December 2023
మహిళా శక్తి
వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించింది సోమ మండల్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన సోమ నాల్కో లో ఇంజనీర్ ట్రైనీ గా అడుగుపెట్టి మహిళా డైరెక్టర్ అయ్యారు. 2017 లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లోకి వచ్చాక ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్ ఫస్ట్ ఉమెన్ చైర్ పర్సన్ ఆఫ్ నెయిల్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. కొత్త వ్యాపార వ్యూహాలతో లాభాల దిశగా నడిపించారు. సక్సెస్ కు షార్ట్ కట్ లేదు […]
అల్లికలతో ఉపాధి
నీడిల్స్ టు సే మోర్ అన్న సంస్థను స్థాపించారు డాక్టర్ మాల శ్రీకాంత్.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిలిటరీ డాక్టర్ గా పనిచేసిన మాల కొండ ప్రాంతం లోని వేలాదిమంది మహిళల కోసం ఈ ఆన్ లైన్ వేదికను ప్రారంభించారు. ఉత్తరాఖండ్ లోని రాణి ఖేల్ కొండ ప్రాంతంలో నివసించే గిరిజన స్త్రీలకు కుట్లు అల్లికలు నేర్పి వారికో ఉపాధి చూపెట్టారు. ఇప్పుడే అల్లికల ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంది.కొండ ప్రాంతం లోని వేల మంది స్త్రీలకు […]
ఆవిరి ఎంతో లాభం
దుమ్ము, ధూళి ఇతర కాలుష్యాలు చర్మానికి చాలా అపకారం చేస్తాయి. చర్మ రక్షణ కోసం ఎన్ని రకాల క్రీములు వాడిన వారానికి ఒకసారి ఆవిరి పట్టటం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. ఆవిరి పట్టటం తో ముఖంపై పేర్కొన్న మృతకణాలు మేకప్ అవశేషాలు పోతాయి. నాణ్యమైన ఎసెన్షియల్ ఆయిల్స్ వేసి ఆవిరి పట్టడం వల్ల చర్మం శుభ్రపడుతుంది.ఒత్తిడి తగ్గుతుంది ఆవిరి పట్టాక మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
అన్నింటా అనుష్క
మోడలింగ్ బుల్లితెర,వెండితెర పై అవకాశాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో అనుష్క సేన్ చాలా పాపులర్ నటి. గత సంవత్సరం ఒక కొరియన్ సినిమాలో నటించాక ఆమెను కొరియా టూరిజం సంస్థ తమ అంబాసిడర్ గా నియమించుకుంది. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ లో మన దేశం తరఫున పాల్గొన్నది. 19 సంవత్సరాల అనుష్కా ఫిల్మ్ స్టడీస్ లో డిగ్రీ చేస్తోంది. అభిమానులు ఈమెను గ్లోబల్ స్టార్ అంటారు.
అలంకార వస్తువులు
దుబాయ్ లో చదువుకున్న నిరుపయోగంగా ఉన్న గాజు వస్తువులతో అందమైన గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తుంది రెంజినీ థామస్.2021 నుంచి వాపసీ అన్న పేరుతో ఈ గాజు వస్తువులు ఆన్ లైన్ లో అమ్ముడుపోతున్నాయి. రీసైకిల్ చేసిన గాజు సీసాలు, కొబ్బరి చిప్పలు, చెక్క లోహ వ్యర్థాలతో దీపాలు, వాల్ హ్యాంగింగ్స్, సైడ్ టేబుల్, గిన్నెలు, గడియారాలు వంటి గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తుంది రెంజినీ థామస్.
వ్యర్థాలతో ఉపాధి
వాడి పారేసే వ్యర్థాలను కూడా వదలలేదు నమ్రత రామనాథన్. చెన్నై లో ఉండే నమ్రత టైలరింగ్ షాపుల్లో కత్తిరించి పారేసిన ముక్కలు సేకరించి ఆ వస్త్ర వ్యర్థాలతో అందమైన హెయిర్ బ్యాండ్స్ కి చైన్లు చిన్న పిల్లల బొమ్మలు పర్స్ లు దిండు కవర్లు తయారు చేస్తుంది. 2021 నుంచి అప్ సైక్లి పేరుతో ఆన్ లైన్ లో వీటిని విక్రయిస్తోంది.విదేశాల నుంచి కూడా ఎన్నో ఆర్డర్ లు ఉన్నాయి. ఈమె తయారు చేసే వస్తువులన్నీ చాలా […]
జామ పండు వెరీ స్పెషల్
సీజనల్ ఫ్రూట్స్ జామ పండు కు మించిన గొప్పది ఇంకేది లేదు.ఇందులో ఉండే విటమిన్ సి వల్ల దగ్గు జలుబు వంటివి రావు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్ తో బాధపడేవారు సందేహం లేకుండా తినొచ్చు. ఈ పండు తినడం వల్ల సోడియం పొటాషియం సమతులంగా ఉంటాయి. జామ ఆకులు నమిలితే నోటిలో దుర్వాసన పోతుంది. జామలో పీచు ఎక్కువ బరువు తక్కువ తగ్గాలనుకుంటే డైట్ లో జామపండు చేర్చుకోవాలి.
