June 2021
లక్షలు ఖరీదు చేసే కర్భూజాలు
రెండు పండ్లు..18 లక్షల రూపాయలు. మీరు సరిగ్గానే విన్నారు జపాన్ లో పండిన యుబరి కింగ్ మెలన్ పండ్లను పోకో సప్పోరో ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీ అక్షరాల 18 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రికార్డుల్లోకి ఎక్కింది. జపాన్ లోని యుబరి అనే ప్రాంతంలో ఈ పండ్లు పండిస్తారు. ఈ పండ్లకు బ్రాండింగ్ తేవటం లో యుబరి రైతులు వందేళ్ళ కష్టం ఉంది.రైతులు అమెరికన్ వంగడానికీ యూరోపియన్ వంగడాన్ని కలిపి కొత్త రకమైన కర్జూజ ను […]
ఇమ్యూనిటీ పెంచేద్దాం
పిల్లలకు కరోనా రాదు అనుకున్నారు కానీ సెకండ్ వేవ్ ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది .కరోనా కు పెద్ద చిన్న తేడా లేదని తేలిపోయింది. కరోనా కోరల్లోంచి బయటపడిన పిల్లలను ఇమ్యూనిటీ పెంచే ఆహారంఇవ్వాలంటున్నారు డాక్టర్లు. పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు విటమిన్-డి ముఖ్యం ఉదయం పూట పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి. పుట్టగొడుగులు గుడ్డులోని పచ్చ సొన లో కూడా విటమిన్-డి దొరుకుతుంది. అరటి, బొప్పాయి, ఆపిల్, పుచ్చకాయ, ద్రాక్ష, బెర్రీలు […]
మెడ నల్లగా ఉందా ?
మొహం కంటే మెడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది. నాలుగు బాదం పప్పులు రాత్రివేళ నానబెట్టి పొద్దుటే మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి దాని మెడ చుట్టూ రాసి ఆరిపోయాక కడిగేయాలి. అలాగే కీర చర్మకణాలను రిపేర్ చేస్తుంది కనుక తురిమిన కీర ను మెడకు పట్టించి మృదువుగా మర్దన చేస్తే చాలు అరగంట తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేయాలి. అలోవెరా జెల్ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే బేకింగ్ సోడా నీళ్లలో […]
కోవిడ్ ను రానివ్వదు ?
గ్రీన్ టీ తో కోవిడ్ తో పోరాడే లక్షణాలు ఉన్నాయని అధిక బరువు తదితర సమస్యలకు ఇది ఔషధం లా పనిచేస్తుందని తాజా అధ్యయనం చెపుతోంది. గ్రీన్ టీ లో వుండే గలోకాటెచిన్ అనే సమ్మెళనం కనుగొన్న శాస్త్రవేత్తలు అది స్పార్స్ కోవ్-2 ను ఎదురుక్కోగల ఔషధ అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలోని స్వాన్సియా యూనివర్సిటీ జరిపిన ఈ అధ్యయనంలో గ్రీన్ టీ ప్రతి రోజు తాగమని రికమెండ్ చేస్తున్నామని కోవిడ్ తో పోరాడగలిగే గుణాలు ఇందులో […]
ప్లాస్టిక్ బౌల్ వాడద్దు
అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్లో ఆహారం వడ్డించడం పిల్లలకు స్కూళ్ళకు ఇవ్వటం చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్లాస్టిక్ బౌల్స్ మెలనిన్ అనే ప్లాస్టిక్ తో తయారవుతాయి వేడివేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్ లోని మెలనిన్ ఆహారంతోపాటు శరీరంలోకి వెళ్తుంది. దేహంలో చేరే ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితం అయింది. మెలనిన్ ఉన్న బౌల్ లో ఏ […]
