Sunday, 28 Jun, 2026

అమ్మకు తోడుగా

అద్వైత నాయర్ నైకా ఫ్యాషన్ సృష్టికర్త ముందుగా తల్లి ఫల్గుణి నాయర్ ప్రారంభించిన నైకా కు వెబ్ సైట్ దగ్గర నుంచి మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ వెబ్ సైట్ డిజైనింగ్ వంటి కీలక బాధ్యతలు అన్ని తీసుకున్నది. బ్యూటీ సంస్థ గా నైకా లాభాల బాటలో పడ్డాక ఫ్యాషన్ బ్రాండ్స్ తో రిటైల్ స్టోర్స్ ప్రారంభించింది అద్వైత. ఈ యంగ్ లీడర్ ను యంగ్ గ్లోబల్ లీడర్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గుర్తించింది.

సమాజ సేవకే ప్రాముఖ్యత

భూమి ఫెడ్నేకర్ స్టార్ హీరోయిన్. గడిచిన ఆరేళ్లలో 26 అవార్డులు తీసుకుంది. నటన ఆమెకు కేవలం వృత్తి మాత్రమే అని చెప్పే భూమి నిజ జీవితంలో ఎన్జీవోలతో కలిసి పర్యావరణ పరిరక్షణ పైన వాతావరణ మార్పుల పైన అవగాహన కల్పిస్తుంది. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి నేషనల్ అడ్వకేట్. అలాగే హీలింగ్ హిమాలయన్ కు అంబాసిడర్ కూడా. ఆమెను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్  యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపిక చేసింది.

ఒంటరి తల్లులకు సాయం

ప్రియా అగర్వాల్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపిక చేసింది. ఈమె వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కూతురు ప్రపంచంలో ఒక పెద్ద మైనింగ్ సంస్థ వేదాంత కు డైరెక్టర్ యోధ పేరుతో జంతు సంరక్షణ సంస్థ నిర్వహిస్తుంది. సి.ఇ.ఓ గా హిందుస్థాన్ జింక్ అనే సబ్సిడరీ సంస్థ స్థాపించింది. ఒంటరి తల్లులకు ప్రత్యేక సాయం మైనింగ్ లో మహిళల అవకాశాల పెంపుకు కృషి చేస్తోంది ప్రియా అగర్వాల్.

ఈ మాత్రానికి కొడుకే కావాలా నాన్న!

కష్టం చూడలేక ఏకంగా కొబ్బరికాయలు కోసే వృత్తి తీసుకుంది కేరళ కు చెందిన శ్రీదేవి గోపాలన్. బి.ఇ.డి చదువుకొంది.ముగ్గురు అక్కచెల్లెళ్ళు. వీళ్ళ చదువుల కోసం తండ్రి ఎంతో కష్టపడేవాడు కొడుకు ఉంటే నా కష్టానికి తోడుగా ఉండేవాడు కదా అన్నారట ఆ తండ్రి ఎంతో అలసిపోతూ. ఆ మాట విని బాధపడి ఆన్ లైన్ లో చూస్తూ కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు దింపటం ప్రాక్టీస్ చేసింది శ్రీదేవి గోపాలన్. ఆమె పట్టుదలకు ముచ్చటపడి 8 ఇళ్లల్లో […]

తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్

ఆస్ట్రోమ్ టెక్నాలజీ తో ఎంటర్ప్రెన్యూర్ గా తన సత్తా చాటుకుంది నేహా సతాక్. భారతదేశంలోని గ్రామాల ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ఆలోచన తన వ్యాపారానికి మూలం అంటుంది నేహా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ తీసుకున్నారు నేహా సతాక్ స్పేస్ టెక్ ఆవిష్కర్తల కోసం ప్రతిష్టాత్మక కర్మన్ ఫెలోషిప్ కూడా గెలుచుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 4G, 5G వైర్ లెస్ ను అమలు చేసే ఖర్చు తగ్గిస్తుంది. ఈ ఆస్ట్రోమ్ టెక్నాలజీస్ ఇదే […]

