July 2022
ఇదీ వ్యాయామమే
వర్షాల్లో వ్యాయామం మూల పడచ్చు. అలా బ్రేక్ పడకుండా ఇతర పనుల్లో వ్యాయామం పూర్తి చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేయచ్చు. కారు కడగచ్చు, బైక్ శుభ్రం చేయచ్చు, తోట పని చేయచ్చు అలాగే బట్టలు ఉతకటం ఆరేయడం మడతలు పెట్టటం కూడా మంచి వ్యాయామం దానితో ఒకేసారి భిన్నమైన కండరాలు పనిచేస్తాయి వెన్ను వంగకుండా నిటారుగా కూర్చోవడం కూడా వ్యాయామం కిందికే వస్తుంది. పనిలో డ్రైవింగ్ లో, డైనింగ్ టేబుల్ దగ్గర […]
ఈ అవకాశం అపూర్వం
రిటైర్ మెంట్ వయసులో మోడలింగ్ మొదలుపెటట్టాం గర్వంగా ఉంది అంటుంది ముక్తా సింగ్. ఫైటర్ పైలెట్ ని పెళ్లి చేసుకొని కుటుంబ బాధ్యతల్లోనే ఏళ్ళు ఏళ్ళు గడిపేసింది 60 ఏళ్లు దాటాక ఒక ఫ్యాషన్ డిజైనర్ తన డ్రెస్ లకు మోడలింగ్ చేయమని ముక్త ని కోరడంతో ఆమె జీవన గమనం మారిపోయింది. చిన్నప్పటి నుంచి ఎన్నో పనులున్నా ఫిట్ నెస్ పైన శ్రద్ధ పెట్టడం నాకు కలిసి వచ్చింది. పెరిగే వయసుని స్వీకరించాలి అలాగే మనదైన […]
ట్రీ ఆఫ్ లైఫ్
త్రీడీ ఎఫెక్ట్స్ తో గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఆకులతో ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను అంతర్జాతీయ వూల్ మార్క్ బహుమతి లభించింది. ప్రపంచ ఫ్యాషన్ వేదికకు కేంద్రమైన ప్యారీస్ హాట్ కోచర్ వేదిక పైన ట్రీ ఆఫ్ లైఫ్ పేరుతో తన డిజైన్స్ పరిచయం చేశారు రాహుల్ చెట్టులోని శక్తిని అందాన్ని ఎదుగుదలను, సృష్టించారు రాహుల్ దట్టమైన చెట్ల నుంచి గాలి వీచినప్పుడు దానిపైన గూడుకట్టుకున్న పక్షులు ఎగురుతూ ఉంటే ఆ అందం […]
ఈ కళాకృతులు అద్భుతం
ఎండిపోయిన సొరకాయ తో అద్భుతమైన కళాకృతులు చేస్తున్నారు ఆధునికులు. బాగా పెరిగిన సొరకాయ తీగ పైన వదిలేస్తే కొన్ని రోజులకు లోపలున్న గుజ్జు తగ్గిపోయి పైన పెంకుల మారిపోతుంది. ఇలా ఎండిపోయిన సొరకాయను గిరిజనులు పూర్వం నీళ్ల సీసాల్లా ఉపయోగించేవారు. ఈ సొరకాయ బుర్ర తో ఆధునికులు ఎన్నో అద్భుతమైన డిజైన్స్ చెక్కుతున్నారు. పెయింటింగ్, డిజైన్స్ తో పాటు లైటింగ్ ఎఫెక్ట్స్ కోసం రంధ్రాలు చేసి అలంకరణ వస్తువుల్లా తీర్చిదిద్దుతున్నారు. వాటికి ఇపుడు మంచి మార్కెట్ ఉంది.
మొహం నలుపా ?
