February 2019
ట్రిమ్ చేస్తే జుట్టు పెరగదు
శిరోజాలను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తుంటే బాగా పెరుగుతాయనుకోవటం కేవలం అపోహా. జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి పెరుగుతోంది కానీ కొసన నుంచి కాదు. కాబట్టి జుట్టు కట్ చేసిన, చేయక పోయినా వెంట్రుకల ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం ఉండదు. కాకపోతే చిట్లిపోయినా కొసల్ని కట్ చేయటం వల్ల నీట్ గా కనిపిస్తుంది. తాజా రూపం కోసం ఎక్కువ వ్యాల్యూమ్ కోసం జట్టు కట్ చేసుకోవాలి అంటారు ఎక్సు పర్ట్స్. ఇక పోతే షాంపలనూ పూర్తిగా శిరోజాలకు పట్టించాలి […]
జడ అందం కోసం బంగారు చామంతులు
చక్కని ముడి మధ్యలో నాగరం ,జడకు మధ్యలో జడ బిళ్ళలు సంప్రదాయనగలు .ఇవి సనాతనకాలం నుంచి రాజుల కాలం నుంచి వస్తు ఉన్నాయి. ఇక కాలానికి తగ్గట్లు వీటి డిజైన్ లలో మార్పులు వచ్చాయి. సూర్యవంకలు, చంద్రవంకలు ,చామంతులు ఇలా జడబిళ్ళలు కొత్త డిజైన్ లలో వచ్చాయి. ఇప్పుడు ప్రత్యేక సందర్భాల్లో అమ్మాయిలు వీటిని జడపొడుగునా ధరిస్తున్నారు. సాధారణమైన బ్యాండ్ కి గుడ్డు ఇప్పుడు బంగారు జడబిళ్ళలు షాపుల్లో దర్శనం ఇస్తున్నాయి. వట్టి బంగారుతో చేసినవి ముత్యాలు, […]
హెర్బల్ టీ తో నిత్య యవ్వనం
ఇష్టంగా తాగే టీ ని హెర్బల్ టీ గా మార్చుకొండి ఉత్సహాంతో పాటు అనేక అనారోగ్యాలు కూగా తగ్గిపోతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మంచి చర్మానికైనా మంచి నిద్రకైనా ఎంతో ఉపయోగపడతాయి. చాలా హెర్బల్ టీ లతో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వార్ధక్యలక్షణాలను నెమ్మదింప జేస్తాయి. ప్రీ రాడికల్స్ హాని నుంచి పరిరక్షిస్తూ కణాల వార్ధక్యాన్ని తగ్గిస్తాయి. చర్మానికి మేలు చేస్తాయి. చర్మం మృదువుగా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి. హెర్బల్ టీ తాగితే చెడు కొలెస్ట్రాల్ […]
మొలకెత్తిన మిల్లెట్స్ మరింత ఆరోగ్యం
చిరుధాన్యాలు ఆరోగ్యం అని ఈ మధ్య అన్ని చోట్ల వినిపిస్తుంది.ఇవి వండుకునే పదార్ధాలని పుస్తకరూపంలో ప్రచారం జరుగుతుంది.ఉప్మాలు పాయసం మాత్రమే కాకుండా వీటిని మొలకెత్తించి పిండిగ చేస్తే ఎక్కువ పోషకాలు ఉంటాయి అంటున్నారు.జొన్నలు,అరికెలు,సామలు,ఊదలు,సజ్జలు,కొర్రలు మొలకెత్తించి వాటిని పిండిగ చేసి ఎన్నో రకాల పిండివంటలు వందుకోవచ్చు.కొత్త కొత్త ఆహారాన్ని కలుపుకునే అలవాటు మనకు ఎఫ్పుడు ఉంది కనుక ఈ చిరు ధాన్యాలు కాస్త కష్టపడి నానబెట్టి మొలకెత్తించి ఆరోగ్యపరమైన పిండివంటలు వండితే అందరికి ఆరోగ్యమే.
వెచ్చని నీరే తాగాలి
తాజా నిమ్మరసాన్ని వేడి నీళ్ళలో కలిపి తాగితేనే సీ విటమిన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు అంటారు డాక్టర్లు.చలి కాలంలో ఉదయాన్నే ఇలా తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం కలుగుతుంది. ఉక్కపోత అధికమైతే చల్లని నీళ్ళలో తాగాలని చూస్తారు కానీ పరగడుపున చల్లని నీళ్ళు తాగడం వల్ల కాలేయం సరిగ్గా పని చేయదు.దానిలో చురుకుదనం తేవడం కష్టం.నిమ్మరసం తాగినందువల్ల వచ్చే లాభాలు ఏవి కలగవు.అదీ కాక జీర్ణకోశం కూడా ఇబ్బంది పడుతుంది. అందుచేత ఎలాంటి వాతావరణంలోనైన వెచ్చని నీటితోనే నిమ్మరసం […]
మీటు నన్ను తాకింది
మీటు గురించి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ నేను కాస్టింగ్ కౌచ్ భారీనపడి ఎనిమిది నెలలు పని పోగోట్టుకొన్ననని చెప్పింది అదితీ రావ్ హైదరీ. కెరీర్ ఆరంభించిన కొత్తలో నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని పరిశ్రమలో ఇలాంటివి జరుగుతాయని ఊహాకు అందలే. ఒక్క సంఘటన నన్ను చాలా బాధించింది. ఓ ప్రాజెక్ట్ విషయంలో అడ్జెస్ట్ అయితే ఛాన్స్ ఇస్తామన్నారు. నేను వద్దనేసి వచ్చేశాను. ఓ ఎనిమిది నెలలు నేను పని కోల్పోయాను. కొత్త అవకాశాలు రానందుకు చాలా […]
కథకే ప్రాధాన్యత
కథనాయికగా నటించటం సంతోషంగా ఉంది. ఈ చిత్రం కథనం పేరుకి తగ్గట్టే కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రేక్షకులు థ్రిల్ అయిపోతారు. ఇందులో సహాయ దర్శకురాలి పాత్రలో కనిపిస్తాను .టీజర్ కు మంచి స్పందన వచ్చింది అంటోంది అనసూయ. ఆమె కథనాయికగా నటిస్తున్న కథనంలో అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనసూయ,రణధీర్ ,ధన్ రాజ్ ,వెన్నల కిషోర్, పృధ్వీ నటిస్తున్నా ఈ సినిమా వినోదం మిలితమైన సరికొత్త థ్రిల్లర్ అంటున్నారు.
