Tuesday, 08 Sep, 2026

ఆమె సంకల్పశక్తి అమోఘం

పుట్టుకతోనే కాలు,మోచేతి లోపంతో పుట్టిన శశ్రుతి నకాడే లెక్కకు మించిన శస్త్రచికిత్సలు చేయించుకొని పారా అథ్లెట్ గా పథకాల పంట పండిస్తోంది. నాగపూర్ లో పుట్టిన శశ్రుతి ప్రొఫెషనల్ స్విమ్మర్  అవ్వాలనుకుని కృషి మొదలు పెట్టింది. ఒక ఏడాది శిక్షణ తర్వాత జాతీయ స్థాయి ఈత పోటీల్లో పాల్గొన్నది .ఇప్పటివరకు నాలుగు స్వర్ణం ఒక రజతం రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నది.2024 లో మూడు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ లలో విజయాలు సాధించింది ప్రపంచ ర్యాంకింగ్ లో టాప్ 10 వరకు చేరింది. గత సంవత్సరం శ్రీలంక లోని తలైమన్నార్ నుంచి భారత్ లోని ధనుష్కోడి వరకు 35 కిలోమీటర్లు విస్తరించి ఉన్న పార్క్ జలసంధిని ఈదింది.ఇందుకుగాను ఆమె 11 గంటల పాటు ఈదుతూనే ఉంది. ఈ ఘనత సాధించిన తొలి భారత అంగవైకల్యం గల స్విమ్మర్ గా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ట్రయాథ్లాన్ మీద దృష్టి పెట్టింది. ప్రపంచ ట్రయాథ్లాన్ పారా ఛాంపియన్ షిప్  కు సిద్ధమవుతోంది శశ్రుతి.

Leave a Reply