Sunday, 28 Jun, 2026

భలే సర్పంచ్

90 ఏళ్ల వయసులోనూ గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వహిస్తూనే ఉంది వీరమ్మాళ్ అమ్మ. తమిళనాడు మదురై ప్రాంతంలోని అరిట్టపట్టి గ్రామానికి సర్పంచ్ అయినా ఆమె రోడ్లు, త్రాగునీరు,పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు వంటి సకల సౌకర్యాలు ఆ గ్రామానికి తీసుకువచ్చింది. ఆమె చేసిన మంచి పనుల వల్ల ఆ గ్రామానికి జీవవైవిద్య వారసత్వ ప్రదేశం గా గుర్తింపు వచ్చింది ప్రదేశంగా గుర్తింపు వచ్చింది. వీరమ్మాళ్ ఇప్పటికీ ఉదయం లేచి తన ఇంటి పనులు పొలం పనులు చేసుకుని తర్వాత […]

ఇదే తొలిసారి

105 సంవత్సరాల రైల్వే శాఖ చరిత్రలో రైల్వే బోర్డు చైర్మన్ గా ఎంపికై రికార్డ్ సృష్టించింది జయ వర్మ సిన్హా ఇప్పటివరకు  మగవాళ్లే బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు. అలహాబాద్ యూనివర్సిటీ లో చదువుకున్న జయవర్మ. 1988 లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు. వివిధ హోదాల్లో పని చేశాక ఆమెకు ఈ గౌరవం దక్కింది.

వాళ్లను నిద్రపోనివ్వండి

పసి పిల్లలు ఎక్కువ సేపు నిద్రపోవాలంటారు ఎక్సపర్ట్స్. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల కార్యకలాపాలతో వచ్చే శబ్దం ముఖ్యంగా టీవీలు, ఫోన్ లు పిల్లల్ని చాలా విసిగిస్తాయి. వాళ్లను ముద్దు చేస్తూ ఎత్తుకోవటం చుట్టూ కూర్చొని మాట్లాడుకోవడం మానేసి వాళ్లకు ప్రశాంతమైన చోటు కల్పించాలని వాళ్లు పడుకున్న గదిలో ఎక్కువ వెలుతురు లేకుండా చూడాలని చెబుతున్నారు.పిల్లల తో పాటు తల్లి కూడా పడుకుంటే వాళ్లకు రక్షణగా అనిపిస్తుందని చెబుతున్నారు.

గణేష్ శిల్పి రేష్మా

ముంబై లోని భారీ గణేష్ విగ్రహాలు సగం వరకు రేష్మా ఖాతు తయారు చేసినవే.ఆమె నంబర్ వన్ గణేష్ శిల్పి. ఆమె తండ్రి విజయ ఖాతు. వారసత్వంగా రేష్మా విగ్రహాల తయారీ తన చేతిలోకి తీసుకున్నది. నేను శిల్పి కూతురిని శిల్పం తయారీ నా జీన్స్ లోనే ఉంది అంటుంది రేష్మా.

దీదీ కేఫ్

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్వయం సహాయక సంఘాల చేత ప్రారంభం చేత ప్రోత్సాహం ఇచ్చింది. ఈ అవుట్ లెట్ లు పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. కాఫీ తో పాటు ఎన్నో రకాల స్నాక్స్ ఈ గ్రామీణ మహిళలు నిర్వహించే క్యాంటీన్లలో లభిస్తున్నాయి. యుపి ప్రభుత్వం ట్రయిల్ ప్రాజెక్ట్ వారణాసి లో ప్రారంభించిన ఈ దీదీ కేఫ్ విజయవంతం అయింది. బీహార్ లో దీదీ కి రసోయి, కేరళాలో కుడుంబా శ్రీ పేరుతో మహిళలు నిర్వహించే కేఫ్ […]

చిరుధాన్య రైతు

గిరిజన రైతు సుభాస మెహంత ఉత్తమ రైతు గా రాష్ట్ర జాతీయ పురస్కారం అందుకున్నది. ఒడిశా లోని సింగార్ పూర్ అనే పల్లెకు చెందిన సుభాస రాగి పంట పండిస్తోంది.45 ఏళ్ల సుభాస కు చుట్టుపక్కల ప్రజలు ‘మండియామ’ అంటూ పిలుస్తారు. ఈ ఏడాది గ్లోబల్ మిల్లెట్ కాన్ఫరెన్స్ జీ 20 సదస్సులో పాల్గొని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నది.

