Sunday, 28 Jun, 2026

క్షమించటం లాభం

క్షమించటం అన్న నాలుగు అక్షరాలు మన జీవితంలోకి ఎన్నో సుఖ,శాంతులు తీసుకు వస్తాయి. ఎవరి పైన అయినా కోపం తెచ్చుకోవటం అన్నది మనం నేరుగా విషం తాగినంత ప్రమాదం. ప్రతికారేచ్చతో రగిలిపోవడం ముందర మన ఆరోగ్యానికి ప్రమాదం. క్షమాపన ప్రదర్శనలోనే ఆధ్యాత్మిక కోణం దాగి ఉంది అంటారు.క్షమించటం జీవితానికి గుర్తు ఇందులో రెండు లాభాలు ముందు మన మనసు తేలిక అయిపోతుంది. రెండవది అవతల పాడైపోయిన బాంధవ్యం కూడా పునరుద్దరించినట్లే.క్షమించటం వైపు నాలుగు అడుగులు వేస్తే వ్యక్తుల మధ్య […]

పువ్వులే ఫ్యాషన్

వేసుకునే దుస్తులు కళ్ళకి ఆహ్లాదంగా ఉంటే బావుండునని తేలికైన రంగులు చక్కని పువ్వులు లతలు అందాన్ని వెయ్యింతలు చేస్తాయని ఫ్యాషన్ డిజైనర్స్ నిర్ణయించుకున్నారు ఏమోగాని లేటెస్ట్ గా వచ్చే ప్రతి డిజైన్ కూడా చక్కని ఫ్లోరల్ డిజైన్స్ అందమైన ప్రకృతి పచ్చదనం కనిపిస్తూ ఉన్నాయి. లాంగ్ కుర్తీ డిజైన్ లో చూస్తే శాటిన్ , సిల్క్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో ఫ్లోరల్ డిజైన్ లే కనిపిస్తున్నాయి. అసలు పొడుగాటి లాంగ్ కుర్తీలు ఫ్యాషన్ అయిపోతే వాటికి చేసిన […]

జాగ్రత్త సుమా ?

ఒక్కసారి ఇంట్లో చూస్తే ఎన్నో రాకాల దుస్తులు అలంకరణ సామాగ్రి ఫ్రిజ్ లో కిక్కిరిసినట్లు బాటిల్స్ చుట్టు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎన్నో కనిపిస్తాయి. కొన్ని అస్సలు వాడనివి కూడా దర్శనమిస్తాయి.కనిపించిన వెంటనే కొనేసే అలవాటు వల్ల ఇలా జరుగుతుంది. అదాయం గురించి అవగాహన ఖర్చు పైన అదుపు ఉంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే షాపింగ్ కు కాస్త పొదుపుగా ఆలోచించే వారిని తోడుగా తీసుకెళ్ళ మంటారు.లేదా షాపింగ్ కోసం ముందే రాసిపెట్టి కొన్న […]

ఎంతో అలసట

ఇంటర్నెట్ వాడుతూ స్మార్ట్ ఫోన్ ద్వారా సమాచారం అందుకోవటం దాన్ని వెంటనే స్పందించి పోస్ట్ చేయడం వల్ల అటూ సోషల్ మీడియా లోకి అడుగుపెట్టి ఇంకో కంటితో ఆఫీస్ పని పైన దృష్టి పెట్టడం వల్ల పని చేసే సామర్ధ్యం తగ్గిపోతుందని అద్యయనాలు చెపుతున్నాయి. దీని వల్ల పెరిగే వత్తిడిలో లక్ష్యాలు అందుకోలేకపోతున్నారని రిపోర్ట్ గట్టిగా చెబుతుంది.శరీరంలో సరఫరా అయ్యే శక్తితో నలభై శాతం మెదడు ఉపయోగించుకుంటుంది. ఇప్పుడీ అంశాల పై ఎక్కువ దృష్టి పెట్టవలసి రావడం […]

ఎప్పుడు నచ్చవు

సినిమానే గ్లామర్ పరిశ్రమ ప్రతి నిమిషం ఎదో కొత్త ఫ్యాషన్ కు తెర తీస్తారు వెండి తెర మహారాణులు. కాని అసలు నాకు ఫ్యాషన్ అంటేనే విరక్తి అంటుంది అనుపమా పరమేశ్వరన్. అసలు షాపింగ్ లు చేయను ముస్తాబు కావటం అంటేనే నాకు పెద్ద బోర్. అసలు మొదటి నుంచి అతిగా అలంకరణ మితిమీరిన మేకప్ అంటే నాకు ఆసక్తి లేదు.అందుకే నేను షాపింగ్ చేసే అవకాశం దాదాపు రాదు. తెర పైన ఎలాగూ డైరక్టర్ సెలక్ట్ […]

