Sunday, 28 Jun, 2026

అప్పుడే మరింత అందం

ఇంద్రధనస్సు రంగుల తో ఇల్లు కాంతిమంతంగా ఉంటే చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అంటారు ఇంటీరియర్ డిజైనర్స్. గది గోడల పైన మన మనసులో పాత జ్ఞాపకాలు తట్టి లేపే ఫోటో ఫ్రేమ్స్ ఫిల్ చేయాలి. ఒక్క గదిలో ఒక విధంగా మనల్ని నార్మల్ మూడ్ లో ఉంచే విధంగా లైటింగ్ ఉండాలి. ఇల్లు ఇంటిరియల్ ఎంత బాగున్నా శుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే పెట్టిన ఎఫర్ట్ వృధానే. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ మ్యాట్స్, సోప్ […]

చెమట ఆరోగ్యమే

నడిచినా పరుగులు తీసిన చెమట పట్టేస్తూ ఉంటుంది. ఇలా చెమటలు రావడం చర్మానికి ఎంతో మంచిది. లోపల ఉండే వేడి నియంత్రించడం తో పాటు శరీరంలోని కెమికల్స్ ని బయటకు తీసుకువస్తుంది. చెమట వల్ల సూక్ష్మరంధ్రాలు పూడి పోతాయనుకోవటం   అపోహ చెమట పడితే ఆరోగ్యంగా ఉన్నట్లే చెమట పట్టే లాగా ఎక్సర్ సైజ్ చేస్తే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. స్వేదం వల్ల బ్యాక్టీరియా క్రిములు శరీరం పైన ఉంటాయి. కనక వర్క్ వుట్స్ తర్వాత […]

అవి అచ్చంగా ఆవుపాలే

బంగాళ దుంపల నుంచి తీసిన పాలలో ఆవు, గేదె పాలల్లో మాదిరే అమైనో ఆమ్లాల తో కూడిన ప్రొటీన్లు ఉంటాయని ఇవి కండరాల పెరుగుదలకు తోడ్పడతాయని నెదర్లాండ్స్ లోని మాస్టర్స్ యూనివర్సిటీ నిపుణులు తాజా పరిశీలనలో స్పష్టమైంది పైగా ఇవి వ్యాయామం చేసే వాళ్లకి జబ్బుతో నీరసించిన వాళ్ళు త్వరగా కోలుకునేందుకు తోడ్పడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్రీడాకారుల కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్ ఆలూ నుంచి తీసిన పాలలో లభిస్తుంది. కనుక ఆలు పాలు తాగండని చెబుతున్నారు.

లాభాలు తెచ్చిన పూలు

అలంకరణ పుష్పాలైన గెర్బెరా పూలు పంటను సాగు చేసి జార్ఖండ్ రాష్ట్రానికి ఘనత తెచ్చారు. జంషెడ్పూర్ సిస్టర్స్ గా ప్రఖ్యాతి చెందిన అక్కచెల్లెళ్ళు ప్రియాంక భగత్, ప్రీతి భగత్ ఫ్యాక్టరీ వర్కర్ గా పని చేసే తండ్రి నవ కిషోర్ భగత్ ఉద్యోగం కోవిడ్ కారణంగా పోవటంతో అక్కచెల్లెళ్ళు తండ్రితో కలిసి తల్లి నగలు కుదువపెట్టి వాళ్లకు ఉన్న భూమిలో గెర్బెరా పూలసాగు మొదలుపెట్టారు. కోసిన తర్వాత కూడా 15 రోజుల పాటు తాజాగా ఉండే ఈ […]

మిస్ ఇండియా 2022

21 సంవత్సరాల సినీ శెట్టి మిస్ ఇండియా 2012 కిరీటాన్ని గెలుచుకుంది. ముంబైలోని భారీ ఉత్సవ వేదిక జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మిస్ ఫెమినా ఇండియా వరల్డ్  2022 పోటీల్లో సినీ శెట్టి విజేతగా నిలిచింది. పుట్టింది పెరిగింది ముంబైలోనే అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ చేసి ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అకౌంటెంట్ చదువుతోంది. ఎయిర్ టెల్, ఫ్రీ ఫైర్, పాంటలూన్స్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కి మోడలింగ్ చేసింది సినీ శెట్టి. మాజీ […]