స్వచ్ఛత కోసం మొక్కలు

ఇంట్లో ఆఫీసుల్లో కూడా ఎన్నో రేడియేషన్ విడుదల చేసే పరికరాలు ఉంటాయి. వీటి  తీవ్రత తగ్గించుకోవాలంటే ఇంట్లో కాక్టస్ మొక్కలు పెంచుకోవాలి. పొడవైన ఆకులు ఉండే స్నేక్ ప్లాంట్ కలబంద వంటివి కుండీల్లో పెంచుకుంటే ఇళ్లలో రేడియేషన్ తగ్గిపోతుంది.

ఐదు రూపాయలే భోజనం

రాజస్థాన్ కోటా నగరానికి చెందిన స్వాతి శృంగి ‘ముస్కాన్ కి రసోయ్’ క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెడుతుంది. రాజస్థాన్ కోటా నగరానికి చెందిన స్వాతి 114 మంది వాలంటీర్ల తో కలిసి స్థానికుల ప్రోత్సాహంతో రోజుకు 1000 మందికి భోజనం పెడుతుంది. ఆ నగరం లోని మూడు ప్రాంతాల కౌంటర్లలో ఎంతోమంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులు స్వాతి పెట్టే ఐదు రూపాయల భోజనం చేస్తారు.

తొలి గిరిజన పైలట్

నీలగిరి కొండల్లోని బడుగర్‌ తెగ నుంచి వచ్చిన ఎం.ఎం జయశ్రీ తొలి గిరిజన పైలట్ గా చరిత్ర సృష్టించింది దక్షిణాఫ్రికా లోని ఉల్కన్ ఏవియేషన్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన జయశ్రీ ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ పొందింది. శిక్షణ కాలం లోనే 70 గంటలు ఆకాశంలో ప్రయాణం చేసిన జయ శ్రీ తానుండే కొండ ప్రాంతాల పిల్లలకు చదువు చెప్పేందుకు ఇష్టపడుతుంది.

వెలుగు నిచ్చింది

ఐ.పి.ఎస్ ఆఫీసర్ అనుకృతి శర్మ అనుకోకుండా చేసిన పని ఆమెను వార్తల్లో నిలిచింది. ‘పోలీస్ చౌపాల్’ సమావేశంలో వృద్ధురాలు నూర్జహాన్ తాను సంవత్సరాల తరబడి కరెంట్ లేక చీకట్లో బ్రతుకుతున్నానని వయసు మీరిన తర్వాత తనకు ఇప్పుడు ఏమీ కనిపించని స్థితి వచ్చిందని తన ఇబ్బంది చెప్పుకొంది. ఆమె కోరిన నెరవేర్చేందుకు ప్రభుత్వ సాయం కోరే అవకాశం లేక అనుకృతి స్వయంగా నూర్జహాన్ ఇంటికి కరెంట్ సదుపాయం కల్పించారు. ఈ ఇంట్లో వెలిగిన బల్బ్ ని నూర్జహాన్ […]

దేవాలయాలే ఎక్కువ

భారతదేశంలో రెండు మిలియన్లకు పైగా హిందూ దేవాలయాల మూడు లక్షల ముస్లిం మసీదులు ఉన్నాయి వాటిలో రెండువేల ఇరవై మూడు వేల దేవాలయాలు ఒక్క వారణాసి లోనే ఉన్నాయి.బహ్రెయిన్ వంటి దేశాల్లో ఉండే జనాభా కంటే భారత్ లో ఉండే దేవాలయాలే  ఎక్కువ.

