అంజలి సినిమాలో మానసికంగా ఎదగని చిన్నపిల్ల పాత్రలో నటించిన షామిలీ ఆ వయసులో జాతీయ అవార్డు అందుకున్నది. నటిగా దక్షిణాదిన అన్ని భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది. కేరళ, కర్ణాటక రాష్ట్రీయ అవార్డ్ లు తీసుకున్నది. విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ తీసుకున్న షామిలి పెయింటింగ్, డిజిటల్ ఆర్టిస్ట్ కూడా ఫిగరేటివ్ పెయింటింగ్ ఆమె ప్రత్యేకత. ‘షీ’ పేరుతో మహిళ చిత్రాలతో చెన్నై లో సోలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది షామిలీ. వరల్డ్ ఆర్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లో కూడా ఆమె చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయి. నటిగా మాత్రమే కాదు ఆర్టిస్ట్ గా కూడా షామిలీ సక్సెస్.













