April 2025
పేరే డబ్బుల చెట్టు
సంపదగా గుర్తుగా చైనీయులు భావించే చైనా మనీ ప్లాంట్ ఇప్పుడు భారత దేశం లోను దొరుకుతుంది.వారానికి ఒకసారి నీళ్లు పోసిన చాలు ఆచం నాణేల వాలే కనిపించే గుండ్రని ఆకులతో ఈ మనీ ప్లాంట్ గాలిని శుభ్ర పరుస్తుంది ఈ కాయిన్ ప్లాంట్ ను చైనా వాళ్ళు స్నేహితులకు పండగ బహుమతిగా ఇస్తారు. ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే మన ఇంటికి వస్తుంది ఎక్కువ జాగ్రత్తలు తీసుకోకుండా చక్కగా పెంచుకొనే మొక్క ఇది.
అంతరిక్ష యాత్ర లో ఆరుగురు స్త్రీలు
పైలట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్లే షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ వివిధ రంగాలకు చెందిన ఆరుగురు మహిళలకు గగన యాత్రకు తీసుకు వెళ్తుంది. నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయేషా బోవ్ శాంతి బహుమతి నామినేట్ అయిన అమండా గుయెన్ రచయిత్రి లారెన్ సాంచెజ్,ఉత్తమ రేడియో టాక్ షో ఎక్స్పర్ట్ గేల్ కింగ్,పాప్ స్టార్ కేటీ పెర్రీ సబ్ ఆర్బిటాల్ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు.ఈ స్పేస్ క్రాఫ్ట్ 11 నిమిషాల పాటు భూమికి 62 మైళ్ళ ఎత్తులో ఉన్న […]
పాత పేపర్ల తో ఆదాయం
ఒడిశా కు చెందిన గిరిజన మహిళ సుధారాణి మరాండి కాగితంతో కళాకృతులు చేయడం తో తన వ్యాపార ప్రస్థానం మొదలు పెట్టింది.కాగితం తోనే కాకుండా చెట్ల నారు తో కూడా అందమైన కళాకృతులు చేయగలరు.2018 లో ‘ఝనుక్ క్రాఫ్ట్స్’పేరుతో ఆన్ లైన్ అమ్మకాలు మొదలు పెట్టింది వాడిపాడేసిన కార్డు బోర్డు లు,టెట్రా ప్యాక్ లు సేకరించి వాటిని అధై వనరులుగా మార్చింది ఆమె తో పాటు ఎంతోమంది మహిళలు ఈ క్విల్లింగ్ పేపర్ ఆర్ట్ నేర్చుకొని సుధారాణి […]
కొబ్బరినీళ్లూ అనారోగ్యమే
ఎండ వేడికి కొబ్బరి నీళ్లు మంచివి అనుకొంటారు కానీ ఆ నీళ్లలో ఉండే పొటాషియం శరీరంలో లవణాల సమతూకాన్ని దెబ్బ తీస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణులు.కొబ్బరి నీళ్లలో చక్కెర కంటెంట్ కూడా ఎక్కువే డయాబెటిక్ గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ నీళ్లకు దూరంగా ఉంటేనే మంచిది.హై బిపీ ఉన్నవాళ్లు పేగు పూత వ్యాధి ఉన్నవాళ్లు కూడా కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండండి అంటున్నారు పోషకాహార నిపుణులు.కొబ్బరి నీళ్లలో కొన్ని రకాల అలర్జీలు కూడా వస్తాయంటున్నారు అందుకే దేన్నయినా […]
బబుల్ గమ్ చాలా ప్రమాదం
బబుల్ గమ్ లో హానికారక ప్లాస్టిక్ అణువులు ఉంటాయని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ హజారిటీస్ మెటీరియల్స్ లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ఒక గంట పాటు ఒక బబుల్ గమ్ నమిలిన వ్యక్తి లాలాజలంలో రెండున్నర లక్షల మైక్రో ప్లాస్టిక్స్ కనిపెట్టగలగారు. ఆటోమేటెడ్ దామన్ స్ప్రెక్టో స్కోపీ అనే పద్ధతి ద్వారా చూయింగ్ గమ్ నమలడం వల్ల మన లాలాజలం లోకి ఎన్నో ప్లాస్టిక్ అణువులు ప్రవేశిస్తాయన్నది అంచనా వేశారు. జీర్ణ వ్యవస్థను […]
ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా నిధి
నిధి తివారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న నిధి సివిల్స్ రాసి ఐఎఫ్‌ఎస్ అధికారిగా పనిచేశారు అటు తరువాత విదేశీ వ్యవహారాల శాఖ లో నిరాయుధీకరణ అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగం అంటే డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ అధికారిగా పని చేశారు ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాని ప్రైవేట్ సెక్రటరీ అయ్యారు. ఆమె జీతం నెలకు లక్ష 44 వేల తో […]
గులాబీ మెరుపుల నగలు
గులాబీ రంగులో మెరిసే రోజు గోల్డ్ ఆభరణాలు ఇవాల్టి యువతలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ కోసం బంగారంలో ఎక్కువ శాతం రాగి కొద్ది పరిమాణంలో వెండిని కలుపుతారు ఎంత ఎక్కువ రాగి కలిపితే బంగారం అంత ఎరుపు రంగులోకి వస్తుంది గులాబీ రంగు వచ్చేంత రాగి కలిపి అన్ని రకాల ఆభరణాలు తయారు చేస్తున్నారు. 18 క్యారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, 21 శాతం రాగి,4 శాతం వెండి ఉంటుంది. రోజ్ గోల్డ్ […]
వివక్ష రూపుమాపుదాం
మన దేశపు గ్రామాల్లో వితంతువులకు ఎక్కడా లేని అనాధారణ ఎన్నో పట్టింపులు ఉంటాయి. వాళ్లు గాజులు, బొట్టు, పూలు ధరించకూడదు. శుభకార్యాలకు రాకూడదనే అంటారు అయితే మహారాష్ట్రలోని 7000 గ్రామాల్లో వితంతువులు భౌతిక వివక్షకు గురి కాకూడదనే నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్రలోని 7683 గ్రామాలు,1,182 మునిసిపల్ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపమని తీర్మానాలు చేశారు. వితంతువులు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు అని వారిని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ […]
సముద్ర సాహస యాత్ర
భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం నుంచి 12 మంది మహిళా అధికారులు హిందూ మహాసముద్రంలో 55 రోజుల సముద్ర సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై లోని ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్ షిప్ ట్రైనింగ్ సెంటర్ ఈ యాత్ర ప్రారంభ కేంద్రం. 55 రోజుల్లో హిందూ మహాసముద్రం లోని 4000 నాటికల్ మైళ్లను ఈ బృందం చుట్టేస్తారు. సముద్రంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సాహసికులుగా త్రివిధ దళాల మహిళా జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పుతారు.7వ […]
స్త్రీలపైనే భారం
అన్నింట వివక్షతో పాటు స్త్రీ పురుషులు ఇద్దరూ ఉపయోగించే వస్తువులను కూడా స్త్రీలు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని యు.ఎస్ ఒక అధ్యయనంలో చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై ఈ పింక్ టాక్స్ చాలా కాలంగా అధిక భారం మోపుతోంది. సబ్బులు, లోషన్లు, బ్లేడ్లు వంటివి కొన్ని స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిని మహిళలు పురుషుల కంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. కేవలం పింక్ ప్యాక్ లో ఉండటం వల్ల ఇద్దరూ వాడే ఒకే ప్రోడక్ట్ స్త్రీలు […]