పూర్తిగా మారాను
నా లైఫ్ స్టయిల్ పూర్తిగా మార్చుకున్నాను ముఖ్యంగా మాంసాహారం మానేశాను హైడ్రోఫోనిక్ పద్ధతి ద్వారా ఆర్గానిక్ ఆహారం స్వయంగా పండించుకుంటున్నాను. పాల పదార్థాలు కూడా ముట్టుకోవటం లేదు అంటోంది సమంతా. కెరియర్ లో తిరుగులేని హిట్స్ అందుకున్నా సమంత ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని చెబుతోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆమెను సూపర్ స్టార్ ని చేసింది ఇక భవిష్యత్తులో హీరోలు ఆమెతో పోటీపడి నటించవలసి వస్తుంది. ఇక ఆమె కోసం కొత్త కథలు […]
బీట్ బాక్సర్ ఆర్ద్ర
కేరళ ప్రథమ మహిళ బీట్ బాక్సర్ గా పేరు తెచ్చుకుంది ఆర్ద్ర సాజన్.దుబాయ్ లోని షార్జా స్కూల్లో చదువుకుంది మిమిక్రీ అభిమాని విషయం సొంతంగా సాధన చేసే మిమిక్రీ ని బీట్ బాక్సింగ్ లో కలిపి ప్రయోగాలు చేసింది ఆర్ద్ర. టిక్ టాక్ లో ఆ ఆర్ద్ర వీడియోలకు లక్షలకొద్దీ వ్యూయర్స్ ఉన్నారు. సంగీత ప్రపంచంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న వ్యక్తి గా పేరుతెచ్చుకుంది. ఎలక్ట్రానిక్ సంగీతం తో పాటు వేణువు తో సహా అన్ని రకాల […]
కష్టానికి ఫలితం
భారతదేశంలోని అతిపెద్ద ఎడ్ సెట్ కంపెనీ బైజూస్ కో ఫౌండర్ దివ్యా గోకుల్ నాథ్ ఈ యాప్ కి 80 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు బైజూస్ లో విద్యార్థిగా చేరి అక్కడ టీచర్ అయ్యారు దివ్య 2015 లో ఆన్ లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చే యాప్ ని లాంచ్ చేశారు. ఈ కోవిడ్ సమయంలో యాప్ 35 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. ఇక […]
ఔషధ గుణాలున్న వెల్లుల్లి
వెల్లుల్లిని యాంటీ బయోటిక్స్ తో పోలుస్తారు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. జలుబు శ్వాస సమస్యలకు వెల్లుల్లి మందు వంటిదే .వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ అనే అమైనో యాసిడ్ కు ఔషధ గుణాలు ఎక్కువ. వెల్లుల్లి లో ఉండే విటమిన్ సి సెలీనియం వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి రక్తనాళాలు పనితీరు మెరుగు పరిచే శక్తి వెల్లుల్లికి ఉంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రెండు వెల్లుల్లి రెబ్బలు ప్రతిరోజూ తింటే […]
ఆశ్రిత వి.ఓలేటి
భారత దేశపు తొలి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్ ఆశ్రిత వి.ఓలేటి. 1973 నుంచి ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న ఈ పరీక్షను కేవలం 275 మంది పాసవగా వాళ్ళలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది. ఇకనైనా భారతీయ ఎయిర్ పోర్ట్ లో ఏ విమానం కావాలన్నా సేవలు మొదలు పెట్టాలన్నా దానిపై పరీక్షించి ఓకే చేయవలసిన బాధ్యత ఆశ్రితా దే. ఈమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బెస్ట్ పైలెట్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫ్లయిట్ బెస్ట్ కోర్స్ […]
జీవనశైలి మార్పుతో ఆరోగ్యం
