Monday, 07 Sep, 2026

తిరుగులేని వెండితెర రాణి

కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్ గ్రామంలో పుట్టిన మమత బైజు ఈరోజు భారతీయ చిత్ర పరిశ్రమలో  ఒక ఏడాదిలో 200 కోట్ల క్లబ్ సినిమాల్లో నటించిన ఏకైక నటిగా సరికొత్త రికార్డు సృష్టించింది.మానసిక శాస్త్రం చదువుకున్న మమత ఏ ఏ సందర్భాల్లో మనుషులు ఎలా స్పందిస్తారు వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయి అన్నది చక్కగా అర్థం చేసుకుంది సినిమా నటిగా ప్రయాణ ప్రారంభంలో చిన్ని పాత్రలు వేసినా, 2019లో వచ్చిన జూన్ చిత్రంలో పుంజు  పాత్ర తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఆపరేషన్ జావా ఆమె కెరీర్ కు మంచి మలుపు.  ఒక స్పోర్ట్స్ సినిమాలో  నటించిన మమత 44వ కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు లో ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది .తరువాత ఆమె కెరీర్ ని ఉన్నత దశకు తీసుకెళ్లిన సినిమా ప్రేమలు. మలయాళంతో పాటు తెలుగు తమిళ భాషల్లో ఆ సినిమా రికార్డు సృష్టించింది .విజయ్ దళపతి తో జన నాయగన్ లో నటించాక ఆమె ఏకంగా ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకుంది. సూర్య తో చేసిన విశ్వనాధ్ అండ్ సన్స్ నవీన్ పౌలీ తో చేసిన బెత్లెహేము కుటుంబం మొదలైనవి 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆమెను బాక్సాఫీస్ క్వీన్  గా రికార్డుల్లో నిలబెట్టింది.

Leave a Reply