Sunday, 28 Jun, 2026

చుక్కల్ని చూసే ప్రేమ

గెలాక్సీ లా ఆవిర్భావం గురించి పరిశోధించడం ఎంత ఇష్టమో పేద బాలికలకు సైన్స్ తో చేరువ చేయటం అన్నా అంతే ఆసక్తి నాకు అంటోంది ఆస్ట్రానమర్ నిమిషా కుమారి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనితీరును పర్యవేక్షించే స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో ఆస్ట్రానమర్ ఆమె స్పేస్ టెలిస్కోప్ కోసం పని చేస్తూనే నక్షత్రాల పుట్టుక, గెలాక్సీల ఆవిర్భావంపై పరిశోధనలు చేస్తున్నారు. బీహార్ ప్రాంతంలోని ఆడపిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించేందుకు క్లాసులు తీసుకుంటారామె. ఈ జేమ్స్ […]

ఎడారి అందం

చిన్న చిన్న వేడుకలకు కానుకలుగా మొక్కలు ఇవ్వటం చాలా మందికి ఇష్టం ఇలాంటి గిఫ్ట్ లాగా ఇచ్చేందుకు సక్యులెంట్ల ఫ్లవర్ వాజ్ ఆకారంలో వచ్చేలా పెంచుతున్నారు. ఇప్పుడు పెద్దగా పువ్వులు పూయగానే ఈ ఎడారి మొక్కలు డ్రాయింగ్ రూమ్ కి చాలా అందం కుండీలో ముందుగా ఎరువు మట్టి వేసి దాని మధ్యలో ఇంకో ఒక కప్పులో సక్యులెంట్ల లను ఒక పద్ధతి ప్రకారం నాటుతారు గులకరాళ్లు ఇతర కొమ్మలతో అలంకరించిన ఈ ఎడారి మొక్కల ప్రేమికులకు […]

సముచిత గౌరవం

ఐ.ఎం.ఎఫ్ గోడ పైన వరుసగా ఉండే ప్రముఖ ఆర్థిక వేత్త ల ఫోటోల  సరసన గీత గోపీనాథ్ ఫోటో చేరింది. ఇండియన్ అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీత గోపీనాథ్ కోల్‌కతా లో జన్మించారు. హర్వార్డ్‌ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసిన గీత గోపీనాథ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అండ్ గ్లోబల్ లీడర్ (2011) పురస్కారాన్ని అందుకున్నది. 2014 లో టాప్ 25 ఎకనామిస్ట్ అండర్ 45 జాబితాలో చోటు […]

విశ్వ రహస్యాలు చూసే కళ్ళు ఆమెవి

టెలిస్కోప్ తొలి చిత్రం చూడగానే సంతోషంతో తబ్బిబ్బు అయ్యాను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో కీలకమైన ఎన్ ఐ ఆర్ క్యామ్ పరికరానికి బాధ్యత వహించడం ఒక రోలర్ కోస్టర్ రైడ్ వంటిది. నేను చూసిన అంతరిక్ష చిత్రాలు ఉర్సా మేజర్ నక్షత్రాల కూటమి కి చెందినవి.18 నక్షత్ర చిత్రాలు ఈ రాకెట్ లాంచ్ లో నేను భాగం అయినందుకు ఎంతో గర్వంగా ఉంది అంటోంది డాక్టర్ మార్సియా జె రైకే 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం […]

తొలి భారతీయురాలు

డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న రిజా రెజీ గ్లోబల్ ఈవెంట్ లో ర్యాంప్ వాక్ చేయనున్నది ప్రీమియర్ ఫ్యాషన్ షో కు ఎంపికైన తొలి ఇండియన్ అమ్మాయిగా రిజా చరిత్ర సృష్టించనున్నది కేరళకు చెందిన వహీద్ అనే అనిత రెజి దంపతులకు జన్మించిన రిజా చక్కగా డాన్స్ నేర్చుకుంది సింగింగ్ డాన్సింగ్ స్టేజ్ షోల ద్వారా పాపులర్. గ్లోబల్ డాన్ సిండ్రోమ్ అనే సంస్థ బీ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్ పేరుతో ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తోంది. […]