సింపుల్ నగలివి

మెలోరా పేరుతో 2016లో నగల వ్యాపారం మొదలుపెట్టారు సరోజ. ప్రతి శుక్రవారం 75 రకాల కొత్త డిజైన్లను మార్కెట్ లోకి ప్రవేశపెడతారు. ఆ నగలన్నీ తక్కువ బరువు తో ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ధోరణులకు తగ్గట్లుగా ఉంటాయి. ఈ సంస్థకు సీఈఓ ప్రమోటర్ సరోజినే  ఒక స్టార్టప్ గా అత్యధిక క్రౌడ్ ఫండింగ్ ఫండింగ్ సాధించిన సంస్థగా రికార్డ్ కెక్కింది. నగలంటే కొని లాకర్ లోకి చేర్చటం కాదు రోజువారి వేసుకునేలా డ్రెస్సింగ్ టేబుల్ […]

తేమగా అనిపిస్తోందా ?

వర్షాలు కురుస్తుంటే వార్డ్ రోబ్స్ తేమగా మారి బట్టల నుంచి ఒక లాంటి వాసన వేస్తూ ఉంటుంది. ఆ వాసన లేకుండా ఉండాలంటే అలమారాల్లో పేపర్స్ పరవాలి. అవి తేమను పీల్చేస్తాయి. బట్టలు పూర్తిగా ఆరిపోయాకనే కప్ బోర్డ్స్ లో పెట్టాలి. మూలల్లో కీటకాలు చేరకుండా ఎండిన వేపాకులు పెట్టాలి. తేమ ఎక్కువ అనిపిస్తే ఒక ఉప్పు ప్యాకెట్ కత్తిరించి అలమారలో మూల ఉంచాలి లేదా సిలికాన్ జెల్ పాకెట్లు మార్కెట్లో దొరుకుతాయి వాటిని అలమరాలో ఉంచినా […]

సింపుల్ లుక్ తో జంప్ సూట్స్

మోడర్న్ లుక్ కోసం ఎక్కువ మంది అమ్మాయిలు జంప్ సూట్స్ ఎంచుకొంటున్నారు విమానం లోంచి కిందికి దుకే పారా షూటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులివి. ఈ జంప్ సూట్ ను 1930లో ఫ్యాషన్‌ డిజైనర్‌, ఎల్సా షియాపెరెల్లి ఫ్యాషన్‌ ప్రపంచానికి పరిచయం చేసింది.ఒళ్లంతా కప్పి ఉంచడంతో పాటు, కదలికలకు ఇబ్బంది కలిగించని జంప్‌ సూట్స్‌ ఎన్నో రకాల మెటీరియల్స్‌ తో రూపొందుతున్నాయి. పార్టీ వేర్‌, రెగ్యులర్‌ వేర్‌ ఫ్యామిలీ వెకేషన్ లు ఇవి ప్రధాన ఆకర్షణగా […]

రైఫిల్ ఉమెన్

అస్సాం కు చెందిన రైఫిల్ ఉమెన్ బృందాలకు ఎంతో మంచి పేరు ఉంది. అస్సాం రైఫిల్స్ లో భాగమైన ఈ రైఫిల్ ఉమెన్ బృందాలు ప్రాణాలు పణంగా పెట్టి అసాధారణ ధైర్యసాహసాలు చూపెట్టి ఆపదలో ఉన్న వారిని కాపాడుతారు. అస్సాం లో ఎన్నో జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యంగా కచార్ జిల్లా వరదల దెబ్బతో అల్లకల్లోలం అయింది. ఇళ్లన్నీ నాని పోయి ఏ నిమిషంలో కూలి పోతాయో అన్నట్లు ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ రైఫిల్ […]

