Sunday, 28 Jun, 2026

మరీ ఇంత అభిమానమా ?

తమిళం లో నేను రెండే సినిమాలు చేశాను. ఇంకా కొత్తమ్మాయి కిందనే లెక్క నాకు అభిమాన సంఘం అంటూ లేదుకూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉన్నాను అంతే విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టేంత ప్రేమ చుపించారంటే ఎంతో ఆనందంగా ఆశ్యర్యంగా ఉంది అంటోంది నిధి అగర్వాల్. ప్రేమికుల దినోత్సవం రోజు నిధీ అగర్వాల్ కు అభిమానులు ఉన్నందుకు పొంగి పోతున్నాను మూగ జీవాలకు ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలని అంటూ […]

ఈ బ్లెండర్ తో మేకప్ ఈజీ

చూసేందుకు వాటర్ డ్రాప్ షేప్ లో ఉండే ఈ మేకప్ బ్లెండర్ తో మేకప్ వేసుకోవటం సులభం దాన్ని ఉపయోగించటం తేలిక కూడా.ఈ బ్లెండర్ ను పొడిగా వాడకూడదు. నీటిలో ముంచి గట్టిగా పిండేయాలి.ఈ నీటి చుక్క ఆకారంలో ఉండే బ్లెండర్ తో ఫౌండేషన్ కన్సీలర్ వేసుకోవడం చాలా సులభం ఫౌండేషన్ ను మొహం పై చుక్కలు చుక్కలుగా పెట్టుకొని బ్లెండర్ తో పైపైన అద్దితే అది సమంగా పరుచుకుంటుంది ప్యాచ్ లాగా కనిపించకుండా సహజంగా ఉంటుంది. […]

లౌజైన్ అల్హాత్లౌల్

లౌజైన్ అల్హాత్లౌల్ సోషల్ యాక్టివిస్ట్ సౌదీ జైలు నుంచి ఈ నెల విడుదల అయ్యింది మహిళలకు సౌదీ లో డ్రైవింగ్ చేసే అర్హత కోసం ఆమె పోరాటం చేసింది. 2014 నుంచి ఈ పోరాటం మొదలైంది ఆమెను జైలు అధికారులు చిత్రహింసలు పెట్టారు. విచారణ పేరుతో వచ్చే అధికారులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమ్నెష్టి ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వంటి సౌదీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాక ఈనెల పదవ  తేదీన లౌజైన్ Loujain విడుదల చేశారు […]

ఇవి వేడినిస్తాయి

ఇంకా చల్ల గాలులు వస్తూనే ఉన్నాయి. ఈ చల్లని రోజులో వెచ్చదనం ఇచ్చే ఆహారం కావాలి. జలుబు,ఫ్లూ,జ్వరాలు ఔషధంగా తేనె ఉపయోగించాలి. అల్లం తులసీ టీ శరీరానికి స్వాంతన ఇస్తుంది.చలి కాలంలో నెయ్యి శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా ఖర్జురాలు,ఆప్రికాట్స్ వంటివి తింటే వళ్లు వెచ్చగా ఉంటుంది. బెల్లం తినటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. దాల్చిన చెక్క వాడకం కూడా చాలా మంచిది. గోరు వెచ్చని పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని […]

రసాయనాల ప్రభావం కావచ్చు

సౌందర్య ఉత్పత్తుల్లో రసాయనాలు ఉంటాయి. ఒక్కసారి ఈ రసాయనాల ప్రభావం చర్మం పైన పడుతుంది అప్పుడు చర్మం కొన్ని సంకేతాలు ఇస్తుంది చర్మంపైన చిన్న ఎర్రని బుగ్గలు ఏర్పడి పగుళ్ళు వస్తే ఉపయోగించే సౌందర్య సాధనాలలో సల్ఫేట్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ లో సోడియం లారైల్, సల్ఫేట్ పాళ్ళు ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఒక్కసారి చర్మం పైన ఎక్కువ జిడ్డు లేదా పొడిగా కనిపించవచ్చు. అన్ని సీజన్లలో ఒకే రకం సౌందర్యసాధనాలు వాడకూడదు […]

