Sunday, 28 Jun, 2026

సర్వర్ నుంచి సి ఈ ఓ వరకు

హబ్ స్పాట్ సిఈఓ యామిని రంగన్  ఇంజనీరింగ్ చదువుకున్న యామిని ఎం.ఎస్ చేయడం కోసం అమెరికా వెళ్లి సర్వర్ గా జాబ్ మొదలుపెట్టింది. చదువయ్యాక ఉద్యోగంలో చేరిన యామిని డ్రాప్ బాక్స్ వర్క్ డే వంటి ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల్లో పని చేశారు. తరువాత హబ్ స్పాట్ సి ఈ ఓ అయ్యారు. బిజినెస్ టైమ్స్ ఈమెను అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తించింది. యామిని వెంచర్ క్యాపిటలిస్ట్ గా అనేక కంపెనీ లో బోర్డ్ సభ్యురాలిగా […]

అమ్మాయిలకు కొత్త కోర్స్

కేరళ మలప్పురానికి చెందిన రిన్షా పట్టకల్ తొలి మహిళ డ్రోన్ పైలట్ గా చరిత్ర సృష్టించింది. మనదేశంలో ఏరియల్ సర్వైలైన్స్,అగ్రికల్చర్, వెదర్ మానిటరింగ్ వంటి డ్రోన్ ఆపరేషన్స్ కోసం డిజిపిఎ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ తప్పనిసరి ఈ లైసెన్స్ దొరికిన తొలి కేరళ మహిళా డ్రోన్ పైలట్ గా సర్టిఫికెట్ అందుకున్న 18 సంవత్సరాల రిన్షా పట్టకల్ ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి.

రాకెట్ ఉమెన్

అమోఘమైన చారిత్రక విజయాన్ని దేశానికి అందించిన చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ రీతు కరిధాల్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో పుట్టారు. రీతు. 1997 లో ఇస్రో లో అడుగు పెట్టారు మిషన్ ఎనాలసిస్ డివిజన్ లో ఉద్యోగి గా పనిచేశారు. మంగళయాన్ మిషన్ లో డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్ గా చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ గా ఉన్నారు.ఇక చంద్రయాన్-3 విజయం తనలో అంతులేని విశ్వాసాన్ని నింపిందని  చెబుతున్నారు రీతు. నా విజయం మాత్రం టైమ్  మేనేజ్మెంట్ అంటారామె.