జీవనం కోసమే

అవసరం అన్ని భయాలు జయించేలా చేస్తుంది.45 సంవత్సరాల తట్టా జయలక్ష్మమ్మ అనకాపల్లి సమీపంలోని గవరపాలెంలో కాటికాపరిగా విధులు నిర్వహిస్తుంది. ఆమె ఇరవై ఐదేళ్ళ వయసులో భర్త చనిపోతే నలుగురు పిల్లల పోషణ కోసం ఈ స్మశాన వాటిక పనిలో అడుగుపెట్టింది. ముందుగా ఇంట్లో వాళ్ళు ఆ ఊరి వాళ్ళు అభ్యంతరం పెట్టారు కాని నేడు ఆడవాళ్ళయినా మగ వాళ్ళయినా ఏపని అయినా చేయగలరు. చేయోచ్చు అని చేసి చూపించాను. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశాను. నాతో […]

వదిలేయండి

మేకప్ వేసుకునేటప్పుడు ఉన్న శ్రద్ద దానిని తొలగించేటప్పుడు చూపించకపోవడం వల్ల చర్మానికి కళ్ళకు ఎంతో ప్రమాదకరం. ఐ షాడో కళ్ళ అందం ఎక్కువ చేసే మాట వాస్తవం. దాన్ని రోజంతా అలా ఉంచేసి రాత్రివేళ సరిగ్గా తుడిచేయకపోతే కళ్ళకు ఇన్ ఫెక్షన్ రావటం ఖాయం. అలాగే మొహం పై మేకప్ తుడిచేయకపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగానే చర్మం పై ముడతలు వస్తాయి. దీనివల్ల వయసు కనబడుతుంది కూడా. లిప్ స్టిక్ తొలగించకపోతే పెదవులు పొడిబరిపోయి […]

ఇంట్లో పెంచుకోవచ్చు

సేంద్రీయ పద్దతిలో పెరటి తోటలో కూర తేలిగ్గా పెంచుకోగలిగింది వంకాయలు, బ్రింజల్ గా పిలిచే ఈ వంగ మొక్కలు కుండీల్లో ఒక్కదాన్లో రెండు,మూడు నాటుకోవచ్చు. కుండిల్లో ముందుగానే పశువుల ఎరువు ,పిండి ఎరువులు, మట్టి కలుపుకోవాలి. ఒక్కో కుండీలో ఒక్క పుదినా మొక్క బంతి మొక్కకు ఎండ సరిగ్గా తగలాలి. మట్టి పూర్తిగా పోడిబారి పోకుండా నీళ్ళు పోయాలి. అక్టోబర్,నవంబర్ నెలల్లో నాటుకుంటే నాటిన 40 ,50 రోజుల్లో చక్కగా కాయలు కాస్తాయి. కొన్ని కుండీలు ,బ్యాగ్ ల్లో కొద్దిపాటి […]

రెండు వాడండి

కొన్ని గింజలు రోజువండుకొనే వంటల్లో చేరిస్తే అధిక ప్రయోజనాలు అంటున్నారు పరిశోధకులు. బాలింతలు తినే ఆహారంలో మెంతులను చేర్చటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వీటిని ఆహారంతో తీసుకోవాలి. గాయాలు, అల్సర్లు ,ఎగ్జిమా వంటి సమస్యలకు మెంతులు మంచి మందు కూడా అలాగే నువ్వుల్లో జింక్ కాల్షియం ఫాస్పరస్ ఎక్కువ .ఎముక మజ్జ ఏర్సాడటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎముక పుష్టి పెంచుతాయి. అధిక రక్త పోటు ,గుండె జబ్బులు అదుపులో ఉంటాయి. […]

గొప్ప అవకాశం

కూచిపూడి నృత్య కళాకారిణిగా లలితా సింధూరి ఫూల్ బ్రైట్ ఫెలోషిప్ కి ఎంపికైంది అమెరికా ఆతిధ్యం తీసుకొని వచ్చారు. ఈ ఫెలోషిప్ చాలా ప్రతిష్టాత్మాకమైనది. విద్య పరిశోధనలో విజ్ఞాన మార్పిడి కోసం అమెరికన్ ప్రభుత్వం దీన్నీ ఏర్పాటు చేసింది. విద్య వైద్యశాస్త్ర సాంకేతిక రంగాల్లో 100 దేశాల నుంచి చాలా కొద్ది మందిని ఆహ్వానిస్తారు. అక్కడి విద్యసంస్థలు విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తారు. ఒక సంవత్సరం పాటు కొనసాగే పరిశోధనకు అయ్యో ఖర్చు అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. ఈ […]

