Sunday, 28 Jun, 2026

ఆహారమే ఔషధం

కోవిడ్ను ఎదుర్కొనేందుకు మాస్క్ లు సామాజిక దూరాలతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్.  వయసును బట్టి తగినన్ని కేలరీలు అందేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి. చిక్కీలు, ప్రోటీన్ బార్ ల తో పాటు మామిడి, అరటి వంటి పండ్లను స్నాక్స్ గా తీసుకోవాలి. తాజాగా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పప్పు దినుసులు, పన్నీర్, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులకే ప్రాధాన్యత […]

కరోనా పై పోరులో యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ ప్రముఖ క్రికెటర్ భారత ప్రభుత్వం నుంచి అర్జున్, పద్మశ్రీ పురస్కారాలు పొందాడు క్రికెట్ మైదానం లో అడుగుపెడితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే యువరాజ్ గుండె ఎదుటి మనిషి కష్టాలకు కరిగిపోతుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అతని సాయం క్రికెట్ రికార్డుల కంటే గొప్పది ఆసుపత్రిలో బెడ్లు, దొరక్క, ఆక్సిజన్ అందక ప్రజలు కరోనాతో పిట్టల్లా రాలి పోతుంటే తన స్వచ్ఛంద సంస్థ యు వియ్ కెన్ ( youwecan ) ద్వారా బాధితులకు […]

గుడ్డు బొమ్మలు సూపర్

గట్టిగా వేళ్ళతో పట్టుకుంటేనే చితికి పోతుంది అనిపించే గుడ్డు తో అద్భుతమైన బొమ్మలు, గుడ్డు శిల్పాలు, ఎంబ్రాయిడరీలు, గోడ చిత్రాలు చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఉక్రెయిన్ లో కళాకారులు గుడ్డు పైన అద్భుతమైన జానపద చిత్రాలు, దేవతా రూపాలను, ప్రకృతి దృశ్యాలను వ్యక్తుల రూపాలనీ అద్భుతంగా గీస్తారట. తేనెపట్టు నుంచి తీసిన మైనం తో రంగులు కలిపి సన్నని సూదితో గుడ్డు పైన జానపద డిజైన్ లు గీయటం అక్కడి కళాకారులకు మాత్రమే సాధ్యం. ఈ ఆర్ట్ […]

వాట్ ప్రా దమకాయా

గౌతమ బుద్దుడి ని ప్రపంచం మొత్తం ఆరాధిస్తారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏకశిలా విగ్రహం టాంక్ బండ్ లో కనిపిస్తుంది. బుద్ధుడికి సంబంధించి ఎన్నో చిహ్నాలు దేవాలయాలు ఉన్నాయి . థాయ్ లాండ్ లో వెయ్యి ఎకరాల స్థలంలో బుద్దుడి దేవాలయం ఉంది. వాట్ ప్రా దమకాయా అని పిలిచే ఈ భారీ బుధ్ధ దేవాలయం థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న క్లాంగ్ లువాన్ మండలం లో ఉంది. […]

ఇవి ఆర్నమెంటల్ క్యాబేజిలు

క్యాబేజీ కూర వండుకుంటాం కానీ అందాల పూల తోటలుగా పెంచటం ఎక్కడైనా ఉంటుందా ? ఆర్నమెంటల్ క్యాబేజిలు చూస్తే తోట అలంకరణకు ఇంత కంటే మంచి పూవులు ఇంకెక్కడా లేవనిపిస్తుంది. ఈ అందమైన క్యాబేజిపూవులు గులాబీ,పీచు,వంగపూవు ఇలా విభిన్నమైన రంగుల్లో మిశ్రమ వర్ణాల్లో కనువిందు చేస్తాయి. మాములు క్యాబేజీలో చుట్టు కొన్ని ఆకులు విచుకొన్నట్లు మధ్యలో బంతిలాంటి క్యాబేజీ ఉంటుంది కదా. ఆ బంతి బదులుగా గులాబీలా రెక్కలు విచ్చుకొంటాయి.చల్లని ఈ క్యాబేజీ పూవులు రంగులు ముదురు […]