ఎక్కువ రసాయనాలు ఉన్న సబ్బు లు వాడటం ఎండలో తిరగడం సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పెరిగి నల్లగా అయిపోతుంది. ముఖ చర్మం బాగా ఉండాలంటే సబ్బుకు బదులు మైల్డ్ క్లెన్సర్ వాడాలి. చర్మం తీరుకు తగ్గ మాయిశ్చరైజర్ ఎస్ పి ఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ రాస్తే మొహం నలుపు తగ్గిపోతుంది. అలాగే స్పూన్ తేనెకు అర స్పూన్ నిమ్మరసం కలిపి ప్యాక్ లా వేస్తే ఫలితం ఉంటుంది. […]
శిరోజాలకు శక్తి
పోషక విలువలు ఉన్న రైస్ మిల్క్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మిల్క్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వండిన అన్నం మూడు స్పూన్లు ఒక బౌల్ లో వేసుకొని ఇందులో పావు స్పూన్ ఆర్గాన్ ఆయిల్ అర కప్పు నీళ్లు కలిపి మెత్తగా మిక్సీలో రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకడితే రైస్ మిల్ తయారైనట్లే తల స్నానం చేసి శుభ్రంగా ఉన్న జుట్టుకు ఈ రైస్ మిల్క్ కు పట్టించి ఐదు నిమిషాలు ఆరిపోనిచ్చి శుభ్రం […]
శుభ పరిణామం
సత్యసాయి సంస్థ లో ట్రాన్స్ జెండర్ ల కోసం సాంప్రదాయ నృత్యాలు నేర్పించే ప్రత్యేక తరగతులు నిర్వహించడం మొదలుపెట్టారు ఇటీవలే చెన్నై లోని సహోదరన్ సంస్థ కూడా భరతనాట్యం నేర్పించేందుకు పూనుకుంది. ప్రాచీన కాలం నుంచి మానవ నాగరికత వికాసం తో కళలు ప్రముఖ పాత్ర పోషించాయి. అందుకే కళలు నేర్చుకునేందుకు జాతి, మత, కుల, లింగ వివక్ష కూడదు అంటారు కేరళ తమిళనాడుకు చెందిన గురువులు ట్రాన్స్ జెండర్ లకు ఈ ప్రత్యేక తరగతులు నిర్వహించడం […]
చర్మం రంగు మారుతోందా ?
కాస్త పెద్దవిగా అనిపించే ఉంగరాలు ధరించటం ఫ్యాషన్. ఈ ఉంగరం ధరించే వెలికి ఉంగరం ఉన్న మేరా నల్లగా నో తెల్లగా నో రంగు మారి కనిపిస్తూ ఉంటుంది. ఉంగరం ధరించి,స్నానం చేయటం ముఖం కడుక్కోవడం కోసం సబ్బు వాడటం తో దాని తాలూకా డిటర్జెంట్ లు ఉంగరం అడుగుభాగంలో పేరుకు పోతూ ఉంటాయి. ఆ డిటర్జెంట్ ప్రతిచర్య వల్ల చర్మం నల్ల బడటం లేదా అలెర్జీలు రావటం జరగవచ్చు. లేదా ఆభరణాల్లో ఉండే ఇతర లోహాల […]
ఎంతో శక్తిమంతం
థయామిన్ రైబో ఫ్లోవిన్ పుష్కలంగా ఉండే పనస విత్తనాల్లో మానసిక వత్తిడిని తగ్గించే శక్తి ఉంది. అంటారు ఎక్సపర్ట్స్. ప్రోటీన్లు మైక్రో నూట్రిన్లు అధికంగా ఉండే వీటిని తీసుకొంటే కొన్ని రకాల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. జాక్ ఫ్రూట్ సీడ్స్ గుండెకు మంచివి. ఈ విధానాల్లో ఎ-విటమిన్ ఉండటం వల్ల కంటికి చాలా మంచిది . ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి .కనుక కండరాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇవి ఆల్మండ్ తో సమానమైన వనే అంటారు డాక్టర్స్.