ఆరోగ్య నిధి నెయ్యి

నెయ్యి తో కొవ్వు పెరిగి పోతుంది అనే భావన నుంచి బయటకు రావాలి అంటున్నాయి అధ్యయనాలు. ఇందులో యాంటీ వైరల్ గా పనిచేసే బుటిరిక్ యాసిడ్స్ ఉన్నాయి. బీటా-కెరోటిన్ లకు ఎ,డి,కె విటమిన్ లకు నెయ్యి నిధి వంటిది మిగతా వంటనూనెలల్లో కంటే నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. నెయ్యి లోని జీవశక్తిని వ్యాధి నిరోధక శక్తిని పెంచే అంశాలు ఆయుష్ పెంచడంతో పాటు వార్ధక్య లక్షణాలు నివారించి యవ్వనాన్ని నిలబెడతాయి. నెయ్యి పిల్లల ఎదుగుదలకు […]

యంగెస్ట్ సర్పంచ్    

చదువుకొన్న వాళ్ళు సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరిస్తే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అంటుంది లక్షికా దాగర్.21 సంవత్సరాల రేడియో జాకీ లక్షికా దాగర్ ప్రస్తుతం ఒక గ్రామానికి సర్పంచ్ అయి, రాష్ట్రం లోనే యంగెస్ట్ సర్పంచ్ గా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌ పరిధిలోని చింతామన్‌ జవాసియా గ్రామానికి చెందిన అమ్మాయి లక్షికా మూడు వేలకు పైగా జనాభా ఉన్న చింతామన్‌ కు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోస్ట్ మహిళలకు కేటాయించారు. ఎస్సీ మహిళలకు […]

జుట్టు పెరుగుతుంది

జట్టు వత్తుగా పెరగాలంటే పోషకాలుంటే ఆహారం తినాలి ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి ఉసిరిపొడి,నిమ్మరసాం లో కలిపి జుట్టుకు పట్టించాలి జుట్టు పెరుగుతుంది. పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది తాజా కొబ్బరి పాలతో హెయిర్ మాస్క్ వేసుకొంటే జుట్టు ఆరోగ్యానికి తిరుగు ఉండదు. అలాగే ఉల్లిపాయరసం జుట్టు కు పట్టించుకొన్న మంచిదే ప్రతి ఉదయం నానబెట్టిన ఆల్మండ్స్ నాలుగైదు తినాలి. జుట్టు స్టైలింగ్ కోసం చేసే హీట్ ట్రీట్ మెంట్స్ మానేయాలి.

గడువు ముగిసినట్లే

ఇంట్లో వాడుకునే ఎన్నో వస్తువులు చూసేందుకు బాగుంటే నెలల తరబడి వాడుతూ ఉంటాం కానీ గడువు తీరిన వస్తువులు వాడకండి ప్రమాదం అంటారు అధ్యయనకారులు. వంట పాత్రలు తోమే స్పాంజ్ తో చేసిన స్క్రబ్బర్ నాణ్యంగా ఉన్నాయని నెలలపాటు వాడుతాం  కానీ వాటి జీవితకాలం రెండు నెలలు. అలాగే టాయ్ లెట్ బ్రష్ లు వాడకపోయినా ఆరు నెలలకు ఒకసారి మార్చాలి. అలాగే బ్రా లు కూడా త్వరగా చిరిగి పోవు కానీ వదులై భుజం పై […]

సహజమైన ఔషధం

మన దేశంలో దొరికే అద్భుతమైన ట్రెడిషనల్ మెడిసిన్ అల్లం. ఇది పసుపు జాతి కి సంబంధించింది. అప్పుడే మట్టిలో నుంచి తీసిన అల్లం దుంపలో 79 శాతం నీళ్లు 18 శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రక్తం లోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మినరల్, బి3, బి6, సి- విటమిన్, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, ఐరన్ ఇలా 400కు పైగా ఉపయోగకరమైన కాంపౌండ్స్ అల్లం లో ఉంటాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా వైరస్ లను […]

