October 2020
ఈ మూడింటి మిశ్రమం తో ఫలితం
కొబ్బరి నూనె కండీషనర్ గాను పనిచేస్తుంది అంటారు ఎక్సపర్ట్స్. ఇందులో విటమిన్-ఇ ఇనుము ఉంటాయి. అలాగే ఆముదంలో ప్రొటీన్లు ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు ఉంటాయి.ఈ రెండింటిని కలిపి రాస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.రాత్రి పడుకునే ముందుర ఈ రెంటినీ కలిపిన మిశ్రమాన్ని ఒక చుక్క కనుబొమ్మలకు రాసి చక్కగా మర్దన చేయాలి.ప్రతి రోజు ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. కొబ్బరి నూనె ఆముదం లో అలోవెరా గుజ్జు కూడా కలిపి […]
అయ్యో అలా ఉండలేం
సృష్టి దీక్షిత్ యూట్యూబ్ కమెడియన్.నవ్వొచ్చే సెటైర్ లతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తోంది.తాజాగా ఈమె సృష్టించిన ఒక వీడియోకు ఏడు లక్షల 50 వేల రివ్యూస్ రెండువేల కామెంట్స్ వచ్చాయి ‘ ఉమెన్ ఫైనల్లీ ఆపాలజిస్ట్ ఫార్ ఎవ్రీథింగ్ ‘ అన్న వీడియో రెండు నిమిషాల 30 సెకండ్ల నిడివి గలది మాత్రమే. స్త్రీలు ఎలా ఉంటే బాగుంటుందో, ఆమె ఎలా ఉండకూడదు పురుషుల కు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. అలా పురుషుల అభిప్రాయాలకు తగ్గట్లుగా […]
పాత్రలు శుభ్రంగా ఉన్నాయా ?
సురక్షితమైన నీరు తాగితే ఆరోగ్యం అని మనందరికీ తెలుసు.కానీ వాడే పాత్రల విషయంలో అతి జాగ్రత్త వహిస్తేనే మంచినీళ్లు తాగ గలం.పాత్రలన్నీ శుభ్రపరిచే నీళ్లలో ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి.పాత్రలు ముందుగా శుభ్రం చేయాలి.కడిగేశాక మళ్లీ వేడి నీళ్లలో ముంచి తీయాలి.లేదా శుభ్రం చేసిన పాత్రలను వేడి నీరు పోసిన టబ్ లో లిక్విడ్ సోప్ వేసి కాసేపు నాననిస్తే మిగిలిన మురికి జిడ్డు హానికరమైన బ్యాక్టీరియా తొలగిపోతుంది.తరువాత బాగా రన్నింగ్ వాటర్ లో కడిగేయాలి.ఆ పాత్రల్లో నీళ్లు […]
నోబెల్ వస్తుందను కోలేదు
యాభై రెండేళ్ల కవిత ప్రస్థానంలో 14 సంకలనాలు తీసుకొచ్చారు లూయిస్ గ్లాక్. పులిట్జర్,నేషనల్ బుక్ అవార్డ్ లతో సహా అనేక ప్రతిష్టాత్మిక పురస్కారాలు అందుకొన్నారు సాహిత్వభిమానులకు ఆమె ఒక సెలబ్రెటీ. కనెక్టికట్ లోని యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా చేస్తున్న గ్లాక్. నోబెల్ వస్తుందని ఊహించలేదు అంటోంది అందరితోనూ బాగా కలిసిపోయే తత్వం నాది నా కష్టాలు,సంతోషాలు,విశిష్టమైనవి ఏంకాదు. ఇంటర్యూలు పెద్ద ఇష్టం ఉండదు,కానీ ఒంటరిగా ఉండాలనుకునే మనస్తత్వం మాత్రం నాది కాదు. ప్రచారాల పట్ల నాకు […]
మట్టి పాత్రల వాడకం శ్రేయస్కరం
మట్టి పరిమళం మనకు కొత్త కాదు.పూర్వం మట్టి కొండలే వంట పాత్రలు.ఆ తరువాతే ఇనుము అల్యూమినియం స్టీలు వచ్చాయి.మట్టికుండలో వండిన ఆహారం ఐరన్,ఫాస్పరస్, క్యాల్షియం,మెగ్నీషియం ఖనిజలవణాలు పుష్కలంగా లభిస్తాయి.మూత గట్టిగా పెట్టి వండితే పోషకాలు ఆవిరి కావు. ఉష్ణోగ్రత ఆవిరి అన్ని వైపులా పరచుకుని వంటకం సంపూర్ణంగా ఉడుకుతుంది.కట్టెల పొయ్యి పైన మట్టికుండలో వండిన ఏ పదార్థమైనా రుచిగా పోషక భరితంగా ఉంటుంది. మట్టికి ఉండే క్షార గుణంతో ఆహారంలోని ఆమ్లా గుణాలు నశిస్తాయి. ఆహారం త్వరగా […]
