వెండి నగలు కొనకండి
925 సిల్వర్ నగలుగా ఆన్‌లైన్ లో అమ్ముడు అవుతున్న వెండి నగల్లో రెండు శాతం వెండి ,మిగతా 92.3 శాతం కాడ్మియం ఉండే అవకాశం ఉంది అంటున్నారు.ఈ కాడ్మియం అత్యంత విషపూరితమైన భారీ లోహం ఇది శరీరంలో మూత్రపిండాలు ఎముకలు, శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది అందుకే యూకే ఐరోపా దేశాల్లో కాడ్మియం వాడకాన్ని జీరో శాతానికి పరిమితం చేశారు. ఈ లోహాన్ని నగరూపంలో ధరించడం వల్ల పియర్సింగ్ ద్వారా కూడా లోహ అవశేషాలు శరీరంలోకి వెళతాయి.చిన్నపిల్లలు ఈ నగలు నోట్లో పెట్టుకోవడం కూడా విషపూరితమవుతుంది. వెండి నగలు కొనద్దనే చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్.