స్శ్యూల్ సింగర్

స్శ్యూల్ అనేది ఒక యాప్ . సింగపూర్ లో ఉండే విధు వివేక్ ఈ స్శ్యూల్ యాప్ గురించి స్టడీ చేసి స్వతహాగా సింగర్ అవ్వటాన్నే ఈ యాప్ సహాయంతో పాతవి కొత్తవి కలిపి వెయ్యికి పైగా పాటలు పాడింది. ఒక పాటకు ఏకంగా పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఇల్లు రికార్డింగ్ స్టూడియోగా చేసుకొని విధువివేక్ పాడిన పాటలకు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారంటే ఆశ్చర్యమే కదా. స్మార్ట్ ఫోన్ ఉన్నా వాళ్ళు ఈ యాప్ డౌన్ […]

ఈఘాటు ఆరోగ్యమే

నల్ల మిరియాలు కేవలం మసాలా కోసమే కాకుండా అవి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. అవి కేలరీలు కరిగించి కొవ్వును రానీవ్వకుండా చేస్తాయి ఇవి రుచికి ఘాటుగా ఉంటాయి. పర్లేదు తినగలం అవీ రోజు రెండు మిరియాలు నేరుగా నోట్లో నమిలినా మంచిదే .శ రీరంలోని మెటబాలిజం క్రమబద్దం అవుతుంది. వెజిటెబుల్ సలాడ్స్ ,సూప్ ల పైన చల్లితే అద్భుతమైన రుచి ఇస్తాయి. ఒక్క చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్ ను ఒక గ్లాస్ నీటిలో వేసి ఉదయం […]

బాత్ పౌడర్

ఎంతో తేలికైనా సబ్బులైనా కొద్దిపాటి రసాయనాలు అయినా కలిసే ఉంటాయి. మొహం కొద్దిపాటి మెరుపు కోసం సబ్బు రాసుకొని శరీరం తాజాగా శుభ్రంగా ఉండేందుకు జిడ్డు పట్టకుండా ఉండేందుకు చర్మం ఆరోగ్యం కోసం పెసర పిండితో ఇంట్లోనే మంచి బాత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. గంధం ,తులసి , బావంచాల పొడి ,అశ్వగంధ , గులాబీ రేకుల పొడి ,తుంగ ముష్టి , కస్తూరి పసుపు , వేప ఇవన్నీ పొడి రూపంలో షాపులో దొరుకుతాయి. ఇవన్ని […]

ఏం చేస్తాం

నేనేం చేస్తానో ,చేశానో నాకే తెలుసు కనుక, నాలో తప్పొప్పులు ముందు నాకే తెలుస్తాయి. ఇంకొన్నాళ్లు నన్ను వేలెత్తి చూపే అవసరం రాకుండా నన్ను నేను ఎప్పుడు సరిదిద్దుకొంటాను అంటోంది రాశి ఖన్నా. ప్రస్తుతం ఆమె శ్రీనివాస కళ్యాణంలో వటిస్తుంది. నటిగా నేను ఫర్ ఫెక్ట్ రూపం తీసుకోగలిగానూ అంటే అందులో విమర్శల పాత్ర చాలా ఉంది. నాలోనే పెద్ద విమర్శకురాలు ఉంది. నా సినిమా చూస్తున్నాప్పుడు నాకే నాలో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. అప్పడు నా […]

ఒలంపిక్స్ కి రెడీ అవుతా

ఇండియా టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ మధ్య ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ డైట్ విసయంలో తానేంతో జాగ్రత్తగా ఉందో ఎన్నో కబుర్లు చెప్పింది సానియా. డైట్ విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆకు కూరలు ,గ్రీన్ జ్యూస్ తీసుకొంటున్నా చాలా ఆరోగ్యవంతమైన ఆహారం గురించి ఎన్నో సలహాలు వింటున్నానని చెప్పింది సానియా. హైదరాబాద్ లోనే కుటుంబ సభ్యులతో ఆమె ప్రెగ్నెన్సీ టైమ్ ని […]