ఫ్యాషన్ రంగంలో ఎంతో ఒత్తిడి
కాలేజీ చదువు పూర్తికాకుండానే ఫ్యాషన్ రంగంలోకి వచ్చాను స్టైలిష్ గా సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే ఒత్తిడి ఎక్కువే కీర్తి సురేష్ రష్మిక, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ క్రీడాకారులు సింధు, శ్రీకాంత్ మొదలైన వాళ్లందరికీ వ్యక్తిగత డిజైనర్గా పని చేశాను.ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమా నిర్మాతగా మారటం వెనక ఆ కృషి ఎంతగానో ఉంది అతి చిన్న వయసు ఫ్యాషన్ డిజైనర్ ని బహుశా నేనే అనుకుంటూ అంటుంది శ్రావ్య వర్మ. ఫ్యాషన్ డిజైనింగ్ లో తనదైన […]
ఇవే ఉత్తమ లక్షణాలు
మనుష్యులలో కొన్ని ఉత్తమ లక్షణాలు ఉంటాయి.వాటిని కోరి నేర్చుకోమంటారు జ్ఞానులు.ఈ మాటలు మాట్లాడితే మనకు అయిష్టం అనిపిస్తుందో, ఏ పని మనకు బాధ కలిగిస్తుందో,అలాంటివి ఇతరుల కు ఎప్పుడు చెయ్యకూడదు కోపం ద్వేషంతో,ఎవ్వరినీ దూరం చేసుకోకూడదు. కళ్ళకు కనిపించినవన్నీ కావాలని అనుకోకూడదు.సభ్యతతో ప్రవర్తించాలి.ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అర్హులైన వారిని గౌరవించాలి. మర్యాద తో మాట్లాడాలి దానంగా ఇస్తే తిరిగి తీసుకోకుండా ఉండాలి అలాగే ఇచ్చిన దానాన్ని పదిమందికి ప్రచారం చేసుకోకూడదు దీనివల్ల దాన ఫలం కూడా […]
వాకింగ్ మెడిటేషన్
నడుస్తూ మెడిటేషన్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు అధ్యయనకారులు వాకింగ్ చేస్తూ ఉంటే శారీరక మానసిక చురుకు దానాలు ఇనుమడిస్తాయి.ఇంతటి ప్రభావం గల వాకింగ్ చేస్తూనే మెడిటేషన్ చేస్తే మానసిక వ్యాయామం సాధ్యపడుతుంద.ఇలా చేసేందుకు సీరియస్ గా ప్రయత్నం ఉండాలి.సాధారణంగా నడుస్తూ ఇతర ఆలోచనలు లేకుండా నడిచే పాదాల పైన దృష్టి కేంద్రీకరించాలి.ఆ ఏకాగ్రత సాధిస్తే మూడు మెరుగవుతుంది. దైనందిన జీవితంలో ఏకాగ్రత పెరుగుతుంది దీన్ని నెమ్మదిగా సాధన చేయాలి.
ప్రపంచంలోనే పెద్దది
ఈ ప్రపంచంలో అతి పెద్ద ఇల్లు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది ‘కార్ల్ మార్క్స్ హాఫ్’ అనే నివాస సముదాయం. ప్రపంచంలో ఇదే అతి పెద్ద కిలోమీటరు విస్తీర్ణంలో ఉండే ఈ ఇంటిని 1927లో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత చాలా మంది నివాసాలు లేవు. వారికి ఆశ్రయం కల్పించటం కోసం ఈ ఇల్లును కట్టుకుంటూపోయారు.పైకప్పు ఒక్కటే కానీ… లోపల మాత్రం గోడలతో వేరు చేస్తూ 1382 నివాసాలను నిర్మించారు.లోపల ట్రామ్ […]
తొలి పానీయం
ఉదయాన్నే మొట్టమొదటి రుచిచూసే తొలి పానీయం రోజంతా ప్రభావం చూపిస్తుంది అంటున్నాయి అధ్యయనాలు.గోరువెచ్చని నీళ్లలో సగం నిమ్మచెక్క పిండుకొని తాగితే రోజంతా తాజాగా చురుగ్గా ఉంటుంది.శరీరం హైడ్రేషన్ లో ఉండేందుకు జీవక్రియ సక్రమంగా సాగేందుకు నిమ్మ సహకరిస్తుంది.లివర్ ను క్లెన్స్ చేస్తోంది. నీరు శరీరం నుంచి విషతుల్యాలను వెలికి నెట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది రాత్రంతా మెంతులు నీళ్ళలో నానేసి ఉదయాన్నే వట్టి ఖాళీ కడుపుతో తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారికి […]
