June 2020
వాళ్లు జాగ్రత్త
లాక్ డౌన్ తో పిల్లలు ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. చుట్టుపక్కల పిల్లలతో కూడా కలిసి ఆడుకునే అవకాశాలు చాలా తక్కువే. ఇంట్లోఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటే పరవాలేదు గానీ ఏకైక సంతానం అయితే మటుకు తల్లిదండ్రులే స్నేహితులు గా వారితో గడప కాకపోతే కష్టం.పిల్లలకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.సాయంత్రం ఉదయం వారితో చిన్న వ్యాయామాలు చేయించాలి. మధ్యాహ్నం వేళల్లో వాళ్లలో సృజనాత్మకత పెంచే పనులు అప్పగించాలి బొమ్మలు వేయడం, రంగులు నింపటం, బొమ్మలు చెయ్యటం, చదరంగం వంటి పనులు […]
స్వాంతన నిచ్చే నిమ్మ గడ్డి
నిమ్మ గడ్డి తో చేసిన టీ తీసుకుంటే జీవక్రియలు వేగవంతం కావడమే కాక జీర్ణకోశానికి సంబంధించిన ఎన్నో సమస్యలు పోతాయి అంటున్నారు డాక్టర్లు.చక్కని పరిమళం వెదజల్లే నిమ్మగడ్డి ఒత్తిడి తగ్గిస్తుంది హాయిగా నిద్ర పోయేలా చేస్తుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధికారక ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సాయపడతాయి.ఇది క్రిమి నాశినిగా పనిచేస్తుంది నోటి ఇన్ఫెక్షన్లు రానివ్వదు.దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది నిమ్మగడ్డి లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు […]
పోషకాలనందించే గింజలు
సాధారణంగా తియ్యగా ఉండే పాయాసానికి కూడా డ్రైఫ్రూట్స్ చేరిస్తేనే అంతులేని రుచి వస్తుంది.పోషకాలు పుష్కలంగా ఉండే డ్రైఫ్రూట్స్ ని తప్పనిసరిగా ప్రతి రోజూ ఆహారంలో కలిపి తీసుకుంటే ఆరోగ్యం.పిస్తాలు, విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి.అధిక రక్తపోటు నుంచి కాపాడతాయి ఈ పప్పులు.అలాగే బాదం శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తుంది.మంచి కొవ్వు పెంచుతోంది మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.గ్లూకోజ్ ఉత్పత్తి పెంచుతుంది.మెగ్నీషియం చాలా తక్కువ అలాగే వాల్ నట్స్ లో కూడా పుష్కలంగా పీచు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ […]
మెట్టే ఫ్రెడరిక్సన్
ముందు చూపు చాకచక్యం తో మహిళా నేతలు కరోనా సమయాన్ని సమర్థవంతంగా దాటుకొచ్చారు.అనారోగ్యం భయం నుంచి విముక్తి పొంది ఏప్రిల్ 15 వ తేదీన బడులు తెరిచిన తొలి యూరోపియన్ దేశంగా పేరు తెచ్చుకుంది డెన్మార్క్.ఈ విజయానికి కారణం ప్రధాన మంత్రి మెట్టే ఫెడ్రిక్ సెన్ ఆలోచన ,దాన్ని ఆచరణలో పెట్టిన విధానం మాత్రమే, డెన్మార్క్ లో ఫిబ్రవరి 27న తొలి కరోనా కేసు నమోదయ్యింది.మార్చి 11న తొలి కరోనా మరణం.మార్చి 13 నే లాక్ డౌన్ […]
ఘాటైన కారానికి అందాల రంగులు
