాటు నీలి రంగులో ఉండే శంఖు పూలతో కూడా రుచి, ఆరోగ్యం.కంటికి ఇంపుగా ఉండే రంగుని ఆహార పదార్ధాలకు ఇచ్చే గుణం ఉంది. ఈ శంఖు పూలతో హెర్బల్ డ్రింక్ చాలా ఆరోగ్యం కూడా ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి ఇందులో శంఖు పూలు వేసి ఉంచితే కాసేపటికి, ఆ రంగు నీళ్ళలో […]

ఇవి డయాబెటిక్ ఫ్రెండ్లీ 

భారత దేశంలో డయాబెటిక్  ఎక్కువవుతున్నాయి.ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం ద్వారా చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. చియా గింజల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి.వాటిలో ప్రొటీన్లు ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు అధికం. రక్తంలో చక్కెర స్థాయిని స్థిరాకరించగలిగే.చియా గింజలను ఆల్మండ్ పాలలో నానబెట్టి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి ఉదయం తింటే మంచిది.అలాగే శెనగల్ని వేయించి ఉప్పు కారం చల్లి స్నాక్స్ గా తిన్నా మంచిదే.రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి డయాబెటిస్ ను  వృద్ధి చెందకుండా చూస్తాయి శనగలు. […]

హెవీ మేకప్ వద్దు 

మాస్క్ తప్పని సరి అయిన ఈ రోజుల్లో హెవీ మేకప్ అవసరం లేదంటున్నారు ఎక్సపర్ట్స్. ఫేస్ మాస్క్ తో తొందరగా చమట పడుతోంది. కాబట్టి మాస్క్ తో బయటకు వెళ్లేప్పుడు ఫౌండేషన్,లిప్ స్టిక్,మేకప్ పరిమిత స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. స్కిన్ కేర్ ప్లాన్ తో పాటు చర్మం హైడ్రేడ్ గా ఉండేలా చేసుకోవాలి. మేకప్ కు ముందు ఫౌండేషన్ అవసరం లేదు. దాని బదులు బిబీ క్రీమ్ రాసుకుంటే మేకప్ వైట్ గా వస్తుంది. పెదవులకు మ్యాటి […]

తెమరి  హ్యాండ్ బాల్స్ 

తెమరి హ్యాండ్ బాల్స్ చైనా జపాన్ ల కు చెందిన సాంప్రదాయ కళ.( Temari balls ) కొత్త ఏడాది ప్రారంభానికి గుర్తుగా ఇంట్లోనే పెద్దలు పిల్లలకు వీటిని తయారు చేసి ఇవ్వడం ఆనవాయితీ.ధర్మకోల్ బంతి పైన రంగు రంగుల ఊలు న  సూదితో ఎంతో నైపుణ్యంతో కుడితే ఈ అందమైన బాల్స్ తయారవుతాయి. అద్భుతమైన కళ్ళు చెదిరే రంగుల దారాలతో ఎంబ్రాయిడరీ చేసినట్లు కనబడే ఈ బంతులను స్నేహానికి, నమ్మకానికి, ప్రతీకలుగా భావిస్తారు ఈ కళ […]

పాడైన పాలు మొక్కలకు బెస్ట్ 

పాడైపోయిన పాలు చెత్త బుట్టలో వేయకండి, వాటిని మొక్కలకు పోస్తే మంచి పోషణతో పాటు ఆరోగ్యం కూడా అంటోంది సమంత.ఎక్సపైరీ దాటిపోయిన పాల ప్యాకెట్ పాలడబ్బా ల లోని పాలు ఆరోగ్యానికి మంచివి కావు.అవి మొక్కలకు మంచి ఎరువుగా పనికి వస్తాయి.ఆ పాలలో యాంటీ ఫంగల్ యాంటీ పెస్టిసైడ్ గుణాలుంటాయి పాలలోని కాల్షియం మొక్కలు పెరిగేందుకు తోడ్పడతాయి.టమాటో, దోస, గుమ్మడి మొక్కల్లో పూత రాలిపోవడాన్ని అడ్డుకుంటాయి. పాలలో ఉండే అత్యవసర /ప్రోటీన్లు విటమిన్ బి మొక్కలను పూర్తి […]

ముఖం పై మడతలా ? 

కొందరిలో చాలా తొందరగా వార్ధక్యఛాయలు కనిపిస్తాయి మొహం పైన ముడతలు వచ్చేస్తాయి.అవి పోయేందుకు ఒక మంచి చిట్కా చెబుతున్నారు ఎక్సపర్ట్స్. మామిడి ఆకులు ఎండబెట్టి పొడి చేయాలి అందులో మినప పప్పు పొడి, ముల్తానీ మట్టి సమన పాళ్లలో కలిపి ఓ డబ్బాలో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని పాలతో కలిపి పేస్ట్ గా చేసి మొహం పై ప్యాక్ వేసుకుంటే ముడతలు పోతాయి. అలాగే బంగాళదుంప గుజ్జు, టమోటో రసం, అరటిపండు గుజ్జు కూడా ముఖం […]

ఈ మాత్రం అవసరం 

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్లు గృహిణిలు, పెద్దలు ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఫిట్ నెస్ తో పాటు ఇమ్యూనిటి పెరుగుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.కొన్ని రకాల వ్యాయామాలు శరీరాకృతిని చక్కగా దృఢంగా మారుస్తాయి.ప్లాంక్స్ ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలిగిన వ్యాయామాలు కూర్చీలో కూర్చుని లేవటం కూడా స్క్యాట్స్ చేసిన ఫలితాలు ఇస్తాయి.పొట్ట ప్రాంతంలో కొవ్వు కరగాలంటే క్రంచెస్ చెయ్యాలి.ఈ వ్యాయామానికి వయోపరిమితి లేదు ఇక ఫిట్ నెస్ తోడ్పడ ఏదైనా తేలికైన నడక రోజు మొత్తంలో […]

