Wednesday, 12 Aug, 2026
అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

ఒక్క నవ్వే చాలు 

హాయిగా నవ్వండి చాలు మీ ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. రోజు 100 సార్లు కనుక నవ్వితే 15 నిముషాలు సైకిల్ తొక్కటంతో సమానం అవుతుందట 10 నిమిషాల రోయింగ్ మెషీన్ పై వ్యాయామం చేసిన దానికి 30 నిముషాల వాకింగ్ కు 15 నిముషాల రన్నింగ్ కు సమానం దీనితో వంద నుంచి 150 కేలరీల వరకు ఖర్చు అవుతాయి ఆలా ప్రతి రోజు 100 సార్లు గనక నవ్వ గలిగితే ఇక ఎలాటి వ్యాయామం చేయ వలసిన అవసరం లేదంటారు సైంటిస్ట్ లు. నవ్వడం శరీరానికి మంచి వ్యాయామమని,అధిక బరువు,గుండె జబ్బులు డైయాబెటిస్ వంటి జబ్బులు రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు.

Leave a Reply