యోగాకు జీవితం అంకితం

యోగాకు జీవితం అంకితం

యోగాకు జీవితం అంకితం

యోగ ప్రథమ మహిళ గా చెబుతున్న ఇంద్రాదేవి మైసూర్ ప్యాలెస్ లో ఆధునిక యోగా పితామహుడిగా పిలిచే తిరుమలై కృష్ణమాచార్య దగ్గర యోగా నేర్చుకున్నారు. ఆమె బి కే ఎస్  అయ్యంగార్ కే పట్టాభి జో ఎస్ వంటి ఇతర శిష్యులతో సాధన చేశారు. ఆమె భారతీయురాలు అనుకుంటాం కానీ రష్యన్ అసలు పేరు యుజేనియా పీటర్సన్ యోగ మీద ఇష్టంతో ఒంటరిగా భారతదేశానికి వచ్చారు ఇక్కడ సినిమాల్లో నటించారు అప్పుడే ఆమె పేరును ఇంద్రాదేవి గా మార్చుకున్నారు యోగా నేర్చుకుని ఫస్ట్ లేడీ ఆఫ్ యోగ గా నిలిచారు తరువాత ఆమె షాంగై లో శిష్యులకు యోగా నేర్పారు. తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. తన ఉపన్యాసాల ద్వారా యోగాను ఎన్నో దేశాలకు పరిచయం చేశారు. దీన్ని గ్లోబల్ వెల్ నెస్ మూమెంట్ గా మార్చారు. ఆమె  102 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించారు.