June 2020
చూసి ఎంచుకోండి
శిరోజాల ఉత్పత్తుల ఎంపిక ఎప్పుడు కష్టమే ,మంచి వాసన చూసేందుకు బావుండటం వంటివే కనబడుతూ ఉంటాయి. కానీ రసాయనాల ప్రభావం గురించి అవగాహన ఉంటేనే ఏ వస్తువు వాడిన జుట్టుని నష్ట పరచకుండా ఉంటుంది.ఏ ఉత్పత్తి అయినా చర్మం మాడు తగలగానే చర్మరంధ్రాలు లోకి వెళ్లి పోతుంది. ఏ.ఎల్.ఎస్ సోడియం సల్ఫేట్ కోకో సల్ఫేట్ షాంపూల్లో నురుగును పెంచుతాయి.ఇవే శిరోజాలను పొడిబార్చుతాయి.వాటిలోనే కఠినత్వం చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంది.ఇలాంటి ఉత్పత్తుల ఆర్గానిక్, సహజ ఉత్పత్తులు ప్రత్యామ్నాయాలు. ఇవి సల్ఫేట్ […]
జుట్టుకు కాకర వైద్యం
కాకరకాయ రసం షుగర్ పేషెంట్లకు ఔషధం గానే కాదు శిరోజాలకి మందుగా ఉపయోగపడుతుంది అంటున్నారు అంటున్నారు ఎక్సపర్ట్స్. కాకరకాయ రసంలో గట్టి పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేస్తే జుట్టు మెరిసిపోతోంది. జుట్టు రాలిపోతుంటే కాకరకాయ రసంలో పంచదార కలిపి ఆ మిశ్రమం జుట్టు లోపలి వరకు బాగా పట్టించి ఓ గంట ఆరిపోయాక తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కాకర రసాన్ని జుట్టు చివర్ల వరుకు పట్టించి ఓ గంట ఆగి గోరు వెచ్చని […]
వక్కలంటే మక్కువ
వక్కలను అదృష్టానికి ప్రతీకలు అంటారు ఇంటికి వచ్చిన అతిథులు వెళ్లిపోయే సమయంలో వారికి ఆకులు వక్కలతో తాంబూలం ఇచ్చి సాగనంపడం అతిధి మర్యాద గా భావిస్తారు. వక్కల్లో ఎన్నో సుగుణాలు ఉన్నాయి కొన్ని ఆయుర్వేద మందుల్లో వీటిని ఉపయోగిస్తారు. వీటిలో ని ఎరికోలిన్ అనే పదార్థం మెదడును ప్రభావితం చేస్తోంది. ఆల్కహాల్ కెఫిన్ తరువాత మానసిక ప్రేరేపిత పదార్థంగా వీటిని చెబుతారు. అందుకే వక్క పొడితినే అలవాటున్న వారు దీన్ని తొందరగా మరిచిపోలేరు.గుండె జబ్బుతో బాధపడే వారికి […]
నెలసరి సమస్య కు పరిష్కారం
నెలసరి నలత వేధిస్తూ ఉంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకోమన్నారు ప్రఖ్యాత న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్.ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలు తప్పకుండా పోతయి అంటున్నారు. రాత్రంతా నీళ్ళలో నానబెట్టిన ఎండు ద్రాక్ష కుంకుమ్ పువ్వు లను పర గడుపున తీసుకోవాలి.ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటల ఆహారం తో పాటు నెయ్యి తీసుకోవాలి. నెలసరి సమయంలో విసిగించే మలబద్ధకం పోవాలంటే గుప్పెడు జీడిపప్పు లేదా వేరుశనగ పప్పు లను బెల్లంతో తినాలి.రాత్రి భోజనం గా […]
ఏ హక్కులు లేవు
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది పేదల మానవ హక్కులను కోల్పోయారు అంటున్నారు మానవ హక్కుల కార్యకర్త డా. లుబ్నా సర్వత్. వలస కార్మికులు జీవించే హక్కు ఆత్మగౌరవం అన్ని పోగొట్టుకున్నారు.వాళ్ల హక్కును బలితీసుకుంది కరోనా కాదు.మన ప్రభుత్వమే బాధితులకు కనీస అవసరాలు తీర్చలేదు.క్వారంటైన్ సెంటర్లు అధిక సంఖ్యలో ఆసుపత్రిల ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం స్పందించలేదు.దీనితో సామాన్య ప్రజల ఆరోగ్య హక్కు మన్నులో కలిసింది. లాక్‌డౌన్ సమయంలో పేదల విషయంలో బాధ్యతాయుతంగా గౌరవంగా వ్యవహరించక పోవడం వల్ల […]
