October 2021
అందానికి యాపిల్
యాపిల్ పండుతో వేసే ప్యాక్ ముఖంపై ముడతలు కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు తగ్గిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ గుజ్జు, నిమ్మరసం పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై పేరుకొన్న మురికి మృతకణాలు తొలగిపోతాయి. తరచుగా ఈ ప్యాక్ వేసుకుంటే ముడతలు తగ్గిపోతాయి అలాగే యాపిల్ గుజ్జు పెరుగు నిమ్మరసం కలిపిన ప్యాక్ కూడా మంచి ఫలితం ఇస్తుంది. చర్మం శుభ్రపడి […]
మహిళలకు శిక్షణ అవసరం
నేత్రీ ఫౌండేషన్ ద్వారా భూపాల్ కు చెందిన Kanksshi Agarwal మహిళలకు రాజకీయ పాఠాలు బోధిస్తోంది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో అర్బన్ పాలసీ అండ్ గవర్నెన్స్ చదివిన కనక్షి పాలనలో ఎక్కువగా పురుషులే ఉండటం, స్త్రీలకు సమానత్వం లేకపోవటం గమనించింది దేశవ్యాప్తంగా 2017 నుంచి జిఎస్టి అమల్లోకి వచ్చాక,పెరిగిన పన్నుల్లో, మహిళలు వాడే శానిటరీ నాప్ కిన్స్ పైన 18 శాతం పన్ను భారం పడ్డాక జిఎస్టి కౌన్సిల్ లో మహిళలు లేకపోవటం […]
ఇడ్లీ సంత
మేం సంవత్సరాలుగా తడి గుడ్డ పైనే ఇడ్లీలను ఉడకబెడుతూ ఉన్నాం అందుకే నా ఇడ్లీలకు అంత రుచి అంటుంది ఈ రోడ్ లోని ఇర్లీ సంత లో ఒక హోటల్ ఓనర్ తమిళనాడులోని ఈ రోడ్ లోని కరుంగల్ పాళ్యం లో స్త్రీలే నడిపే 35 హోటళ్ళ సంత ఉదయం 5 నుంచి 9 వరకు సాగుతుంది. ఈ నాలుగు గంటల వ్యవధిలో అక్కడ రోజుకు పదివేల ఇడ్లీలు అమ్ముడుపోతాయి. పెళ్లిళ్ల సీజన్ లో 40 వేల […]
జనపనార హారాలు
సాంప్రదాయ బంగారు పతకాన్ని తగిలించిన జూట్ నెక్లెస్ లు, హారాలు గ్రాండ్ లుక్ ఇస్తాయి. సాంప్రదాయ చీరె కట్టు కైనా, వెస్ట్రన్ డ్రెస్ కైనా ఈ జనపనార ఆభరణం అందంగా అమరిపోతుంది. విడిగా నారతో చేసిన గొలుసు లకు పెద్ద పెండెంట్లు జతచేసి అందమైన నగలు తయారవుతున్నాయి. లక్ష్మీ రూపాల దగ్గర నుంచి సిల్వర్, కలపతో చేసిన పెద్ద పెండెంట్లు జతచేసిన రంగుల జనపనార హారాలు ఇప్పటి ట్రెండ్. రంగురంగులుగా వేసుకునే దుస్తుల పైకి ఈ తరహా […]
ఒంటరిగా ఉండటం మంచిదే
ఒంటరితనం, ఒంటరిగా ఉండటం రెండు వేరు వేరు అయినా ఒంటరిగా ఉండాలనుకునే ధోరణి మానసిక ఆరోగ్యానికి మంచిది అంటున్నారు సైకాలజిస్ట్ లు. నీతో నువ్వు ఉన్నప్పుడే నువ్వేమిటో అర్థం అవుతావు ఏం చేయాలో చేయకూడదో స్పష్టంగా ఉంటుంది. ఇష్టాలు, అయిష్టాలు వేసుకుంటే స్పష్టమైన మార్గం తెలుస్తుంది అంటారు. ఒంటరిగా ఉండటం అంటే సోషలైజ్ అవుతూనే ఏకాంతంగా ఉండటం. ఎవరికి వాళ్లే జడ్జ్ గా ఉండటం పోలికలు చూడకుండా జీవితాన్ని గడపటం ఆరోగ్యకరం. మన కోసం మనం సమయం […]
జుట్టుకు రక్షణ