మానసిక వ్యాధులు గుర్తిస్తుంది

లైనా ఇమాన్యుయేల్ తో కలిసి  రిమ్ జిమ్ అగర్వాల్ స్థాపించిన బ్రెయిన్ సైట్ ఫ్లాట్ ఫామ్ మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్స్ కు న్యూరో సర్జన్ కు ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్ అఫ్ ది బ్రెయిన్ గా ఈ బ్రెయిన్ సైట్ గుర్తింపు పొందింది. మెదడులో ఏం జరుగుతుంది అన్న దాన్ని ఈ టెక్నాలజీ అర్థమయ్యేలా చేస్తుంది. స్కీజో ఫెనియా బైపోలార్ డిసార్డర్ వంటి మానసిక వ్యాధులకు సంబంధించి ఈ ‘బ్రెయిన్ సైట్’ చక్కగా అర్థం చేసుకునేందుకు అవసరం.

ఇది సరైన కలర్  

డిజిటల్ ఫస్ట్ కాస్మెటిక్ బ్రాండ్ ‘షుగర్’ ఎంటర్ ప్రెన్యూర్ గా విజయం సాధించింది వినీత సింగ్. ఆమె మొదటి స్టార్టప్ క్వెట్జల్. 2012లో దేశంలో పెరిగిన ఇ -కామర్స్ దృష్టిలో పెట్టుకుని మహిళలకు బ్యూటీ ప్రొడక్ట్స్ తక్కువ ధరకు ఇచ్చే ప్యాచ్ బ్యాగ్ అనే సబ్ స్క్రిప్షన్స్ వ్యాపారం కూడా చేసింది.అయితే తను అందిస్తున్న మేకప్ బ్రాండ్స్ మన భారత దేశ మహిళల స్కిన్ టోన్ కు సరిపోవడం లేదని గ్రహించి 2017 లో కాస్మెటిక్ షుగర్ […]

మహిళలకు ప్రోత్సాహం

2011 లో స్థాపించిన ‘కినారా క్యాపిటల్’ అనే ఫిన్ టెక్  సంస్థ ద్వారా హార్దికా షా 40,000 మంది చిన్న వ్యాపారవేత్తలను ప్రోత్సహించింది. ఈ శాఖకు ఆరు రాష్ట్రాల్లో 110 శాఖలు ఉన్నాయి.కొలంబియా బిజినెస్ స్కూల్లో చదువుకున్న హార్దికా షా మొదటి నుంచి లింగ సమానత్వాన్ని  ప్రోత్సాహిస్తోంది. ఆమె కంపెనీ మహిళా పారిశ్రామికవేత్తలను ముందుగా తీసుకుపోతుంది. ప్రతిష్టాత్మక బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ ఆసియా గ్లోబల్ అవార్డు అందుకున్నది. హార్దికా షా ఫోర్బ్స్ ఇండియా టాప్ 20 అత్యంత శక్తివంతమైన […]

యంత్రాలకే శిక్షణ

డిజిటల్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ లకు సంబంధించిన మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించారు. అశ్విని అశోకన్. విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్న అశ్విని ముందుగా  ఇంటెల్ లో పని చేసింది. ఎన్నో కంపెనీల్లో ఈ క్లౌడ్ ఆధారిత ఫ్లాట్ ఫామ్ ఉపయోగా పడుతోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అప్ ఏఐ కంప్యూటర్లు, యంత్రాలు మనుషుల్లాగే పని చేసేందుకు వాటిని నియంత్రిస్తూ ట్రైనింగ్ ఇస్తుంది.

మహిళలు సూపర్ విమెన్ లే  

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణ పురోహిత్ పాతాళ లోక్, మిర్జాపూర్,మేడ్ ఇన్ హెవెన్ వంటి బ్లాక్ బస్టర్ తీసి మంచి పేరు సాధించింది. తమ దైనందిన జీవితంలో మహిళలు ఎప్పుడు సూపర్ కాకపోతే సూపర్ మ్యాన్ లాగా సూపర్ ఉమెన్ అనే పేరు మనకు వినిపించాదు అంటుంది అపర్ణ.