గంటలో 33 రకాల వంటలు
10 సంవత్సరాల సాన్వి ఏం ప్రజిత్ ఒక గంటలో 33 రకాల వంటలు తయారు చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్,ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ప్రజిత్ బాబు, మంజిమా ల కూతురు సాన్వి.సాన్వి తల్లి మంజిమా స్టార్ షెప్. సాన్వి తయారు చేసిన పదార్థాల్లో ఇడ్లీ మొక్కజొన్న పన్నీర్ టిక్కా, శాండ్విచ్,చికెన్ రోస్ట్ మొదలైనవి ఉన్నాయి.సాన్వి కి సొంత యూట్యూబ్ ఛానల్ కూడా […]
ఇవి మాంసపు పండ్లు
లండన్ లో మీట్ ఫ్రూట్ వంటకం తెలియని వాళ్లు ఉండరు.పైకి చూస్తే కమల చెర్రీ టమాటో లాగా కనిపిస్తాయి కానీ లోపల బాతుల కాలేయం తో చేసిన డెసర్ట్ ని వేరు వేరు పండ్ల రుచి తో కలిపి చేసిన వంటకాన్ని కూరుస్తారు.పదార్థాన్ని వండాక దాన్ని చూసేందుకు పండు లాగా ఉండేలా తయారు చేస్తారు. ఈ మీట్ ఫ్రూట్ ని తినేందుకు ప్రముఖ షెఫ్ హెస్టవ్ బ్లూమెంథాల్ కు చెందిన డిన్నర్ రెస్టారెంట్ కి భోజనప్రియులు తప్పనిసరిగా […]
రూపాయికే భోజనం
ఢిల్లీలోని నాంగ్లోయ్ భూటోవాలి గల్లీ లో ఉన్న శ్యామ్ రసోయి పేరు తెలియని వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండరు. 51సంవత్సరాల పర్వీన్ కుమార్ ఒక్క రూపాయి మాత్రం తీసుకొని రోటి, అన్నం, కేసరి, పన్నీర్, పప్పు ఉండే భోజనం పెడతారు.ప్రతిరోజు ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఈ రూపాయి భోజనాన్ని 2000 మంది వరకు తింటారు. పార్సల్స్ కట్టి ఆటోల్లో ఇతర ప్రాంతాల్లో పంచుతారు.మొత్తం ఇదంతా విరాళాలతోనే నడుస్తోంది అంటారు కుమార్ గోయిల్.
తేనె వంటి బతుకు తీపి
ఒక చక్కని కథ ఉంది.ఒక మనిషిని సింహం తరుముకుంటూ వస్తుంది.అతను పరిగెడుతూ ఒక పాడుబడిన బావి లోకి జారి పోతూ చేతికి అందిన ఒక బలమైన వేరు అందుకొన్నాడు.అది మర్రి చెట్టు వేరు బావిలోకి వంగిన ఆ మర్రి కొమ్మ మీద ఒక విషసర్పం విష సర్పం నాలుక జాపుపోతోంది మనిషి బరువుకు కొమ్మ జారిపోతోంది. తలెత్తిన ఆ మనిషి నోట్లో కి ఒక తేనె చుక్క రాలి పడింది.ఎత్తుగా ఉన్న ఆ చెట్టు కొమ్మ పైన […]
సూర్య కిరణ చికిత్స
సూర్య కిరణాలు శరీరానికి ఇంట్లోకి నేరుగా సోకే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. రక్తంలో అత్యధిక కొలెస్ట్రాల్ ను, స్టెరాయిడ్ హార్మోన్ల,పునరుత్పత్తికి అవసరం అయ్యే సెక్స్ హార్మోన్ల గా మార్చే శక్తి ఈ కిరణాలకు ఉంటుంది.సూర్యకిరణాలు రోజులో ఒక్కసారి సోకిన రక్తపోటు తగ్గుతుంది. పిల్లల్లో ఎముకలు ఎదుగుదలకు అవసరం అవుతుంది.సూర్యకాంతి డిప్రెషన్ తగ్గిస్తుంది.సోరియాసిస్ మొటిమలు ఎగ్జిమా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సంబంధిత వ్యాధులకు సూర్యకిరణాలు చక్కని చికిత్స కూడా.ఉదయం సాయంత్రం కొంతసేపయిన సూర్యుని లేలేత కిరణాల స్పర్శను […]
