Tuesday, 22 Sep, 2026
నిజం మాటాడితే నీ నోటికి భయపడాలి అంటారు. నేను ప్రాక్టికల్ గా చూసినవి అనుభవించినవె కదా మాట్లాడేది. అందుకే వాళ్ళు ఎవళ్ళు ఖండించరు కానీ ఒప్పుకోరు అంటుంది కంగనా రనౌత్. నేను నీటిలో పుట్టి పెరగలేదు, హిమాచల్ ప్రదేశ్ లోని ఒక చిన్న టౌన్ లో పుట్టాను. ముంబాయి కి వచ్చిన కొత్తలో ఇక్కడి పద్దతులు తెలియవు. నా ఇంగ్లీష్ యాక్సెంట్ చూసి నా డ్రెస్ చూసి నవ్వేవాళ్ళు. వారి ప్రవర్తనే నాలో కసి పట్టుదల పెంచాయి. వేషం మార్చుకున్నాను. భాష నేర్చుకున్నాను. అన్ని విధాలా మారిన నన్ను చూసి నవ్విన వాళ్ళే ఆశర్య పోతున్నారు. బాలివుడ్ లో నాకంటూ ఒక రహదారి ఏర్పరుచుకొన్నాను. ఒక చదువు రాని పల్లెటూరు అమ్మాయి ఈ స్తాయికి రావడం ఆషామషి కాదు. ఇప్పుడు వున్న స్టార్ హీరోయిన్స్ కి సినీ బాక్ గ్రౌండ్, లేదా కుటుంబం అండో వున్నాయి. నా విషయంలో ఆ రెండులేవు. అలంటి స్తితి నుంచి బాలీవుడ్ స్వాన్ అనిపించికోవడం పెద్ద అచీవ్ మెంట్ అని నా ఉద్దేశ్యం అంటోంది కంగనా. కంగనా కూడా గొప్ప ఆత్మవిశ్వాసం స్వాతంత్ర భావాలు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయనడం సందేహం లేదు.

నేను నేనే.

నాకు నేనే బహుమతి ఇచ్చుకున్నాను. బి యం డబ్ల్యు 7 సిరీస్ కొన్నాను. కోటి రూపాయిల ఖర్చుతో 17 సంవత్సరాల వయస్సు తో ఫీల్డ్ కు వచ్చి నటించడం మోదలు పెట్టి నాలుగేళ్ళు. కష్టపడే కొనుకున్నా అంటుంది కంగనా రనౌత్. ఆ తర్వాత ఓ కార్ల కంపెనీ కి అంబాసిడర్ అయ్యాను. ఇండస్ట్రీ లో నాకు గాడ్ ఫాథర్స్ లేరు. నాలో ఉండే ప్రతిభ నన్నీ స్ధాయి కి తీసుకు వచ్చింది. ఇవ్వాళ అవకాశాలు డబ్బు పుష్కలంగా వున్నాయి. సంపాదన ఎక్కువ భాగం కార్లు , స్దలాలు , నాడ్రెస్సులకే పోతుంది అంటుంది కంగనా . నిజమే ఆమె ప్రెత్యేకమైన మనిషి. నిసాన్ మైక్రో ఎక్స్ ఫిస్ట్ తో పాటు ఇవ్వాళ ఆమె గ్యారేజ్ నిండా కార్లే.

Leave a Reply