కోవిడ్ నుంచి కోలుకున్నంత మాత్రాన గండం గట్టెక్కినట్లు రిలాక్స్ అయి పోకూడదు,మరోసారి కోవిడ్ కు గురికాకుండా రక్షణ చర్యలు కొనసాగించాలి అంటున్నారు డాక్టర్లు.కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కొంతకాలం పాటు నీరసం నిస్సత్తువ వేధించడం సహజం .జీవనశైలి మరింత మెరుగ్గా ఉంచుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది భోజన వేళలు నిద్రవేళ వ్యాయామ వేళలు సక్రమంగా పాటిస్తే పూర్వపు ఆరోగ్యాన్ని సమకూర్చుకోవటం సులభం. ప్రతిరోజూ కాస్త దూరం నడవాలి తేలికైన వ్యాయామాలు చేయాలి. నిద్రపోవటం మనస్సు శాంతిగా ఉంచుకోవటం […]
చేసిన హాని చాలు
పర్యావరణ పరిరక్షణ అంటే శాస్త్రవేత్తలు మేధావులు మాత్రమే ఆలోచించవలసింది కాదు. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఇంట జరగవలసిన పవిత్ర కార్యక్రమం అంటోంది ప్రముఖ నటి దియా మీర్జా ఇప్పటి వరకు పర్యావరణానికి చేసిన హాని చాలు ఇకనైనా సహజ వనరులను కాపాడుకుందాం అనే దియా ఐక్యరాజ్య సమితి తరపున ఎన్నో పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండుసార్లు ఐరాస పర్యావరణ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైన దియా. సముద్రాల్లో వ్యర్ధాలపై చైతన్యం కోసం ముంబై […]
మారని రుచి
ఆకుకూరలు రెండు మూడు రకాలు తెస్తే ఒకేసారి వండ లేకపోతే పాడైపోతూ ఉంటాయి .అలాంటప్పుడు తెచ్చిన ఆకుకూరల్లో పాలకూర ఉంటే దాన్ని అయిదారు రోజులు తాజాగా ఉండే పేస్ట్ లాగా చేసుకోవచ్చు పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి మరుగుతున్న నీళ్లలో పాలకూర ఆకులు వేసి ఉడకనివ్వాలి వడకట్టి ఆకుల్ని చల్లారనివ్వాలి మిక్సీ జార్జ్ లో ఈ ఉడికిన ఆకులు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ లాగా చేసి కంటైనర్ లో వేసి ఫ్రిజ్ […]
ఎన్నేళ్లయినా-తాజాగా
కరోనా కాలంలో, లాక్ డౌన్ వల్ల సరుకులు ముందే ఎక్కువ కొని నిల్వ చేసుకోవలసి వస్తోంది. ఆ సరుకులు పాడైపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాలిష్ పట్టిన లేదా పట్టని బియ్యం గాలి చొరబడిని డబ్బాల్లో 40 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే 30 ఏళ్లయినా పాడైపోవు .గోధుమలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా 6 నెలలకు మించి నిల్వ ఉండవు ఉప్పు తయారీలో కలిపే అయోడిన్ మూలంగా మెత్తని ఉప్పు నిల్వ సామర్థ్యం […]
మారని ఫ్యాషన్
స్ట్రయిట్ కట్ తో మెడ నుంచి పాదాల వరకు పొడవుగా ఉండే మ్యాక్సీ వేసవిలో సందేహం లేకుండా ధరించే ఫ్యాషన్ దుస్తుల్లో మొదటిది.గ్లాడియేటర్ చెప్పులు వెడల్పాటి సన్నటి బెల్ట్ .లెదర్ లేదా డెనిమ్ జాకెట్ ఈ మాక్సీ డ్రెస్ కు ఇతర అలంకారాలు. వేసవి ఎండల కు ఎలాంటి చిరాకు లేకుండా ధరించవచ్చు మెనోడ్రోమ్ ,పెద్ద చిన్న ప్రింట్లు ఏ తరహా వైన ఈ డ్రెస్ కు నొప్పతాయి. సన్నగా ఉన్న బొద్దుగా ఉన్న ఎలాంటి రూపం […]
ఆమే ఇన్‌ఫ్లుయెన్సర్
మంత్రముగ్ధుల్ని చేసే వస్త్ర ధారణ,మనసుకు హత్తుకునే మాటతీరు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి అంటే ప్రపంచం మిమ్మల్ని చూసి, మాట తీరు చూసి మీరు ఇన్ ఫ్లూయిన్స్ అవుతోంది అంటుంది ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టయిలిస్ట్, బ్రాండింగ్ కన్సల్టెంట్ మమతా శర్మ దాస్. ఆమెకు ‘ వీవ లా వీదా’ పేరుతో ఆమె ఒక ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్ నడిపిస్తోంది ‘వీవ లా వీదా’ అంటే జీవితాన్ని ఏ కళతో నైనా వర్ధిల్లేలా చేసుకోవచ్చు అని అర్థం .ఆమె బ్రాండింగ్ […]
మంచి గాలి ముఖ్యం
గర్భిణీ గా ఉండగా శిశువు ఆరోగ్యం కోసం మంచి పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు.కానీ ఆహారంతోపాటు తాజా గాలి అవసరం అంటున్నాయి అధ్యయనాలు. కాలుష్యం నిండిన గాలి వల్ల ఒక్క ఆసియాలోనే ఏటా నాలుగు లక్షలమంది గర్భస్థ శిశువులు అమ్మ కడుపులోనే తుదిశ్వాస విడుస్తూన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశం సహా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లలోని మహిళలు కాలుష్యం కారణంగా అత్యధిక స్థాయిలో గర్భస్రావాలకు గురవుతున్నారని లాన్సెట్ కథనాలు చెబుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల […]
నాణ్యతే మా గెలుపు
ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న అతిపెద్ద ఫార్మా సమస్త లూపిన్ ఈ కంపెనీ సి.ఇ.ఓ వినీత గుప్తా టి.బి మందుల తో ప్రారంభమైన లూపిన్ ఈరోజు క్యాన్సర్ తో సహా వందలాది ప్రాణాంతక వ్యాధులకు మందులను తయారు చేస్తోంది. ఏటా 155 మిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్న లూపిన్ సంస్థ ఆదాయం లో 66 శాతం అమెరికా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, రష్యా నుంచే వస్తాయి. మా నాన్న దేశ్ బంధు గుప్తా ఎంతో నమ్మకంతో లూపిన్ […]
యోగ బెస్ట్
ఈ రోజుల్లో ప్రతి వాళ్లనీ వెంటాడే సమస్య ఒత్తిడి యోగా తరగతులకు తప్పకుండా హాజరైతే సానుకూల ఆరోగ్య ఫలితాలు వస్తాయంటున్నారు బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ క్రిస్ స్ట్రీటర్ . ఆయన సమర్పించిన ఒక అధ్యయనంలో యాంటీ డిప్రెసెంట్లు వాడినా కూడా కుంగుబాటు నుంచి కోలుకోలేక పోయిన వారు యోగాతో ఆరోగ్యం సాధించారు. శ్వాస పైన దృష్టి కేంద్రీకరించి చేసే యోగ సాధన వల్ల నరాల వ్యవస్థ బలపడుతుంది. శారీరకంగా సౌకర్యంగా […]
ఇదే గొప్ప వైద్యం
డాన్స్ థెరపీ విత్ నిత్య పేరుతో ఇంస్టాగ్రామ్ లో, పేజీ ప్రారంభించింది దివ్య బరాయి మానసిక సమస్యల నుంచి బయటికి వచ్చేందుకు డాన్స్ తెరఫీ మంచి మందు అంటోంది దివ్య .మనసులోని బాధను బయటికి నెట్టివేసే నైపుణ్యాలు డాన్స్ లో ఉంటాయి. కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఎంతోమంది తమ మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఈ వేదికను ఆశ్రయిస్తున్నారు అంటోంది దివ్య .ఎంతో మంది బాధలకు, వత్తిడి కి పరిష్కారం డాన్స్ ఒక్కటే […]
