Sunday, 11 Oct, 2026
అమ్మాయిలు తప్పించుకోలేని ఇబ్బంది నెలసరి. ఈ సమయంలో కలిగే సమస్యలను ఎదుర్కోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. తృణ ధాన్యాలతో చేసిన ఆహారం కాల్షియం తగినంత మోతాదులో అందేందుకు పాలు పాల పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఆరుకురలు పప్పు ధాన్యాలు ముఖ్యంగా గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అవిసె గింజలు తీసుకోమంటున్నారు. ముఖ్యంగా అవిసెలు కాల్షియం తో పాటు మేగ్నేషియం మోతాదు కూడా ఎక్కువ ఈ పోషకాలు నెలసరి సమయంలో నీరసం రాకుండా కాపాడతాయి. కాఫీ చాక్లేట్ల బదులుగా గ్రీన్ టీ చామంతి హెర్బల్ టీ తాగచ్చు. మంచి నీళ్లు బాగా తాగితే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఎదురవకుండా ఉంటుంది. మంచి పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పండ్లు కూరగాయలు ఎక్కువగా వుండే డైట్ తీసుకోవాలి. అలాగే ఆహారం జీర్ణం అయ్యేందుకు శరీరం చైతన్యం ఉండేందుకు పది పదిహేను ,నిమిషాలు నడక కూడా ఆనందమే. అలసట చిరాకు వత్తిడీ వంటివి ఎదుర్కొనేందుకే మంచి ఆహారం.

నెలసరి నీరసమా ? 

నెలసరి సమయంలో చాలా మందికి అలసట,నీరసం పొత్తికడుపు నొప్పి నొప్పి వంటివి విసిగిస్తాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి ఉపశమనం అనిపిస్తుంది .నీళ్ళు బాగా తాగాలి పుచ్చ కర్బుజా,కీరా దానిమ్మ,వంటివి తీసుకొంటే డీహైడ్రేషన్ సమస్య ఉండదు రక్త హీనతను నివారించేందుకు ఆకు కూరలు  శనగలు,రాజ్మా బొబ్బర్లు అలసందలు వంటివి ప్రతి రోజు ఆహారంలో తీసుకొంటే నెలసరి సమయంలో నీరసం వంటి సమస్యలు పోతాయి. ఆహారం ఉండే ఇనుమును శోషించు కొనేందుకు విటమిన్ -సి చాలా అవసరం అన్ని రకాల పండ్లు నిమ్మరసం పచ్చి కాప్సికమ్ ,ప్రోటాన్లు ఎక్కువగా వుండే చికెన్,చేప,గుడ్లు,పప్పులు సోయా గింజలు పనీర్ మీల్ మేకర్ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

Leave a Reply