దోమలు పరార్
ఇంట్లో దోమలు తరిమేందుకు కాఫీ పొడి ఉపయోగపడుతుంది ఒక బౌల్ లో నిప్పులు తీసుకొని అందులో ఒకటి రెండు స్పూన్ల కాఫీ పౌడర్ కొంచెం కొంచెంగా వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేస్తే దోమలు ఎక్కడున్నా పారిపోతాయి. కాఫీ పొడి వాసనకు దోమలే కాదు కీటకాలు కూడా పోతాయి. అలాగే సాంబ్రాణి ధూపం లేదా నిప్పుల పైన వెల్లుల్లి పొట్టు ఎండా పెట్టిన వేపాకులు వేసిన దోమలు పోతాయి తులసి మొక్కలు,బంతి […]
నచ్చినట్లు బతికితేనే జీవితం
1994 లో మిస్ యూనివర్స్ గెలుచుకొని సినిమా రంగంలో అడుగు పెట్టాక హీరోయిన్స్ కు బాలీవుడ్ ఇచ్చే విలువ ఏపాటిదో అర్థం అయింది అంటుంది సుస్మితా సేన్. అందాల ప్రదర్శన రెండు పాటలు తప్ప ఇంకో అవకాశం లేని ఈ సినిమాలు ఎందుకు అని నేను వదిలేశాను. ఇప్పుడు పదేళ్ల గ్యాప్ తర్వాత ఓటీటీ లో నాకు నచ్చిన పాత్రలు వెతుక్కుని మరీ నటిస్తున్నాను ఇదంతా కూడా మనకు నచ్చిన రీతిలో మనం బ్రతకాలి అనే దానికి […]
అది వట్టి సాకు
‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది శృతి షా దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల శృతి షా నటి,మోడల్ కూడా సంగీతంలో తన ప్రతిభ చాటుకుంటుంది.మ్యూజిక్ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది.ఆమె ప్రొడ్యూసర్ కూడా. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయ సూత్రాల్లో మొట్టమొదటిది.నీ గురించి నాకే తెలుసు ఎదుటి వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి ఒక స్కూల్ వంటి వాళ్ళు అందులోంచి మనకు […]
వాన వేళ మేకప్
వర్షాల్లో తేమ ప్రభావం మేక పైన పడి, మేకప్ చెదిరిపోయి ప్యాచీగా తయారవుతుంది. తప్పనిసరిగా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మేకప్ కు పౌడర్ ను బేస్ వాడుకోవాలి. అందుకోసం పౌడర్ బేస్డ్ ఫౌండేషన్స్ ఎంచుకోవాలి. మేకప్ కు ముందు అప్లై చేయాలి. లిప్ గ్లాస్ వాడకం మానేయాలి. సాఫ్ట్ మ్యాటీ, పింక్ షేడ్స్ లేదా తేలికైన బ్రౌన్ షేడ్స్ ఎంచుకుంటే పెదవులు సహజ వర్ణంతో మెరుస్తూ ఉన్నట్లు ఉంటాయి. అలాగే పౌడర్ బ్లుష్ర్స్,ఐ షాడోలు […]
మరీ ఎక్కువా ?
ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకు వ్యాయామం దినచర్యలో భాగం. కానీ సమస్య ఎక్కడ అంటే ఆ వ్యాయామం చేయటం వల్ల అంటున్నారు ఎక్సపర్ట్స్. సాధారణంగా 20,30 నిమిషాల నుంచి మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవాలి. ఒక సెట్ పూర్తి అవ్వగానే 20 సెకండ్ల విరామం ఇవ్వాలి లేకపోతే శరీరం అలసిపోతుంది. అలాగే ముందుగా వార్మప్ చేయాలి శరీరాన్ని, మనసునీ, వ్యాయామానికి సన్నద్ధం చేసే లాగా ఐదు నిమిషాలు వార్మప్ చేస్తే మంచిది. ఎప్పుడైనా వళ్ళు నొప్పులు అలసట […]
మహిళా సాధికారత లక్ష్యం
ఆగ్వా ఉమెన్ ఫౌండేషన్, ఆగ్వా ఉమెన్ లీడర్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నెట్ వర్క్ విస్తరించింది. 2008లో ప్రారంభమైన ఆగ్వా నెట్ వర్క్ లో తొమ్మిది వేల మందికి పైగా మహిళలు ఉన్నారు. వారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన సాయం నెట్ వర్క్ ద్వారా అందుతుంది అంటుంది శుభా పాండియన్. మహిళాభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ నెట్ వర్క్ నేడు వందల మంది వాలంటీర్స్ సామాజికవేత్త లతో కలిసి పని చేస్తోంది. కాగ్నిజెంట్, అవీవా, సీఎస్‌ఎస్, […]
