Friday, 27 Nov, 2026

15 ఏళ్ల శాస్త్రవేత్త

సంకల్ప బలం ఉంటే చిన్న చేతులు కూడా ప్రపంచ గతిని మార్చగలరని నిరూపించారు కొందరు బాలలు. వారిలో భారతీయ మూలాలున్న అమెరికన్ బాలిక గీతాంజలి రావు ఒకరు .2020 లో 15 ఏళ్ల వయసులో టైమ్ మ్యాగజైన్ మొట్టమొదటి “కిడ్ ఆఫ్ ది ఇయర్”గా ఆమెను ఎంపిక చేశారు.కలుషిత నీటి లోని సీసం వేగాన్ని గుర్తించే టెథిస్ పరికరాన్ని,సైబర్‌బుల్లింగ్‌ను అరికట్టే కైండ్లీ అని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యాప్ ను రూపొందించింది గీతాంజలి రావు 5 వేలకు మందిగా నామినీలలో సాంకేతికత ద్వారా సామాజిక సమస్యలకు పరిష్కారం చూపించినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. 15 సంవత్సరాల వయసులోనే తన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఈ బాలిక. ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోలాజికల్ ఇంజనీరింగ్ చదువుతోంది.

Leave a Reply