అపోహాలు పోవాలి

శరీరం చుట్టు శరీరంలో సహాజంగా జరిగే ప్రక్రియల గురించి ఎన్ని అపోహాలు . ఒక్క సారి వింటూ ఉంటే నవ్వోస్తుంది అంటోంది నటి రాధిక ఆప్టే. రుతు క్రమం పరిశుభ్రత కథాంశంతో వచ్చిన ఫ్యాడ్ మాన్ సినిమాలో అక్షయ్ కుమార్ ,సోనమ్ కపూర్ లతో కలిసి నటించింది ఆమె. ఈ సినిమా ఆగస్ట్ 12వ తేదిన టీవీలో ప్రసారం కానున్న సందర్భంగా ఆమె ఒక ప్రకటన చేస్తే ఈ రుతుక్రమం అనేది ప్రకృతి సహాజమైన దేహా ధర్మం. […]

ఖరీదును మించిన అందం

ఇవ్వాళ్టి జ్యూవెలరీ ట్రెండ్ పచ్చల హారాలకే . బంగారు రాళ్ళ నగల కంటే బీడ్స్ హారాలు అధ్భుతమైన అందంతో ఉన్నాయి. వీటి ధర క్యారేట్ 50వేల నుంచి మొదలవుతుంది. భారీగా ఉండే ఈ బీడ్స్ హారాలు యాభై లక్షలకు మించే ఉంటాయి. వీటిని పేరున్న షాప్ లో విడిగా కొని ,డిజైన్ చేయించుకొంటే మంచి హారం తయారవుతోంది. బర్మాలో తయారైనవి బర్మనీస్ రుబీస్ అని కొన్ని నకిలీకి దొరుకుతున్నాయి. చూసేందుకు ఈ బీడ్స్ చక్కగానే ఉంటాయి కానీ […]

శక్తి నిచ్చే బీన్స్

వంటగదిని పోషకాలతో నింపేయండి లేకపోతే కొన్నిసార్లు మంచి ఆహారం తినటం కూడా సమస్య అయి పోతుంది. వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్ తీసుకొంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దక్కుతాయి. బీన్స్ లో ఉండే పీచు ,యాంటీ ఆక్సీడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ట్రై గ్లిజరైడ్స్ పెరగనివ్వవు. బరువు తగ్గించుకోవాలను కొనేవారు బీన్స సందేహాం లేకుండా తినాలి. అరకప్పు బీన్స్ లో ప్రోటిన్లు ,విటమిన్లు పుష్కలంగా దోరికినట్లే .వీటిని ఉడికించిన తర్వాత కూడా వీటిలో […]

నొప్పులా?

సాధారణంగా వ్యాయామం చేశాక కండరాలు ,జాయింట్లు నొప్పులుగానే ఉంటాయి. సాఫ్ట్ టిష్యులతో అసౌకర్యం ఉంటుంది. భుజాలు ,ఛాతీ ,బైసెప్స్ దగ్గర ఇలాంటి నొప్పులు ఉంటాయి. నొప్పి ఉన్నచోట ఐస్ పెడితే ఫలితం ఉంటుంది. నొప్పి తగ్గకుండా అదే రకంగా మజిల్స్ ని శ్రమపెట్ట కూడదు.ముందు రెస్ట్ ,రికవరీ అవసరం సోర్ నెస్ తగ్గేందుకు స్ట్రెచ్ చేయాలి. అనుకొన్న లక్ష్యం కోసం శక్తి మించి వ్యాయామం చేయకూడదు. ఒక్కోసారి ఆసనాలు వేసేటప్పుడు పాశ్చర్ సరిగ్గా లేకపోయినా జాయింట్లు నొప్పులు […]

నడవండి

పాతికేళ్ళు కూడా దాటక ముందే పది అడుగులు వేయలేక పోతున్నాను ,అసలు నడవాలంటే గుండె గొంతులోకి వస్తుంది అంటున్నారు యువతరం. నిజమే అలవాటు లేకపోవటం ,టూ వీలర్స్ ,ఫోర్ వీలర్స్ వాడకం ఎక్కువై కాస్త దూరం కూడా నడవలేకపోవటం ఈ సమస్యకు కారణం.లిఫ్ట్ వాడకంతో మెట్లు ఎక్కే పని లేదు. నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు చెప్పినా పట్టించుకోరు.నడక బరువును నియంత్రిస్తుంది.మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది.శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది. రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.ఒత్తిడి ఉండదు. […]