October 2021
అందాల అమిగురుమి టాయ్స్
జపాన్ అమిగురుమి బొమ్మలు చాలా బావుంటాయి. ఇక్కడి బొమ్మలు తమ మనుమలు మనమరాళ్ల కోసం వాళ్లకు ఇష్టమైన కామిక్ క్యారెక్టర్లను దారాలతో అల్లుతారు. ఎంతో ముద్దుగా ఉండే ఆ మెత్తని బొమ్మలు పాప్యులర్ కావటం తో వాటిని చైనా వాణిజ్య పరంగా ఉత్పత్తి చేస్తోంది. మనదేశంలోనూ దొరుకుతున్నాయి ఈ బొమ్మలు. ఆరోగ్యానికి హాని చేసే ప్లాస్టిక్ బొమ్మల కంటే ఇవి ఎంతో మేలు మాసిపోతే ఉతుక్కునే వీలుగా ఉంటాయి కనుక ఈ జపాన్ అమిగురుమి బొమ్మలను యూట్యూబ్ […]
సరికొత్త రాగాల కలింబా
చూసేందుకు చిన్న హార్మోనియం లాగా లేదా చిన్న కీ బోర్డు లాగా కనిపించే ఆఫ్రికన్ కలింబా వాయిద్యం సంగీత ప్రియులను పరవశులను చేస్తోంది. చెక్క తో తయారైన కలింబా పెట్టె పైన ఏడెనిమిది మెట్లు నుంచి 17 వరకు ఉంటాయి. యూట్యూబ్ లో ఎట్లా వాయించాలో చూస్తూ దీన్ని సాధన చేయచ్చు. దీనితోపాటు యూజర్ ఇ బుక్ కూడా ఇస్తున్నారు. పియానో మాదిరిగా ఉండే కలింబా ను చాలా తేలికగా నేర్చుకోవచ్చు. ఆసిమి సౌండ్ థంబ్ పియానో […]
ఎడడుగుల ఎత్తు రుమేసా గెల్గి
టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆమె నిలబడి ఉన్నప్పుడు 7 అడుగుల 0.7 అంగుళాల ఎత్తు ఉన్నారు. ప్రపంచంలో జీవించి ఉన్న అతి పొడవైన మహిళ ఈమె రుమేసా కు 18 ఏళ్ళ వయసులో మొదటి సారి టాలెస్ట్ మహిళా టీనేజర్ గా రికార్డ్ సాధించింది. అప్పుడు ఆమె ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు కాళ్లు 30.5 […]
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి
మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు ధైర్యంగా ప్రతిఘటించాలి అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిందే అంటారు తెలంగాణ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి జెడ్ పి టి సి సభ్యులు సంధ్యారాణి ఇతరులను ప్రోత్సహించే ముందర తానే స్వయంగా కర్రసాము కరాటే నేర్చుకున్నా రామె. రామగుండం లో జరిగిన ఒక పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంధ్యారాణి పోటీలో పాల్గొన్న వారితో కర్ర సాము చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడామె ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు […]
అకాల వార్థక్యం తథ్యం
శీతల పానీయాలతో కోరి అనారోగ్యాలు కొని తెచ్చుకోవటమే అంటారు నిపుణులు రోజుకో కూల్ డ్రింక్ తాగితే మధుమేహం బారినపడే అవకాశాలు 67 శాతం ఉన్నాయి. సోడాల్లో ఉండే బ్రోమినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ అనే రసాయనానికి నాడీ నష్టానికి సంబంధం ఉంది. ఈ రసాయనం తో చర్మంపైన దద్దుర్లు వస్తాయి. కూల్ డ్రింక్స్ నిల్వ ఉండేందుకు వాడే ఫాస్పేట్స్ పాస్ఫారిక్ యాసిడ్ లు చర్మపు సాగే గుణాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా తక్కువ వయసులోనే వార్ధక్యపు లక్షణాలు వస్తాయి. రోజుకో […]
ఇదీ ఒక అవకాశం