ఎప్పటికీ వాడిపోని పూవులు

సృష్టి లోని సౌందర్యం మొత్తం ఒకే చోట పోగుపడి వికసించినట్లు ఇంత అందం ఇంత సౌందర్యం ఎక్కడ లేనట్లు ఎప్పటికీ వాడిపోని అపురూపమేమో అన్నట్లు ఉన్నాయి కానీ చేయి జారిందంటే మాత్రం పగిలిపోతాయి ఇవి పింగాణీ పువ్వులండి ! కోల్డ్ ఫోర్సిలిన్ తో చేసిన ఈ లిల్లీలు, గులాబీలు, చామంతులు చూస్తే వెంటనే తలలో పెట్టుకోవాలని పిస్తుంది. కానీ చేతిలోకి తీసుకుంటే అదే ఏమిటి పూలు రాళ్ళు లాగా ఉన్నాయి అనిపిస్తుంది. ఉక్రెయిన్  కు చెందిన బలెస్వా […]

కలర్ ఫుల్ ఎగ్

ఎంతో ఆరోగ్యం కదా అని గుడ్డు తినిపించాలని చూస్తే పిల్లల మొహం తిప్పేస్తారు తెల్లగా రుచిగా లేని గుడ్డు తినటం అంటే కష్టమే మరి. గుడ్డులోని శక్తిమంతమైన ప్రొటీన్లు, రిబోఫ్లేవిన్ ఎడి ఇకె విటమిన్లు ఖనిజాలు ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి.వీటిని పిల్లలు చేత తినిపించాలంటే ఎడిబుల్ కలర్స్ తో రంగులు మార్చేయండి అంటున్నారు షెఫ్ లు. ఐరోపా అమెరికాల్లో ఈ ఈస్టర్ పండుగకు సంతాన సాఫల్యతకు పుట్టుక కి సంకేతమైన గుడ్డుని రంగు రంగులతో అలంకరించి […]

అందాల పూల తోటలు

లావెండర్ తోటలు చూస్తుంటే కన్నుల పండుగ అనే పదం సరిగ్గా సరిపోతుంది .ఫ్రాన్స్ లోని ప్రోవెన్స్, ల్యూబెరాన్ వాలెన్సోల్ భూముల్లో వందల ఎకరాల్లో లావెండర్ తోటలు వేస్తారు.జూన్ లో మొదలై ఆగస్టు లో ముగిసే ఈ లావెండర్ పూల సీజన్ లో నేలంతా వంగ రంగులోకి మారిపోయి నట్లు అవుతుంది .తీరుగా గీత గీసినట్లు భూమిపైన వంగపూవు రంగు పూవులు వికసిస్తాయి.మెరిసే ఆకు పచ్చని ఆకుల మధ్య నిలువుగా కాడలతో పూసే లావెండర్ వనాలు ప్రకృతి ఇచ్చిన […]

ఈ కాడ కూర కిలో ఒక లక్ష

ఆకుకూరలు కాయిగూరలు ఖరీదు ఎంతుంటాయి చెప్పండి మహా అయితే కిలో వందో రెండువందలో అంటే మనం కళ్ళు తేలేస్తాం మరీ అంతఖరీదా అని.. కానీ కేజీ దాదాపు లక్ష రూపాయిలు పలికే కూరగాయి ఒకటి ఉంది. దాని పేరు హాఫ్ షూట్స్ ప్రపంచంలోకెల్లా ఖరీదైన కాడ కూర ఇది ఈ మొక్క లోని భాగాలు అన్ని ఔషధాలే కావడంతో దాన్ని కూరగాయ గా వాడటమే కాదు మందుల తయారీలో కూడా వాడుతుంటారు హాఫ్ షూట్స్ లోని ఔషధ […]

ఎడారిలో పూల సందడి

సృష్టిలో చాలా అందమైన పువ్వులు గులాబీ మొదటి వరుసలో ఉంటుంది. వందల రకాల గులాబీలు చూశాం కానీ ఎడారుల్లో ఇసుక నేల పైన విరిసే రోజ్ రాక్ ని చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓక్లహోమా ఎడారిలో విరిసే గులాబీలు చూస్తుంటే సృష్టి విచిత్రం అంటే ఇదే కదా అనిపిస్తుంది. ఇసుక నేల పైన అందాల గులాబీలు ఎలా వచ్చాయి అంటే మాత్రం సైన్స్ పాఠం లా చెప్పాలి. ఖనిజాలాన్ని నేలమాళిగల్లో గూడుకట్టుకుని రత్నాల్లా క్రిష్టల్స్ లా […]

