నందిని అగర్వాల్ దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థల్లో ఆడిటింగ్, ఫైనాన్షియల్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లక్షలాదిమంది విద్యార్థుల కోసం సంక్లిష్టమైన ఫైనాన్స్ అంశాలు సోషల్ మీడియాలో వేదికగా చెబుతూ ఒక యంగ్ ఫైనాన్షియల్ ఐకాన్ గా ఎదిగారు. 19 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో అత్యంత పిన్న వయసుకు రాలేనా సి ఏ గా గిన్నిస్ రికార్డు సృష్టించిన నందిని అగర్వాల్ ప్రయాణం ఒక అసాధారణ అకాడమిక్ వండర్ అని చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్ కు చెందిన నందిని 15 సంవత్సరాలకే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది 2021 లో సి ఏ లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకున్నది 19 ఏళ్ల ఎనిమిది నెలల 18 రోజుల వయసులో సి ఏ పూర్తి చేసి ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన చార్టెడ్ అకౌంటెంట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.