గులాబీలతో అందం
అందమైన గులాబీ పువ్వులు చర్మ సౌందర్యం కోసం కూడా చక్కగా ఉపయోగపడతాయి. గుప్పెడు గులాబీ రేకులు మెత్తగా నూరి చెంచా తేనె,చెంచా పాలపొడి కొంచెం తేనె కలిపి పేస్ట్ లా చేసి దానితో ముఖాన్ని నెమ్మదిగా రుద్దితే మృతకణాలు పోతాయి. చర్మం చక్కగా ఉంటుంది. అలాగే కొన్ని గులాబీ రేకులు పావు కప్పు పెసర పిండి స్పూన్ వట్టివేళ్ళు పొడి, చెంచా పాలు ముఖానికి పూత వేస్తే చర్మానికి తగినంత తేమ అంది ముఖం తాజాగా అనిపిస్తుంది. […]
జీన్స్ వల్లే నలుపు
జీన్స్ వాడే వాళ్ళు తప్పని సరిగా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలని చర్మానికి తేమ అందించే కొబ్బరి బాదం నూనె ను తొడలకు రాసుకోవాలి లేకపోతే తొడలు కాళ్లపైన రాపిడి పెరిగి చర్మం నల్లగా అయిపోతుందని అంటున్నారు కాస్మెటాలజిస్ట్ లు. బిగుతుగా ఉండే ఈ ప్యాంట్లు వేసుకోవటం వల్ల ఒత్తిడి ఎక్కువై వెరికోజ్ వీన్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. జీన్స్ కాస్త వదులుగా ఉన్నవే ఎంచుకోవాలి. ప్రతిసారీ ఉతకాలి ఏడు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు […]
మెడలో మురళి
శ్రీ కృష్ణుని మురళి నాదం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధం బృందావనం, గోపికలు, మురళి నాదం వంటివి సౌందర్యానికి మరో రూపాలుగా మనస్సులో మెదులుతాయి అలాటి చక్కని వేణువుని అందంగా నగల్లో కి తెచ్చారు కళాకారులు ప్రేమకు ప్రతిరూపమైన ఫ్లూట్ ని అందంగా నగల్లో అమరేచ్చేరు. ఆకులు, రుద్రాక్షలు, కృష్ణుని రూపం లో ఈ మురళి చక్కగా ఒదిగిపోయి అద్భుతంగా కనిపిస్తోంది పచ్చని నగల్లో అమ్మాయిలు తమ అభిరుచి ని చేప్పేట్లు గా ఎంచుకునే నగల్లో ఈ ఫ్లూట్ నగలు […]
యాపిల్ గింజల్లో సైనేడ్ ?
యాపిల్, ఖర్జూరం వంటి పండ్ల విత్తనాల్లో ఎమిగ్ డాలిన్ అనే సమ్మేళన పదార్థం ఉంటుందని ఇది మానవ జీర్ణ ప్రక్రియ ఎంజైమ్ల తో కలిస్తే సైనెడ్ విడుదల అవుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ విత్తనం పై గట్టి పూత ఉంటుంది. అంచేత విత్తనం లోపలి పదార్థం జీర్ణప్రక్రియ ఎంజైమ్ తో కలవదు. పొరపాటున ఒక గింజ ఎవరైనా మింగిన ప్రమాదం లేదు. అది మానవ శరీరంలో ఎటువంటి మార్పు చెందకుండా విసర్జితం అయిపోతుంది. కానీ ఎక్కువ […]
మౌనం కాపాడదు !
మీ నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు అంటోంది తమన్నా. ముఖం పై నల్లని అరి చెయ్యి నొక్కుతూ ఉన్నట్లుగా కనిపించే ఒక ఫోటో ని ట్విట్టర్ లో ఉంచింది తమన్నా ఆ ఫోటో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతితో జాత్యాహంకార దాడులకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు రోడ్డెక్కారు ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ. ఇది కేవలం నల్లజాతీయుల సమస్య మాత్రమే కాదు అందరి జీవితాలకు సంబంధించిన విషయం అంటూ ‘ఆల్ లైఫ్స్ మేటర్’ పేరుతో ట్వీట్ చేసింది తమన్నా.