భారతీయ వంటల్లో కారం లేని కూర ఉండదు మిర్చి లో వేల రకాలున్నాయి. కానీ అన్నింటి తోనూ కారం తయారు చేయరు. మనదేశంలో గుంటూరు, బెంగళూరు మిర్చి, కాశ్మిరీ రెడ్ చిల్లి శంకేశ్వరి వంటి రకాలు కారం కోసం వాడతారు. హంగరీ లో తియ్యగా ఉండే బెల్ పెప్పర్ రకాలతో కారాలు తయారు చేస్తారు. దీన్ని ప్యాప్రికా అంటారు. జాతీయ అంతర్జాతీయ షెఫ్ లు కాశ్మీరీ కారాన్ని వాడతారు ఇది ఎంతో ప్రకాశవంతమైన రంగులు, తక్కువ […]
Lion 2016 సినిమా
లూక్ డేవిస్ రాసిన A Long way Home ఆధారంగా తీసిన సినిమా ఇది. ఐదేళ్ల సారో అన్న పిల్లవాడు తప్పిపోయి ఆర్ఘనేజ్ కి చేరుతాడు. అతన్ని ఒక ఆస్ట్రేలియన్ దంపతులు పెంచుకొంటారు. 20 ఏళ్ల తర్వాత సారో వాళ్ళ తల్లితండ్రుల కోసం గూగుల్ సర్చ్ చేసి,వెతికి కలుసుకోవటం ఈ సినిమా కథ సారో అన్న పేరు గుర్తించుకొన్నాడు కానీ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఈ చక్కని సినిమా ఆస్కార్ లో ఆరు […]
కార్టిన్ జాకోబ్స్డాట్టిర్
సంక్షోభ సమయాన్ని ఉమ్మడిగా ఎదుర్కొందాం కాసేపు మన ఈగో పక్కన పెడదాం. వైద్యులు, వైరాలజిస్ట్ ల సలహాతో కరోనా ను కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు ఐస్ ల్యాండ్ ప్రధాని కార్టిన్ జాకోబ్స్డాట్టిర్ యూరప్ లో అన్ని దేశాల కంటే అతి తక్కువ కరోనా మరణాలు రేట్ ను నమోదు చేసుకుంది ఐస్ ల్యాండ్. వేగవంతంగా కరోనా పరీక్షలు చేయడం కోసం డి కోడ్ జెనిటిక్స్ అనే బయో ఫార్మా కంపెనీ లు మార్చిలోనే టై ఆఫ్ పెట్టుకోంది […]
జసిండా ఆర్డెర్న్
కరోనా పై యుద్ధం కాదు,కలిసి కట్టుగా నిర్ములిద్దాం అంటూ న్యూజీలాండ్ ప్రజల్లో ఆత్మస్థయిర్యం నింపింది ఆదేశ యువ ప్రధాని జసిండా ఆర్డెర్న్ కోవిడ్ -19 ను పూర్తిగా అరికట్టిన,జీరో కేసులున్న దేశంగా న్యూజీలాండ్ చరిత్రకెక్కింది. దేశంలో తోలి వంద కేసులు రిజిస్టర్ కాగానే ‘గో హార్డ్ అండ్ గో ఎర్లీ’ అంటూ కఠినమైన లాక్‌డౌన్‌ను ప్రకటించింది ప్రధాని జసిండా. కరోనా పరీక్షలు వేగవంతం చేయించింది. విదేశాలతో పోలిస్తే అత్యధికంగా మూడు లక్షల కరోనా టెస్ట్ లు చేసిన […]
అలా వదిలేస్తే ప్రమాదం
కోవిడ్ -19 వ్యాప్తి భయంతో శుభ్రత పట్ల శ్రద్ధ అందరికీ ఎక్కువైంది.పాదాలు శుభ్రంగా కడుక్కొంటూ ఉంటాము కానీ పాద రక్షలు బయటే వదిలేస్తాము. వాటిని వెంటనే గాలి చొరబడనీయకుండా స్టాండ్ లో పెట్టేస్తే అపటికే చెమట తో తడిగా ఉన్న పాదరక్షల పైన ఫంగస్ విస్తరిస్తుంది. మార్కేట్ లో డిస్పోజబుల్ వెట్ వైప్స్ దొరుకుతున్నాయి. బయట నుంచి రాగానే ఈ వైప్ తో పాదరక్షల లోపల బయట శుభ్రం చేస్తే వ్యాధికారిక క్రిములు నశిస్తాయి. అల్ట్రా వయొలెట్ […]
‘సంతోష్ దేశ భక్తుడు ‘
దేశ భక్తుడి ని కన్నా అదృష్టం నాది. కొడుకు చని పోయాడని బాధగా ఉన్న దేశ రక్షణ కోసం,నా కొడుకు ప్రాణాలు వదలటం నాకు దక్కిన ఓదార్పు అంటున్నారు,గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ లో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కు మళ్ల మంజుల దేశానికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదనేవాడు సంతోష్. ఐదో తరగతి వరకు సూర్యాపేటలో చదువు కొన్నాడు. ఆరు నుంచి కోరుకొండ సైనిక్ స్కూలు ఆ తర్వాత ఎన్ […]
