Chinna Maata
అన్ని భావాలకు నిలయం మనిషే
లాఫర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అంటారు (Laughter is the best medicine)నవ్వు కొన్న ప్రాధాన్యత భౌతిక మానసిక ఆరోగ్య లలో ఎంతో గణనీయమైనదని చెపుతారు.ఈ మధ్యకాలంలో నవ్వును ఒక వ్యాయామంగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.ఎన్నో లాఫింగ్ క్లబ్ లు నడుస్తున్నాయి.భౌతిక ఆరోగ్యానికి నవ్వు సాయపడుతుంది. ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసే యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. సామాజిక స్థాయిలో మంచి సంబంధాలు పెంపొందింప జేసుకునేందుకు నవ్వు […]
కాలిన గాయాలకు చిన్న చిట్కా
కాలిన గాయాలకు వంటగది లో దొరికే పదార్థాలతో చిట్కావైద్యం చేయచ్చు.అరటి ఆకు కాలిన గాయాలకు మంచి ఔషధం ఆకుల్ని మెత్తగా నూరి గాయంపైనా పై పూతలా పూస్తే గాయం త్వరగా మానిపోతుంది.స్వల్పంగా కాలిన గాయానికి చన్నీళ్ల వైద్యం చాలు కాలిన భాగాన్ని పంపు కింద ఉంచి చన్నీళ్ల ధారగా పదినిమిషాల పాటు వదిలితే చాలు గాయం కారణంగా వచ్చే నొప్పి పోతుంది. వాపు రాదు నీళ్ళలో కాస్త వెనిగర్ కలిపి కాలిన చోట పూసి శుభ్రమైన వస్త్రంతో […]
ఈజీగా కిచెన్ గార్డెన్
వంటగది దగ్గర చిన్న జాగా ఉన్న ట్రే గార్డెన్ లో పెంచుకోవచ్చు.ట్రే గార్డెన్ కోసం ప్రత్యేకంగా అడుగున చిల్లులు ఉన్నా ట్రే దొరుకుతాయి.వాటిలో సారవంతమైన మట్టి నింపి వాటిలో ధనియాలు, మెంతులు చల్లాలి ఇవి నాలుగైదు రోజుల లోపే మొలకలు వస్తాయి. వారం పది రోజుల్లో చిన్న ఆకులు వస్తాయి దశలవారీగా రెండు ట్రే లలో గింజలు చల్లి రెండు రోజులకోసారి తాజా కొత్తిమీర మెంతికూర వాడుకోవచ్చు.అలాగే ట్రే లో టమోటో మిర్చి వంటి గింజలు చల్లి […]
గాలిలో గడ్డ కట్టేశాయి
ఈ చలి తయారు చేసిన రెండు బొమ్మలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సైబేరియా లోని నావొసిబ్రిస్క్ లో ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కి అటూ ఇటుగా ఉంటుంది. గాలి ఆర్కిటిక్ లో కన్నా చల్లగా ఉంటుంది ఆ పరిస్థితి ఏదైనా చేతిలో ఉండగానే గడ్డ కట్టేస్తుంది. ఒలెగ్ అనే స్థానికుడు గుడ్డు పగలకొడితే అది ప్లేట్లో కారే లోపలే గడ్డ కట్టింది. అలాగే వేడివేడి నూడుల్స్ తిందామని ఫోర్క్ తో […]
గుండె ఆరోగ్యానికి ఇవి అవసరం
క్యారెట్లు కళ్ళకే కాదు గుండెకు కూడా మంచివి. క్యారెట్ లలోని బీటా కెరోటిన్ శరీరంలో కి చేరాక విటమిన్ ఎ గా మారుతుంది. ఈ విటమిన్ ఎ, రక్తంలో చెడు కొవ్వులు పెరగకుండా హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అయితే గుండె ఆరోగ్యం లో బీటా-కెరోటిన్ లా పాత్ర అంశం పై చేసిన అధ్యయనంలో క్యారెట్ లోని బీటా కెరోటిన్ ని విటమిన్ ఎ, గా త్వరగా మారాలంటే క్యారెట్ తో పాటు పాలు […]
ఇప్పటి వరకు ప్లాన్లే లేవు
