ప్రజా సంక్షేమమే లక్ష్యం
తిరుపతికి చెందిన రష్మీ బాల్యం నుంచే ఐఏఎస్ కావాలి అనే సంకల్పంతో చదువుకున్నారు. బి ఏ, ఎల్ ఎల్ బి, LLM పూర్తిచేసి ఐపీఎస్ సాధించారు ప్రస్తుతం సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టాక ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు .కమిషనరేట్ పరిధిలో అన్ని ఆవాసాల్లో సీసీ కెమెరాలు బిగింపు మొదలుకొని, జాతీయ రాష్ట్ర రహదారుల మీద ప్రయాణం చేసే మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా మొదటిసారిగా షీ సేఫ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేని విద్యార్థుల కోసం ఉద్యోగమేళా నిర్వహించి 600 మందికి ఉద్యోగాలు కల్పించారు. సిద్దిపేట ఉద్యోగ మిత్ర పేరుతో యాప్ రూపొందించి వివిధ కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అధికారంలో నైపుణ్యాల అభివృద్ధి కి ప్రాజెక్టు సిద్ధి పేరిట శారీరక సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. యోగ,ధ్యానం,కరాటే వంటి వాటితో పాటు మహిళా కానిస్టేబుల్ లకు మోటార్ వాహనాల డ్రైవింగ్ లోను తర్ఫీదిపిస్తున్నారు. యువత కోసం గ్రంథాలయం వాలీబాల్ క్రికెట్ గ్రౌండ్లు ఏర్పాటు చేస్తున్నారు. రష్మీ బాధ్యత తీసుకున్న ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజలు,సిబ్బంది కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందారు.