డోలక్ కే గీత్
హైద్రాబాద్ కే ప్రత్యేకమైన ఉర్దూ జానపద గీతాలకు మళ్ళి ప్రాణం పోసింది హఫీజా అపా… గతంలో ఇంట్లో ఏ శుభ కార్యం జరిగిన డోలక్ కే గీత్ తోనే ప్రారంభం కావాలనుకొనేవాళ్ళు. ఈ దక్కనీ సంగీతం ఇప్పుడు కనుమరుగై పోయింది. హైద్రాబాద్ లోని యాకుత్ పురా లో పుట్టి పెరిగింది హఫీజా. చిన్నప్పటి నుంచి డోలక్ కే గీత్ నేర్చుకొంది. ఎంతో కాలం కుటుంబ బాధ్యతలలో డోలక్ ను అవతల పెట్టిన హఫీజా పెద్దయ్యాక,తనకు తోడుగా ఇద్దరు […]
మెంతితో మెరుపు
మెంతుల్లో అధిక మోతాదులో ప్రోటీన్,నికోటిసిన్ లెసిథిన్ పొటాషియం లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడేవి. నాన పెట్టిన మెంతి పిండిలో కొబ్బరి పాలు కలిపి తలకు ప్యాక్ వేసుకొంటే జుట్టు మెత్తగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ జుట్టు చక్కగా ఎదిగేందుకు సాయం చేస్తుంది. పావు కప్పు మెంతులు నానపెట్టి మెత్తగా రుబ్బి దానికి పాలపొడి,పెరుగు కలిపి పేస్ట్ లా చేసి మొహానికి ప్యాక్ వేసుకోవాలి అరగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మం పై ఉండే […]
ఇదే మంచిది
కరోనా వ్యాపించకుండా సోషల్ డిస్టెన్స్ కంటే సోషల్ బబుల్స్ విధానం తోడ్పతోందని పరిశోధనలు చెబుతున్నాయి సామాజిక దూరం పాటిస్తూ ఎక్కువ మంది కలిసే విధానం కంటే తక్కువ మందికే పరిమితమై మసలు కునే విధానం ఎక్కువ ఫలితాలు చూపెడుతోందని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇతరులను కలుసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా నియంత్రించుకోవాలి .ఒక పక్క సామాజిక దూరం పాటిస్తూ నలుగురితో కలిసి ఉండే విధానం అనుసరించాలి. ఇలా చేస్తే సోషల్ ఐసోలేషన్ తో తలెత్తే దుష్పరిణామాలు నియంత్రించవచ్చు.చుట్టు పక్కల ఉండే కొద్ది […]
మెరుపు నిచ్చే పెసరపిండి
టాన్ లేదా మొహంపై నలుపు పేరుకుపోవటం చాలా మంది సమస్య పెసర పిండితో ఈ సమస్యను పోగొట్టవచ్చు.పెసరపిండిలో గులాబీ నీరు, రోజ్ ఆయిల్, పంచదార కలిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.పావుగంట తర్వాత తడి చేతులతో మృదువుగా రుద్ది కడిగేయాలి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పోతుంది. పెసర పిండి, తేనె, పెరుగు ప్యాక్ తో మొహం పై జిడ్డు పోతుంది. అలాగే పెసరపిండిలో గులాబీరేకులు ,పాలు కలిపి పేస్ట్ లాగా […]
ఫిట్నెస్ కోసం ఇంటి పని మేలు
ఇప్పుడున్న వాతావరణం,కరోనా నేపథ్యంలో ఫిట్నెస్ కోసం జిమ్ లకు వెళ్లటం సహవాసం చేయటమే.ఇంట్లో పని తోనే కేలరీలు కరిగించుకోండి అంటున్నారు నిపుణులు.ఏ పని చేస్తే ఎన్ని క్యాలరీలు కరిగిపోతాయో లెక్క చెబుతున్నారు. ఇంట్లో మూల మూలలా ఉన్న దుమ్ము దులపటం ఒక రకంగా స్ట్రెచింగ్ లాంటిది దీనితో కండరాలు దృఢంగా అవుతాయి .ఈ పని చేస్తే గంటకు 166 కేలరీలు ఖర్చవుతాయి. ఇల్లు వుడిస్తే భుజాలు అటూ ఇటూ తిప్పాలి ముందుకు వంగి పని చేయాలి ఇలా […]
