52 వ ఏట సిఏ డిగ్రీ
చదువుకునేందుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది అనిత కాపాడీ. అనిత తండ్రి కంపెనీ సెక్రటరీ గా పనిచేశారు ఆయన 75వ పుట్టినరోజుకు సీఏ చేసి డిగ్రీ ఆయన చేతిలో పెట్టాలని 48 ఏళ్ల వయసులో అనిత నిర్ణయించుకున్నారు. 2012లో సీఏ కి దరఖాస్తు చేసుకుని కోచింగ్ లేకుండానే చార్టెడ్ అకౌంటెంట్ లో రెండో ఫౌండేషనల్ స్టేజి ఐపీసీసీ పూర్తి చేశారు. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ఈ పరీక్షలన్నీ రాశారు అనిత.52 సంవత్సరాల వయసులో అనుకున్నట్లుగా పట్టా పొందారు ఏడాదిన్నర పాటు అసిస్టెంట్ మేనేజర్ గా మరో ఏడాది ఇన్ డైరెక్ట్ టాక్సేషన్ ఎగ్జిక్యూటివ్ గా చేశారు సిఏ గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఏదైనా సాధించేందుకు వయసు ఎప్పుడు అడ్డంకి రాదు.