నలభై చిత్రాలకు పైగా పని చేసిన మహిళా కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ ఈ వృత్తిలోకి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావాలని చెబుతారు. సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్టుల్లో ‘కాస్టింగ్ డైరక్టర్’ పదమే లేదు.దాన్ని దర్శకత్వంలో భాగం అనుకుంటారు కానీ ఈ ప్రొఫెషన్ చాలా ప్రత్యేకం అంటారు పుష్ప ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఇలాంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు అవకాశాలు వచ్చాయి ‘పోస్ పోరీస్’ వెబ్ సిరీస్‌తో నాకు పేరొచ్చింది. ఇప్పటికీ 15 వెబ్ […]
ఇవి మట్టి వంటే నమ్మలేం
యాంటిక్ గోల్డ్ కోటింగ్ టెర్రికోట్ జ్యువెలరీ లో లేటెస్ట్ డిజైన్ లు రామ్ పరివార్ టెంపుల్ జ్యువెలరీ కాసులు వంటివి కొత్తగా వస్తున్నాయి. సహజాతి రత్నాలు కుందన్ లు అంటించిన ఈ మట్టి నగలు ఎనలేని అందంతో అచ్చం బంగారం నగలకు ధీటుగా ఉన్నాయి ఈ మట్టి నగలు ధరించడం ఇప్పుడు క్రేజ్. పండగైనా ప్రత్యేక సందర్భమైన ఎప్పటికప్పుడు కొత్త ఆభరణం కావాలి అనుకునే వాళ్లకు ఈ ఆభరణాలు మనసు దోచేస్తున్నాయి. లక్ష్మీదేవి బొమ్మలున్న టెంపుల్ జ్యువెలరీ […]
మెన్ ఫ్యాషన్ మేకర్ నిటాషా
నిఫ్ట్ లో ప్రొఫెసర్ ని అయినంత మాత్రాన ఫ్యాషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూ యార్క్ లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ లో చదువుకొన్నంత మాత్రాన నాకు అవకాశాలు ఏవీ రాలేదు ఒక పుస్తకంలా హీరో ని అధ్యయనం చేస్తే అతని స్టైల్ మేకర్ కావచ్చు అంటుంది నిటాషా గౌరవ్ స్టయిలింగ్ లో ఒక రూల్ బుక్ ఉంటుంది. దాన్ని పరిధుల్లోనే చేయాలి కానీ నేను చాలాసార్లు రూల్ బుక్ వదిలేసి స్ట్రీట్ లుక్ సృష్టించాను. […]
వండర్ ఉమెన్ ఎక్షా హంగ్మా
సూపర్ మోడల్ షో కి ఎంపిక కావటం చాలా సంతోషంగా ఉంది. పోలీస్ అకాడమీలో తీసుకొన్న శిక్షణ ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఎలాటి పరిస్థితుల నైనా ఎదురుక్కొనే ధైర్యం,త్వరగా నేర్చుకోగలిగే నైపుణ్యం నన్ను లక్ష్యం దిశగా నడిపాయి అంటోంది ఎక్షా హంగ్మా సుబ్బా. ఈ 21 సంవత్సరాల సిక్కిం యువతి బాక్సింగ్ లో జాతీయ క్రీడాకారిణి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ర్యాంప్ మీదకు వస్తే ‘మహీంద్రా గ్రూప్’ అధినేత ఆమెను వండర్ ఉమెన్ అని ట్విట్టర్ లో […]
నృత్య నీరాజనం
ఆలయంలో ఒక్క దీపం అయినా వెలిగించాలని ఆశపడతారు. కానీ నా నృత్యాల వల్ల ఒక్క ఆలయానికైనా ప్రాచీన వైభవం వస్తే చాలు అంటుంది హిమాన్సీ కాట్రగడ్డ. ఈమె కూచిపూడి నృత్య కళాకారిణి. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయలు శిథిలా వస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాల్లో నృత్యం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి ‘టెంపుల్ డాన్స్’ పోస్ట్ చేస్తారు. ఒక్క తెలంగాణా లోనే వెయ్యికి పైగా శివాలయాలు ఉన్నాని అంతకుమించి శిల్పకళా ఉందని ఆ ఆలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నాని […]