నిజమైన హీరో
మనసున్న మనిషిగా రుజువు చేసుకున్నారు అక్షయ్ కుమార్. భారత దేశంలో గొప్ప దాతృత్వం ఉన్న సెలబ్రిటీ అక్షయ్ కుమార్.కరోనా నివారణ చర్యలు కోసం 30 కోట్ల విలువైన సాయం అందించారు అనే ఫోర్బ్స్ పత్రిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో మన దేశం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి అక్షయ్.కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ ఇబ్బందులు పడుతున్న ఎందరికో సాయం చేసి నిజమైన హీరో గా […]
సమస్తం తాటాకు తోనే
తమిళనాడులో ముఖ్యంగా కారైకుడి, చిట్టినాడ్ ప్రాంతాల్లో తాటిచెట్ల సంఖ్య ఎంతో ఎక్కువ. అక్కడి హస్తకళా వస్తువుల తయారీలో తాటాకే అత్యంత కీలకం.తాటి ఆకులతో ఎన్నో అందమైన వస్తువులను తయారుచేస్తారు. దీన్ని కొట్టాన్ కళ అంటారు. పెళ్లిళ్లలో తెచ్చే చీరలూ మిఠాయిలూ సారెలో వాటిని ఉంచే బాక్సులూ ట్రేలూ మొదలైనవి అన్ని తాటాకుతోనే అల్లుతారు. వర్షాకాలపు గొడుగులు దగ్గర నుంచి పిల్లలు ఆడుకొనే గిలక్కాయలూ బ్యాగ్ లు పూలదండలు. ఇలా తాటితో అల్లిక లెన్నో ఉన్నాయి. లేత తాటాకును […]
ఆమె మా గర్వం
కరోనా లక్షణాలతో వచ్చే వారికి మోనా చికిత్స చేస్తుంది ప్రతి రోజు ఆమె మారథాన్ లో పరుగులు తీస్తోంది అంటున్నారు. ది ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్ ఆయన కూతురు మోనా మిల్ఖా సింగ్ న్యూయార్క్లోని మెట్రోపోలిటియాన్ హాస్పిటల్ సెంటర్ లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ వార్డ్ లో ఫిజిషియన్ గా సేవలందిస్తున్నారు.లక్షల్లో బాధితులు ఆస్పత్రులో చనిపోతున్నారు. నాలుగు లేయర్ల ప్రొటెక్టివ్ సూట్ ధరించి రోజులో 12 గంటల పాటు ఆస్పత్రిలో గడుపుతోంది మోనా మిల్కా సింగ్.ఆమె పని […]
పోషకాల ఖజానా
దోర జామ కాయ పోషకాల ఖజానా అంటున్నారు ఎక్స్పర్ట్స్.రోగ నిరోధక శక్తి మెండుగా ఉండే ఆహారం జామపండు.ఈ పండులో విటమిన్-సి చాలా ఎక్కువ.ఇన్ఫెక్షన్లను రానివ్వదు100 గ్రాములు,లేదా కప్పు పండ్ల ముక్కల నుంచి రోజులో మనకు కావల్సిన దానికంటే ఎక్కువగానే సి- విటమిన్ అందుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఎంతో మేలు చేస్తుంది.ఇందులోని వగరు మ్యూకప్ ను పలుచగా చేస్తుంది.జలుబు దగ్గు తగ్గిపోతాయి. రోజుకు జామ పండు తింటే మంచిది.
