ట్రెండింగ్ లో జిగినీ లు
తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారసత్వపు నగగా పరిగణించే జిగిని నెక్లెస్ కొత్త నగిషీలతో ట్రెండింగ్ లోకి వచ్చేసింది .కంటె లాగా బిగుతుగా కాకుండా వదులుగా ఉండే పట్టి లేదా వెడల్పాటి చిన్న గొలుసు రంగురంగుల రాళ్లతో నిండిన పెండెంట్ తో ఈ నగ చాలా అందంగా ఉంటుంది.ఇలాంటివే దిద్దులు జుంకాలు కూడా నేటి పోకడలకు అనుగుణంగా డిజైనర్లు మార్చేశారు.ఈ జిగినీ లను ప్రాచీన చోళుల కాలంలో రూపొందించినట్లు చెప్తారు .దేవాలయాల్లోని దేవతా విగ్రహాలకు అలంకరించేందుకు రాజ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ హారాలు తయారు చేయించే జిగిని .నక్లెస్ మెడను అంటిపెట్టుకొని చోకర్ గా కనిపిస్తుంది. నెక్లెస్ మధ్యలో అమర్చిన లాకెట్టు ముఖాన్ని కాంతిగా మెరిపిస్తుంది .లాకెట్ పై నెమలి, హంస వంటి డిజైన్లు ఈ గొలుసు కి చాలా అందం ఇస్తాయి. వీటిని గుండ్రంగా అండాకారంలో చతురస్రాకారంలోనూ చేసి కెంపులు పచ్చలు, నీలాలు, వజ్రాలతో అలంకరిస్తారు .జిగిని తయారీకి ఎక్కువ బంగారం కూడా అవసరం ఉండదు 13 నుంచి 20 గ్రాముల్లోనే అందమైన నెక్లెస్ రూపొందిస్తున్నారు డిజైనర్లు. ఇవి కంజీవరం పట్టు చీరలు మీదకి అద్భుతంగా సూట్ అవుతాయి.