అడవులు కాపాడండి

పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తారు జార్ఖండ్ ఫారెస్ట్ అధికారి మమత ప్రియదర్శి. ప్రకృతి ప్రాముఖ్యత కాపాడుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్యుమెంటరీ లు తయారు చేశారు. 347 గ్రామాలు స్కూళ్లలో లక్షల మందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అడివిలో బ్రతికే మూగజీవాలకు ఇబ్బంది కలిగించకుండా సర్దుకు పోవాలని అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రచారం కోసం ఎల్ ఈ డి స్క్రీన్ లో ఏర్పాటు చేశారు.

ఉపాధి మార్గం

పది రూపాయల ఖరీదు తో పసుపు సంచి ఉద్యమాన్ని ప్రజల్లోకి తెచ్చారు ఐ.ఎ.ఎస్ అధికారి సుప్రియ సాకు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాక తమిళనాడు లో పసుపు సంచుల తయారీ ని ప్రోత్సాహించారు సుప్రియ.ఎక్కడ చూసినా పసుపు సంచి దొరికే వెండింగ్ మిషన్ లు స్థాపించారు. పది రూపాయలు వేస్తే సంచి బయటకు వస్తుంది. ‘మీడుం మంజాపై’ పేరుతో ఈ పసుపు సంచుల ప్రచారం తమిళనాడు లో సక్సెస్ అయింది. వందల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

జానపద కళలకు కొత్త వెలుగు

జానపద కళలకు పూర్వ వైభవం ఇవ్వటం కోసం మిమెరాకి సంస్థ స్థాపించాను అంటుంది యోషా ఆమె స్థాపించిన స్టార్టప్ బాందిని అప్లిక్, బని, పట్టచిత్ర, బికనేర్ వంటి కళారూపాలకు కొత్త వెలుగు వచ్చింది.హ్యాండ్ బాగ్స్ పైన అందమైన కళారూపాలకు చిత్రించటం తో వాటికి అద్భుతమైన మార్కెట్ వచ్చింది. ఈమె మార్కెట్ చేసే బ్యాగ్ లు అమెరికా, యు.కె, ఆస్ట్రేలియా,హాంగ్ కాంగ్, సింగపూర్, దుబాయ్ లో అమ్ముడు పోతాయి. వందల మంది కళాకారులకు స్థిరమైన ఆదాయం వస్తోంది.

ఇది అవసరమైన బ్రేక్

డోపమై ఫాస్టింగ్ పేరుతో పుస్తకం రాశారు అమెరికన్ సైకియాట్రిస్ట్ అన్నా లెంబ్కే. ఆమె చెబుతున్న ప్రకారం మన చుట్టూ ప్రపంచంలో ఉండే ఎన్నో ఎక్కువ సౌకర్యాలు ఒత్తిడి పెంచుతాయి.వీటి తో మెదడులో డోపమైన్ పెరుగుతుంది. అందుకే జీవితంలో ఒక బ్రేక్ తీసుకోవాలి. అధిక నిద్ర తిండి అదేవిధంగా అదేపనిగా సోషల్ మీడియాలో తలదూర్చే ఎన్నో అలవాట్లు తగ్గించమని డిజిటల్ ప్రపంచం నుంచి కొద్ది రోజులు దూరంగా ఉంటే ఆరోగ్యం అంటున్నారు. ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం కాదు […]