చర్మానికి మెరుపు
చర్మ రక్షణ లో పచ్చిపాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పచ్చిపాలు రోజ్ వాటర్ సమానం తా తీసుకుని చక్కగా కలిపి ఈ మిశ్రమం తో ముఖానికి మర్దనా చేయాలి.10 నిమిషాల తర్వాత కాటన్ బాల్ తో శుభ్రం చేయాలి. అలాగే పచ్చి పాలలో చిటికెడు ఉప్పు వేసి ఆ పాలతో ముఖానికి మర్దన చేయాలి. తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. రోజు క్రమం తప్పకుండా ఏదో ఒక కాంబినేషన్ తో ముఖం మర్దన చేస్తే ముఖం సహజసిద్ధమైన […]
మొక్కలకు ఫుడ్ స్టిక్స్
మొక్కలు బలంగా పెరిగేందుకు ఆహారం కావాలి వాటికి కావలసిన పోషకాలను ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్ వంటివి కలిపి తయారుచేస్తున్న ఫుడ్ స్టిక్స్ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఈ ఫుడ్ స్టిక్స్ మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి బాల్కనీలో కుండీల్లో పెరిగే మొక్కల చుట్టూ ఈ కడ్డీలను నాలుగైదు మట్టి లోపలికి వెళ్లేలా అమర్చితే చాలు. నెలన్నర వరకు కాసిన్ని నీళ్లు పోస్తే చాలు మిగతా పోషకాలు ఈ కడ్డీ ద్వారా అందుతాయి. పూల మొక్కల కోసం […]
చీకటైనా పర్లేదు
సూర్యుడితో పని లేకుండా మొక్కలు చీకటిలోనూ ఆహారాన్ని తయారు చేసుకోగలిగే ఎలక్ట్రో కేటలిటిక్ అనే కృత్రిమ విధానాన్ని రూపొందించారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. ఈ హైబ్రిడ్ విధానంలో విద్యుచ్ఛక్తి సాయంతో నీటితోనూ కార్బన్ డయాక్సైడ్ తోను చర్య పొంది వాటిని ఎసిటేట్ పదార్థంగా మార్చుకోవడం ద్వారా ఆహారం ఉత్పత్తి చేసుకోవటమే కాక బాగా పెరిగాయట. ఇందుకోసం సోలార్ ప్యానల్స్ ద్వారా సంగ్రహించిన వేద శక్తిని విద్యుత్ గా వాడుతున్నారు.
బాతు పువ్వులు
ప్రకృతి ఎప్పుడు మనిషిని అబ్బుర పరుస్తూనే ఉంది. కొన్ని నిజంగా విచిత్రంగానే ఉంటాయి. అచ్చంగా బాతు వంటి పువ్వులు ఉన్నాయి కలేనా మేజర్ ఆర్కిడ్ జాతికి చెందిన మొక్క పువ్వులు అచ్చంగా ఎదుగుతున్న బాతుల ఉంటాయి. తూర్పు దక్షిణ ఆస్ట్రేలియా లో ఉండే ఈ పువ్వులు తల భాగం పైన చేతితో తాకితే చాలు వెంటనే లోపలకు ముడుచుకుంటాయి. ఏదైనా ప్రమాదం ఏమో అని శంకించి అలా తల దాచుకుంటాయి.
నిత్య యవ్వనం
ఎలాంటి ఒత్తిడి నైనా పోగొడతాయి కూలింగ్ స్పా గ్లోబ్స్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫేస్ బ్యూటీ క్రియో స్టిక్స్ చివరలో పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. కళ్ళు, బుగ్గలు, గడ్డం, మెడ, పెదవులు ఇలా ప్రతి భాగంలో వీటిని సవ్య దిశలో అపసవ్య దిశలో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. ఈ గ్లోబ్స్ రక్త ప్రసరణ ను ఇంప్రూవ్ అయ్యేలా చేస్తాయి. బుగ్గల పైన ఏర్పడిన గీతలు ముడతలు తొలగిస్తాయి. కళ్ల కింద నల్లని వలయాలు తగ్గిస్తాయి. అలసట […]
