Thursday, 13 Aug, 2026
అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

ఆనందాన్నిచ్చే స్వభావం 

ఎప్పుడూ ఎక్కడైనా ఏదో రకంగా సాయం చేసే వాళ్ళు ఆనందంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.అది చిన్న సాయం అయినా సరే,ఇరుగు పొరుగు కి అవసరమైన సరుకులు తెచ్చి ఇవ్వడం ప్రేమ ప్రమాదం జరిగితే తక్షణం స్పందించటం వంటివి కూడా సాయాలే కదా. కొందరూ విరాళాలు ఇస్తారు సంస్థలు నెలకొల్పటం వంటి  సమాజ సేవ చేస్తారు.వాళ్లు మరింత ఆనందం తోనే ఉంటారట. దయ,సానుభూతి సాయం చేసే గుణాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి.ఈ స్వభావం శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఈ సాయం చేసే తత్వం చిన్నవాళ్ళ లో ఉంటే వాళ్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందనీ పెద్ద వాళ్లలో ఉంటే శారీరక ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ రకమైన సహాయ గుణం వల్ల ఆడవాళ్లు ఎక్కువ ఆనందంగా ఉంటారట.

Leave a Reply