February 2024
ఎంతో స్పెషల్ ప్లీటెడ్
ఎప్పుడు ఒకే రకం చీరలేనా ? కాస్త వెరైటీ ఉండదా? పట్టు,కాటన్,జార్జెట్,కోట ఎన్నిసార్లు కట్టుకోలేదు. ఇప్పుడే ఏదైనా కొత్త వెరైటీ కావాలా అనుకుంటే అమ్మాయిల కోసం వచ్చాయి ప్లీటెడ్ క్రష్డ్ చీరలు ఎలాంటి డిజైన్ లేని సాదా చీరలకు చిన్న మడతలు పెట్టినట్లు కనిపించే ఈ చీరలు ఇవ్వాల్టి ఫ్యాషన్. జార్జెట్,సిల్క్ లతో ఈ ప్లేటెడ్ క్రష్డ్ సారీస్ చక్కని డిజైనర్ బ్లౌజ్ తో కలిసి కొత్త అందాన్ని ఇస్తున్నాయి. అందమైన నలుపు, ఎరుపు వంటి ముదురు […]
మహిళల ఓట్లే కీలకం
2029 నుంచి భారతదేశంలో మహిళా ఓటర్ల సంఖ్య అధికం అవనున్నదని ఎస్.బి.ఐ నివేదిక చెబుతోంది. 2024 లో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో నివేదిక మొత్తం 68 కోట్ల మంది ఓటర్లను అంచనా వేసింది. అందులో మహిళా ఓటర్లు 49 శాతంగా అంటే 33 కోట్ల మంది ఉన్నారని నివేదిక పేర్కొన్నది గత దశాబ్ద కాలంలో భారతదేశ రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళల ఓటింగ్ శాతం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. […]
ఏనుగుల రాణి
భారత దేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బహుకరించి గౌరవించింది. మన దేశం లోనే కాదు ఆసియాలోని ప్రమాద స్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణ కోసం వాటిని ఎలా కనిపెట్టుకొని ఉండాలో తెలుసుకొని ఇన్నాళ్లుగా వాటిని సంరక్షిస్తున్న పర్బతి అస్సాం అటవీశాఖ లో చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్ గా పనిచేసింది. మావటి పని డ్రైవర్ ఉద్యోగం చేసినట్లు పనిగంటలతో ఉండదు ఏనుగు కు మావటి అనుక్షణం తోడు ఉండాలి అంటుంది పర్బతి. […]
చామీ ముర్ము కు పద్మశ్రీ
ఝార్ఖండ్ కు చెందిన చార్మి ముర్మా 36 సంవత్సరాలుగా తన రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. కూలి పనులు చేసుకుంటూ పర్యావరణ హితం కోసం మొక్కలు నాటిన ముర్ము కు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేశారు. ఈ మొక్కలు నాటే పని పెట్టుకున్నందుకు ఇంట్లో వాళ్లతో కూడా గొడవలు వచ్చాయి. చామీ ముర్ము ఇంటి నుంచి బయటికి వచ్చి ఎంతో ధైర్యంతో సమాజ హితం కోరింది. తాను నివసించే భుర్సా గ్రామం బంజరు […]
రోజుల కొద్దీ పాట
పాట వింటూ గంటలు గడిపేయచ్చు కానీ రోజుల కొద్దీ అవిశ్రాంతిగా పాడటం గురించి విన్నారా ? ఘానా కు చెందిన 33 ఏళ్ల అసాంతేవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.ఆఫ్రికాలోని కొట్టుకు కొటోకా విమానాశ్రయం వేదికగా ఆమె తన గాన మారథాన్ ప్రారంభించి సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు పాడింది. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రయాణికులు సహా వేలాది మంది ఆమెను ప్రశంసించారు […]
పెదవులు పగుళ్ళా ?
వాతావరణం అతి చల్లగా ఉన్న వేడిగా ఉన్న పెదాలు పొడిబారి పోతాయి. అలర్జీలు, థైరాయిడ్, ఐరన్, బి-విటమిన్ లోపం తగినన్ని నీళ్లు తాగకపోవడం మాటిమాటికి పెదాలు నాలుకతో తడపడం కూడా పెదవుల పగుళ్లకు కారణం కావచ్చు. పెదవులపై చర్మం చాలా పలుచగా ఉంటుంది. పెదవిపై నూనె గ్రంధులు ఉండవు అందుకే ఎప్పటికప్పుడు పెదవులకు పోషణ అందించడం కోసం రోజుకు మూడు లీటర్ల నీరు తాగాలి.కానీ కొన్ని రకాల టూత్ పేస్ట్ లు కూడా పడవు అదేమైనా కారణమేమో […]
స్ఫూర్తిదాయక ప్రయాణం
తమిళనాడు కు చెందిన ప్రీతి శ్రీనివాసన్ క్రికెటర్ అమెరికాలో చదువుకున్న టాప్ స్టూడెంట్ 18 ఏళ్ల వయసులో వెన్నెముక పక్షవాతం రావడం తో వీల్ చైర్ కే పరిమితం అయింది. సొంత అనుభవాలతో ఈ దేశంలో దివ్యాంగుల గౌరవంగా జీవించగలిగిన స్థలం లేదని అర్థం అయ్యాక సోల్ ఫ్రీ పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. ఇక్కడ వెన్నుపాము సమస్యలున్న వారికి పూర్తి చికిత్స, పునర్వాసం, వైద్య సంరక్షణ విద్య కౌన్సిలింగ్ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ సంస్థ […]
నోక్టర్న్స్ కు అవార్డ్
హిమాలయ ప్రాంతాలకు చెందిన మాత్ అంటే రెక్కల పురుగుల పై తీసిన డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన నోక్టర్న్స్ డాక్యుమెంటరీ,అమెరికాలో జరిగిన సన్‌డాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి ఈ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ ఆమె భర్త అనిర్బన్ దత్తా తో కలిసి ఢిల్లీలో ఉంటారు. హిమాలయాల్లో ఉండే అందమైన రెక్కల పురుగులు పర్యావరణ మార్పులతో నశించిపోతున్నాయని తెలుసుకొని వాటి జీవన విధానాన్ని డాక్యుమెంటరీ గా తీశారు.డాక్యుమెంటరీ లో రెండే […]
చర్మానికి పోషకాలు అవసరం
చుట్టూ వాతావరణంలోని దుమ్ము ధూళి తో పెరుగుతున్న ఎండ వేడితో చర్మం నిర్జీవంగా మారుతుంది. చర్మానికి కూడా పోషకాలు అవసరం ఎలాంటి రసాయనాలు లేని కొన్ని మాస్క్ లు చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కమల పండు తొక్కలను ఓ గిన్నెలో వేసి ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మూడు ఇ విటమిన్ క్యాప్సూల్స్ కలపాలి వీటిని మిక్సీలో వేసి మెత్తగా చేసి ఆ రసాన్ని వడగట్టి దానికి అలోవెరా గుజ్జు కలిపి గాజు సీసాలో ఫ్రిజ్ లో […]