ఉడిపి చీరకు కొత్త వెలుగు

‘కడికె ట్రస్ట్’ పేరుతో ఉడిపి నేత చీరలకు గొప్ప మార్కెట్ తెచ్చిపెట్టారు మమతా రాయ్.దక్షిణ కన్నడ ఉడిపి జిల్లాలోని నేత కళాకారులకు ఉడిపి చీరల నేత ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. సౌకర్యంగా కళాత్మకంగా కనిపించే ఈ ఉడిపి నేత చీర ఆదరణ తగ్గి కనుమరుగైపోయింది. పర్యావరణ హాని లేని సహజమైన రంగులద్ది తయారు చేసే ఈ నేత చీరలకు ఆన్లైన్ లో అమ్మకాలు పెంచి కళాకారులకు బతుకు తెరువు చూపారు మమత. కడికె ట్రస్ట్ ద్వారా […]

ఆధ్యాత్మిక రూపం

ఇంటి అలంకరణ లో డివోషనల్ సబ్జెక్టు ఎంచుకుంటున్నారు నిపుణులు పురాణ ఇతిహాసాల కళారూపాలు అలంకరణలో జోడిస్తే ఇంటి అందం వైయ్యింతలు అవుతోంది విశాలమైన హాల్లో దశావతారాలు,ఏనుగుల జట్టు సంగీత కళాకారుల మూర్తులను అమరిస్తే ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది.కృష్ణవతార ఘట్టాలు రాధాకృష్ణ పెయింటింగ్స్ కూడా ఇంటికి ఆధ్యాత్మిక దృష్టిని తెస్తాయి. వుడ్ కార్వింగ్ తో సెంటర్ టేబుల్స్ సెల్ఫ్ కార్నర్ టేబుల్స్ వాటి పైన చక్కని అవతార పురుషుల బొమ్మలు చాలా అందంగా ఉంటాయి.

సిలంబం యుద్ధ కళ గ్రేట్

ప్రాచీన యుద్ధ కళ సిలంబం నేర్చుకొని చీర కట్టు తో సిలంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఐశ్వర్య మణి వన్నన్ తమిళనాడు కు చెందిన ఈ యుద్ధ కళ ను ఏరికోరి నేర్చుకొన్నది ఐశ్వర్య కర్రలు,కత్తులు,దివిటీలు,లేడి కొమ్ముల వంటి ఆయుధాలని ఈ విద్య లో ప్రయోగిస్తారు. ఈ యుద్ధ కళ లో మహిళలకు శిక్షణ ఇవ్వడం కోసం మాయిషా స్టూడియో స్థాపించి పాఠశాల కళాశాల విద్యార్థినులను ప్రోత్సహిస్తోంది ఐశ్వర్య. 70 ఏళ్ళ వయసులో కూడా ఈ కళను […]

ప్రపంచ స్థాయి ప్రభావం

భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన ఫిట్నెస్ ఐకాన్స్ యోగ ఇన్ ఫ్లూయెన్సర్ లలో ఒకరు గా ఉంది శిల్పా శెట్టి. ఐదు పదుల వయసులో ఆమె తీరైన శరీరాకృతి ఎందరికో స్ఫూర్తి.ఆమె వ్యాయామం చేసే విధానం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఎన్నో  డివిడిలు రిలీజ్ చేసింది శిల్ప. ఆమె యూట్యూబ్ ఛానల్ కు మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లున్నారు. మనసు, శరీరం, ఆత్మ పై యోగా వల్ల కలిగే ప్రయోజనాలు చెబుతోంది శిల్పా శెట్టి.

ఇలా చేస్తే ప్రయోజనం

హెన్నా పొడి లో మెంతులు పెరుగు మందార పొడి వంటివి కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు కు పోషణ అందుతుంది.మాడు పొడిబారి పోకుండా ఉంటుంది. ముందుగా టీ లేదా కాఫీ డికాషన్ మరిగించి అందులో హెన్నా పొడి మందార పొడి వేసి కలపాలి. దీనికి కోడిగుడ్డు తెల్లసొన చేర్చి కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో వెంట్రుకలు కడిగేసుకోవాలి. మరునాడు గాఢత  తక్కువగా ఉన్న షాంపూ తో తలస్నానం చేసే ప్రయోజనం ఉంటుంది.