మెయిల్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కావటం వాళ్ళ మెప్పు పొందటం అంతా ఏదో కలలాగా ఉంది.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పాటలు అన్నీ ఇష్టమే. టీవీ షో బేబీ సింగర్ 2 లో విజేతగా నిలిచాను. మా కాలేజి మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ స్టాల్ లో విజేతగా వచ్చాను.అక్కడ నుంచి మోడలింగ్ యాక్టింగ్ అవకాశాలు వస్తున్నాయి. ఓ టీ టీ లో సినిమా సక్సెస్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా అంటుంది గౌరీ ప్రియ రెడ్డి.మెయిల్ సినిమాలో ఒక్కసారిగా […]
సక్సెస్ ఫుల్ గా నమ్మ కేఫ్
స్విట్జర్లాండ్ లో హోటల్ మేనేజ్ మెంట్ చదువుకొంది తమిళనాడు కు చెందిన దమయంతి.భారతీయలు ఇష్టపడే టీ ని నమ్మ కేఫ్ పేరుతో చెన్నయ్ లో దుకాణాలు తెరచి మార్కేట్ చేస్తోంది. పుదుచ్చేరి,కోయంబత్తూర్,చెన్నయ్ లలో కూడా ఈ కేఫ్ లో గోల్డెన్ సులేమాన్, పసుపుతో చేసిన ఎల్లో టీ తో సహా ఎనిమిది రకాల టీ లు ఉంటాయి 40 రూపాయల లోపే ఉంటుంది ఖరీదు. దమయంతి తల్లి నిర్వహిస్తున్న నేచురల్ సెలూన్ లని కూడా మహిళలే నడిపిస్తున్నారు. […]
హెయిర్ కేర్ టిప్స్
చలికాలంలో మాడుపైన పొడిబారకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో సంరక్షణ చేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క నూనెలో వేసి మరిగించాలి.వెచ్చగా ఉండగానే ఆ నూనెతో జుట్టు కుదుళ్ల వరకు రాసి మర్దనా చేయాలి. అలాగే వేప నూనె, ఆలీవ్ నూనె సమపాళ్లలో కలిపి వేడి చేయాలి.ఆ గోరువెచ్చని నూనెతో మర్దనా చేయొచ్చు. ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి దాన్ని నూనెలో కలిపి మర్దనా చేయొచ్చు. కలబంద గుజ్జు కూడా చుండ్రును నివారిస్తుంది.మాడుపై ఉన్న చర్మ సమస్యలను పోగొడుతుంది.
Maara (తమిళం) (2021)
మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్, నటించిన మారా సినిమాకు మలయాళం మూవీ చార్లీ ఆధారం పార్వతి అన్న యువతి కేరళలోని ఒక కుగ్రామంలో గోడలపైన తాను చిన్నతనంలో విన్న కథ తాలూకూ చిత్రాలను చూసింది.ఆ కథలన్నీ గోడల పైన చిత్రించిన మణి మారన్ ను వెతుక్కొంటూ వెళ్తుంది. ఆ ప్రయాణంలో తాను విన్న కథ లోని ఒక ప్రేమికుల జంటను కలుసుకుంటుంది.అప్పటికే వాళ్ళు వృద్ధులు జీవితం మొత్తం ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెతుక్కుంటూ పెద్దవాళ్ళయిపోతారు. తనను ఆదరించిన వృద్ధికి […]
కాక్ టైల్ స్పెషలిస్ట్ మీనాక్షి సింగ్
వైవిధ్యమైన కాక్ టైల్ రుచులూ మెరుగైన ఆతిథ్యం తో మీనాక్షి సింగ్ ప్రారంభించిన బార్ ప్రపంచంలోనే అత్యున్నతమైన 100 బార్ లో ఒకటిగా నిలిచింది. ఈమె నడిపే సైడ్ కార్ బార్ పాత గ్రంథాలయం లాగా బిలియర్డ్స్ రూమ్ లాగా ఉంటుంది.మీనాక్షి టీమ్ ప్రత్యేకమైన రుచులతో డ్రింక్స్ తయారు చేస్తారు. ఈ డ్రింక్ కి అవసరమైన దినుసులు బార్ వెనుక ఉన్న గార్డెన్ లో పండిస్తారు హోటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చేస్తున్న మీనాక్షి సింగ్ […]
ఆడవాళ్లే డ్రైవర్స్
