Saturday, 28 Nov, 2026

విశ్వసుందరి జెన్నిఫర్ బారెటో

మిస్ యూనివర్స్ 2026 పోటీలలో ప్యూర్టో రికో కు చెందిన జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచింది.శాన్ జువాన్ లో జరిగిన 75వ మిస్ యూనివర్స్ వేదిక పై 27 ఏళ్ల జెన్నిఫర్ తన అద్భుతమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది.అందాల పోటీలు అంటే కేవలం గ్లామర్,ర్యాంప్ వాక్, బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, బాధ్యత ఆత్మవిశ్వాసం సామాజిక సేవ కూడా అవసరం అని నిరూపించింది జెన్నిఫర్.ఏడేళ్ల చిన్నారికి తల్లిగా బాధ్యత నిర్వర్తిస్తూనే ప్రపంచవ్యాప్తంగా 116 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి 2026 మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నది జెన్నిఫర్.విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న మొట్టమొదటి తల్లిగా, వివాహితగా సరికొత్త చరిత్ర సృష్టించిన బారెటో జీవిత ప్రయాణం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి .జర్నీ ఫర్ కేవలం సౌందర్యవతి మాత్రమే కాదు అత్యున్నత విద్యావంతురాలు, సామాజిక కార్యకర్త కూడా. రీసెర్చ్ సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సైకాలజీ క్లినికల్ సోషల్ వర్క్ విభాగంలో రెండు మాస్టర్ డిగ్రీలు సాధించింది. 2021 లో టెక్సాస్ లోని పోర్ట్ వుడ్ లో అమెరికా రక్షణ శాఖ పరిధిలో తమ ఉద్యోగం చేసింది. ఫ్యామిలీ అడ్వకసీ ప్రోగ్రాం కింద ఎడ్యుకేటర్ గా క్రైసిస్ కో రెస్పాండర్ గా కీలక బాధ్యతలు నిర్వహించింది జెన్నిఫర్ బారెటో.

Leave a Reply