వ్యాయమ ప్రణాళిక అవసరం 

బరువు తగ్గాలనే ఆలోచన తో వ్యాయామాలు చేసే ఆలోచన మంచిదే గానీ అతిగా చేయద్దు అంటారు ఎక్సపర్ట్స్. ఏదైనా క్రమ పద్దతిలో సాగాలి అతి వ్యాయామం వల్ల అంతర్గత గాయలయ్యే ప్రమాదం ఉంది. కండరాలు త్రివమైన వత్తిడి గురవుతాయి. కీళ్ల నొప్పులు కూడా రావచ్చు. సరైన వ్యాయమ ప్రణాళికతో ముందుకు సాగితే సమస్యలుండవు. అలాగే నెలసరి సమయంలో కూడా శరీరానికి బరువులు ఎత్తటం,ఎక్కువ దూరం పరుగులు తీయటం మాత్రం మంచిదికాదు నెలసరి సమయంలో సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోవాలి.

రుచి ఆరోగ్యం 

నువ్వులతో ఎముకలు బలోపేతం అవుతాయి శ్వాస సమస్యలు దూరం అవుతాయి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ కరోనా సమయంలో వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేందుకు ఈ నువ్వులను కూరల్లో పచ్చళ్ల లో వాడుకోవచ్చు. నువ్వులు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కూడా.ఈ పచ్చడికి రెండు కప్పుల నువ్వులు, ఆరు మిరపకాయలు, ధనియాలు, నాలుగైదు మెంతి గింజలు, పసుపు, చింతపండు, కొంచెం బెల్లం, కావాలే నువ్వులు వేయించుకోవాలి మెంతులు కూడా వేయించాలి ఇప్పుడు నువ్వులు ధనియాలు మెంతులు మిరపకాయలు పసుపు […]

పగుళ్ళ నుంచి స్వాంతన 

కర్పూరం మొటిమలకు చక్కని మందు. బ్లాక్ హెడ్స్ మొటిమల సమస్య ఉంటే, గంధం పొడి లో ఓ స్పూన్ బాదం నూనె కలిపి దీనిలో కర్పూరం కరగ నిచ్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.ఓ పదిహేను నిమిషాలు వదిలేసి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే వెంటనే ఫలితం తెలుస్తుంది.అలాగే కర్పూరం లో ఉండే యాంటి మైక్రోబియల్ గుణాలు కాలి పగుళ్ళు తగ్గిపోతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతాయి.కొబ్బరినూనెలో కర్పూరం కరిగించి […]

అందాల ఇక్కత్ చీరెలు 

ఇకత్ పేరు మోసిన టై అండ్ డై విధానపు అందమైన నేత చీరె.తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సాలో, చేనేత కళాకారులు సృష్టించే ఈ చీరె ఎప్పటికీ తిరుగులేనిదే కావలసిన రంగును సృష్టించేందుకు ఎన్నోసార్లు నూలు బట్టలను రంగులో ముంచి ఎండలో ఆరబెడతారు. పట్టు దారాల తో నేసే పోచంపల్లి,పుట్టపాక చీరెలు,డబల్ ఇక్కత్ చీరెలు గా పిలుస్తారు.ఇండోనేషియా, జపాన్లలలో, నేసే డబల్ ఇకత్ రంగులు  డిజైన్ లు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన వస్త్రాలు. లేత రంగులో,పచ్చని చిలుకలు గజరాజుల […]

నాకో ప్రత్యేకత కావాలనుకొన్నా ! 

పార్లే ఆగ్రో సంస్థ జాయింట్  మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యాపారంలో ఉన్నారు నాడియా చౌహాన్.ముందు నుంచే మార్కెటింగ్ విభాగంలో పని చేశారు.నాదైన ప్రత్యేక ముద్ర కావాలనిపించింది.టెట్రా ప్యాక్ తో ఫ్రూటీ ని అందించటం మొదలుపెట్టాం.మా ఉత్పత్తుల అమ్మకాలు దూసుకు పోతున్నాయి. ముంబై లోని పార్లే విల్లే ప్రాంతానికి చెందిన చౌహాన్ కుటుంబం నుంచి వచ్చాను.1929లో మా తాతగారు బిస్కెట్లను తయారుచేసే సంస్థను స్థాపించారు.అందులోంచి వేరువేరు సంస్థలు వచ్చాయి అందులో పార్లే ఆగ్రో సంస్థ మా నాన్న ప్రకాష్ […]

CU SOON (మలయాళం)

ఒక గొప్ప ప్రయోగం ప్రయోగాత్మక సినిమా సి యు సూన్ సినిమా ప్రత్యేకత ఏమిటంటే మొత్తం, మొబైల్ ,వాట్సాప్, ఫేస్ బుక్, జి మెయిల్ ,జూమ్ వీడియో కాల్స్,చాటింగ్ తోనే నడుస్తుంది.ఒక యువకుడికి చాటింగ్ లో ఒక అమ్మాయి పరిచయం అవుతోంది. ఆమె ఇంట్లో ఏదో సమస్య ఉందని చెప్పటంతో ఆమెను తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమె ఎవరో, ఎక్కడ నుంచి మాట్లాడిందో, అంతకు ముందు ఏం జరిగిందో అతనికి తెలియదు అతను ఆఫీస్ కు వెళ్లే […]