పియర్సింగ్ ఆర్టిస్ట్ సిమ్మి

సిమ్మి అలియాస్ కుసుమ కుమారి హైద్రాబాద్ కు చెందిన మొదటి పియర్సింగ్ ఆర్టిస్ట్ సిమ్మి. టాటూ ఒక వ్యాపారం కాదు ఇదొక ఆర్ట్. అలాగే పియర్సింగ్ చెవులకు కమ్మలు కుట్టినట్లు శరీరంలో అక్కడక్కడ స్టోన్స్ ని సర్జరీతో అతికించే కళలో నిష్ణాతురాలు. ఇంక్ క్రాఫ్ట్ టాటూ స్టూడియోలో టాటూ ఆర్టిస్ట్ గా శిక్షణ తీసుకొంది ప్రేమకు మానాల్ని చూపించేందుకు టాటూ లు వేయించుకొంటారు. వాళ్లకు సందేశం సరిగ్గా స్పందించేట్లుగా కొత్త డిజైన్ సొంతంగా వేస్తాను అంటుంది సిమ్మి […]

వెలుగు వైపే ఆమె ప్రయాణం

భారత దేశపు తొలి అంధ మహిళా ఐఏఎస్ అధికారి ప్రంజల్ బలమైన కంటిచూపుతో జన్మించిన ప్రంజల్ ఆరేళ్ళ వయసులో చూపు పోగొట్టుకున్నది తల్లిదండ్రులు ఆమెను మహారాష్ట్ర లో అంధుల కోసం ప్రత్యేకంగా నడిపే కమల మెహతా స్కూల్ లో చేర్చారు .సివిల్ సర్వీస్ ప్రంజల్ డ్రీమ్ ఆమె 2015 లో యు పి ఎస్పి పరీక్ష రాసింది ఐ ఆర్ ఏ ఎస్ లో ఉద్యోగం సంపాదించింది 2017 లో మరోసారి పరీక్ష రాసి ఐఏఎస్ కు అర్హత సాధించిన […]

ప్రతిదీ  పర్ ఫెక్ట్

నేను చాలా పర్ ఫెక్ట్ పలు వస్తువులు పర్ ఫెక్ట్ ప్లేస్ లో ఉండాలి. నాకు నీట్ అండ్ క్లీన్ అన్నమాట అసలు మా అమ్మే ముంబై వచ్చి బీరువా ఇల్లు చూసి ఆశ్చర్య పడుతుంది. అసలింత ఆర్గనైజ్డ్ గా ఎలా ఉన్నావే అంటుంది ప్రగ్యా జైస్వాల్ జ్యోతిష్యం నమ్ముతాను. నాది మకర రాశి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ప్రతి పని పద్ధతిగా చేస్తారు. అట్లాగే భక్తి ఎక్కువే దేవుణ్ణి ఎంతో విశ్వసిస్తా. పూజలు అవీ […]

ఇవి ఇలా తింటే ఆరోగ్యం

ఇవి తరచుగా తింటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. వారానికి నాలుగు సార్లు ఆకుకూరలు తినాలి అలసందలు మొదలైనవాటిని వారానికి రెండుసార్లు స్నాక్స్ లాగా తినాలి. వారానికి మూడుసార్లు తెల్ల నువ్వులు ఉండలు,పల్లీల ఉండలు బెల్లంతో తయారు చేసినవే తినాలి. నెయ్యి బెల్లం కలిపిన సున్నుండలు చాలా మంచిది. ఆయా కాలాల్లో దొరికే పండ్లను వారానికి రెండుసార్లు తినాలి.నానబెట్టిన బాదం పప్పు స్నాక్ లాగా తినాలి. పరిమితంగా జీడిపప్పు, పిస్తా పప్పు తినాలి. అవన్నీ వేడిగా ఉన్నప్పుడే […]