మహిళ డ్రైవర్లు నడిపే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది రేవతి రాయ్ .ఆమె స్థాపించిన హే దీదీ కంపెనీలో ఇప్పుడు తొమ్మిది వందల మంది మహిళ డ్రైవర్లు పనిచేస్తున్నారు.రేవతి ప్రధాన కార్యాలయం ముంబాయి స్వయంగా రేవతి టాక్సీ డ్రైవర్ గా ఎయిర్ పోర్ట్ లో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక టాక్సీ మొదలు పెట్టింది తరువాత తన వంటి మహిళా డ్రైవర్లను తయారు చేసేందుకు పూనుకొంది ఆమె శిక్షణ ఇచ్చిన మహిళలు టాక్సీలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ, అమెజాన్ […]
అందమైన జీవితం
పరిపూర్ణమైన జీవితం 40 ఏళ్ల వయసు నుంచి ప్రారంభం అవుతుంది అని చెబుతారు ఎక్సపర్ట్స్. శరీరం ఈశాయ నాలో దృఢంగా ఫిట్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.ఇక అటు తర్వాత కూడా యవ్వనాన్ని తరగనివ్వకుండా కాపాడుకోవాలంటే ఫిట్ నెస్ ఎక్సర్ సైజ్ లు కొనసాగించాలి. వైద్యుల సిఫార్సు లతో అవసరమైన వ్యాయామాలు జీవితంలో భాగంగా చేసుకోవాలి. నట్స్, ఆకుపచ్చని కూరగాయలు, పాలు, ధాన్యాలు, చేపలు, మాంసం తినాలి.మంచి వయసులో ఎంతో తీరిక లేని ఉద్యోగ వ్యాపారాల్లో క్షణం […]
ప్లానెట్ ఏ బుల్ట్
ప్లానెట్ ఏ బుల్ట్ అనే పేరుతో దివ్యాంగుల కోసం టూరిజం సౌకర్యం ఏర్పాటు చేసింది నేహా arora. నేహా తండ్రి అంధుడు తల్లి చక్రాల కుర్చీకి పరిమితం అయిన దివ్యాంగురాలు. నేహా బాగా చదువుకొని ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించింది తన సంపాదన తో తల్లిదండ్రులను టూరింగ్ కు తీసుకు వెళ్ళినప్పుడు దివ్యాంగులకు ఎలాంటి సౌకర్యాలు లేవని అర్థం అయ్యింది. ఆ సమయంలో ఆమె ఈ సంస్థ గురించి ఆలోచన వచ్చింది. 2016 లో ప్రారంభమైన […]
మహిళా వేదిక హీరోస్
హీరోస్ అన్న మహిళా వేదికను ౨౦౧౪లో ప్రారంభించారు. ఈ ఇంటర్నెట్ వేదిక పైన ఐదు లక్షల మంది కలుస్తున్నారు. సమస్యలకు సలహాలు నైపుణ్యాలు పొందటం, కొత్త అవకాశాలు వెతకటం అవసరమైన రుణాలను పొందటం మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులు ప్రదర్శించి అమ్మకాలు చేసుకోవటం కోసం ఈ వేదిక ఉపయోగపడుతోంది.ఉద్యోగాలు చేసే చోట ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లైంగిక వేధింపుల నుంచి బయటపడే మార్గాల సూచన వంటివి కూడా ఇక్కడ పొందగలరు. ఫిర్యాదు చేసే మార్గాలు న్యాయ సలహాలు […]
చర్మ ఆరోగ్యానికి నిద్ర
చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండేందుకు సౌందర్య ఉత్పత్తులు వాడే కంటే వేలకు కంటినిండా నిద్రపో మంటున్నారు ఎక్సపర్ట్స్ . నిద్ర శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరంలో అతి పెద్ద అవయవం అయిన చర్మం ఆరోగ్యం తాజాదనం, నిగారింపు మీద నిద్ర ప్రభావం చూపెడుతుంది. కంటి నిండా నిద్రపోతే చర్మం తనను తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి దానితో ఫ్రీరాడికల్స్ తొలగిపోతాయి. నల్ల మచ్చలు ముడతలు మాయం అవుతాయి. చక్కని నిద్ర […]
ఒంటరి తనం ఒక భావన మాత్రమే