పోషకాల జ్యూస్
క్యారెట్ అనగానే ఆరెంజ్ కలర్ గుర్తోస్తుంది. కానీ క్యారెట్లలో తెలుపు ,పసుపు,ఎరుపు రంగులో కూడా ఉన్నాయి.క్యారెట్ లో పోషకాలు ఎక్కువ క్యాలరీలు తక్కువ .వంద గ్రాముల పచ్చి క్యారెట్ లో 48 క్యాలరీల శక్తి ,86 గ్రాముల మాయిశ్చరయిజర్ ,10.6 గ్రాముల కార్బోహైడ్రేడ్స్ , 1.2 గ్రాముల పీచు,0.9 గ్రాముల ప్రోటీన్, 1890 గ్రాముల కాల్షియం, 1.5 గ్రాముల ఐరన్ లభిస్తాయి. ఉడికించి తిన్న ,పచ్చిగా తిన్న పోషకాలు అందుతాయి. గ్లాస్ క్యారెట్ జ్యూస్ లో అల్లం […]
ముఖ కాంతికి బాదం ప్యాక్
కళ్ళ కింద నలుపు పోవాలంటే బాదం పప్పులు, ద్రాక్షపళ్ళు ,కుంకుమ పువ్వు రేకులతో చక్కని ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. బాదం పప్పు పొడి గంధం పొడి బంగాళాదుంప రసం నిమ్మరసం కలిపి ఫేస్ పాక్ తయారు చేసి కళ్ళ కింద నల్లని వలయాలున్న చోట మృదువుగా రాయాలి. పది నిమిషాలు విశ్రాంతిగా ఉండి చల్లని నీళ్ళతో శుభ్రం చేయాలి. రోజు విడిచి రోజు ఈ మిశ్రమం రాస్తే కళ్లకింద వలయాలు పోతాయి. […]
ఎక్కడో ఒక చోట నేనుంటా
నేను నటించిన ప్రతి పాత్రలోనూ ఎక్కడో ఒక చోట నేనుంటాను కానీ అలా ఉండటం తప్ప ఏ దశలోను నా ఇష్టం వచ్చినట్లు నటించాలనుకోను. నా పాత్రను దర్శకుడు చెప్పినట్లు నటిస్తూ పోతాను అంతే. నా మనసుకి తెలుస్తుంది. ఆ పాత్రలో నా ఛాయలు నా అలవాట్లు ఆలోచనలు ఉన్నాయని కానీ నేను స్వతంత్రించి అవన్ని నా పాత్రలోకి లాగాలని చూడను.నాకు తెలిసిందే కదా అని పాత్రను ఎక్కువ చేయటం ,తగ్గించటం ఏదీ లేదు. ఏ పాత్రైనా […]
మామి అధ్యక్షురాలిగా దీపికా
బాలీవుడ్ అగ్ర కథానాయక దీపికా పదుకోనేకు కొత్త గౌరవం దక్కింది.మామి(ముంబై అకాడమీ ఆప్ మూవింగ్ ఇమేజ్ )చిత్రోత్సోవాలకు ఆమె కొత్త అధ్యక్షురాలిగా నియమితురాలయ్యారు. గత నాలుగేళ్ళుగా అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ ఈ పదవిలో ఉన్నారు. ఇది నాకు దక్కిన గౌవరం. అంత కంటే గొప్ప బాధ్యత .సినిమా ప్రేమికులను సినీ ప్రముఖులను ఒక్కచోట చేర్చే మామి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళతాను అంటోంది దీపికా.
అమెజాన్ లో గద్వాల్ చీరె
గద్వాల్ చీరె ఇప్పుడు అమెజాన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లోకి వచ్చింది. చేనేత జౌళి శాఖ సహాయంలో అమెజాన్ ప్రతినిధులు గద్వాల్ స్థానిక వీవర్స్ తో సమావేశం అయ్యారు. గద్వాల పట్టు చీరెను అమెజాన్ లో విక్రయిస్తే 8శాతం కమిషన్ చాలన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ లో గద్వాల్ పట్టుచీరెల అమ్మకాలు జోరుగా ఉన్నా తరువాత అమెజాన్ ముందుకు రావటంలో జోగుళాంబ గద్వాల్ కేంద్రం గద్వాల్ తో పాటు రాజోలి ,మాచర్ల ,అలంపూర్ చీరెలను నేసే కళాకారులకు […]