అంతకు మించిన అందం
అందరికీ అందమైన ఆధునికమైన నగలు చాలా ఇష్టం.వాటిని భద్రపరిచే పెట్టెలు కూడా అందంగా కనబడితే బాగుంటుందనే ఉదేశ్యంతో తయారు చేశారు డిజైనర్ ట్రింకెట్ బాక్స్ లు.ఇవి కేవలం నగల పెట్టలేక కాదు అలంకరణ వస్తువులు లాగా కూడా ఉపయోగపడతాయి డ్రెస్సింగ్ టేబుల్ పైనా షోకేస్ లోను పెడితే చక్కగా ఉంటాయి. ఎంతో అందమైన రంగుల్లో రంగు రాళ్ళు పొదిగిన ఈ డిజైనర్ ట్రింకెట్ బాక్స్ లు ఎన్నో చక్కని రూపాల్లో కనిపిస్తున్నాయి రథం, పడవ, స్ట్రాబెర్రీ, పూలబుట్ట, నెమలి […]
శిరోజాలకు మెరుపు
ఎండ వేడికి వెంట్రుకలు నిర్జీవంగా అయిపోతాయి అలాటప్పుడు కొబ్బరిపాలతో జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది. పావు కప్పు పచ్చి కొబ్బరి పాలు అరటిపండు స్పూన్ ఆముదం కలిపి మెత్తని పేస్టులాగా చేసి ఆ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఓ అరగంట అలా ఉంచి తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా జుట్టు రాలకుండా ఉంటుంది. కొన్ని కొబ్బరి పాలు గుడ్డులో తెల్లసొన చంచా […]
గిరిజన సేవలో ఉమా ప్రేమాన్
గిరిజనులు పిల్లల కోసం అట్టప్పాడి రెండేళ్ల కిందట ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించింది ఉమా ప్రేమాన్. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషలు నేర్పటం తో పాటు మార్షల్ ఆర్ట్స్, సంగీతం, నృత్యం కూడా బోధిస్తారు.ఇరవై సంవత్సరాలుగా పేదలకు ఎన్నో విధాలుగా ఆధారంగా ఉన్నఉమా ప్రేమాన్ కేరళలో అట్టప్పాడి దత్తత తీసుకున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం మహిళలకు రుణాలు ఇప్పించి టైలరింగ్, విస్తరాకులు కుట్టటం, శానిటరీ నాప్ కిన్స్ రూపొందించటం నేర్పించారు వీ […]
కల నిజమాయే !
లాక్ డౌన్ ఎప్పుడూ లేనంత విశ్రాంతి సమయాన్ని ఇచ్చింది.ఈ సమయాన్ని ఎంతో శ్రద్ధగా ఒక నెరవేరని కలని నిజం చేసేందుకు వినియోగించుకున్నాను అంటుంది నటి ఐశ్వర్య రాజేష్.నాకు మొదటినుంచి డాన్స్ చాలా ఇష్టం.క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని కలలు కనేదాన్ని.చదువు ఇంకా చిన్న ఉద్యోగాలు చేయటంతో అది సాధ్యం కాలేదు తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక డాన్స్ నేర్చుకోవడం కాలే అనుకొన్నా ఇంతలో ఈ లాక్ డౌన్ పీరియడ్ వచ్చింది. పూర్తి సమయాన్ని నృత్యం నేర్చుకోవటం లోనే […]
ఇది కొత్త సమస్య
కరోనా సమయంలో సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. వర్చువల్ ప్రపంచంలో యువతరం ఎక్కువసేపు గడుపుతోంది. వండిన, తినా,కొత్త డ్రెస్ వేసుకొన్న ఒక పాట పాడిన, పుస్తకం చదివిన అవన్ని సెల్ లో క్లిక్ మనిపించడం సోషల్ మీడియాలో పెట్టటం ఒక లైక్ ల కోసం ఎదురు చూడటం సర్వ సాధారణం అయిపోయింది. కానీ ఈ లైక్ ల కోసం ఎదురు చూడటం సెల్ఫీలు పోస్ట్ చేసి రెస్పాన్స్ కోసం ఎదురు చూసే యువత లో ఈటింగ్ డిజార్డర్స్ […]
ఇకపై అన్ని ఆన్ లైన్ లోనే
కరోనా భయంతో కొనుగోళ్ళు అమ్మకాలు ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే ఎక్కువగా సాగనున్నాయి. ఫ్యాషన్ వీక్ లు కూడా డిజిటల్ బాట పట్టాయి ఈ మధ్య జరిగిన షాంఘై ఫ్యాషన్ వీక్ లో 150 మంది డిజైనర్లు తమ బ్రాండ్ ని ప్రదర్శించారు. ‘ టి మాల్ ‘ వేదికగా ఫ్యాషన్ షో ని ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.అప్పటికప్పుడే చూడండి కొనండి అనే నినాదం తో మొదలైన ఈ షోని 15 […]