వర్షాల్లో రక్షణ

వర్షాల్లో పాదాలకు వేసే చెప్పులు స్టైలిష్ గా కన్నా సౌకర్యంగా ఉండాలి ఫ్లిప్ ఫ్లాట్స్,స్లిప్ అనే క్రాస్ లైట్ శాండిల్స్ వర్షాలకు  అనువైనవి అలాగే టో బ్యాలెట్ ఫ్లాట్స్ ఇండియన్ వెస్ట్రన్ ఏ స్టయిల్ దుస్తుల పైన చక్కగా నప్పుతాయి. పాదాలు తడిగా ఉన్నప్పుడు చెప్పులు జారిపోకుండా స్ట్రాప్ శాండిల్స్ ఎంచుకోవాలి వర్షంలో రోడ్డు పైన నీళ్లు నిలుస్తాయి జారి పోతూ ఉంటాయి కనుక హీల్స్ జోలికి పోకుండా ఉండటం ఉత్తమం.

కీలక పరిశోధన

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లోని నాలుగు కీలక వ్యవస్థల్లో మిరి మిడ్ ఇన్ ఫ్రారెడ్ ఇన్ స్ట్రుమెంట్ ఒకటి దీన్ని ప్రాజెక్ట్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు పొందారు కళ్యాణి. ఈమె స్వస్థలం ముంబై ఐఐటి ముంబై లో బిటెక్ చేసి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్ లో డాక్టరేట్ అందుకున్నారు అంజలి. వ్యోమ నౌక లు వేడెక్కకుండా నిరోధించడం తో ఈమె చేసిన పరిశోధనలు ఆ ప్రాజెక్ట్ విజయవంతం అవడానికి తోడ్పడ్డాయి. 2012లో నాసా […]

వత్తిడికి అశ్వగంధ

ఆఫీస్ పని తో ఆందోళన పడే యువతుల కు అశ్వగంధ టీ అలసట తీరుస్తుంది. పలు రకాల వైద్య గుణాలు ఉన్న అశ్వగంధ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. కప్పు నీళ్లలో పావు చెంచా అశ్వగంధ వేసి మరగబెట్టి వడకట్టి అందులో స్పూన్ నిమ్మరసం, తేనె కలిపి నిద్రపోయే ముందు తాగితే ఒత్తిడి ఆందోళన కుంగుబాటు వంటివి తగ్గుతాయి. కంటినిండా నిద్ర పోవచ్చు ఈ టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.

చక్కని నిద్ర

రాత్రి వేళ్ళ తగినంత సమయం గాఢ నిద్ర పోతేనే శరీరం,మెదడు ఉదయానికి యాక్టివ్ గా ఉంటాయి. గాఢనిద్ర కోసం పాడుకునేందుకు రెండు గంటల ముందే భోజనం చేయాలి. ఆహారం జీర్ణం అయ్యాక పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. పాడుకొనే ముందు స్నానం చేయటం కూడా మంచిది.ఇది శరీర ఉష్ణోగ్రత ను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. చల్లని నీళ్లతో స్నానం చేస్తే శరీరం శుభ్రం కావటమే కాదు ఒత్తిడి,అలసట కూడా దూరం అవుతాయి. బెడ్ రూమ్ […]

శిరోజాలు పెంచే గింజలు

పోషక విలువలున్న ఆహారానికి కొన్ని రకాల గింజలు జతచేసి తీసుకుంటే శిరోజాలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. నువ్వుల్లో పాలీ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి.పొద్దు తిరుగుడు విత్తనాలు లోని జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్-ఇ వంటివి శిరోజాలు పెరగటం లో తోడ్పడతాయి. అవిసె గింజల్లోని ఖనిజాలు శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. రోజు ఒక స్పూన్ గుమ్మడి విత్తనాలు […]