కర్ణాటకలో గరుడా

ఉగ్రవాదంపై వ్యతిరేక పోరుకు కర్ణాటక రాష్ట్రం ఆల్ ఉమెన్ టీమ్ ని సిద్ధం చేసింది దాని పేరు గరుడ. ఆ రాష్ట్ర సెక్యూరిటీ విభాగం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సహకారంతో ప్రభుత్వం మొదటి విడతగా 16 మంది అమ్మాయిలతో గరుడా టీమ్ ఎంపిక చేసింది.వీరంతా యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ లో పాలుపంచుకునేందుకు రోజుకి 14 గంటల పాటు శిక్షణ తీసుకుంటున్నారు.శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు స్ట్రెస్ మేనేజ్మెంట్ తోనూ తర్ఫీదు తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం వీరంతా యాంటీ […]

అన్షు జమ్సేన్పా

41 సంవత్సరాల అన్షు జమ్సేన్పా ఒక సీజన్ లో రెండుసార్లు పర్వతారోహణ చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచారు.ఈ సాహస చేసేందుకుగాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని దిరాంగ్ ఆమె స్వస్థలం . ఇద్దరు పిల్లలు తల్లి అయినా అన్షు 2009లో పర్వతారోహణ ప్రారంభించింది.ఆమె తండ్రి ఇండో టిబెట్ సరిహద్దుల్లో ఒక పోలీస్ అధికారి తల్లి నర్స్. ఎవరెస్ట్ ను జయించేందుకు అన్షు రన్నింగ్, జిమ్, యోగా ఎంచుకుంది ఏరోబిక్స్ నేర్చుకుంది మొదటి చిన్నచిన్న […]

నీళ్లు తక్కువ అవసరం

ఇప్పుడు అపార్ట్ మెంట్స్ లో కూడా కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. కుండీలలో పెంచే మొక్కలకు నీళ్లు తక్కువ అయితే ఎండిపోతాయి ఎక్కువ అయితే కుళ్లి పోతాయి. వేడి అధికంగా ఉండే మొక్కకు పోసే నీళ్ళు ఎక్కువగా ఉండాలి. బాల్కనీలో ఉండే మొక్కలకు నీళ్ళు రెండు రోజులకొకసారి పోయలి కుండీలో ని మట్టిలో పెంకులు ఇసుక మట్టి కలిపి పోస్తే నీళ్ళు ఎక్కువగా పిలుచుకొని తేమగా ఉంటాయి. మొక్కలకు తెగుళ్ళు పురుగు పట్టకుండా ఆవాలను నీళ్లతో కలిపి బాగా […]

అస్సలు ఊహించలేదు

యాక్టింగ్ అంటే నాకు ఇష్టమే కానీ ఇప్పుడు సైకాలజీ చదువుకుంటున్నాను కదా ఇప్పుడే ఎందుకీ సినిమాలు అనుకున్నాను కానీ కథ విన్నాక ఈ సినిమా చేయాలనుకున్నాను .ఇంతకు ముందు కొన్ని యాడ్స్ చేసిన అనుభవం మాత్రం ఉంది .నాకు వచ్చిన దాన్ని సహజంగా చేశాను తీరా చూస్తే నా కోసం సోషల్ మీడియా లో ఫ్యాన్స్ క్లబ్ లు కూడా ఉన్నాయని నాకు ఫాన్స్ ఉన్నారని తెలిసి ఎంతో ఆశ్చర్యంగా ఉందొ అంటుంది కృతి శెట్టి. వైష్ణవ్ […]

తులసి బెస్ట్ మెడిసిన్

ఎన్నో ప్రయత్నాలు చేసినా చుండ్రు సమస్య వదలకుండా ఉంటుంది. ఈ చిట్కా వైద్యంతో జుట్టు కుదుళ్లు బలంగా అవ్వటం తో పాటు చుండ్రు పోతుంది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తులసి చుండ్రును పోగొడుతుంది. కొన్ని తులసి ఆకులు తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల ఉసిరి కాయ పొడి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ ను తలకు పట్టించి మర్దనా చేయాలి అరగంట తర్వాత నీళ్లతో […]

ఆష్లే బైడెన్

జిల్,జో బైడెన్ ల కుమార్తె ఆష్లే బైడెన్ సామాజిక కార్యకర్త గా ఫ్యాషన్ డిజైనర్ గా ఆమె వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. స్కూల్లో చదువుతూ ఉండగానే ఒక కాస్మెటిక్ కంపెనీ తమ ఉత్పత్తులను జంతువుల చర్మాలతో తయారు చేస్తుందని  తెలుసుకుని దాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాలు మొదలుపెట్టింది. డాల్ఫిన్ లా పరిరక్షణ కోసం కాంగ్రెస్ సెనేటర్ బార్బరా బాక్సర్ తో కలిసి పని చేసేలా తండ్రిని ప్రభావితం చేశారు దాని ఫలితంగా 1990 లో […]

పాపాయి స్నానం చేస్తున్నారా ?

