లాంగ్ జంపర్ శైలీ సింగ్

లాంగ్ జంపర్ శైలీ సింగ్

లాంగ్ జంపర్ శైలీ సింగ్

తైపీ అథ్లెటిక్స్ ఓపెన్ లో బంగారు పతకం గెలిచి ఏషియన్ అండర్ 22,23 అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నది శైలీ సింగ్.ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలో పుట్టిన శైలి చిన్నతనం నుంచి తల్లి సంరక్షణలోనే  పెరిగింది. ఆమెతండ్రి పిల్లలను తల్లిని వదిలేసి వెళ్లిపోయారు. శైలికి ఆటలంటే చాలా ఇష్టం .తల్లిని ఒప్పించి బెంగళూరులోని జార్జ్ స్టోర్స్ ఫౌండేషన్ లో శిక్షణ  తీసుకుంది శైలీ సింగ్.అండర్ 16, 18 విభాగాల్లో జాతీయస్థాయిలో లాంగ్ జంప్ లో పథకాలు ఎన్నో సాధించింది. 2018 లో 5. 94 మీటర్ల  జంప్  తో జూనియర్ లాంగ్ జంప్ లో రికార్డు సృష్టించింది.ఆపై వరల్డ్ అండర్ ట్వంటీ ఛాంపియన్ షిప్స్. 2023 25లో ఏషియన్ ఛాంపియన్ షిప్స్  లోనూ పథకాలు సాధించారు. తాజాగా తైవాన్ లో జరుగుతున్న తైపీ అథ్లెటిక్స్ ఓపెన్ లో 6.24 మీటర్ల జంపుతో బంగారు పథకాన్ని అందుకున్నది 22 ఏళ్ళ శైలి.