మాస్క్ ఉన్నా పర్లేదు
మాస్క్ లతో మేకప్ ఎలా చేసుకోవాలి అనుకొంటారు కానీ సర్జికల్ మాస్క్ లు వాడితే మేకప్ పాడవదు అంటారు ఎక్సపర్ట్స్. తేలిక పాటి ఫౌండేషన్ కొద్దిగా పౌడర్ తో మేకప్ ఫినిష్ చేయవచ్చు. క్రీమ్ లిప్ స్టిక్ కాకుండా మ్యాటే లిప్ కలర్ వేసుకోవాలి. లిప్ స్టిక్ వేసే ముందల పెదవులకు మ్యాటే ఫౌండేషన్ రాయాలి. మాస్క్ వేసుకొనే ముందర టిష్యు తో పెదవులు అద్దాలి. లిప్ లైనర్ తప్పక వాడాలి లిప్ బామ్ రాస్తే పెదవులు […]
ఐ లైనర్ ఈజీగా
ఐ లైనర్ తో కళ్ళు విప్పారినట్లు కనిపిస్తాయి. చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే చక్కగా వేసుకోవచ్చు. ఐ లైనర్ క్రీమ్ గా ఉంటే కనురెప్పల పైన మెత్తగా జరుగుతుంది. వేసుకోవటం ఈజీ ఇలాటి క్రీమ్ లైనర్ తోనే స్మడ్జ్ డ్ కలిసి ఉంటే బ్లెండ్ చేయటం ఎంతో తేలిక కాబట్టి వాటర్ ప్రూఫ్ బిల్ట్ ఇన్ స్మడ్జ్ డ్ క్రీమ్ ఐ లైనర్ నే ఎంచుకోవాలి. ఐ లైనర్ వేసుకునేందుకు ఉపయోగించే అద్దం ఫ్లాట్ గా ఉండే […]
కరోనా జలుబు వంటిదే
ఇకపై కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక సాధారణ జలుబు లాగా ఓ సామాన్య సమస్యగా ఉండబోతోంది. సార్స్ సి వో వీ-2 వైరస్ మరింత తీవ్రంగా మారుతుందని చెప్పేందుకు ఎలాంటి కారణాలు లేవు. త్వరలో కరోనా వైరస్ నిరపాయకరమైన వైరస్ గా మారబోతుంది అంటున్నారు వ్యాక్సిన్ రూప కర్త ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్. ఆమె ప్రముఖ వాక్సిన్ లలో ఒకటైన ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా టీకా రూపకర్త ల్లో ఒకరు. మానవాళిలో ఇప్పటికే నాలుగు రకాల కరోనా […]
రంగులతో కనికట్టు
ఎప్పుడు ఏదో ఒక డిజైన్ ఉన్న దుస్తులనే ఎంచుకోనక్కరలేదు. ఎలాంటి హంగులూ లేకుండా కొన్నిసార్లు ఒక సాదరంగు తో ప్రత్యేకంగా కనిపించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. పౌడర్ బ్లూ, పసుపు, ఐస్ బ్లూ, పీచ్, సముద్రం నీలం వంటివి ఫ్యాషన్ కలర్స్. సిల్క్, సాటిన్, కాటన్ సిల్క్, జార్జెట్ తరహా వస్త్రాలు ప్రత్యేకంగా కనిపించాలి. అనుకుంటే చిన్నగా అంచులు బుటీలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మొత్తం ఒకే రంగులో భారీ బ్లౌస్ వేసుకుంటే ఇతర వస్తువుల ఎంపికల ప్రత్యేకత […]
వెండి నగల్లో అందం
చీరెలు, చుడీ దార్లు లెహంగాలు, డ్రెస్ ఏదైనా కరెక్ట్ మ్యాచింగ్ జుంకీలే. డ్రెస్ స్టయిల్ కు తగ్గట్లు జుంకీలు ఎంచుకుంటే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావచ్చు. వెండితో తయారైన ఆక్సిడైజ్ అయిన జుంకీలు సాధారణ వెండి జుంకీల కంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి గుజరాతీ స్టైల్ జుంకాలు ఆక్సిడైజ్ జుంకీ లు ఫ్యాన్సీ డ్రెస్ లకు మ్యాచింగ్ గా బావుంటాయి. డిజైనర్ దుస్తులు అయితే రాళ్ల జుంకీలు ఎంచుకోవాలి. పగడం, ముత్యం, గోమేధికం పొదిగిన 22 క్యారెట్ల […]