క్రిష్టల్ టీ షర్ట్స్
వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతో మంది ఇళ్లలోంచే వర్క్ చేస్తున్నారు.టీ షర్ట్ లతో నే రోజు గడిచిపోతోంది క్యాజువల్ లుక్ మారుపేరైన టీ షర్ట్ లు మిల మిల లాడే గ్రాండ్ లుక్ తెప్పించారు డిజైనర్స్. నల్లని టీ షర్ట్ లకు సప్త వర్ణాల కాంతిని విరజిమ్మే స్వరోవ్స్కి క్రిస్టళ్ళు, రాళ్లు జోడించారు పువ్వులు, తీగలు, పక్షులు మొత్తం రాళ్లతోనే సృష్టించారు. సీతాకోక చిలుకలు, నెమళ్ళు ఫ్యాషన్ ఐకాన్లు నిలిచిన హృదయకారాలు, స్మైలీ డిజైన్ లు సంస్కృతిని […]
కష్టం విలువ తెలియాలి
చూసిన ప్రతి వస్తువు తమకు కావాలని కోరుకుంటారు. వెంటనే కొని ఇవ్వమని మారాం చేస్తారు. కానీ పిల్లలకు అలా కొనేసి వెంటనే చేతిలో పెట్టకండి .కష్టపడి పని చేస్తేనే కోరుకున్న వస్తువు చేతిలో పడుతుంది అన్న ఆలోచన వాళ్ళ మనసులో కలిగేలా చేయండి అంటారు చైల్డ్ సైకాలజిస్ట్ లు.మంచి మార్కులు తెచ్చుకుంటే చిన్నచిన్న పనుల్లో సాయం చేస్తే గిఫ్ట్ గా ఏదైనా ఇచ్చినా అది కూడా కష్టానికి తగిన ఫలితం లాగే ఉంటుంది. పిల్లలకు కష్టపడే తత్వాన్ని […]
వేల మందికి పునరావాసం
చిన్నతనం లోనే దేవదాసీగా మార్చారు కుటుంబీకులు 2006 లో ప్రభుత్వాధికారులు ప్రభుత్వ సంరక్షణగా కేంద్రానికి తరలించారు.తర్వాత అన్యాయ్ రహిత జిందగీ (అర్జ్ ) అనే స్వచ్చంధ సంస్థలో చేర్చారు. అక్కడ నుంచి నాలాగా చీకట్లో బతికే మహిళలను బయటికి తెచ్చేందుకు పనిచేశాను. అర్జ్ సహకారం తో గోవాలో స్విఫ్ట్ వాష్ లాండ్రీ (Swift Wash Laundry) ప్రారంభించాను. వేశ్య గృహాల నుంచి బయటికి వచ్చిన వాళ్లకు ఇందులో ఉపాధి దొరుకుతోంది అంటోంది భీమవ్వ ఛాల్వాడీ. ఇక్కడ 500 […]
అలసట తీర్చే బీట్ రూట్ డ్రింక్
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బీట్ రూట్ జ్యూస్ తో శక్తి ఉత్సాహం వస్తుంది.అంటున్నారు డాక్టర్లు ఈ జ్యూస్ కోసం బీట్ రూట్ క్యారెట్ గుప్పెడు కొత్తిమీర సగం కప్పు దానిమ్మ గింజలు, కరివేపాకు, పుదీనా ఆకులు, అల్లం ముక్క, నిమ్మకాయ తీసుకోవాలి వీటన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చెయ్యాలి వడపోసి నిమ్మరసం పిండితే జ్యూస్ తయారైనట్లే.ఈ డ్రింక్ లోని ఫైటో న్యూట్రియంట్స్ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రీ రాడికల్స్ తొలగించి చర్మాన్ని యవ్వనంతో […]
అత్యంత పొడవైన కాళ్ళు
నా కాళ్ళు ఎక్కువ పొడవు ఉండటం ఒక పక్క గర్వం గాను ఇంకోపక్క ఇబ్బందిగా అనిపిస్తుంది.నాకు సరిపోయే దుస్తులు దొరకవు, కారులో కూర్చోలేను,నాకు కావాల్సిన జీన్స్ ప్యాంట్లు కూడా దొరకవు, ఒకటే సంతోషం ప్రపంచంలోనే పొడవైన కళ్ళున్నా టీనేజర్ నేను అంటుంది మాసి కర్రిన్ ఆమె ఎత్తులో సగానికి పైన ఎత్తు ఆమె కళ్ళదే కావటం విశేషం తన పొడవైన కాళ్లతో రెండుగిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకొన్నా ఈ యువతి ఆశయం పొడవైన మోడల్ గా […]
