Saturday, 25 Jul, 2026

మొదటి మహిళా పైలట్

1920 ల్లో నే కార్ డ్రైవింగ్ తో పాటు ఫోటోగ్రాఫర్ గా, వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ గా ,ట్రక్ డ్రైవర్ గా ఎన్నో పనులు చేసింది అమేలియా ఎర్ హార్ట్. మొదటిసారిగా విమానం ఎక్కాక ఆమె దాన్ని నడపాలని లక్ష్యం ఏర్పరచుకుంది. ఫ్లైట్ నడపటం నేర్చుకుని పైలెట్ లైసెన్స్ సంపాదించి చివరకు చిన్న విమానాన్ని కొనేసింది.1928లో ఇద్దరు వ్యక్తులతో కలిసి విమానంలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి ఈ ఘనత సాధించిన మొదటి మహిళా ప్యాసింజర్ గా చరిత్రకి ఎక్కారు.1932లో ఒంటరిగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళా పైలట్ గా గుర్తింపు పొందారు. 1935లో పసిఫిక్ మహాసముద్రం దాటిన మొదటి వ్యక్తిగాను చరిత్ర సృష్టించారు మహిళా పైలట్లకు ఉపాధి కల్పించేందుకు ఆ రోజుల్లోనే ఆమె ది నైంటీ-నైన్స్ అనే సంస్థ ప్రారంభించారు. 1937లో బ్లాక్ హిట్ విమానంలో నావిగేటరు ఫ్రెడ్ నూనన్‌ తో కలిసి విమానంలో బయలుదేరారు. ఆ తర్వాత హౌ ల్యాండ్ ద్వీపం సమీపంలో ఆ విమానం  ఆచూకీ తెలియకుండా పోయింది. ఆమె అదృశ్యం అంతు పట్టని మిస్టరీ అయినా ఆమె జీవితం తరతరాలకి స్ఫూర్తి అయింది. ఆమె పుట్టిన రోజు జూలై 24న  అమెరికాలో నేషనల్ అమేలియా ఎర్ హార్ట్ డే  ని నిర్వహిస్తారు.

Leave a Reply