Saturday, 10 Oct, 2026

అన్నే కార్సన్ కు నోబెల్ అవార్డు  

కెనడాకు చెందిన కవయిత్రి అన్నే కార్సన్ సాహిత్య నోబుల్ అవార్డు గెలుచుకున్నారు. చారిత్రక కథను సంప్రదాయాలను మిళితం చేయటం ద్వారా సమకాలీన సాహిత్యంలో ఆమె ఒక కొత్త  పంథాను సృష్టించారని కార్సన్ కృషిని సాహిత్య అకాడమీ కొనియాడింది. కెనడాలోని టొరెంట్ లో 1950 లో జన్మించిన కార్సన్ అధ్యాపకులుగా సుదీర్ఘకాలం పనిచేశారు ఉత్తర అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రాచీన సాహిత్యం బోధించారు పదవీ విరమణ అనంతరం భర్తతో కలిసి ఐలాండ్ లో స్థిరపడ్డారు. గ్రీకు పురాణ పాత్ర గెలియాన్ కథను ఆధునిక నేపథ్యానికి అనుసరిస్తూ రాసిన ఆటో బయోగ్రఫీ ఆఫ్ రెడ్ ఈమెకు  ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. మెన్ ఇన్ ఆఫ్ అవర్స్, నార్మా జీన్ బేకర్ ఆఫ్ ట్రాయ్ రాంగ్ నార్మ ఇవన్నీ కార్సన్ రాసినవే.

Leave a Reply