Saturday, 10 Oct, 2026
చేపలలో పోషకాలెన్నో ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని మెదడు పని తీరుకు మంచిదని అంటారు. కానీ అన్ని చేపలలోను ఒకే పోషకాలు వుండవు. చేపల్లో మైక్రో నుట్రీయంట్లు, ఓమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. మంచి నీటి చేపలలో అవి వుండవు. ఆక్వా ఫిష్స్ కన్నా సీ ఫుడ్స్ ఎంతో మంచివి. చేపలు ఎక్కువగా తినడం వల్ల గ్రీన్ ల్యాండ్ వాసుల్లో చూద్దాం అన్నా ఆర్దరైటిస్ వుండదు. అలాగే గోదావరి జిల్లాలో దొరికే నెత్తళ్ళు పేరు తో పిలిచే చేపలలో, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-బి, బి-12 వంటి అన్ని ఎక్కువే. ఆహారంలో భాగంగా చేపలు తింటే కాన్సర్లు, హృదయ రోగాలు రావు. ఒమేగా ఆమ్లాలు ఎక్కువగా వుండే వీటిని వారానికి రెండు దార్లు అయినా తినమని సూచిస్తున్నారు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్. ప్రోటీన్ల తో పాటు జింక్ సమృద్ధిగా దొరికే ఈ చేపలలో చిన్నారుల కోసం బంగ్లాదేశ్ లో 13 లక్షల చెరువులు తవ్వించారట. గుండెకు చేవ నిచ్చే చేపల్ని భోజనంలో భాగంగా తిసుకోమంటున్నారు డాక్టర్లు.

స్ట్రో క్ రిస్క్ తక్కువ

వారంలో కనీసం రెండు సార్లు చేపలు తినే వాళ్ళలో స్ట్రోక్ రిస్క్ చాలా తక్కువ ఉంటుందని చెపుతున్నారు నిఫుణులు. ఒమేగా-3 సప్లిమెంట్స్ అన్న పదం ఇప్పటికే చాలా సార్లు విన్నాం .అయితే ఈ సప్లిమెంట్స్ కంటే అసలైన చేపల్లోనే ఎంతో శక్తి ఉంటుందంటున్నారు. చేపల్లో ఉండే విస్తృతస్థాయి పోషకాల అంతర్గత పని తీరుతో స్ట్రోక్ రిస్క్ ఎక్కువశాతం దగ్గరకు రాదంటున్నారు. సప్లిమెంట్స్ లో కూడా ఎంతో శక్తి ఉన్న మాట నిజమే కానీ తరుచూ చేపలు తింటే ఈ సప్లిమెంట్స్ అవసరం రాదంటున్నారు. ఉదయాన్నే లేవగానే యాంటీ ఆక్సిడెంట్లు ,మెగ్నిషియం,పోటాషియం వంటి ఖనిజాలు ,ఒమేగా ఫ్యాట్ ఉండే బాదం , వేరు శనగ గింజలు అలాగే వారంలో రెండు సార్లు చేపలు తింటే మరణాల రేటు తక్కువని అధ్యయనం చెపుతుంది.

Leave a Reply