చెత్త నుంచి విముక్తి
ముంబై మహిళ మనా షా వినూత్నమైన ఆలోచన తో ముంబైలోని చెత్త సమస్యకు ఒక పరిష్కారం చూపించింది. ఏ వీధిలో చూసినా కుప్పలుగా పేరుకుపోయిన చెత్త ఆమెను బాధపెట్టింది. 2010 గ్రీన్ ప్రాక్టీసెస్ అనే సంస్థను ప్రారంభించి వివిధ కాలనీలోని చెత్తను సేకరించి కంపోస్టు తయారీకి రూపకల్పన చేసింది. కొన్ని వందల మందికి ఈ పనితో ఉపాధి దొరికింది. కాలనీలు, హౌసింగ్ సొసైటీల నుంచి చెత్తను సేకరించినందుకు ఇంటికి 100 రూపాయలు చార్జీ చేసిందీ సంస్థ.సేకరించిన చెత్తతో […]
అవమానాలే స్ఫూర్తి
చెన్నై కు చెందిన కృష్ణ జయశంకర్ యు.ఎస్.ఎ లో జరిగిన మౌంట్ వెస్ట్ ఇండోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలుచుకొని నేషనల్ రికార్డ్ నెలకొల్పింది. ఆమె తండ్రి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు తండ్రి పోలికలు శరీర సౌష్టవం ఆమెకు వచ్చింది దానితో బాగా ఎత్తు లావుగా ఉండేది. అస్తమానం ఆమెను అమ్మాయిల లేవు అని తోటి వాళ్లు వేధించేవాళ్లు ఇదంతా తన ఆరోగ్యం పైన ప్రభావం చూపెడుతోందని గ్రహించిన కృష్ణ తండ్రి […]
అతి పెద్ద ఘూమర్ నృత్యం
గుజరాత్ లోని సూరత్ లో 11 వేల మంది మహిళలు ఒకేసారి డాన్స్ చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. రాజస్థాన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇన్ని వేలమంది సంప్రదాయ దుస్తులు ధరించి ఘూమర్ నృత్యం ప్రదర్శించారు. సామూహిక ఘూమర్ నృత్యం చేయడం కూడా ఇదే తొలిసారి ఈ సాంప్రదాయ నృత్యం ఈ గిన్నిస్ రికార్డ్ తో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. రాజస్థాన్ యువ సంఘ్ సూరత్ నిర్వహించిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ వేదికపై జానపద కళను ప్రోత్సహించటం […]
మొదటి గ్రామీణ బ్యాంక్
మన్ దేశీ మహిళా శక్తి బ్యాంక్ ఏర్పాటు చేసి, గ్రామీణ మహిళల ఆర్థిక ప్రగతి కి పాటు పడిన చేతన సిన్హా 2024 సంవత్సరానికి గాను ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకొన్నారు.ఆమె గ్రామీణ మహిళల తో బ్యాంకు నెలకొల్పుతానని 1981 లో ఆర్బీఐ ని సంప్రదిస్తే బృంద సభ్యులు నిరక్ష్యరాస్యులని బ్యాంక్ తిరస్కరించింది.అయిదే నెలల్లో వారిని అక్షరాస్యులుగా మర్చి తిరిగి అధికారుల దగ్గరకు తీసుకుపోయారు చేతన సిన్హా.దానితో అనుమతి లభించింది .దానితో పూణే కేంద్రంగా దేశం లో […]
అతి బలశాలి
ఉత్తర ప్రదేశ్ కు బుధానా గ్రామానికి చెందిన పూజ తోమార్ యు ఎఫ్ సి ఫైట్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.కరాటే తో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ కూడా (M.M.A) నేర్చుకుంది పూజతోమార్. మెరుపు వేగంతో ప్రత్యర్థులను మట్టి కల్పించగల నేర్పు సాధించింది. బ్రెజిల్ కు చెందిన రయాన్ అమాండా ను ఓడించి అల్టిమేట్ ఫైట్ ఛాంపియన్ షిప్ (U.F.C) లో విజయం సాధించి ఆ ఫైట్ గెలిచిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది.