జుట్టు రాలే సమస్యకు రసాయనాలు లేని సహజమైన హెయిర్ మాస్క్ వాడటం మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. కర్పూరం కలిపిన కొబ్బరినూనెను తలకు పట్టించి రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల తేనె రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి కలిపి ఆ పేస్ట్ ను తలకు పట్టించాలి. ఈ మాస్క్ కూడా జుట్టు రాలటం తగ్గిస్తుంది. అవకాడో […]
అత్యంత శ్రీమంతురాలు
యు ఎస్వీ చైర్‌పర్సన్ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్ ‘100 రిచెస్ట్ ఇండియన్ జాబితాలో మహిళల్లో 3.28 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. 1961 లో యు ఎస్వీ ఏర్పాటయింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబై లో బి.కం చేసిన లీనా బోస్టన్ యూనివర్సిటీ మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పుచ్చుకుంది. లీనా మంచి రచయిత్రి. తాత విట్టల్ బాలకృష్ణ గాంధీ జీవిత చరిత్ర పై ఆమె రాసిన బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్ ఎంతో […]
స్నేహానికి ఉన్న శక్తి
మంచి స్నేహితులు ఉన్నవాళ్లు ఆనందంగా ఉండటమే కాకుండా ఒత్తిడి తగ్గి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు గుర్తించాయి 70 ఏళ్లు దాటిన వాళ్ళలో స్నేహితులు ఎక్కువగా ఉండే వాళ్ళు. లేనివాళ్ళ కంటే 22 శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు పరిశోధనలు చెప్తాయి. ఎవరితోనైనా స్నేహం చేసేందుకు ఎవరితోనైనా స్నేహం చేసేందుకు కనీసం 50 గంటలు పడుతుందని, వాళ్ళు మంచి స్నేహితులుగా మారేందుకు 200 గంటలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.స్నేహానికి ఒక కెమిస్ట్రీ ఉంటుందని […]
మేకప్ క్లీనింగ్
బయటకు వెలుతుంటే కాస్తయినా మేకప్ వేసుకోవటం సర్వ సాధారణం. ఆ మేకప్ ను సరిగ్గ తొలగించు కోకపోతే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల పాలలో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి దూది ముంచి నీట్ గా తుడిచేసుకోవాలి. దీనితో మేకప్ తో పాటు చర్మంపై పేరుకొన్న మురికి కూడా పోతుంది. కీరా దోస రసం లో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి […]
మునగాకు టీ
మునగాకు లో విటమిన్లు, ఖనిజాలు చాలా ఎక్కువ. ఇది మల్టీ విటమిన్ టాబ్లెట్ మాదిరిగా పని చేస్తుంది. ఇంటి పనిలో అలసటగా ఉంటే ఓ కప్పు మునగాకు టీ తాగండి అంటున్నారు ఎక్సపర్ట్స్. అరకప్పు మునగాకు తీసుకొని నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అందులో దాల్చిన చెక్క పొడి ఒక స్పూన్, నాలుగు స్పూన్ల తేనె వేసి రెండు నిమిషాలు ఉంచి వడకట్టుకోవాలి. ఈ టీ తో అలసట, బలహీనత పోతాయి.
