Tuesday, 13 Oct, 2026

విజయం సాధించిన మహిళలు

అమెరికాలో ఉన్న శక్తివంతమైన ఇండియన్ అమెరికన్ మహిళా నాయకురాళ్ల గురించి ఒక పుస్తకం రాసింది కామిని రమణి.ఈమె కూడా భారతీయ అమెరికన్.లోటస్ లీడర్షిప్ మోడర్న్ ప్లే బుక్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డం అనే పేరుతో ఈ పుస్తకం తెచ్చారు.సిలికాన్ వ్యాలీ లో ఉంటున్న కామిని రమణి. ఇందులో 30 మంది భారతీయ అమెరికన్ మహిళా విజేతల గురించి రాశారు పెప్సికో మాజీ సీఈవో ఇంద్రనూయి, ఏల్ యూనివర్సిటీ ఆస్ట్రానమీ విభాగ చైర్ పర్సన్ గా ఉన్న ప్రియం వదా నటరాజన్ , జూమ్ మాజీ సీఈవో అపర్ణ బజ్వా,ఫాలో ఆల్టో నెట్వర్క్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీరా రాజ్వేల్ ,అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు లతా కృష్ణన్ వీళ్ళ అందరి గురించి ఈ పుస్తకంలో రాశారు కామిని రమణి . ఈ పుస్తకంలో లీడర్ స్థాయిలో ఉన్న అందరిని వారు ఉన్నత స్థాయికి చేరుకునే దారిలో ఎదురైన సవాళ్లు వాటిని వారు అధిగమించిన విధానాల గురించి ప్రశ్నలు అడిగి అనేక ఇంటర్వ్యూలు తీసుకున్నారు రమణి. యువతరం వాటిని చదివితే వృత్తి,వ్యక్తిగత జీవితాల్లో ఎలా పైకి వెళ్ళొచ్చో అర్థమవుతుందని చెప్తారు రమణి .ముంబైలో పుట్టి పెరిగిన రమణి స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్లకు సలహాదారుగా, వెంచర్ క్యాపిటల్ సంస్థ మే ఫీల్డ్ ఫండ్ కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేశారు.ఈ పుస్తకం చదివితే అమెరికాలో ఉన్న మన భారతదేశ యువతుల విజయ గాథలను తెలుసుకోవచ్చు.

Leave a Reply