అమెరికా లోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉన్న మొనోవి అన్న గ్రామంలో ఒకే ఒక మహిళ నివాసం ఉంటారు. ఆ గ్రామానికి ఆమె మేయర్ పేరు ఎల్సీ లైబ్రేరియన్ 1902 లో ఆ గ్రామం ఏర్పడింది రైలు, రోడ్డు వేశారు. 1930 లో ఆ గ్రామ జనాభా 150 ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిపోతే రూడీ ఆయన భార్య ఎల్సీ మాత్రమే మిగిలారు. 2004 లో రూడీ మరణించాడు ఇక ఎల్సీ ఒక్కతే ఆ గ్రామంలో ఉంటుంది. ఆ గ్రామంలో లిక్కర్ షాపు లైసెన్స్ తనే మేయర్ గనుక పొడిగిస్తుంది. గ్రామంలో ఉండే నాలుగైదు దీపాలకు కరెంటు దగ్గర్లో ఉన్న పట్టణం నుంచి వస్తుంది. మొనోవి అంటే అక్కడి భాషలో పువ్వు. అక్కడ రకరకాలైన ప్రత్యేకమైన పువ్వులు దొరుకుతాయి.