సెల్ఫ్ మేడ్ ఉమన్  

కృతి సనన్  ఫోర్బ్స్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో స్నానం సంపాదించింది. నటిగా నే కాదు వ్యాపారవేత్తగా అతిపెద్ద బ్రాండ్లకు అంబాసిడర్ గా కృతి ఎంతో ప్రయాణం చేసింది వైశాలి గుప్తా తో కలిసి హైఫిన్ పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ ని తీసుకొచ్చారామె అలాగే మిస్ టేక్న్ అనే ఫ్యాషన్ లేబుల్ కూడా ఉంది.సోదరి నుపుర్ సనన్ తో కలిసి బ్లూ బటర్ ఫ్లై అనే ప్రొడక్షన్ నడుపుతోంది. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ -100 […]

కేరళ టు కాశ్మీర్

జెలజ ట్రక్ డ్రైవర్ కేరళ నుంచి కాశ్మీర్ వరకు ట్రాక్ తోలింది. పుతట్టు ట్రావెల్ వ్లోగ్ పేరుతో తను,భర్త కూతురు చేసే ఒక కుటుంబ ప్రయాణం గురించి చెబుతూ లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నది. కేరళలోని కొట్టాయం నుంచి బయలుదేరి ట్రక్ లో సరుకు రవాణా చేస్తూ కాశ్మీర్ వరకు  వెళ్ళగలదు జెలజ వాష్ రూమ్స్ కాస్త ఇబ్బంది కానీ మిగతా ప్రయాణం నాకేం కష్టం కాదు అంటుంది జెలజ ఒక్కసారి అత్తగారిని కూడా తీసుకుపోతుందట […]

లివ్ లవ్ లాఫ్

గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం లివ్ లవ్ లాఫ్ అనే సంస్థ స్థాపించారు దీపికా పదుకొనే ఆ బాధ్యత ఆమె చెల్లెలు అనిషా పదుకొనే తీసుకున్నారు.ఈ ఫౌండేషన్ ఆరు రాష్ట్రాలకు విస్తరించి ఉంది. 15,000 మంది గ్రామీణ మహిళలు మానసిక చికిత్స తీసుకున్నారు. 26,000 మంది అంగన్‌వాడీ కార్యకర్తల మానసిక చికిత్స లో అవగాహన కోసం శిక్షణ తీసుకున్నారు.స్త్రీలు వ్యాయామం చేస్తూ పోషకాహారం తీసుకుంటూ బాగా నిద్రపోతే ఈ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారు అంటుంది […]

క్యాన్సర్ ను గెలవచ్చు

క్యాన్సర్ వస్తే మరణం దగ్గరైనట్లు కాదు అంటుంది భారతీయ సినీ అగ్రతార మనీషా కోయిరాలా. ఆమె రాసిన హీల్డ్, క్యాన్సర్ గావే మి ఎ న్యూ లైఫ్ అన్న ఆటోబయోగ్రఫీ లో తన క్యాన్సర్ ప్రయాణాన్ని విఫులంగా వివరించారామే. ఇది క్లిష్టమైనది కానీ మన ప్రాణం మనకు విలువైనదే కదా. క్యాన్సర్ తగ్గిపోయే వ్యాధి కానీ దానితో ధైర్యంగా పోరాడాలి అంటుంది మనిషా.ఈ పుస్తకం క్యాన్సర్ రోగులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.

ఆటోమొబైల్ రంగంలో మహిళలు  

మొబైల్ రంగంలో అమ్మాయిలకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి జపాన్ కు చెందిన ప్రముఖ టైర్ల కంపెనీ యోకోహామా లో వెయ్యి మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గుజరాత్ లోని దహేజ్ తమిళనాడులోని తిరునల్వేలి ఆంధ్రప్రదేశ్ లోని తిరునల్వేలి టైర్ల తయారీ ప్లాంట్స్ ఉన్నాయి.ఈ ప్లాంట్లలో మహిళలే ఎక్కువ మిషన్ ఆపరేటర్లు,టీమ్ లీడర్, టెక్నీషియన్‌లు మరియు సూపర్‌వైజర్‌లు మహిళలే ఈ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు మహిళలు ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన శిక్షణ లపై దృష్టి పెడితే మంచిది.