చిన్న పిల్లలకు స్నానం చేయించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాపాయి పుట్టిన తొలి రోజుల్లో చర్మాన్ని సున్నితంగా ఒత్తిడి లేకుండా చేయండి మర్ధన నింపాదిగా ప్రశాంతంగా చేయాలి. చిన్నారులకు శరీరం మర్దన చేసేప్పుడు ముందు రెండు చేతులు బాగా రుద్దుకుంటే అరిచేతులు వెచ్చగా ఉండి ఆ స్పర్శ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ముందుగా చేతుల గోళ్ళు తీసుకోవాలి లేకపోతే పసిపిల్లల చర్మాన్ని గాయపరుస్తాయి. కొబ్బరి నీటితో ముఖం శరీర భాగాలు మర్దన చేస్తే […]

నేత్ర సౌందర్యం 

దేహంలో ఉండే అవయవాల్లో అతి ముఖ్యమైన కళ్లు నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. కళ్ళకు సంబంధించిన సంరక్షణ తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. పడుకునే ముందర రోజ్ వాటర్ లో కాటన్ ముంచి కళ్ళ చుట్టూ శుభ్రపరచుకుంటే దుమ్ము ధూళి పోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి కనుబొమ్మలకు కనురెప్పలకు రాత్రివేళ ఆముదం రాసి తెల్లవారి కడిగేస్తే ఒత్తుగా అయిపోతాయి. కళ్ళ చుట్టూ తేనెతో మసాజ్ చేస్తే కళ్ల చుట్టూ ఉండే ముడతలు పోతాయి. పచ్చిపాలలో  కాటన్ ముంచి […]

భవ్య లాల్

అమెరికా ఉన్నత పదవికి ఎంపికైన ప్రవాస భారతీయురాలు భవ్యలాల్ ఒకరు. నాసా యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా జో బైడెన్ ప్రభుత్వం ఆమెను నియమించింది. నాసాకు సంబందించిన బడ్జెట్ ఆర్ధిక అంశాలపై కూడా సీనియర్ సలహా దారుగా భవ్య లాల్ పని చేస్తారు. నాసా భవితవ్యం పై బైడెన్ ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీం లో భవ్య సభ్యురాలిగా పనిచేశారు. భవ్య న్యూక్లీయార్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీలు చేశారు.

గుగులోతు సౌమ్య

నిజామాబాద్ జిల్లా రెంజల్‌ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన గుగులోతు సౌమ్య భారత్ ఫుట్ బాల్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి తొలి మహిళా క్రీడాకారిణిగా ప్రాతినిథ్యం వహించనుంది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీకి ఆమె ఎంపికయింది సౌమ్య తండ్రి గోపి ఉపాధ్యాయుడు తల్లి ధనలక్ష్మి గృహిణి చైనా లో జరిగిన అండర్ సెక్షన్ పోటీల్లో ఆమె అత్యధిక గోల్స్ తో టాపర్ గా నిలిచింది తెలంగాణ ఉమెన్స్ లీగ్  లోనూ ఆమే టాపర్.

మొటిమలు పోతాయి

మొటిమలు దద్దుర్లు పోవాలంటే ఈ చిట్కా వాడుకోవచ్చు స్పూన్ సెనగపిండిలో చిటికెడు వంటసోడా పాలు కలిపి మొటిమలపై పది నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. మొటిమల మచ్చలు పడకుండా తగ్గిపోతాయి.అలాగే స్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు స్పూన్ల తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాలు ఆరిపోనిచ్చి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.అలాగే రోజు గ్లాసు టమోటా రసం లేదా క్యారెట్ రసం తాగితే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది రసాయనాలు ఉన్న క్రీమును వాడకుండా ముఖాన్ని […]