60 ఏళ్లుగా సిలిండర్ తో జీవితం

పాల్ అలెగ్జాండర్ రాసిన పుస్తకం త్రీ మినిట్స్ ఫర్ ఎ డాగ్ మై లైఫ్ ఇన్ యాన్ ఐరన్ లాంగ్ ,ఒక సంచలనం. 60 ఏళ్లుగా ఒక ఇనుప యంత్రం సాయంతో బతుకుతున్న పాల్ జీవిత కథ ఇది. అమెరికాలోని డల్లాస్ కు చెందిన అలెగ్జాండర్ కు ఇప్పుడు 72 ఏళ్లు. ఆరేళ్ల వయసులో  సోకిన ఒక వింత పోలియో అతన్ని ఇలా ఒక ఇనుప చట్రం లో బిగించింది. 1916 నుంచి అమెరికాలో ప్రతి వేసవిలోనూ […]

సాంప్రదాయానికి ఆధునిక రూపం

పవిత్రమైన పూజగదిని అందంగా అలంకరించుకోవడం భక్తులకు ఎప్పుడూ ఇష్టం. అక్కడే ఉండే ప్రతి వస్తువు అందంగా ఉండాలనుకొంటారు . హారతి  పళ్లేలు కుంకుమ భరణి లు ఎన్నో డిజైన్ల లో వచ్చేశాయి .ఇప్పుడు అగరబత్తి స్టాండ్ లు కూడా రకరకాలు డిజైన్ లలో అందుబాటులోకి వచ్చేసాయి. చూసేందుకు అమ్మాయిల మెడలో పెండెంట్స్ లాగా భగవంతుని ప్రతిమ లాగా కనిపించే ఫినిషింగ్ స్టాండ్లు దొరుకుతున్నాయి. ముందు వైపు చిన్న విగ్రహం అందమైన ప్రతిమ ఉన్నట్లు కనిపించే వీటికి వెనకవైపు […]

బ్రాండ్ బై గార్డెన్ సిటీ అనే తోటలో ఊరు

భవనాల మధ్యలో అందం కోసం చక్కని పూలతోటలు,పార్క్ లు ఏర్పాటు చేస్తుంటారు కానీ ఏకంగా తోటలోనే ఊరు కడితే ఎలా ఉంటుంది.డెన్మార్క్ లోని కోపెన్ హెగన్ దగ్గర లో ఉన్న బ్రాండ్ బై గార్డెన్ సిటీ గ్రామాన్ని చూస్తే పచ్చని చెట్లతో అసలా ఊరే పెద్ద ముగ్గులా ఉంటుంది. పదుల సంఖ్యలో బండి చక్రాల్లా పరచుకొన్న తోటలు ఆ మధ్యలో ఎంతో అందంగా తీరుగా నిర్మించిన ఇల్లు ఎంతో అద్భుతం అనిపిస్తుందీ గార్డెన్ సిటీ .ఎంత అందంగా […]

బీ వాటర్ మై ఫ్రెండ్

ఎంటర్ ది డ్రాగన్ సినిమా తో బ్రూస్లీ ప్రేక్షకులకు ఒక తుఫాన్ లాగా పరిచయం అయ్యాడు కుంగ్ ఫూ,మార్షల్ ఆర్ట్స్ తో బ్రూస్లీ చేసిన సాహసాలతో ఒక అర వీర బయంకరుడైన కరాటే వీరుడిని ప్రేక్షకులు ఆదరించారు. క్రమశిక్షణ,కఠిన శ్రమతో శరీరాన్ని ఉక్కులా మార్చుకున్న బ్రూస్లీ గురించి అయన కూతురు షానన్ లీ బీ వాటర్ మై ఫ్రెండ్ పేరు తో ఒక పుస్తకం రాసింది. బ్రూస్లీ గురించి ప్రపంచానికి తెలియని అనేక కొత్త విషయాలు వెలుగులోకి […]

హీరోకి ఫిట్ నెస్ ముఖ్యం

నాకు బరువు పెరగటం తగ్గటం కొత్త కాదు సినిమాల్లోకి రాకముందు 125 కిలోలు ఉండేవాడిని. 2007 లో నా వి.ఎఫ్.ఎక్స్ సంస్థ అమ్మేసి పూర్తి స్థాయిలో సినిమాలు చేయాలనుకొన్న. హీరో అవ్వాలంటే ఫిట్ నెస్ ముఖ్యం కదా. హీరో పొట్టతో కనబతే ప్రేక్షకులు మెచ్చుతారా ? అందుకోసం ఎనిమిది నెలల్లో 20 కిలోలు తగ్గాను వారంలో ఆరురోజుల స్ట్రిక్ట్ డైట్ అంటారు రాణా. బాహుబలిలో బల్లాలుడి గా భారీ ఆకారంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రాణా తరువాత […]