ఫ్రెండ్లీ బొమ్మలు
పిల్లల బొమ్మల తయారీలో తన జీవితాన్ని అంకితం చేసిన నమితా ఆజాద్.బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక,బీహార్ హస్తకళల పురస్కారం అందుకున్నారు. చంపారన్ జిల్లాలోని గుడ్డపీలికలతో తమకు చేసే బొమ్మలు సంస్కృతిలో ఒక భాగం. కన్యా పుత్రి బొమ్మల పేరుతో చేసే ఈ బొమ్మలు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లలో ఉంచుకున్నారు. ఈ బొమ్మలు ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు ప్లాస్టిక్ వాడకం లేకుండా కేవలం గుడ్డపీలికలతో తయారు చేసే ఈ కన్యాపుత్రి బొమ్మలను ఎస్ క్రియేషన్స్ పేరు తో తయారుచేయంటే […]
మంచి పుస్తకం
‘వెస్ట్రన్ లేన్’ ఈ సంవత్సరపు బుకర్ ప్రైజ్ తుది జాబితాలో స్థానం సంపాదించుకొంది. భారతీయ మూలాలున్న బ్రిటిష్ రచయిత్రి చేతనా మారూ రాసిన పుస్తకం చాలా అద్భుతంగా ఉందని విమర్శకులు సైతం మెచ్చుకొన్నారు. గోపీ అనే 11 ఏళ్ళ అమ్మాయి చుట్టూ తిరిగే ఈ నవలను ప్రముఖ అమెరికన్ ప్రచురణ సంస్థ ఎఫ్ ఎస్ జీ ప్రచురించింది.
నయా ఫ్యాషన్
దుస్తులకు సరిపోయే మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఎప్పటినుంచో మార్కెట్ లో దొరుకుతున్నాయి కానీ అచ్చంగా చీర లాగే ఉండే డిజైన్స్ తో మ్యాచింగ్ గాజులు ఉండవు కదా. తీషా క్రాఫ్ట్ వాళ్లకు చీరను లేదా డ్రెస్ ను బట్టి అచ్చు అలాగే ఉండేలా కస్టమైజ్ గాజుల్ని చేసి ఇస్తున్నారు. వాళ్ళ వెబ్ సైట్ లో చీరె ఫోటో పెట్టి గాజులు ఆర్డర్ చేస్తే అచ్చం చీర డిజైన్ గాజులు,ఒకవేళ చీరకు కుందన్లు పూసలు ఉంటే అది కూడా కలిపి […]
మాకు ప్లాస్టిక్ వద్దు
బార్టన్ బ్యాంక్ స్థాపించిన నీరు యాదవ్ ఊరు ఎంత శుభ్రంగా ఉంచవచ్చు నిరూపించారు రాజస్థాన్ లోని జూన్ జూన్ అనే పల్లెకు సర్పంచ్ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఉపయోగించే డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువులు గ్రామం నిండా పేరుకుపోయి పర్యావరణానికి హాని కలిగించటం నీరు యాదవ్ గమనించారు. ఆమె పెళ్లిళ్లలో వడ్డెనకు ఉపయోగించే గ్లాసులు, ప్లేట్లు, స్పూన్స్ అన్ని కొనేసింది. నీరు యాదవ్ గ్రామంలో ఎవరి ఇంట శుభకార్యం జరిగిన ఇవే వాడాలని కోరా రామె. ఈ బార్టన్ […]
ఆమె చిత్రాలే స్ఫూర్తి
బిబిసి 100 విమెన్ 2023 లో క్లైమేట్ వయనార్స్ విభాగంలో స్ఫూర్తిదాయక మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు ఆరతి కుమార్ రావ్ ఆమె పర్యావరణ ఫోటోగ్రాఫిర్ జీవన వైవిధ్యం క్లైమేట్ చేంజ్ అంశాలపై ఫోటోలు డాక్యుమెంటరీ లు తీశారు. భారతదేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను కళ్లకు కట్టేలా మార్జిన్ ల్యాండ్స్ ఇండియన్ ల్యాండ్ స్కేప్ ఆన్ ది బ్రింక్ అనే పుస్తకం రాశారు ఆరతి టెడెక్స్ స్పీకర్ కూడా.