సౌందర్య లేపనాలు

వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్లు లేపనాలు గా చేసేయచ్చు. ఇవి మొహానికి మెరుపును అందిస్తాయి మచ్చలు పొగడతాయి  అంటున్నారు ఎక్సపర్ట్స్. పుచ్చకాయ ముక్కలు గుజ్జుగా చేసి అందులో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని లేపనం లాగా మొహానికి పూసి ఓ అరగంట అయ్యాక కడిగేస్తే చాలు. ఇది మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మం లోని మృతకణాలు పోగొడుతుంది అంటున్నారు. అలాగే పుచ్చకాయ తేనె కలిపి మాస్క్ వేస్తే ఇది సహజ టోనర్ గా పనిచేసి ముఖచర్మం […]

ఆస్ట్రానమర్‌ నిమిషా కుమారి

  జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ పనితీరుని పర్యవేక్షించే స్పేస్‌ టెలిస్కోప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆస్ట్రానమర్‌ నిమిషా కుమారి.ఈ ప్రతిష్ఠాత్మక టెలిస్కోప్‌ రూపకల్పనలో.. సైన్స్‌, ఆపరేషన్స్‌ బృందంలో ఉన్న ఏకైక ఆసియా అమ్మాయి నిమిషా. కానీ డిగ్రీలోకి వచ్చే వరకూ టెలిస్కోప్‌నే చూడలేదు. ‘మాది చాలా వెనుకబడిన ప్రాంతం. మా ఊళ్లో పుస్తకాల దుకాణాలు చాలా తక్కువ. ఇప్పటికీ మాకు సరైన రవాణా సదుపాయం లేదు.ఆస్ట్రానమర్‌  అవ్వాలన్నది నా చిన్ననాటి కల. పట్టుదలగా చదివి ఆస్ట్రోఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేసేందుకు ఫ్రాన్స్‌ […]

ఇలా కాపాడుకుందాం!

జల్లులతో పాటు బోలెడు వ్యాధులను కూడా తనతో తీసుకొస్తుంది వర్షాకాలం. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు ముప్పేట దాడి చేస్తాయి. మన సంగతి పక్కన పెడితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీటికి తోడు దోమలు, కలుషిత నీరు-ఆహారం పిల్లల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడతాయి.ఇక వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు.. వంటి సీజనల్ సమస్యలు తలెత్తడం సహజం.వర్షాకాలంలో పిల్లల్లో తలెత్తే ఇలాంటి అనారోగ్యాల […]

చేతులు శుభ్రం చేసుకుంటున్నారా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి.ఏదో కడుక్కున్నాంలే అన్నట్లుగా గబగబా చేతులు కడిగేసుకుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరతాయి.సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో  వివిధ రకాల వ్యాధులను మోసుకొచ్చే ఈ వర్షాకాలంలో చేతుల శుభ్రత విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

బెనారసీ చాయ్

టీ ల్లో ఇప్పటికే ఎన్నో రకాల మనకు తెలుసు. మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడో స్పెషల్ టీ దొరుకుతుంది కాశీలో ఘాట్స్ దగ్గర హజ్‌మోల చాయ్ దొరుకుతుంది. కాశీలో ఘాట్స్ దగ్గర హజ్‌మోల టీ దొరుకుతుంది. దీన్నే బెనారసీ చాయ్ అంటారు. జీర్ణశక్తి పెంచుకొనేందుకు హజ్‌మోలా అనే ఆయుర్వేద మాత్రలున్నాయి. ఈ మాత్రలనే చాయ్ లో వేస్తాం ఉప్పగా,పుల్లగా ఉండే ఈ చాయ్ కాశీ ప్రజలు ఇష్టంగా తాగుతారు.