జీవితం అతి పెద్ద పోరాటం

బాలీవుడ్ లో అగ్రశ్రేణి స్టంట్ ఉమెన్ గీతా టండన్ చిన్న వయసులోనే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లల తల్లి అయిన గీత భర్త వేధింపులు తట్టుకోలేక ఇల్లు వదిలి పిల్లలతో బయటకు వచ్చేసింది. ఉపాధి మార్గంగా సినిమాల్లో గ్రూప్ డాన్సర్ పని ఎంచుకుంది. యాక్షన్ స్టంట్స్ లో మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిశాక అటువైపుగా ప్రయత్నాలు మొదలు  పెట్టింది గీత . ఈ వృత్తిలో చాలా సవాళ్లు ఉంటాయి కేబుల్ వైర్ల పైనా వేలాడటం, ఎత్తైన భవనాల […]

అలా వెళ్లొద్దామా ?

ప్రయాణం అనగానే హడావుడిగా ఎయిర్ పోర్ట్ కు స్టేషన్ కు సామాన్లు సర్దుకుని వెళ్లే రోజులకి ఇక తెర పడినట్లే అందమైన ప్రయాణానికి కదిలే ఇళ్ళు లాంటి క్యార్ వాన్ లు వచ్చేసాయి కుటుంబ సభ్యులు, స్నేహితులతో హాయిగా క్యార్ వాన్ లోనే భోజనాలు, స్నానాలు, నిద్ర అన్నీ ప్రశాంతంగా జరిగిపోతూ, ఏకంగా  హిమాలయ పర్వత సానువుల్లో విహరించవచ్చు. సముద్రపు అలలతో కబుర్లు చెప్పచ్చు. ఏడాదిలో వెన్నెల రాత్రుల్లు గడపవచ్చు. ఇప్పటికే క్యార్ వాన్ ట్రావెల్స్ కి […]

బ్లెస్సింగ్ హట్

బ్లెస్సింగ్ హట్ ఎందరో నిరుపేదల అవసరాలు తీరుస్తోంది అస్సాంలోని డిమా హసావో జిల్లాకు చెందిన కొందరు యువకులు ఈ బ్లెస్సింగ్ హట్ ఏర్పాటు చేశారు. ఇది నూటన్ లీకుల్ గ్రామంలో ఉంది సాయం చేయాలి అనుకున్న వారు తమ ప్రాంతంలో పండిన కూరగాయలు వండిన ఆహారం, నిత్యవసర వస్తువులు, స్టేషనరీ కాలక్షేపం కోసం చదువుకునే పుస్తకాలు ఏవైనా ఇవ్వచ్చు కోవిడ్ సమయంలో అధికంగా చితికిపోయిన నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడ్డాయని యువకులు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ […]

టీకా అక్కడే ఎందుకు ?

కరోనా వ్యాక్సిన్ భుజం దగ్గరే వేస్తుంటారు పోలియో తప్ప దాదాపుగా అన్ని రకాల వ్యాక్సిన్ లను భుజం కండరానికి వేస్తారు. ఇతర ఇంజక్షన్లు మాదిరిగా రక్తనాళానికి ఎక్కించారు. ఎందుకంటే పై భాగంలో ఉండే డెల్టాయిట్ కండరాల్లో రోగనిరోధక శక్తి కారక డెంట్రిటిక్ కణాలు ఉంటాయి. ఇవి వ్యాక్సిన్ లోని యాంటీ జెన్లను వెంటనే గుర్తించి శరీర రోగనిరోధక వ్యవస్థ కేంద్రీమైనా లింఫ్ నాడ్స్ కు చేరవేస్తాయి అక్కడున్న టిబి కణాలు అంతే త్వరగా స్పందించి యాంటీ బాడీలు […]

పువ్వుల సందేశం

పువ్వులు పిల్లల నవ్వులు  లేని ప్రపంచాన్ని ఊహించలేము అన్నాడో కవి అందమైన పూల తోటలు తలచుకుంటే ఊటీ గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే ఫ్లవర్ షో చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు.1948 లో 55 ఎకరాల్లో ఏర్పడ్డ ఈ గార్డెన్ వేలాది పూలమొక్కలు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. గత సంవత్సరం అక్టోబర్ లో 124 వ ఫ్లవర్ షో ఉత్సవం జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది కానీ అప్పటికే గార్డెన్ […]