రుతు రోగాలు
రుతువు మారటం తో పాటు వాతావరణం కూడా మారిపోయింది. కుండపోతగా కురిసే వర్షాలతో నీళ్లు నిలిచిపోయి దోమకాటుతో వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లు అధికంగా ప్రబలుతున్నాయి. ఇంటి చుట్టూ నీళ్ళు నిలవ ఉండకుండా చూసుకోవాలి అంటున్నారు వైద్యాధికారులు. పాత టైర్లు, సీసాలు పాత్రల్లో నీరు నిలిస్తే వాటిలో గుడ్లు పెడతాయి దోమలు. సెప్టిక్ ట్యాంక్ ల్లోనూ సెప్టిక్ ట్యాంక్ కు, ఏర్పాటు చేస్తే గొట్టాలకు దోమతెరలు కట్టండి అని సలహా ఇస్తున్నారు అధికారులు.
నది మీద ఉద్యానవనం
నేల పైన కాకుండా నది పైన తేలియాడే ఉద్యానవనం చూడాలి అనుకుంటే న్యూయార్క్ లోని లిటిల్ ఐలాండ్ పార్కుకు వెళ్లాలి. ఒక హెక్టర్ విస్తీర్ణంలో తులిప్ పూల ఆకారం వచ్చేలా నిర్మించారు. ఈ పార్కు నిర్మాణానికి మూడేళ్ళు పట్టింది. వ్యాపారవేత్త, నిర్మాత బారీ డిల్లర్, అతని భార్య డయాన్ లు కలిసి రెండు వేల కోట్ల రూపాయలతో ఈ పార్క్ నిర్మించారు రకరకాల పూల చెట్లు విశ్రాంతి తీసుకునే పచ్చిక మైదానాలు ఉండే ఈ పార్క్ లోకి […]
ఇదే నా రహస్యం
ఇబ్బంది కరమైన సమస్యలు వస్తే హాస్య కోణం లో చూసి ఆ వత్తిడి తగ్గించుకోవటం నాకు అలవాటు అంటుంది దీపిక పడుకోనే ఆనందంగా, ఉండటం ప్రశాంతమైన నిద్ర రెగ్యులర్ గా చేసే వ్యాయామాలే నా బ్యూటీ సీక్రెట్స్. తాజా ఆకుకూరలు, కాయగూరలు పండ్లు కు ఇస్తాను. ఎక్కువగా స్పా లకు వెళ్లటం నాకు అలవాటు. ఎంత బిజీగా ఉన్నా సరే కాస్త ఒత్తిడి అనిపిస్తే స్పా లో మసాజ్ చేయించుకుంటే ఉపశమనం లభిస్తుంది. అట్లాగే స్టీమ్ బాత్ […]
అందాల బొమ్మ
ఓహ్ రోజీ’ 22 ఏళ్ల అమ్మాయి జాగింగ్, యోగా వంటివి చేస్తూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ అమ్మాయి వర్చువల్ గర్ల్ సిడస్ స్టూడియో ఎక్స్ అనే సంస్థ ఈమెను తయారు చేసింది. 800 కు పైగా ముఖ శరీర కదలికలను 3డి టెక్నాలజీ ద్వారా సేకరించి ఈమెను సృష్టించారు. ఈ వర్చువల్ అమ్మాయికి ఎన్నో యాడ్స్ చేసే అవకాశాలు వచ్చాయి. 6 కోట్లకు పైగా డబ్బు రావడంతో […]
ఇవే ట్రెండ్
బుట్ట బొమ్మ పాట హిట్ అయినట్లే నాట్యం చేసే బొమ్మల బుట్ట లోలాకులు కూడా ఫ్యాషన్ ప్రపంచంలో మంచి చోటే తీసుకున్నాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపాలే కాదు వెస్టర్న్ స్టయిల్ లో భలే డాన్స్ భంగిమలు ఆభరణాల్లో కనువిందు చేస్తున్నాయి. రత్నాలు పొదిగిన బంగారు బుట్టలు లాకెట్లు, వెండితో చేసినవి కాకుండా ఇమిటేషన్ ఫ్యాషన్ జ్యువెలరీ లో కూడా డాన్సింగ్ బుట్టలు అమ్మాయిలు ఎంతో ఇష్టపడుతున్నారు. సంప్రదాయా వేడుకల్లోనే కాదు క్యాజువల్ గానూ […]
తప్పని సరి
ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటాం. చెవుల పై చాలా సేపు ఉండటం వల్ల బ్యాక్టీరియా అంటుకోవటం సహజం బ్యాగుల్లో జేబుల్లో ఉంచుకోవటం వల్ల డస్ట్ పేరుకుపోతుంది. ఇయర్ ఫోన్, చెవి లోపల వరకు పెడతాం కనుక వాటిపై పేరుకున్న దుమ్ము ఇయర్ బడ్ లేదా మెత్తని బట్టను శానిటైజర్ లో ముంచి శుభ్రపరచుకోవాలి. తేమలేని టూత్ బ్రష్ తో ఇయర్ ఫోన్ లో ఉండే మట్టి తొలగించాక, ఫోన్ ల పైన ఉండే […]
నేరగాళ్ల ఆటకట్టు
సైబర్ మిషన్ పేరుతో వివిధ రాష్ట్రాల్లోని వేల మంది పోలీస్ లకు శిక్షణ ఇస్తోంది కామాక్షి శర్మ ఘజియాబాద్ కు చెందిన కామాక్షి శర్మ డిజిటెక్ అనే కంపెనీ సి.ఐ.ఓ గా పని చేసింది. హ్యాకింగ్ పైన ఆసక్తితో ఎన్నో కోర్సులు చేసిన కామాక్షి సైబర్ నేరాలను అరికట్టటం తో పోలీసులకు సాయం చేయటం మొదలుపెట్టింది. సైబర్ ఇన్ వెస్టిగేషన్ కెరీర్ గా మార్చుకొంది. 35 రోజుల్లో 30 నగరాల్లో వర్క్ షాప్ నిర్వహించి 50 వేల […]
దళిత మహిళల చైతన్య లక్ష్యం
వేల మంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండుసార్లు బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకోవటమే కాక తన రచనలతో దళిత్ మహిళలను జాగృత పరుస్తున్నారు అనిత భారతి. 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయటం ప్రారంభించిన అనిత భారతి. 2012 లో హిందీ లో కంటెం పరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్ రెసిస్టెన్స్ పేరుతో ఒక పుస్తకం విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్ -10 పుస్తకాలలో ఒకటి. కదమ్ దళిత్ సెంటర్ ద్వారా దళిత్ […]
ప్రభావితం చేసే రంగులు
మన ఇంటి గోడలకు వేసే రంగులు మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయని అంటారు నిపుణులు. గోడల రంగును బట్టి ఉంటుందంటారు. కొన్ని రంగులు ప్రశాంతతతో పాటు ఆశావహ దృక్పధాన్ని పెంచుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆకుపచ్చ రంగు ఆలోచనల్లో వేగాన్ని పెంచుతుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఆశ ఉంటుంది. ఆందోళన, వత్తిడి గందరగోళం తొలగిపోతాయి. నీలం రంగు బుద్ధిని వికసింపజేస్తుంది కోపాన్ని తగ్గిస్తుంది. గులాబిరంగు గోడల మధ్య ఉండే ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలని […]
ఈమెది ప్రధమ స్థానం
గోద్రెజ్ వంశంలో మూడవ తరం వారసురాలు స్మిత 33 వేల కోట్ల సంపద తో హరూన్ జాబితా లో మహిళలు ప్రథమ స్థానంలో ఉన్నారు థియేటర్ ఆర్టిస్ట్ విజయకృష్ణ ను పెళ్లాడారు నౌరోజా గోద్రెజ్ సెంటర్ ఫర్ ప్లాంట్ రాప్టర్ రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సంస్థ పశ్చిమ కనుమల్లోని వృక్ష వైవిధ్యాన్ని కాపాడుతూ ఔషధ మొక్కలను సంరక్షించే ప్రయత్నం చేస్తోంది. ఆమె కుమార్తె నైరిక ఇక హోల్కర్ కూడా సంస్థ […]