మనిషి సామాజిక జీవి. ఎప్పుడూ ఎవరో ఒకరితో సంబంధాలతో ఉండి గుంపులో గుంపుగా జీవించగలిగే వాడు.ఏ కారణం చేతైనా గుంపుతో లేదా మందలోంచి వేరు చేయబడిన జీవి ఎంత అలజడికి గురి అవుతోంది ఓ మనిషీ అంతే పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళయి ఇల్లు వదిలి వెళ్లిపోయాక చాలా మంది దంపతులు ఎదుర్కొనే పరిస్థితి ఇదే.అప్పటికే బంధుమిత్రులతో దూరం అవుతుంటాము పిల్లలు పెంపకంలో ఎవరికీ ఒక గంట సమయం కేటాయించలేక పోయినందువల్ల చుట్టూ వారితో మానసిక బంధం […]
అత్యంత శ్రద్ధ అవసరం
ముఖానికి కనుబొమ్మలు అందం వాటిని ట్విజర్ తో తీర్చిదిద్దటంలో కొన్ని మెలకువలు పాటించండి అంటున్నారు ఎక్సపర్ట్స్ .ముందుగా రెండు అద్దాల తీసుకొని ట్విజర్ తో కనుబొమ్మలు తొలగించేప్పుడు భూతద్దం వాడాలి. కనుబొమ్మల ఆకారం సరి చూసుకునేందుకు మామూలు అద్దాన్ని ఉపయోగించాలి. అలాగే తీరైన ఆకృతి కోసం ఒకే రోజు వెంట్రుకలు తొలగించవద్దు రోజుకు కొన్ని చొప్పున కనుబొమ్మలు ఆకృతి దెబ్బతినకుండా తొలగించాలి. కనుబొమ్మల వెంట్రుకలను కింది వైపు నుంచి తొలగిస్తూ రావాలి. కొత్త రూపం కోసం అసలు […]
వాకింగ్ లైబ్రేరియన్ రాధా మణి
కేరళకు చెందిన అరవై నాలుగేళ్ల రాధారమణి నడిచే గ్రంథాలయం అని పిలుస్తారు మహిళల్లో పుస్తకపఠనం పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఉమెన్స్ రీడింగ్ ప్రాజెక్ట్ చేపట్టిన కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ వాకింగ్ లైబ్రేరియన్ ఉద్యోగాన్ని సృష్టించింది. 2012లో వాకింగ్ లైబ్రేరియన్ గా విధుల్లో చేరిన రాధా మణి చేతినిండా పుస్తకాలతో కాలినడకనే ఇంటింటికి వెళతారు. ప్రతిసారీ రెండు కొత్త పుస్తకాలు ఇస్తారు ఎనిమిది రోజుల తర్వాత వాటిని తీసుకుంటారు. ఇప్పటికీ రోజూ నాలుగు కిలోమీటర్లు నడుస్తూ ఇంటింటికి […]
Tandav వెబ్ సిరీస్ (2021) (హిందీ)
తొమ్మిది భాగాలుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న తాండవ్ ఒక పొలిటికల్ డ్రామా మినిస్టర్ దేవకీనందనన్ తెల్లవారి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయనగా హత్యకు గురవుతాడు. అతని కొడుకు సమర్ ప్రతాప్ ప్రధానమంత్రి కవలసి ఉంది. కానీ నాటకీయ పరిణామాలలో దేవకీనందన కి అత్యంత ఆప్తురాలిగా ఉన్నా అనురాధ కిషోర్ ప్రధానమంత్రి అవుతోంది. తనను గురించి ఆమె చేతిలో ఉన్న రహస్యం ఏమిటో అర్థం చేసుకోలేకపోతాడు సమర్ ప్రతాప్. ఈ కథలో సమాంతరంగా యూనివర్సిటీలో ఎలక్షన్ జరుగుతూ […]
Liars Dice (2015) (హిందీ)
గీతు మోహన్ దాస్ తీసిన లయర్స్ డైస్ చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఉత్తమ చిత్రం. చైనా బార్డర్ లో ఉన్న చిట్కుల్ అన్న పల్లెటూరు ఢిల్లీ సమీపంలో ఉంటుంది. ట్రైబల్ కమ్యూనిటీ కి చెందిన కమల భర్త ఐదు నెలలుగా జాడ తెలియకుండా ఉంటాడు.ఢిల్లీలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే అతన్ని వెతుక్కుంటూ కమల తన కూతురు మూడేళ్ల కూతురు తో బయలుదేరుతుంది. సైన్యం నుంచి పారిపోయి వస్తున్న సిపాయి నవాజుద్దీన్ ను అనుకోకుండా కలుసుకొని […]