అక్కడ లావే అందం

అందంగా ఉండటం అంటే సన్నగా పొట్ట లేకుండా ఉంటారు కదా. మౌరిటేనియా ఆఫ్రికా లో ఆడపిలల్లో బరువుగా ఉంటేనే అందం ఇంటికి ప్రతిష్ట అనుకుంటారు. ఒకవేళ సన్నగా ఉంటే తిండి పెట్టడం లేదని పరువు పోతుందని ఆడపిల్లలను ఫ్యాట్ ఫార్మ్ లో చేర్చి మరి తిండి తినిపిస్తారు. రోజుకి 16,000 కేలరీలు తినాలి. ఆడపిల్లలు పెళ్ళయ్యాక భర్త కూడా భార్య సన్నబడకుండా సరిగ్గా పోషించటం లేదు అనుకుంటారని ఆమెను నిరంతరం తినే లాగా చూస్తారట.

తొలి మహిళ ఆమే

ఆరతి సాహా 1959 లో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి ఆసియన్ మహిళగా రికార్డ్ ల కెక్కారు. ఫ్రెంచ్ నుంచి ఇంగ్లాండ్ కు 16 గంటల 20 నిమిషాల్లో ఈది ఈ ఘనత సాధించారు. 1960 లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.  ఆరతి సాహా గౌరవార్థం 1999 లో పోస్టల్ డిపార్ట్ మెంట్ స్టాంప్ విడుదల చేస్తే గూగుల్ సంస్థ ఈమె 80వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌ నే క్రియేట్ చేసింది. 1996లో […]

మొదటి బైక్ రైడర్

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోటార్ బైక్ ప్రయాణించిన తొలి భారతీయ మహిళ రోషిని శర్మ. ఉత్తర్ ప్రదేశ్ లోని నరోరా లో పుట్టిన రోషిని ఇంజనీరింగ్ చదివారు. బైక్ పైన ప్రయాణంతో ఇష్టంతో ఆమె ఒంటరిగా 11 భారతీయ రాష్ట్రాల గుండా ప్రయాణం చేసింది తన సోలో బైక్ ట్రిప్ తనకు తీర్థయాత్ర వంటిదే అంటుంది రోషిని ఇంజనీర్ గా పనిచేస్తున్న రోషిని సైక్లింగ్, మౌంటెన్ క్లైమ్బింగ్ కు వెళుతుంది. అప్రమత్తంగా ఉంటే మహిళ లైనా […]

మిస్ వరల్డ్  క్రిస్టినా

110 దేశాలకు చెందిన యువత లతో పోటీపడి మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నది క్రిస్టినా పిస్కోవా ఈమెది చెక్ రిపబ్లిక్. లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డ్యూయల్ డిగ్రీ చేసింది. క్రిస్టినా పిస్కోవా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు సాయం చేస్తోంది.దేశ విదేశాలు చూడాలనే కోరిక తో మోడలింగ్ కు కట్టాను అని చెప్పే క్రిస్టినా ధేయం.ప్రపంచంలో చదువుకొని అవకాశం లేని పిల్లలకు చదువు చెప్పించాలని ఆమె ప్రత్యేకత ఆమె అందమైన మనసే అన్నారు ప్రేక్షకులు.

బహుముఖ ప్రజ్ఞ

యాక్టర్, రైటర్,బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్,సోషల్ యాక్టివిస్ట్ గా తన ప్రత్యేకత నిరూపించుకుంది మలయాళ మంజు వారియర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్టు కుటుంబ శ్రీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపించింది.కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెండర్ పార్క్ ప్లాట్ ఫామ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మంజు క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తోంది. దేశం లోనే అద్భుతమైన భరతనాట్య కళాకారిణి కూడా ‘సల్లాపం’ […]