శీతాకాలపు సీరమ్
చలిగాలులకు చర్మంలో తేమ తగ్గిపోయి పొడిబారి పగుళ్లు వస్తాయి. ఇందుకోసం ఇంట్లోనే సీరమ్ తయారు చేసుకోవచ్చు. కమల పండు తొక్కలు ఒక గిన్నెలో వేసి రెండు టేబుల్ స్పూన్ గులాబీ నీరు అర టేబుల్ స్పూన్ గ్లిజరిన్ విటమిన్ ఇ క్యాప్సిల్స్ నూనె కలపాలి. వీటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసి వడకడితే వచ్చే రసంలో కాస్త అలోవెరా గుజ్జు కలిపి సీసాలో భద్రపరుచుకుంటే రెండు మూడు వారాలు వాడుకోవచ్చు. క్రీమ్ రాసుకునే ముందు ఈ […]
ఇంగ్లీష్ టీచర్
ఇంగ్లీష్ పాఠాలు చెపుతోంది యశోదా లోధి ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లా లో సిరాతు నగర్ అనే పల్లెటూర్లో ఉంటుంది యశోద. హిందీ మీడియం లో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. బంగాళదుంప చేలల్లో కూలి కి వెళ్తుంది. యూట్యూబ్ లో చూసి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంది. అట్లా నేర్చుకుంటూనే తన సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ పాఠాలు నేర్పటం మొదలు పెట్టింది యశోద. మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో యశోద లోధి […]
అమ్మాయిలే మెకానిక్ లు
కేరళ లో తొలి విమెన్ మెకానిక్ వర్క్ షాప్ ప్రారంభించారు బిన్సీ, మెర్సీ, బింటు అనే ముగ్గురు అమ్మాయిలు కేరళలో కాసరగోడ్ జిల్లాలోని వెస్ట్ ఎలేరి అనే చిన్న గ్రామంలో నుంచి వీరు ముగ్గురు వాహనాల రిపేర్లు మొదలుపెట్టారు. రీబిల్డ్ కేరళ పేరుతో ఆ రాష్ట్రం మహిళలకు ఉపాధి మార్గాలు చూపిస్తోంది.వారు ప్రవేశపెట్టిన కుడుంబశ్రీ ఇప్పటికే విజయం సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ముగ్గురు టూ వీలర్ రిపేరింగ్ వర్క్ షాప్ మొదలుపెట్టారు.
170 కోట్ల వితరణ
రోహిణీ నిలేకని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని భార్య ఈ సంవత్సరం 170 కోట్ల రూపాయలు సేవా కోసం ఖర్చు చేసి దాతల జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. మీరు పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం అర్ఘం ఫౌండేషన్, ప్రతిభ గల విద్యార్థులకు ఎక్ స్టెప్ అక్షర ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. నోని అన్న కలం పేరుతో ఆమె పిల్లల కోసం ఎన్నో రచనలు చేశారు.
మహిళల కోసం గోబర్ దియా
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్ పాల్ గ్రామీణ మహిళల కోసం గోబర్ దియా ప్రారంభించారు. ఆవుపేడతో దీపాలు చేయడం మహిళలకు శిక్షణ ఇప్పించారు. గేదెలు, ఆవులు పేడతో పిడకలు చేసి ఎండనిచ్చి పొడిచేసి బంకమన్ను కలిపి చేసే దీపాలు ఉపయోగించిన తర్వాత వ్యర్ధంగా ఏమి మిగలదు ఈ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు గ్రామాల్లో ఉండే మహిళలు.
ఎనిమిదేళ్లకే గుర్తింపు
మణిపూర్ లోని బషిఖోంగ్ లో పుట్టిన లసిప్రియా కంగుజం ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల పర్యావరణ వేత్త గా గుర్తింపు పొందింది.తన ఐదేళ్ల వయసు గల పర్యావరణ రక్షణ. నిరక్షరాస్యత వంటి సమస్యల పై మాట్లాడటం మొదలు పెట్టింది. 2019 లో స్పెయిన్ లో జరిగిన ఐరాస్ సదస్సులో ప్రసంగించే అవకాశం సంపాదించింది.ఈ చిన్నారికి వర్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ ది ఇండియా పీస్ ప్రైజ్ అబ్దుల్ కలాం అవార్డులు వచ్చాయి.
ప్రధానిపై పి.హెచ్.డి
ప్రధాని మోదీ పి.హెచ్.డి చేసిన మొదటి మహిళ స్కాలర్ గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. బనారస్ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ చదివిన పర్వీన్ పి.హెచ్.డి కోసం ‘నరేంద్ర మోడీస్ పొలిటికల్ లీడర్ షిప్ యాన్ అనలిటికల్ స్టడీ’ అన్న అంశాన్ని ఎంచుకొంది.8 సంవత్సరాల అధ్యయనం చేసి నజ్మా ఈ పి.హెచ్.డి పూర్తి చేసింది.
ఆక్సా చాలా ప్రత్యేకం
అతిపిన్న వయస్కురాలైన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్ గా గుర్తింపు సాధించింది. 11 సంవత్సరాల అక్సా మస్రత్ ‘వాట్ అక్సా సే’ పేరుతో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసింది. ఆక్సా చేసిన వీడియోల్లో పేద రైతులకు క్రీడాకారులు రకరకాల వృత్తులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉంటాయి.
