వెండితెరపై విస్మయ
32 ఏళ్ల వయసులో మలయాళ చిత్రం తుడక్కం తో విస్మయ మోహన్ లాల్ తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చింది.తుడక్కం అంటే ప్రారంభం అని అర్థం.ఈ సినిమాకి జూడ్ ఆంథని జోసెఫ్ దర్శకుడు.ఈ సినిమాలో మీను గా ప్రధాన పాత్ర ధరించింది విస్మయ. దశాబ్దాలుగా ఆమె తండ్రి మోహన్ లాల్,ఆ తర్వాత ఆమె అన్న ప్రణయ్ లాల్ వెండితెర మీద ప్రకాశిస్తున్నా,విస్మయ మాత్రం స్టార్ కిడ్ అన్న ముద్ర కి దూరంగా ఇప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పుస్తక రచయిత గా తన ప్రపంచంలోనే ఉంది.ఇప్పుడు కొత్తగా ఆమె తెర ముందుకు వచ్చింది.తిరువనంతపురంలో పుట్టిన విస్మయ తల్లి సుచిత్ర ది కూడా సినీ నేపథ్యమున్న కుటుంబం.సుచిత్ర తండ్రి దివంగత సినీ నిర్మాత బాలాజీ. విస్మయ రచయిత్రి కూడా. ఆమె ఈ మధ్య రాసిన గ్రైన్స్ ఆఫ్ స్టార్ డస్ట్ కవితల సంకలనానికి సూపర్ స్టార్ అమితాబచ్చన్ ప్రత్యేక ప్రశంసలు అందించారు.విస్మయ కవితలు రాస్తుంది.బొమ్మలు గీస్తుంది.ఇప్పుడు సినిమా నటి అయ్యింది కూడా.