వర్షాలు వస్తున్నాయి జాగ్రత్త
వర్షాలు మొదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కూడా ఈ వాతావరణం కారణం అవుతుంది. ప్రస్తుత సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ఇతర క్రిములు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఉంది. ఈ కాలంలో ఈగలు, దోమలు బాధ చాలా ఎక్కువ .ఇవి దగ్గరకు రాకుండా చూసుకోవాలి. చేతులు పూర్తిగా కప్పేలా ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి. ఇంటిలోపల బయట చుట్టు పక్కల నీళ్ళు నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి చల్లదనం తేమ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది కాబట్టి శరీరం తడిలేకుండా […]
ఎందుకైనా మంచిది
ఒక్కసారి కరోనా వస్తే మళ్ళీ మళ్ళీ వస్తుందా ?రాధా అన్న ప్రశ్న ప్రతి చోటా తలెత్తుతోంది .ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాలు వైరస్ మన శరీరంలో యాంటీ బాడీలు అడ్డుకుంటాయనే చెబుతున్నాయి .సాధారణంగా చికెన్ ఫాక్స్ ,మజిల్స్ మొదలైన వైరస్ ఇన్ఫెక్షన్ కు శరీరం గురవుతాయి. ఆ వ్యాధి మరోసారి సోకకుండా శరీరంలో యాంటీబాడీస్ తయారై రక్షణ కల్పిస్తాయి అయితే ఫ్లూ, డెంగ్యూ జలుబు వంటి వైరస్ లు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి .అంటే శ్వాసకోశ […]
చర్మం కాంతివంతం
ఎండ వేడికి చర్మం కమిలిపోవడం చెమట వల్ల జిడ్డుగ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సరైన జాగ్రత్త తీసుకోకపోతే ట్యాన్, మొటిమలు సమస్య వస్తుంది. అలాంటి సమయంలో పుచ్చకాయ రసం స్వాంతన ఇస్తుంది. పుచ్చకాయ రసం మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఒక టీ స్పూన్ బార్లీ పొడి లో ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పట్టించి ఆరిపోయాక శుభ్రం చేస్తే ఎండదెబ్బకు కమిలిన […]
Merku Thodarchi Malai
మెర్కు తోడార్చి మలై (పడమటి కనుమలు) తమిళ సినిమా. మున్నార్ కొండల పై ఉండే ఏలక్కాయి కూలీల జీవిత చిత్రం ఈ కథ. రంగస్వామి అనే కూలీ ఆ కొండల్లో ఒక బారెడంత అయినా పొలం కొనుక్కోవాలి కష్టపడి డబ్బు కూడా పెడతాడు అప్పు చేసే ఏలకుల బస్తా కొంటాడు. గాలికి ఆ బస్తా కొండ మీద నుంచి జారి పడి పోతుంది.అధిక అప్పులు,వడ్డీలతో రంగస్వామి తను కలలు కని కొనుక్కున్న పొలంలోనే కూలీగా చేరటం కథ.ఒక […]
తప్పక చూడదగ్గ పంచాయత్ (వెబ్ సిరీస్ )
అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ ని ఈ కాలపు మాల్గుడి డేస్ గా వర్ణిస్తున్నారు విమర్శకులు ఢిల్లీలో బీటెక్ చేసిన అభిషేక్ పార్టీ పంచాయత్ ఆఫీస్ఉద్యోగిగా ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలో పూలేరా అన్న చిన్న ఊర్లో అవకాశం వచ్చింది ఆ మారుమూల పల్లెల్లో అభిషేక్ చూసిన జీవితం పంచాయత్ అత్యంత సహజమైన నిజమైన పల్లె సౌందర్యం చూడవచ్చు నటుడు రఘువీర్ యాదవ్ సర్పంచ్ గా నీనా గుప్తా […]