ఇది ప్రపంచ రికార్డ్  

లేహ్ నుంచి మనాలి వరకు మొత్తం 480 కిలోమీటర్లు సోలో సైక్లింగ్ చేసిన తొలి మహిళగా ప్రీతి మాస్కే గిన్నిస్ రికార్డు అందుకుంది. 45 ఏళ్ల, ఇద్దరు పిల్లల తల్లి ప్రీతి ఐదారేళ్ల క్రితం అనారోగ్య సమస్యల దృష్ట్యా వ్యాయామంగా సైక్లింగ్ ఎంచుకుంది ఆమెది పూణే బాస్కెట్ బాల్ హాకీ లో జాతీయ క్రీడాకారిణి 2019లో ఇద్దరితో కలిపి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3773 కిలోమీటర్ల దూరాన్ని 17 రోజులు 17 గంటల్లో పూర్తి చేసింది. […]

ఇంకా ఎక్కువ శ్రమ అవసరం

టెక్నాలజీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను మిట్ గుర్తిస్తోంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో మహిళలు తమను తాము నిరూపించుకొనేందుకు నాయకత్వం స్థాయికి చేరుకునేందుకు పురుషులు కన్నా ఎక్కువ శ్రమించాలి అంటుంది సుచరిత మన్యాల తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్ నగర్ నుంచి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిట్ లో సీట్ సంపాదించింది. అందులో సిస్టం డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ ను ఇటీవలే పూర్తి చేసింది సిస్టం డిజైన్ అండ్ […]

అలాటి ట్యాగ్స్ వద్దు

నన్ను లేడి పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయటం నాకు అసలు నచ్చలేదు పేరుకు ముందు ఇలాంటి ట్యాగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఇటువంటి వాటికి నేను కనెక్ట్ కాను. ఈ ట్యాగ్స్ వల్ల ఎంతో ఒత్తిడికి గురవుతున్నాను అంటుంది సాయి పల్లవి. ఇప్పటివరకు నేను పోషించిన పాత్రల వల్లే ప్రేక్షకులు ఆరాధిస్తున్నారు. వారి ప్రేమను దృష్టిలో ఉంచుకొని మంచి పాత్రలలో నటిస్తా  చాలా సాధారణంగా ఉండేందుకే ఇష్టపడతాను. అంటోంది సాయి పల్లవి.

కూరకు మరింత రుచి

ఒక్కసారి కూర లో నీళ్ళు ఎక్కువై కూర రుచి తగ్గిపోతుంది. అలాటప్పుడు చిక్కని గ్రేవీ దానికి జతచేయాలి. పెరుగు, ఫ్రెష్ క్రీమ్ చక్కగా కలిపి కూరలో వేసి కలిపితే దానికి కాస్త మసాలా కారం వేస్తే గ్రేవీ చిక్కగా రుచిగా వస్తుంది. అలాగే జీడిపప్పు నేతిలో వేయించి పాలలో కలిపి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ను కూడా వేసి పది నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ చిక్కగా అవుతుంది.కార్న్ ఫ్లోర్ ను నీళ్లలో కలిపి కూర లో […]

పోర్గై వర్క్ ఇప్పుడు ఫ్యాషన్

తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో పోర్గై కళ ఎంతగానో ఆకట్టుకుంది తమిళ నాడు లోని ధర్మపురి జిల్లా సిత్లింగి వ్యాలీ లోని గిరిజనలు సాంప్రదాయ ఎంబ్రాయిడరీ ఎంతో వినూత్నమైంది 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కి వచ్చిన డాక్టర్ లలిత రేగి దంపతులు ఈ కళను బతికించేందుకు పోర్గై అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

జ్ఞాపకాన్ని భద్రంగా

మనకు ఎంతో ఇష్టమైన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం వారు వాడిన వస్తువులు దుస్తులు జాగ్రత్తగా భద్ర పరచుకుంటూ ఉంటారు. దీన్ని ద్రుష్టి లో పెట్టుకొని డెహ్రాడూన్‌ లో పుర్కాల్‌ స్త్రీ శక్తి అనే సమితిని ఏర్పాటు చేసింది నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే ఈ సంస్థలు. గత పదిహేను సంవత్సరాలుగా డెహ్రాడూన్ లోని నలభై గ్రామాల్లోని దాదాపు 200 మంది మహిళల మహిళలు ఈ సంస్థలో బొంతలు కుడతారు. ఈ మధ్యకాలంలో ముంబైకి చెందిన […]