ఆలియా చాలా ప్రత్యేకం
కాశ్మీర్ లో తొలి మహిళా ఫిట్ నెస్ ట్రైనర్ ఆలియా ఫారూక్. శ్రీనగర్ లోని ఖన్యార్ కు చెందిన ఆలియా ఇద్దరు పిల్లల తల్లి హార్మోన్ల అసమతుల్యత తో జిమ్ లో చేరిన ఆలియా తానే ఫిట్ నెస్ ట్రైనర్ కావాలనుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ లో చేరి ఫిట్ నెస్ లో పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంది. 2012 నుంచి జిమ్ ఇన్స్ట్రక్టర్ గా మారింది. ఈ 9 సంవత్సరాలలో ఆలియా […]
27 దేశాలతో వ్యాపారం
చక్కని బాల గణపతిని, ఇతర దేవుళ్ళను తయారు చేసే ‘మోదీ టాయ్స్’ సంస్థ యజమాని అవని ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది విదేశాల్లో పెరిగిన అవని భారతదేశపు సాంప్రదాయం, సంస్కృతిని విదేశాల్లో పరిచయం చేయాలనే దృష్టితోనే టాయ్ ఎంట్రప్రెన్యూర్ గా మారింది. అన్నా విట్టల్ మోదీ తో కలిసి 2018 లో ప్రారంభించిన మోదీ టాయ్స్ కు 27 దేశాల్లో కష్టమర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 40 వేల పైగా బొమ్మలు అమ్మారట అవని.
అందమైన బొమ్మలు
కళాశ్రీ ఫౌండేషన్ ద్వారా బార్బీ బొమ్మలంత అందంగా ఉండే బొమ్మలను చేతితో తయారు చేస్తూ, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు రంజన్ బెన్ టైలరింగ్, బొమ్మల తయారీని సరదాగా నేర్చుకున్న రంజన్ బెన్. 1995లో దాన్ని వ్యాపారంగా మలిచారు. 8,000 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చారామె. ఒక్క బొమ్మ తయారీ కి 18 గంటలు పడుతుంది. ఇప్పుడు కళాశ్రీ ఫౌండేషన్ బొమ్మలకు 18 దేశాల్లో కస్టమర్లు ఉన్నారు. ప్రపంచానికి భారతీయ బొమ్మలను పరిచయం చేయాలనుకోన్నాము అంటారు […]
ఆన్ లైన్ యానిమల్
ఆన్ లైన్ లో పశువుల సంత ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఢిల్లీ ఐ.ఐ.టీ చదివిన నీతు యాదవ్ కీర్తి జంగ్రా Animall యాప్ ద్వారా ఈ ఇద్దరు ఇప్పటికే యాభై వేల పశువుల అమ్మకాలు చేశారు. 2019 లో బెంగుళూరు లో యానిమల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇంత చదువు చదివి ఆన్ లైన్ లో పశువుల అమ్మటం ఏమిటని కామెంట్స్ వచ్చాయి. కానీ 2021 నాటికి ఈ యాప్ ద్వారా ఈ అమ్మాయిలు ఇద్దరు కలిసి 2400 […]
పాదాలకు ఆరోగ్యం
ముఖం, చేతులపై చూపే శ్రద్ధ పాదాలపై కూడా చూపించండి అంటారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. సహజమైన వస్తువులతో ఇంట్లోనే, ప్రయత్నించినా, పార్లర్ లో చేసే పెడిక్యూర్ ఫలితాలు వస్తాయి అంటున్నారు. నిద్రపోయే ముందర కొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె వేసి పాదాలకు రాసి బాగా మర్దన చేస్తే రక్తప్రసరణ సక్రమంగా జరిగి పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయి గుజ్జుతో స్పూన్ నువ్వుల నూనె పెసర పిండి పెరుగు కలిపి పాదాలకు పూసి అరగంట ఆగి […]
