Wednesday, 02 Sep, 2026

బిడ్డ చదువు కోసం పరుగు

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయీ లో అమృత్ గౌడ్ పేరుతో త్రీ కే రన్ ఏర్పాట్లు చేయగా అందులో 47 ఏళ్ల రమాబాయి రణీశ్వర్ వేగంగా పరుగు తీసి మూడు వేల నగదు బహుమతి అందుకున్నారు. సాదాసీదా చీర కళ్ళకు మామూలు రబ్బరు చెప్పుల తో శరవేగం గా పరిగెత్తుతున్న రమాబాయి కి మధ్యలో చెప్పులు తెగిపోయాయి.అయినా ఆమె ఆగలేదు వాటిని చేతిలో పట్టుకుని పరుగు కొనసాగించింది ప్రైజ్ మనీ గెలుచుకుంది. అది నా కుమార్తె ఫీజు కోసం ఉపయోగపడుతుందని ఇంతగా కష్టపడ్డాను ఈ ఎండలో చెప్పులు లేని కాళ్లతో పరిగెత్తాను అని రమాబాయి కళ్ళ నీళ్ళ తో చెప్పగానే అక్కడున్న వారందరూ ఉద్వేగానికి లోనయ్యారు. కన్న బిడ్డల భవిష్యత్తు కోసం ఒక తల్లి చూపించిన దృఢ సంకల్పాన్ని అభినందించారు.

Leave a Reply