బొమ్మలతో ఉపాధి
వీణ పీటర్ నాణ్యమైన మెత్తని బట్టతో తయారు చేసే బొమ్మలు పర్యావరణహితం. తారాస్ డాల్ హౌస్ పేరుతో ఈ సంస్థ లో ఎంతోమంది మహిళలు పనిచేస్తారు. కోటి రూపాయల టర్నోవర్ తో సాగే ఈ సంస్థ లో తయారు చేసే బొమ్మలను ప్లాస్టిక్ హానికరమైన రసాయన రంగులు ఉపయోగించరు. పిల్లలు ఎంత కాలం ఆడుకున్నా బొమ్మలు మన్నికగా ఉంటాయి. టైలరింగ్, బొమ్మల తయారీ విభాగం మార్కెటింగ్ మొత్తం మహిళలే చూస్తారు. వీణ పీటర్ బెంగళూరు లో ఉంటారు […]
ఏడాది కష్టపడితేనే ఫలితం
ఏ పనైనా 21 రోజుల పాటు చేస్తే అది అలవాటు అయిపోతుందని చెబుతుంటారు కానీ అందులో నిజం లేదంటారు యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా పరిశోధకులు టైప్- 2 డయాబెటిస్ గుండె జబ్బులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మంచి అలవాట్ల తో జీవన శైలిలో మార్పు చేసుకోవాలని డాక్టర్స్ చెపుతారు. ఈ నేపథ్యంలో కొత్త అలవాటు నేర్చుకునేందుకు ఎన్ని రోజులు పడుతుంది అన్న విషయం పైన పరిశోధన చేస్తే ఒక మంచి అలవాటు చేసుకునేందుకు కనీసం ఒక సంవత్సరం […]
వ్యర్థాలతో ఆదాయం
అరటి వ్యర్థాలను ఆదాయ మార్గం గా మార్చి చూపించి వెయ్యికి పైగా రైతు కుటుంబాలకు ఆర్థిక సుస్థిరతకు దోహదం చేశారు అనసూయ జెనా ఒడిశా రాష్ట్రం ఖుర్దా జిల్లా లోని బాలిపట్న లో అరటి పంట ప్రధానమైన సాగు రైతులకు జీవార్థమైన ఈ పంట అరటి గెలలు కొట్టేశాక మిగిలిపోయిన అరటి బెరడు రైతులకు గ్రామానికి సమస్యగా ఉండేవి అరటి బెరడు వీధుల్లో కుళ్ళిపోతూ దుర్వాసన వచ్చేవి.ఈ సమస్యకు పరిష్కారం చూపించారు అనసూయ జెన్ దంపతులు.2021 లో […]
గుస్సాడీ నృత్యం పై పుస్తకం
గుస్సాడీ సెలబ్రేషన్ ఆఫ్ బియాంగ్ గాడ్ పుస్తకాన్ని రాసింది హైదరాబాద్ కు చెందిన జెన్నిఫర్ ఆల్ఫోన్స్ ప్రాచీన గిరిజన తెగకు చెందిన గోండులు జరుపుకునే నాగోబా జాతర గుస్సాడీ నృత్యం వారి ఆచార వ్యవహారాలు అన్ని రెండేళ్ల పాటు కష్టపడి, ఆ గిరిజనుల అభిమానం సంపాదించి పుస్తకం రాసింది జెన్నిఫర్. ఆదిలాబాద్ అడవుల్లో నెలల తరబడి ఉండి నాగోబా జాతర పై డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీకి మెక్సికో లో జరిగిన కోల్ ఇండీ జీనియస్ ఇంటర్నేషనల్ […]
కృష్ణుని కోసం రోబోటిక్ ఏనుగు
ప్రముఖ సిటారిస్ట్ అనౌష్క శంకర్ కేరళ త్రిసూర్ లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి ఒక రోబోటిక్ ఏనుగు ను బహుకరించారు పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) తో కలిసి ఈ యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఇది మూడు మీటర్ల ఎత్తు 800 కిలోల బరువుతో ఉంది. ఈ రోబోటిక్ ఏనుగు వల్ల నిజమైన ఏనుగును గొలుసులతో బంధించి ఆయుధాలతో హింసించే పని ఉండదని అనౌష్క అన్నారు రబ్బర్, ఫైబర్,మెటల్,ఫోమ్,స్టీల్ […]