ఫ్యాషన్ అంటే మనదే

ప్యారిస్,న్యూయార్క్ ల్లో ఇవ్వాళ ఫ్యాషన్ గా భావించే దంతా మన దేశంలో వేల సంవత్సరాల క్రితం అనుసరించినవి అంటుంది ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్ భారతదేశపు సంప్రదాయం లోనే ఫ్యాషన్ దాగి ఉంది అంటుందామె తిరుగులేని డిజైనర్ కనుకనే ఆమె డిజైన్ చేసిన దుస్తులు ధరించి ఫ్యాషన్ వేదిక పైన నడవటం ఒక అదృష్టంగా భావిస్తారు అందమైన యువతులు ప్రపంచంలో ఎములా ఫ్యాషన్ షో లో అవకాశం వచ్చిన రీతూ కుమార్ నే సంప్రదిస్తారు తను అనుకోకుండా […]

కళలతో మార్పు సాధ్యం

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు సృజనాత్మకత పెరిగే లాగా వారికి కవితలు సంగీతం పరిచయం చేసేందుకు స్లామ్ జౌట్ లౌడ్ ని ప్రారంభించారు. హిమాచల్ కు చెందిన జిగ్యాస లబ్రూ.ఈమె హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి.‘అల్పాదాయ వర్గాలుండే ప్రాంతంలో వాలంటీరుగా పాఠాలు నేర్పిది.జిగ్యాస 2018 లో స్లామ్ జౌట్ లౌడ్ ప్రారంభించి ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ సృజనాత్మకత మొదలైన 21వ శతాబ్దపు నైపుణ్యాల్ని అయిదేళ్లపాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేర్పిస్తారు. వీళ్లలో 70 […]

పేదరికం పై పోరాటం

ఎన్నో నగరాల్లో యువతులకు పీరియడ్ పావర్టీ మహిళల పైన జరిగే హింస వారి మానసిక ఆరోగ్యం గురించి శిక్షణ ఇస్తోంది గర్ల్ అప్. 2010 లో యు ఎస్ ఫౌండేషన్ ప్రారంభించిన ఈ గర్ల్ అప్ లో భారత దేశానికి అతిధి అరోరా నాయకత్వం వహిస్తున్నారు. మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించేందుకు అప్రెంటిస్ హబ్ పేరుతో 18-21 ఏళ్ల యువతులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది గర్ల్ అప్. ఈ సంస్థ ద్వారా నిధులు సేకరించి వెయ్యి మంది […]

పిల్లల చదువులు లక్ష్యం

మూడు నుంచి ఆరేళ్ళ పిల్లల కోసం రాకెట్ లెర్నింగ్ మొదలు పెట్టి మధ్యప్రదేశ్,రాజస్థాన్ తో సహా ఏడు రాష్ట్రాల్లో పనిచేస్తోంది నమ్య మహాజన్. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తోందీ సంస్థ. మెదడు ఎదుగుదలలో 85 శాతం ఎనిమిదేళ్ల లోపే ఉంటుంది భరత్ లో పిల్లలకు ఐదేళ్లు వచ్చినా సరైన చదువు రావటం లేదనే ఉద్దేశ్యం తోనే ఈ రాకెట్ లెర్నింగ్ సంస్థ ను ప్రారంభించింది నమ్య మహాజన్ గూగుల్,అమెజాన్ వంటి సంస్థలు 8 కోట్లు గ్రాంట్ అందించారు. […]

తల్లితండ్రులే బాధ్యత

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో 10 నుంచి 12 శాతం పిల్లల మానసిక అనారోగ్యాలకు కారణం వారికి సరైన వయసులో మంచి అలవాట్లు నేర్పక పోవటమేనని తేల్చింది. బాల్యంలో పిల్లలు అతిగా కోపం ఆవేశాన్ని ప్రదర్శించినప్పుడు ఆ ప్రదర్శన వెనక కారణాన్ని తల్లిదండ్రులు గుర్తించి అదుపులో ఉంచుకోవటం పిల్లలకు నేర్పాలి అంటున్నారు అధ్యయనకారులు. దుడుకు స్వభావం తగ్గించే రకంగా ధ్యానం క్రీడల్లో ప్రవేశించేలా వారిని ప్రోత్సహించాలి. నిద్రపోవటం నిద్రలేవటం సరైన సమయానికి హోం వర్క్ […]