November 2023
సిక్కిం లో శివుడు
ఆకాశాన్నంటే పరమేశ్వరుడి విగ్రహాన్ని చూడాలంటే చార్ ధామ్ కు వెళ్ళాలి.సిక్కిం లోని నామ్చి సోలో ఫోక్ కొండపై కనిపించే ఈ ఆధ్యాత్మిక ధామాన్ని ప్రభుత్వం నిర్మించింది. 108 అడుగుల ఎత్తున శివుడి విగ్రహం ఎదురుగా నంది స్వామి చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఉండడం ప్రత్యేక ఆకర్షణ. మెట్లకు ఇరువైపులా రామేశ్వరం బద్రీనాథ్ పూరీ జగన్నాథ్ ద్వారకా తాలూకూ ఆలయాల నమూనాలు దర్శించుకోవచ్చు. అందమైన నిర్మాణశైలిలో ఈ సిద్దేశ్వర ధామ్ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
తిరుతిండి అంటే ఇదే
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఆకలిగా అనిపిస్తే స్నాక్స్ కింద స్వీట్లు, సమోసాలు తినకండి అంటున్నారు ఎక్సపర్ట్స్. సాయంత్రం వేళల్లో తినేందుకు ఉదయాన్నే ఆహారం సిద్ధం చేసి పెట్టుకోండి అంటున్నారు. కాల్చిన లేదా ఉడికించిన మొక్కజొన్న సెనగలు అల్పాహారంగా తీసుకోవచ్చు.దానిమ్మ,పుచ్చ, బొప్పాయి వంటి పండ్లు అరటి, జామ, ఆపిల్ తినొచ్చు సాయంత్రం వేళ తినేందుకు నూనె చక్కెర లేని ఆహారం ఎంచుకోవాలి.
ఇది అందమైన పోటీ
గాయని మోడల్ వ్రిషా దత్త మిస్ ప్లస్ సైజ్ ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకుంది. నేను లావుగా ఉండటం వల్ల ఎన్నో అవమానాలు బేబీ ఎలిఫెంట్ అని పిలిచేవాళ్ళు చిన్నప్పుడు కానీ ఈ బాడీ షేమింగ్ నాలో పట్టుదల పెంచింది. గాయని గా పాటలు పాడుతున్నాను సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. కొన్ని బ్రాండ్స్ నాతో యాడ్స్ చేస్తున్నారు. ఇప్పుడు కిరీటం గెలిచిన పోటీలో పాల్గొన్న వాళ్లు అందరూ నాలా బొద్దుగా లావుగా ఉన్నవాళ్లే.స్నేహపూర్వక వాతావరణంలో ఈ […]
మద్యం సీసాలతో గాజులు
బీహార్ ప్రభుత్వం మద్యం సీసాలను రీసైకిల్ చేయించి గాజులు తయారు చేసి ప్రాజెక్ట్ ప్రారంభించింది. ‘జీవిక’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ లో మద్యం వల్ల భర్తలను కోల్పోయిన మహిళలను గుర్తించి వారికి గాజులు తయారీ నేర్పించి ఉపాధి ఇస్తున్నారు. పాట్నా లో ప్రస్తుతం 500 మంది స్త్రీలు ఈ గాజుల తయారీలో నైపుణ్యం పెంచుకొని ఉపాధి పొందుతున్నారు.
తారలు మెచ్చిన ధార్నా
ధార్నా దుర్గ హాస్యాన్ని జోడించిన వీడియోలు చేయడంలో ఎక్సపర్ట్. వేడుకల్లో, ఒక డాన్స్ టీచర్ వాళ్లకు డాన్స్ నేర్పించే విషయంలో ఎంత ఇబ్బంది పడుతుందో వీడియో తీసి ఇన్ స్టా లో పెడితే దీపికా పదుకొనే దాన్ని షేర్ చేసింది. దాంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ధార్నా. 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారామె కు బాలీవుడ్ తార లతో కలిసి ప్రచార వీడియోలు చేసింది. ‘మెటా’ కు ప్రచార కర్త కూడా. ఈ 23 […]
అపూర్వ విజయం
బ్రిటిష్ మల్టీ నేషనల్ కంపెనీ యూనీలీవర్ లోని టాప్ టీమ్ యూనిలీవర్ లీడర్ షిప్ ఎగ్జిక్యూటివ్ లో ఒకరుగా, ప్రెసిడెంట్ ఆఫ్ బ్యూటీ అండ్ వెల్ బీయింగ్ గా ప్రియా నాయర్ నియమితులయ్యారు.కోవిడ్ సమయం లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ లిమిటెడ్ లో పెద్ద విభాగమైన బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బాధ్యతల్లోకి వచ్చింది ప్రియా. కేవలం 30 రోజుల్లో తమ హైజీన్ బ్రాండ్ లో పదిహేను వేరియేషన్స్ తీసుకోవచ్చింది. అందులో ఒకటైన హ్యాండ్ శానిటైజర్ మనదేశం […]
అందరూ స్త్రీలే
దుబాయ్ లో ఎ ఆర్ రెహమాన్ ఏర్పాటు చేసిన ఫిర్ దౌస్ ఆర్కెస్ట్రా లో అందరూ మహిళలే. రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ కూడా ఇందులో పనిచేస్తుంది. ఈ ఆర్కెస్ట్రా లో వివిధ దేశాల మహిళా సంగీత కళాకారులు పనిచేస్తున్నారు. ఆర్కెస్ట్రా ముఖ్య ఉదేశ్యం అరబిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతం లో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావటం 26 దేశాల నుంచి వచ్చిన 51 మంది మహిళ సంగీతకారులకు కండక్టర్ గా మోనిక ఉమెన్ అనే […]
మహిళలకు చేయూత
యువ పారిశ్రామిక వేత్తల కోసం లెట్స్ వెంచర్ అనే సంస్థ ప్రారంభించారు బెంగళూరుకు చెందిన శాంతి మోహన్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన శాంతి మహిళలను వ్యాపార దిశగా వ్యాపారం దిశగా ప్రోత్సాహం ఇచ్చేందుకు లెట్స్ వెంచర్ ద్వారా అటు స్టార్టప్ లను ఇటు వ్యాపారవేత్తలను ఒక తాటి పైకి తీసుకొచ్చారు.నందన్ నీలేకని,రతన్ టాటా,రాజన్ ఆనందన్,అనుపమ్ మిట్టల్ వంటి వారు ఈ సంస్థకు పెట్టుబడులు పెట్టారు. సామాన్యులు కూడా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ట్రైకా సంస్థ కూడా ప్రారంభించారు […]
డిజిటల్ స్టార్
శ్రీమణి త్రిపాఠి గ్రాఫిక్ డిజైనర్ ఫ్రీలాన్సర్ గా కథల వీడియోలు సంస్థల సోషల్ మీడియా ఖాతాలకు పనిచేసింది. తనకు నచ్చిన అంశాలతో యూట్యూబ్ లో వీడియోలు చేయడం మొదలుపెట్టింది. యాప్ లో ఫోన్ ఫీచర్లు వ్యక్తిగత ఇంటి సమస్యలకు సాయపడే సాంకేతికత గురించి చెబుతోంది. చదువు రాని వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పే ఈమె వీడియోలకు 21 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టా లో 2.1 మంది ఫాలోవర్స్ ఉన్నారు. టెక్ విభాగంలో ఎంపికైన ఇన్ఫ్లుయెన్సర్ల […]
